శ్రీ మహాభారతంలో శ్లోకములు - Mahabharat Slokas

0
శ్రీ మహాభారతంలో శ్లోకములు - Mahabharat Slokas

శ్రీ మహాభారతంలో శ్లోకములు :
   మనకు గల అన్ని పురాణములలో, ఇతిహాసములలొ ముఖ్యమైనది మహాభారతం. తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట " తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి". అంటే కాకుండా ఎవరైనా ఒక విషయాన్ని మరీ పెద్దగా, ఎక్కువ సేపు చెప్తుంటే మనం సహజంగా అనే మాట "ఏమిటి ఆ చాట భారతం" అని కదా! మరి భారతం ఎంత పెద్దదో మనకు తెలుసా?

మనకు తెలిసినంత వరకు భారతం 18 సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది. ఇందులో ఏది చూసినా 18. దీనిలోని పర్వములుకూడా 18. ఇప్పుడు వాటి పేర్లు వానిలోగల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం!
 • ఆదిపర్వం - 9984 శ్లోకములు 
 • సభాపర్వం - 4311 శ్లోకములు 
 • అరణ్య పర్వం - 13664
 • విరాటపర్వం - 3500
 • ఉద్యోగ పర్వం - 6998
 • భీష్మ పర్వం - 5884
 • ద్రోణ పర్వం - 10919
 • కర్ణ పర్వం - 4900
 • శల్య పర్వం - 3220
 • సౌప్తిక పర్వం - 2870
 • స్త్రీ పర్వం - 1775
 • శాంతి పర్వం - 14525
 • అనుశాసనిక పర్వం - 12000
 • అశ్వమేధ పర్వం - 4420
 • ఆశ్రమవాస పర్వం - 1106
 • మౌసల పర్వం - 300 
 • మహా ప్రస్థాన పర్వం - 120
 • స్వర్గారోహణ పర్వం - 200
అన్ని కలిపితే మనకు మహాభారతం లో మొత్తం 1,00,696 శ్లోకములు ఉన్నాయి. 

పద్యం ;
గీతాశ్రయోహం తిష్ఠామి
గీతా మే చోత్తమం గృహమ్‌,
గీతా జ్ఞాన ముపాశ్రిత్య
త్రీన్లోకాంపాలయామ్యహవ్‌'. ||

నేను గీతనాశ్రయించుకొని యున్నాను. గీతయే నాకుత్తమమగు నివాస మందిరము. మరియు గీతా జ్ఞానము నాశ్రయించియే మూడు లోకములను నేను పాలించుచున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top