ఆయుర్వేద పితామహులు - Ayurveda Pitamahulu

0
ధన్వంతరి - Dhanvantari
Dhanvantari

ధన్వంతరి

పాలసముద్రంలో మందరపర్వతాన్ని అమృతం కోసం దేవతలు, రాక్షసులు  చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతితోనూ, శంఖువును మరొకచేతితోనూ, మూలికలు, చక్రం మిగితా చేతితులలో ధరించి ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు ఉధ్బవించాడు ధన్వంతరి అంటూ పురాణ కధనం. ఈయన శ్రీ మహా విష్ణు అంశ.

సుశ్రుతుడు ఈ ప్రపంచంలో తొలి శస్త్ర వైధ్యుడు(world's first surgeon).1120 రోగాల గురించి,700 మూలికల గురించి,శరీరం గురించి,300 రకాల శస్త్ర చికిత్సల(300 types of surgeries) గురించి,120 surgical instruments గురించి సవివరంగా వివరించిన గ్రంధం అది. అది 6 BC కంటే ముందే రచింపబడిందని తెలుస్తొంది. ధన్వంతరి మహర్షి ప్రజాహితం కోసం ఉపదేశించిన ఆయుర్వేదతంత్రాన్ని అనుసరించి తన పేరిట సుశ్రుతసంహిత రచించినట్లు సుశ్రుతుడు తన రచనలో పేర్కొనాడు.ధన్వంతరి లక్షశ్లోకాల ఆయుర్వేద శాస్త్రాన్ని ఉపదేశించాడని, ధన్వంతరి ఆయుర్వేద మూలపురుషుడని సుశ్రుతుడు చెప్పాడు.

మన దేశంలో 3000 ఏళ్ళ క్రితమే తొలి ప్లాస్టిక్ సర్జరి(plastic surgery)జరిగింది. ఆ కాలంలోనే తోలి   open heart surgery జరిగింది. అది 36 గంటలపాటు జరిగిందని, అలాగే cataract operations కూడా మొట్టమొదటిసారిగా 3000 ఏళ్ళ క్రితమే అనేకం జరిగినట్టు గ్రంధాల ద్వారా స్పష్టం అవుతోంది. ఇలా అనేకం కనిపిస్తాయి. వీటన్నిటికి మూలం ఆయుర్వేదమే. అటువంటి ఆయుర్వేదాన్ని ప్రచారం చేసిన వారు ధన్వంతరి. 

వ్యాస మహాభారతంలో మనకు వైద్యానికి సంబంధించిన విషయాలు కనిపిస్తాయి.భీష్మ పర్వంలో బాణాల చేత గాయపడిన భీష్ముడు అంపశయ్యమీద ఉన్నప్పుడు ఆయనకు చికిత్స చేయడానికి శస్త్రచికిత్సలో(surgery) నిపుణులైన కొంతమంది శస్త్రవైద్యులు(surgeons)తమ పరికరాలతో(surgical instruments) భీష్ముడి శరీరం నుండి బాణాలు తీయడానికి రాగా భీష్ముడు "అంపశయ్య మీద పడుకున్న నాకు ఈ చికిత్స చేయించుకోవడం ఇష్టం లేదు.క్షత్రియుడైన(warrior)నేను నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించాను.యుద్ధంలో పోరాడి ఉన్నతమైన స్థానాన్ని నిలుపుకున్నాను.ఇప్పుడు నాకు వైద్యులతో (physicians and surgeons)పని ఏంటి?అందువల్ల వారికి తగిన ధనం ఇచ్చి గౌరవ మర్యాదలతో సాగనంపండి"అని పలుకుతాడు.అక్కడికి physicians and surgeons అందరు వచ్చారని మనకు మహాభారతం చెప్తోంది. మహాభారతం జరిగి 5000 సంవత్సరాలు దాటింది.అంటే అంతకు పూర్వమే మన దేశంలో వైద్య శాస్త్రం(medical science) ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది.     

"ఆయుర్వేదం శ్చికిత్సాశాస్త్రం ఋద్వేదస్యోపవేదః"
అంటే ఆయుర్వేదం అనే చికిత్సా శాస్త్రం ఋగ్ వేదానికి ఉపవేదమని శౌనకుని చరణవ్యూహం పేర్కొంది.

ఇంత గొప్ప వైద్య విధానం మన భారతీయుల సొంతం.ఆయుర్వేదం కేవలం ఉపవేదమే కాదూ మన భారతీయ ఋషుల గొప్ప ఆవిష్కారం. allopathy కూడా నయం చేయలేని ఎన్నొ రోగాలను ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చు. మన పండగలలోను,మన హిందూ సంప్రదాయ వస్త్ర ధారణలోనూ,వంటకాలలోనూ ఆయుర్వేదం తనదైన ముద్ర వేసింది. అంతేందుకు 3 సంవత్సరాల క్రితం ప్రపంచమంతా స్వైన్ ఫ్లూ(swine flu) వ్యాపించింది. భారతదేశంలో దాని వల్ల జరిగిన నష్టం తక్కువనే చెప్పొచ్చు. అది మన దేశంలో వ్యాపించకపోవడానికి  ఒక కారణం తులసిమొక్క,రెండూ మన వంటకాలని ఒక విదేశి వైద్య బృందం చెప్పింది. ఈ రెండు కూడా ఆయుర్వేదం ద్వారానే వాడుకలోనికి వచ్చాయి. అంతేకాదు ఆహారంలో పసుపును ఉపయోగించి క్యాన్సర్(cancer) ను అరికట్టవచ్చని,కొత్తిమీరను వంటల్లో వాడి food poisoning ను అరికట్టవచ్చని ఆయుర్వేదం చెప్పడమే కాదు మనం ఆచరించేలా చేసింది.ఇప్పుడు మనం వాటిని వంటల్లో వాడుతున్నామంటే అది ఆయుర్వేదం కారణంగానే.

అటువంటి ఆయుర్వేదాన్ని భారతీయులం మరచిపోయాం.అమెరికా వాళ్ళు పసుపు క్యాన్సర్ ను అరికడుతుందని అది తామే కనుగొన్నామని చెప్పుకుని పసుపు మీద "పెటెంట్"పొందారు.అదే కొత్తిమీర విషయంలో కూడా జరిగింది. అంతేకాదు మన ఋషులు చెప్పిన ఆయుర్వేద గ్రంధాలను ఎత్తుకుపొయి 30,000 ఆయుర్వేద మూలికల మీద "పెటెంట్స్"పొందింది ఆ దేశం.వేప,కలబందల గొప్పతనం,ఔషధి గుణాల గురించి ఆయుర్వేదం, భారతీయులు చెప్పినంత గొప్పగా ఇంకేవరు చెప్పలేదు.అటువంటి వేప, కలబందను మన ప్రభుత్వం ద్వారా అధికసంఖ్యలో తమ దేశానికి తరలించుకుపోయి వాటి మీద పెటెంట్స్ పొందింది చైనా. ఇలా భారతదేశం మీద  bio-piracy యుద్దం ప్రకటించాయి. కాని మనం ఏమి పట్టనట్టు, మనకు సంబంధం లేని విషయమైనట్టు భావిస్తున్నాం. మన దేశ మేధాసంపత్తిని(intellectual property) ఇతర దేశాలు దొంగిలించిపోతుంటే సిగ్గులేకుండా చూస్తూ కూర్చున్నాం. ఇప్పటికైన మనము,రాజకీయనాయకులు కళ్ళు తెరవాలి,మన భారతీయ సంపదను కాపాడుకోవాలి.

మన భారత సంస్కృతి ప్రకృతిలో మమేకమైన, ప్రకృతిలోని ప్రతి జీవిని, వస్తువును, దైవంగా భావించి జీవనగమనంలో ముందుకు సాగమని చెబుతుంటుంది. అందుకే నాడు రోగాలు, రుగ్మతలు కూడా తక్కువే ఉండేవి. ఏమైనా రోగాలు దాపురిస్తే, అందుకు తగిన, ప్రకృతి సహజంగా లభ్యమయ్యే మూలికలతో వైద్యం చేయబడేది. ఘనమైన మన చరిత్రలో ఎంతో మంది వైద్య ఘనాపాఠీలు ఉన్నపటికీ, ధన్వంతరీ, సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు, కశ్యపుడు, జీవకుడు, నాగార్జునుడు వంటి వారు ప్రముఖంగా కనిపిస్తుంటారు.

ధన్వంతరీ

వైద్యో నారాయణో హరిః ’ అని అన్నారు. వైద్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమని, అనుభవజ్ఞుడైన వైద్యుని ‘ అపర ధన్వంతరి ’ అని మన వాళ్ళు పోగడుతుంటారు. శ్రీమద్భాగవతం ధన్వంతరిని “దృఢమైన శరీరంతో, పొడవైన చేతులతో, నలుపురంగు శరీరంతో, ఎర్రని కళ్ళతో, \ పసుపువర్ణదుస్తులను ధరించి, వివిధ రకాల ఆభరణాలను అలంకరించుకొని దర్శనమిస్తూంటారు” అని వర్ణించింది. ఇలా పలు పురాణాలు ఆయన అవతారగాథను వివరించాయి. భాగవతపురాణం ప్రకారము, క్షీరసాగరమధనం ద్వార ధన్వంతరి ఆవిర్భావం జరిగింది.

రాక్షసులు  పెట్టే  బాధలను భరించలేకపోయిన దేవతలు బ్రహ్మ దేవునితో మొరపెట్టుకోగా, ఆయన శ్రీహరిని ప్రార్థించమన్నాడు. అందరూ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా క్షీరసాగరమథనము చేస్తే ఫలితము ఉంటుందని చెబుతాడు. అలా వారు విష్ణుదేవుని సలహాననుసరించి గడ్డి, తీగలు, ఓషధులను పాలసముద్రములో వేసి, మందరపర్వతం కవ్వముగా, వాసుకి తాడుగా, కవ్వం కిందుగా కూర్మావతార విష్ణువు ఆధారంగా ఉండగా, ముందుగా హాలాహలం పుట్టగా, దానిని పరమశివుడు కంఠములో ధరించాడు. అనంతరం కామధేనువు, ఉచ్చైశ్శ్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి, వారుణి కన్య ఉద్భవించారు.

ఆ తర్వాత పొడవైన చేతులతో, శంఖం వంటి కంఠంతో నడుముకు పట్టుపుట్టం, కంఠాన పూదండలు, ఎర్రటి కన్నులు, నీలమేఘ శరీరం, చెవులకు రత్నకుండలాలు, కాళ్ళకు రత్న మంజీరాలలో ఓ దివ్యపురుషుడు ఉద్భవించాడు. సకల విద్యా శాస్త్రాలలో నిపుణుడైన అతని చేతిలో అమృతకలశం ధగధగలాదుతోంది. ఈ విధంగా భాగవత పురాణం ధన్వంతరి ఆవిర్భావాన్ని వర్ణించింది.

ఇక, విష్ణుధర్మోత్తరపురణం, ఒక చేతిలో అమృతకలశం, మరొక చేత వనమూలికలు పట్టుకొని ధన్వంతరి దర్శనమిచ్చినట్లు చెప్పబడింది. కొన్ని పురాణాలు ఆయన వనములికలకు బదులుగా జలగలను పట్టుకుని ఉంటాడని పేర్కొన్నాయి. రామాయణంలో కమండలం, దండం నుంచి ధన్వంతరి ఉద్భావించాడని చెప్పబడింది. ఆయన నాలుగు చేతులతో దర్శనమిస్తూ, పై రెండు రెండు చేతులలో,శంఖు, చక్రాలను ధరించి, క్రింది రెండు చేతులలో జలగన్ఉ అమృతకలశాన్ని పట్టుకుని ఉంటాడని కొన్ని పురాణాల కథనం.

దేవవైద్యుడైన ధన్వంతరి భూలోకానికి వచ్చిన ఉదంతాన్ని గురించి హరివంశంలో వివరించబడింది. కాశీ రాజైన దీర్ఘతమునికి చాలా కాలంపాటూ సంతానభాగ్యం లేక పోవడంతో విష్ణుమూర్తిని వేడుకుంటూ ఘోరమైన తపస్సును చేసాడు. అప్పుడు స్వామి దీర్ఘతమునికి ధన్వంతరి కొడుకుగా పుట్టేవరాన్ని అనుగ్రహించాడు. అలా దీర్ఘతముని ఇంట మానవరూపములో జన్మించిన ధన్వంతరి దేవ లోకంలోని వైద్యవిధానాలను మానవలోకానికి అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.

బ్రహ్మవైవర్తపురాణం, ధన్వంతరి భూలోకానికి వచ్చిన తదనంతరం జరిగిన సంఘటనలను వివరిస్తోంది. ఒకానోకసారి ధన్వంతరి, తన శిష్యులతో కలసి కైలాసపర్వత దర్శనానికి బయలుదేరాడు. దారిలో వారిని అడ్డగించిన దక్ష అనే పాము, తన పడగలను విప్పి బెదిరించింది. ధన్వంతరి శిష్యులలో ఒకడు దూకుడుగా ముందుకు వెళ్ళి దక్ష పామును పట్టుకుని ఓ మంత్రమును పఠించడంతో, ఆ మంత్రప్రభావానికి దక్ష పాము మూర్ఛ పోయింది. ఈ విషయాన్ని గురించి విన్న పాములరాజు వాసుకి, ద్రోణ, పుండరీక అనే క్రూర పాముల నాయకత్వంలో కొన్ని వేల పాములను ధన్వంతరి శిష్యులపైకి పంపాడు. ఆ పాముల సైన్యం తమ విషంతో ధన్వంతరి శిష్యులంతా మూర్చపోయేట్లు చేసాయి. అయితే ధన్వంతరి ఆయుర్వేద మూలికలతో తన సిష్యులనంతా మూర్ఛ నుండి తెరుకునేట్లు చేసాడు. ఈ సంఘటన వాసుకిని మరింత ఆవేశానికి లోను చేయగా, ధన్వంతరితో పాటు అతని శిష్యులను నాశనం చేసేందుకు మానసాదేవి అనే పాములరాణిని పంపాడు. మానసాదేవి తన విషాన్ని ఎగజిమ్ముతుండగా, ధనవంతరావిషానికి విరుగుడు చేసాడు. తదనంతరం మానసాదేవికి, ధన్వంతరి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధజ్వాలలకు సకల లోకాలు కంపించిపోసాగాయి. సరిగ్గా అప్పుడు వారి మధ్య శివుడు ప్రత్యక్షం కాగా, తన తప్పును గ్రహించిన వాసుకి పరుగుపరుగున వచ్చి శివుని పాదాలపై వాలిపోయాడు.

ఇలా ధన్వంతరి గురించి అనెక్ పురాణకథలను వింటూంటాం. శస్త్ర చికిత్సలో (ఆపరేషన్స్) ఉద్దండుడైన దివోదాసు ధన్వంతరి వంశావళిలో నాలుగవ తరానికి చెందినవాడు.

శ్రీధన్వంతరి మూలమంత్రం

ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ
ధన్వాతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశకాయ
సర్వరోగ నివారనాయ త్రైలోక్య పతయే త్రైలోక్యవిధయే
శ్రీమహావిష్ణుస్వరూపాయ శ్రీ ధన్వంతరీ స్వరూప 
శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా ||

సుశ్రుతుడు

శస్త్రచికిత్స అనేతప్పటికీ మనకు ముందుగా గుర్తుకొచ్చేది సుశ్రుతుడే. సుశ్రుతుడు ఓ గొప్ప శస్త్రచికిత్సా నిపుణుడు. గొప్ప గురువు, సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడనిపేర్కొనబడుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, సుశ్రుతుడు హిపోక్రెట్స్కు ఓ వంద సంవత్సరాలు ముందుగా, సెల్సియన్ మరియాగాలన్ ల కంటే రెండు సంవత్సరాల ముందుగా ఈ భూమిపై ఆపరేషన్లు చేశాడనేది యదార్థం. సుశ్రుతుడు ఓ గొప్ప వైద్యపరంపర నుంచి వైద్యాన్ని నేర్చుకుంటే, దివోదాసుడు నుంచి సుశ్రుతుడు వైద్యవిద్యను నేర్చుకున్నాడు. సుశ్రుతుని కీర్తి దేశదేశాలకు పాకింది. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ముందుగా అరబిక్ భాషలోకి అనువదించబడి, అరబిక్ భాష నుండి పర్షియన్ భాషలోకి, ఆ తదనంతరం మిగతా భాషలకు విస్తరించాయి. సుశ్రుతసంహిత రెండు భాగాలను కలిగి ఉంది. మొదటి భాగం పూర్వసంహితగా, రెండవభాగం ఉత్తర సంహితగా విభజింపబడ్డాయి. 184 అధ్యాయాలుగా విభజింపబడిన ఈ గ్రంథంలో 1,120 రుగ్మతలను గురించి ప్రస్తావించబడటమే కాక, వాటికి సంబంధించిన చికిత్సాపద్ధతులు కూడ వివరించబడ్డాయి.
అయితే, ఆయన ఇన్ని విధాలైన వైద్యవిధానాలను సూచించినప్పటికీ, ఆయన మధుమేహ, ఊబకాయాలను తగ్గించే వైద్యునిగానే చాలా మంది గుర్తుపెట్టుకుంటున్నారు. ఆయన కాశీలో నివసించినందువల్ల ప్రస్తుతం బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయంలో సుశ్రుతుని విగ్రహం ప్రతిష్టించబడింది. 

చరకుడు

సుశ్రుతుడు శస్త్రచికిత్స  నిపుణుడైతే చరకుడు  ఆయుర్వేద వైద్యుడు. ఏ రోగికి ఏ మూలిక తగినదన్న విషయాన్ని నిర్ణయించడంలో నిష్ణాతుడు. ఆయన శాస్త్ర చికిత్సావిధానాల్లో అనేక అద్భుతాలు చేశాడు.

ఈయన గర్బస్థశిశువు పెరుగుదల గురించి, మానవ శరీర నిర్మాణము గురించి స్పష్టమైన వివరాలు అందించాడు. వాత, పిత్త, కఫములను అనుసరించి చరకుడు శరీరంలోని ఆరోగ్యస్థితిని అంచనా వేసేవాడు. అదేవిధంగా రోగాలను నిర్థారించడమే కాదు, వాటికి తగిన చికిత్సా పద్ధతులను సూచించడంలో కూడా ఘటికుడు చరకుడు. ఈయన వృద్ధాప్యాన్ని వెన్నక్కి మళ్లించే మూలికలను కూడా అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.

ఆయనచే విరచితమైన ‘చరక సంహితి’లో పలు విధాలైన మూలికల వివరాలను, చికిత్సా విధానాలను చూడొచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో చరకుడు వైద్యం చేసేందుకు లోహథాతువులను, జంతు సంబంధ పదార్థాలను కూడా ఉపయోగించేవాడట. మందులు ఉపయోగించే పద్ధతిని అనుసరించి చరకుడు ఆయా మందులను 50 రకాలుగా విభజించాడు. మందులను పొడిరూపంలో, జిగురుగా, ద్రవరూపంలో తాయారు చేసిన చరకుడు ఆ మందులను ఉపయోగించాల్సిన విధానాన్ని గురించి చాల వివరంగా పేర్కొన్నాడు.

వాగ్భటుడు 

పూర్వకాలంలో వృద్ధత్రయీ అని పేర్కొనబడినవారిలో వాగ్భటుడు ఒకరు. మిగతా ఇద్దరు ఆత్రేయుడు, సుశ్రుతుడు. ఈయనచే విరచించబడిన ప్రఖ్యాత వైద్యగ్రంథాలు అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం. సింహగుప్తుని కుమారుడైన వాగ్భటుడు సింధునదీ పరివాహక ప్రాంతములో జన్మించాడు. అవలోకితుడు అనే బౌద్ధగురువు దగ్గర వాగ్భటుడు వైద్యవిద్యను అభ్యసించాడు. అయితే వాగ్భటుడు పుట్టుకతో హిందువే అయినప్పటికీ, జీవన ప్రస్థానంలో హిందూ ధర్మాన్నే అనుసరిస్తున్నప్పటికీ, తనయొక్క గ్రంథాలకు ముడు మాటగా చెబుతున్నప్పుడు బుద్ధుని స్మరించుకుంటాడు.

ఈయన అష్టాంగ సంగ్రహం భారతదేశ పర్యంతం చదువబడింది. ఈయన తన కాలంలో లభ్యమైన వైద్యగ్రంథాలన్నింటిని పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా చేసాడు. చరకుడు, సుశ్రుతుడు చెప్పినవాటిని చక్కగా పరిష్కరించాడు. ఈయన ఋతువులను అనుసరించి చేయాల్సిన దినచర్యల గురించి, ఋతుచర్యల గురించి వివరించాడు. వీటిని పాటించడంవల్ల ఆయుర్ వృద్ధి జరుగుతుందని ప్రయోగాత్మకంగా తెలిపేవాడయాన.

ఈయన రాసిన అష్టాంగ సంగ్రహంలో 6 అధ్యాయాలు, 150 విభాగాలున్నాయి. మొదటి అధ్యాయంలో శరీర నిర్మాణము, గర్భము ధరించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రసవ సమయములో పాటించవలసిన పద్ధతులు, మూడవ అధ్యాయంలో మధుమేహం, చర్మ వ్యాధుల నివారణలను గురించి, నాలుగవ అధ్యాయములో ఆయా వ్యాధులకు తగిన చికిత్సా పద్ధతులు, ఐదవ అధ్యాయంలో చిన్నపిల్లలకు వచ్చే రోగాలు, మూర్ఛలు, పిచ్చి గురించి, వాటి నివారణ పద్ధతులను గురించి వివరించబడింది.

కశ్యపుడు

కశ్యపుడు పిల్లలకు సంబంధించిన విద్యావిధానంలో, ప్రసూతి వైద్య విధానామలో నిష్ణాతుడు. ఈయనచే విరచిత్రమైన గ్రంథం ‘కశ్యప సంహిత’ ప్రశ్నోత్తరాల రూపంలో ఉంటుంది. ప్రసూతి వైద్యంలో కశ్యపుని కృషి గణనీయమైనది. ఆయుర్వేదానికి సంబందించిన ఎనిమిది విభాగాలలో కశ్యపుని కృషి అనితరసాధ్యం.
1. కాయ చికిత్స
2. శల్య చికిత్స
3. శాలక్య తంత్ర
4. అగాధ తంత్రం 
5. భూత విద్య  
6. కౌమార భృత్య 
7. రసాయన తంత్రం 
8. వాజీకరణ తంత్రం అంటూ ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని విభాగాలలో కశ్యపప్రభావం ఉంది.

అదే విధంగా కశ్యపుని వైద్య విధానంలో ఏడు విధాలుగా మందులను తయారు చేసేవారట.
1.చూర్ణం
2.శీతకషాయం
3.స్వరస
4.అభిసవ
5.ఫంట
6.కలక
7.క్వత
కశ్యపుడు పిల్లల పెరుగుదలకు సంబధించిన ఎన్నో సూచనలను తన గ్రంథంలో అందించాడు.

జీవకుడు

జీవకుడు మెదడు, నరాలకు సంబంధించిన వైద్యనిపుణుడు. బౌద్ధ గ్రంథాలలో ఈయన వైద్య విధానాన్ని గురించిన ప్రశంసలను చూడగలం. బింబిసారుని కాలానికి చెందిన జీవకుడు ఒక కుప్పతోట్టిలో కనిపించాడని, రాజుకు ఈ విషయం తెలిసి, ఆ పసికందును ఆస్థానానికి రప్పించి జీవకుడు అనే పేరు పెట్టాడని చారిత్రిక కథనం. పెరిగి పెద్దయిన జీవకుడు తక్షశిలలో వైద్యవిద్యను అభ్యసించాడు. ఏడేళ్ళ పాటు సాగిన ఆ విద్య ముగిసిన అనంతరం, అతనిని గురువు పిలిచి, తక్షశిలకు వలయాకారంలో ఎనిమిది మైళ్ళ పర్యంతంలో వైద్యానికి పనికిరాని మొలకను  తీసుకురమ్మానాడు. జీవకుడు గురువు చెప్పిన ప్రకారం, ఒక యోజన పర్యంతము తిరిగి, అటువంటి మొక్క కోసం వెదకి, వైద్యానికి పనికిరాని మొక్కను కనిపెట్టడం తన వల్ల కాదన్నాడు. అప్పుడు అతని అర్హత పట్ల సంతృప్తి చెందిన గురువు, అతనిని ఆయుర్వేద వైద్యం చేయడానికి అనుమతిని ఇచ్చాడు.

అనంతరం జీవకుడు నరాలకు సంబంధించిన వైద్యాన్ని చేసేందుకు సాకేతపురానికి చేరుకున్నాడు. వైద్యవృత్తి ద్వారా జీవకుడు బాగా ధనవంతుడయ్యాడు. అనంతరం ఒకానొక సమయంలో జీవకుడు బుద్ధునికి కూడా వైద్యాన్ని అందించాడు. ఒకప్పుడు బుద్ధుని కాలికి రాయితగలగా  గాయమైంది. అప్పుడు జీవకుడు కొన్ని మూలికలను గాయముపై పూసి, కట్టు కట్టాడట. ఆ కట్టు ఓ కాలపరిమితి తర్వాత విప్పి వేయాలి. కానీ, ఆ సమయంలో జీవకుడు వేరేపనిపై పొరుగూరుకెళ్ళాడు. అప్పుడు జీవకుడు బుద్ధునితో మానసిక తరంగాల ద్వారా సంప్రదించి, అక్కడనుంచే బుద్ధుని కాలికి కట్టివున్న కట్టును ఎలా విప్పదీయాలో చెప్పి, అలాగే చేయించాడని ప్రతీతి. అప్పట్నుంచి బుద్ధుడు, జీవకుని తన ప్రధాన శిష్యులలో ఒకరినిగా నియమించాడు. జీవకుడు కూడ బుద్ధునికి ఆరోగ్యపరమైన సలహాలను ఇస్తూ ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. 

నాగార్జునుడు

నాగార్జునుడు మందుల తయారిలో అగ్రగణ్యునిగా పేరుగాంచాడు. ఏ వస్తువైనా సరే, బంగారంగా మార్చగలిగే ‘పరసవేది’ విద్యలో కూడ నాగార్జునుడు సిద్ధహస్తుడని చెబుతుంటారు. ఈయన ఆధ్వర్యంలో రసశాస్రం (కెమిస్ట్రీ) బాగా అభివృద్ధి చెందింది. ఇక, ఆ రోజుల్లో వైద్యశాలలను (ఆసుపత్రులు) గురించి పాహియాన్, హుయాన్ సాంగ్ వంటి విదేశీ యాత్రీకులు గ్రంథంస్తం చేసిన విషయాల ద్వారా అనేక విషయాలను తెలుసుకునేందుకు వీలవుతోంది. తెలుసుకోగలం. చంద్రగుప్తమౌర్యుని కాలంలో పాతలీపుత్రాన్ని దర్శించిన చైనా యాత్రీకుడు పాహియాన్ అప్పటి భారతంలోని ఉచిత వైద్యశాలల గురించిన వివరాలను తన యాత్రా గ్రంథంలో లిఖించాడు. తమ ఇళ్ళనే వైద్యశాలలుగా మార్చిన వైద్యులు పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా వైద్యసేవలను అందించేవారట. ఇక, హుయాన్ సాంగ్ అయితే భారతదేశంలో ఉచిత వైద్యశాలలకు కోడవేలేదనటమే కాక, వాటిని పవిత్ర దేవాలయాలని పేర్కొన్నాడు. ఇలా మనది ఘనమయిన చరిత్ర “ప్రకృతిలో పరమాత్మను దర్శించే మన సంస్కృతిలో, వైద్యవిధానాలు కూడ ప్రకృతికి అనుగుణంగానే అభివృద్ధి చెందాయి. ఎక్కడా కృతిమ తత్త్వానికి చోటేలేదు. అప్పటి సమాజం అన్ని విధాలుగా ముందంజ వేసిందంటే, అందుకు కారణం, ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న విషయాన్ని మనసా వాచా కర్మణా నమ్మి, ఆచరించటమే!”


“ప్రకృతిలో పరమాత్మను దర్శించే మన సంస్కృతిలో, వైద్యవిధానాలు కూడ ప్రకృతికి అనుగుణంగానే అభివృద్ధి చెందాయి. ఎక్కడా కృతిమ తత్త్వానికి చోటేలేదు. అప్పటి సమాజం అన్ని విధాలుగా ముందంజ వేసిందంటే, అందుకు కారణం, ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న విషయాన్ని మనసా వాచా కర్మణా నమ్మి, ఆచరించటమే!”


Name of Drug

Indications

  Abhayarishtam

Hemorrhoids, constipation, oedema, Urinary obstructions, indigestion, intestinal worms, anorexia, ascetics.

Amritharishtam

Fever, typhoid, malaria, rakhthavatham.

Asokarishtam

Amenorrhoea, Uterine hemorrhage, vaginal diseases, bleeding, piles, fever, oedema.

Aswagandha
rishtam

Mental diseases, loss of memory, giddiness, epilepsy, insomnia.

Balarishtam

All types of rheumatism.

Dandyarishtam

Indigestion, spruce, urinary obstruction, Anorexia.

Dhanwanthara
rishtam

Paralysis, facial paralysis, fever, tuberculosis, vomiting, vaginal diseases, epilepsy, hernia.

Dasamoolarishtam

General weakness, spruce, anemia, cough, tuberculosis, vomiting, dysurea, jaundice, calculus.

Dasamoolarishtam Spl.

General weakness, sterility

Hridayasanthi

Hypertension, cholesterol, chest pain, bronchitis, cough, tuberculosis

Jeerakarishtam

Puerperal fever, fatigue, nutritional deficiency, cough, dysponea, flatulence, spruce, diarrhea, indigestion

Khadirarishtam

Skin diseases, leprosy, heart disease, anemia, diseases of spleen malignant tumors, skin diseases due to blood toxemia

Kudajarishtam

Bleeding piles, bleeding per rectum, spruce, amoebic and bacillary dysentery.

Mridweekarishtam

Tuberculosis, bronchitis, anemia, cough, diseases of throat, anorexia, fatigue, traumatic infections of chest, exert ional dysponea

Mustharishtam

Spruce, diarrhea, loss of appetite, gastric enteritis, amoebic and bacillary dysentery.

Parthadyarishtam

All heart diseases, bronchitis and bronchiectasis, nostalgia

Panchamridweek
arasam

Diabetes, fatigue, nervous and metabolic disorders.

Saraswatha
rishtam

Convulsions and hysteria, anxiety neurosis, insomnia, weak memory, depression, idiopathic epilepsy

Udarasudha

Peptic ulcer, indigestion, hemorrhoids, worm infestation, anorexia, urinary obstructions.

Vasarishtam

Cough, bronchitis, haemoptysis, hoarseness of voice

 

ASAVAS

Name of Drug

Indications

Aravindasavam

Pediatric general tonic, abdominal distention, colic, anorexia.

Chandanasavam

Leucorrhoea and dysurea in ladies. Also indicated in spermatorrhoea and premature ejaculation in men.

Kanakasavam

All types of cough, bronchitis, bronchiectasis, haemoptysis, relapsing fever, inflammation and infection of chest due to trauma.

Kumaryasavam

Hepatosplenomegaly, jaundice, urinary and bleary calculi, abdominal colic, dysmenorrhoea, menorrhagia, irregular periods, spermatolysis, spermaturea, anorexia

Lohasavam

Anemia of various etiology, anorexia, spruce, haemorhoids, bronchitis, exertional dyspnoea, ischaemic heart disease, hepatosplenomegaly, oedema, ascitis

Nimbasavam

Eczema, scabies, pruritus, urticaria, allergic dermatitis, varicose-ulcer, fistula, luecoderma, arthritis, anemia, jaundice, worms infestation

Punarnavasavam

Localized and generalized oedema, anemia, ascetic, hepatosplenomegaly, jaundice, hyper acidity, dysurea

Saribadyasavam

Leucorrhoea, pyurea, gonococcal infection, virginities, backache, anorexia

Sudarsanasavam

All types of fever especially in viral fever, relapsing fever, enteric fever


KASHAYAMS

Name of Drug

Indications

Ashtavargam Kashayam

All types of rheumatic diseases, lumbago, sciatica, neuralgia, hyper tension.

Brahathyadi Kashayam

Diuretic, urinary obstructions, calculus

Chiruvilvadi Kashayam

Hemorrhoids internal and external with or without bleeding, and fissures, constipation.

Dasamoolakaduthrayam Kashayam

Bronchitis, bronchiectasis, common cold, promotes expectoration, traumatic inflammation of chest.

Dhanwantharam Kashayam

All types of rheumatism, facial paralysis, prolapsed uterus, puerperal fever, inguinal hernia, dysurea, numbness, neuralgia.

Dhanadanayanadi Kashayam

Bells palsy, Parkinson's, hemiplegia, monologue.

Drakshadi Kashayam

Anemia, jaundice, alcoholism, hypothermia, giddiness, fainting, vomiting, haemetemisis, mental diseases, burning sensation of abdomen.

Elakanadi Kashayam

Pulmonary tuberculosis, cough, cold, costalgia, anorexia, body-ache.

Gandharvahasthadi Kashayam

Habitual constipation, sciatica, lumbago, anorexia, impaired functioning of gastro intestinal tract.

Gulguluthikthakam Kashayam

Various types of bacterial and fungal infections, eczema, candidacies, psoriasis, allergic dermatitis, sinusitis.

Indukantham Kashayam

Enteric fever, relapsing fever, malarial fever, tuberculosis, rheumatic fever, rheumatoid arthritis, anorexia, dyspepsia, general debility.

Karappan Kashayam

Scabies, pruritus, impetigo, abscess, infantile eczema, constipation indicated for children.

Mahamanjishtadi Kashayam

Mahamanjishtadi Kashayam.

Maharasanadi Kashayam

All types of rheumatism, hemiplegia, bells palsy, Parkinson's, chorea, monologue, neuralgia, muscular pains.

Manjishtadi Kashayam

Scabies, allergic dermatis, fistula, psoriasis, abscess.

Mahathikthakam Kashayam

Eczema, pruritus, abscess, fistula, various types of dermatitis, diseases of eye stomatitis, hypothermia.

Marma Kashayam

Post traumatic aches, inflammations, oedema, sprains, traumatic back ache, all complications accompanied by marmabhighatham.

Nimbadi Kashayam  Spl.

All types of abscess especially in tropic ulcers. All types of dermatitis, urticaria, pruritus, pimples, relapsing fever.

Panchathikthakam Kashayam

Dermatitis, urticaria, pruritus, pyrexia, pimples, malaria, relapsing fever.

Pathyapunarnnavadi Kashayam

All types of oedema, ascitis, hypertension, retention of urine, nephritis.

Padoladi Kashyam

All types of dermatitis, leprosy, pimples.

Pathyakshadhatryadi Kashayam

Sinusitis, migraine, chronic infections of ear nose and throat, allergic rhinitis, diseases of eye, nasal congestion, all types of head-ache.

Prasaranyadi Kashayam

Monologue, neuralgia, hemiplegia.

Rasnarandadi Kashayam

Rheumatic fever, rheumatoid arthritis, cervical and lumbar spondylitis, arthralgia, myalgia.

Sapthasaram Kashayam

Abdominal colic, constipation, anorexia, dyspepsia, ascitis, dysmenorhhoea. Used in combination with powder of piper longum, asafetida, ghee.

Sukumaram Kashayam

All types of uterine diseases, hernia, flatulence, ascitis, herpatosplenomegaly, irregular periods, dysmenorrhoea, sterility.

Sahacharadi Kashayam

All types of rheumatic diseases especially which affects in the lower portion of the body.

Vidaryadi Kashayam

Continuous use of this will give health and stamina. Cardiac disorders, bronchitis, cough, general debility, tuberculosis.

Varunadi Kashayam

All types of head ache, sinusitis, otitis, diseases of ear, nose and throat, tumours, rheumatic disease.


GHRITHAMS

Name of Drug

Indications

Amaraghritham

A Specific and non-specific leucorrhoea, loss of appetite mental depression, insomnia, dysurea, burning sensation of abdomen and body, constipation. Improves general health and vitality.

Brahmighritham

Psychosis and epilepsy, psychosomatic disorders, mental disorder caused by evil spirits, insanity. Continuous use gives relief to skin diseases and sterility.

Charngaryadighritham

Drug of choice in sprue, peptic ulcer, chronic diarrhea, dysentery, amoebas, ulcerative colitis, recurrent fever, dysurea, hemorrhoids, rectal prolapsed.

Durvadighritham

External application in ulcers, with burning sensation, pricking pain. External application in eye.

Gulguluthikthakaghritham

Used in ear, nose and throat diseases. Anemia, cardiac diseases, distaste, bronchitis, bronchiectasis, sinusitis, rheumatic diseases, scabies, tumors, fistula.

Indukanthaghritham

Increase body resistance to recurrent fever, allergic rhinitis, bronchitis, and chronic respiratory diseases. Improves general immune mechanism.

Jathyadighritham

External application only. Used in all types of ulcers, fistula, tropic ulcers, and acne.

Kalyanaghritham

Disorders of brain, insanity, insomnia, promoting development of memory, physical and mental weakness, hoarseness, stammering, cough, diabetes, skin diseases, anorexia.

Karaskaraghritham

Very effective in rheumatoid arthritis with burning sensation and severe pain

Mahathikthakaghritham

Eczema, ruits, abscess, fistula, various types of dermatitis, diseases of eye, stomatitis, hypothermia. Very good blood purifier. Can be used foe external application in scabies and other skin diseases.

Mahathpanchagavya
ghritham

Epilepsy, insanity, mental disorders, jaundice, anemia, chronic fevers, fistula, hemorrhoids, generalized oedema, ascitis.

Mahathriphalaghritham

Used in eye diseases.

Padoladighritham

Diseases of eye, ear and nose. Cataract, corneal opacity, conjunctivitis, abscess, scabies, stomatitis.

Panchagavyaghritham

Epilepsy, insanity, mental disturbances, jaundice, anemia, chronic fevers, fistula, hemorrhoids, generalized oedema, ascitis.

Saraswathaghritham

Disorders of brain, insomnia, insanity, improves memory power and intelligence.

Sukumaraghritham

Anorexia, constipation, peptic diseases due to acidity, hernia, flatulence, ascitis, hepatosplenomegaly, irregular periods, sterility.

Varunadighritham

Head-ache, diseases of ear, nose and throat, obesity, oedema.

Vidaryadigritham

Used in post natal care, general debility.


OILS

Name of Drug

Indications

Arimedadi Enna

Diseases of gum and teeth. Used on head for bathing, applied on gums or Ashtangahridayam mouth wash.

Asnamanjishtadi Enna

Tooth ache, head ache, ear pain vitiated by ‘kapha’

Asanavilluadi Enna

Head ache, cooling effect to eye used for head  bath.

Balaguloochyadi Enna

Used for head bath in gout, head-ache and inflammation by water absorption in head

Balahatadi Enna

Recurrent attack of headache, gives sound sleep.

Balaswagandha Lakshadi Enna

Used in ‘thala’ (applied on vertex) for bronchitis and bronchiectsis. Used for ‘abhyanga’ (body message).

Chandanadi Enna (cheruthu)

External use for bath and ‘abhyanga’. Cooling, refrigerant, mild antiseptic.

Dhanwantharam Enna

All types of rheumatism, paralysis. Used for ‘abhyanga’ in antenatal and postnatal care. Head bath in trauma of head that leads to continuous headache.

Eladi Enna

Head bath in case of toothache, ear pain. External usage in scabies.

Karprasasthyadi Enna

All types of rheumatism. Head bath and external application of whole body. Paralysis, monologue, facial paralysis.

Kayathirumeni Enna cherutu

Post traumatic pain, oedema and burning sensation. All types of diseases in head. Gives sound sleep

Kayathirumeni Enna Valithu

For all diseases above neck due to injuries. For fracture, contusions, delirium, ear ache etc.

Kayonniadi Enna

Head ache due to vitiated pitha, eye diseases, and dental disorders.

Lekshmivilasam Enna

Coolness to head and eye. Gives sound sleep. Epilepsy, mental diseases.

Mahamashadi Enna

Hemiplegia, facial palsy, monoplefia, wasting of muscles, headache and all types of ENT diseases.

Mahanarayana Thailam

All types of rheumatic diseases, facial palsy, infertility, used in ‘rekthavatham’

Mashadi Enna

Hemiplegia, all types of rheumatic diseases. Head and body application.

Nagaradi Enna

Diseases in mouth and nose.

Kesamritham Enna

Coolness to head, promotes hair growth and prevent graying. Adds blackness and luster to hair.

Valia Amrithadi Enna

Eye diseases. This oil is antipitha and is used against headache and burning sensation in head and body.

Siddha Kayathirumeni Enna

Post traumatic above neck. Used in sprain, fracture, swooning. Used on head and body.

Neelibhringadi Enna

Promotes hair growth and prevents is graying, adds blackness and luster to hair besides cooling eyes and body

Siroreksha Thailam

Recurrent attack of cold, sneezing, head ache, rhinitis

Thriphaladi Enna

Eye diseases, for head bath

Vathasani Enna

All types of rheumatic diseases, deafness, fracture, joint pain.


KUZHAMBU

Name of Drug

Indications

Agasthyar Thailam

All types of pain in body. Pain and oedema in knee joint, numbness, head ache, groin oedema, convulsions. Used in sever “Vatha” diseases.

Asavenna

Traumatic complications, oedema, pain and burning sensation due to fracture. Wasting of joints and stiff joints.

Balathailam

All types of rheumatic diseases. Good for “Meha” diseases

Chinchadi Kuzhambu

All types of rheumatic diseases, pain and burning sensation in joint.

Dhanwantharam Kuzhambu

For rheumatic diseases especially for “Vathe and Vatha Kapha”. Good for ante natal and post natal care.

Karpuradi Thailam

All types of pain. Relieves pain immediately.

Karaskara Thailam

Oedema, burning sensation in joint, tonsillitis, filariasis.

Karpasasthyadi Kuzhambu

Paralysis, monologue, Body bath

Kottamchukkadi Kuzhambu

All types of rheumatic diseases, joint oedema, pain.

Kayarajankthailam

Traumatic pain, contusions, body pain, oedema, soothes body. Good in “thridoshas”

Mahapindathailam

Anti inflammatory, Ant microbial. For pains and burns.

Mahavathanthakan

All types of rheumatic diseases.

Murivenna

All types of injury, fracture, dislocation, sprain and its complications.

Pindathailam

Anti-inflammatory, anti-microbial for pains. Reduce burning sensation.

Prabhanjana Vimardhanam Kuzhambu

Paralysis, weakness of body, numbness, gout.

Prasarani Kuzhambu

Monologue, hemiplegia, facial paralysis.

Sahacharadi Kuzhambu

Rheumatic affections of lower extremities, rheumatic chorea, Parkinson’s, neuralgia.

Sahacharadi Kuzhambu (Spl)

Rheumatic affections of lower extremities, Rheumatic chorea, Parkinson's,

Shashtikathailam

Muscular wasting in polio myelitis, dystrophy, painful rheumatic affections

Siddhakayathirumeni Thailam

Post traumatic diseases above neck. Used in sprain, fracture.

Vathakodalithailam

All types of rheumatic disease. For paralysis, numbness, rheumatic pain.


KERAMS

Name of Drug

Indications

Ashtapathradi Keram

All types of head diseases, earache, ear secretions.

Balaguloochuadi Keram

Used in gout for head and body bath.

Balaswagandhalakshadi Keram

Cough, bronchitis, body bath, cooling eyes.

Chemparuthyadi Keram

Eczdema, scabies, cold in children.

Dentharaksha Keram

Tooth ache, gum ache

Dinesavalyadi Keram

Leprosy, scabies, skin diseases, discoloration of skin, body bath.

Dhurthuradi Keram

Scabies in children, dandruff.

Durvadi Keram

Promotes hair growth, dandruff in head, scabies.

Eladi Keram

Used in children for scabies, hyper pigmentation to skin.

Gopatmajadi Keram

Burns, scabies, skin diseases.

Jathyadi Keram

Ulcers, logorrhea.

Kayonniadi Keram

Head ache, eye diseases, cooling eye.

Nalpaamaradi Keram

Scabies, leprosy, skin diseases.

Neelibhringadi Keram

Promotes hair growth and prevents its graying, add blackness and luster to hair.

Thriphaladi Keram

Eye diseases, ear diseases.

Vachalasunadi Keram

Pus in ear, ear pain.

Kesamrutha Keram

Soothing, promotes the hair growth, prevents hair graying, add blackness and lustre to hair.

Thulaseeswarasadi Keram

Secretions of mouth and nose, chronic sinusitis, removes dandruff.

OILS (INTERNAL)

Name of Drug

Indications

Balamritham Avanakkenna

Umbilical pain, intestinal colic. Used as laxative

Balasarvangam

Rheumatic diseases and respiratory diseases. Epilepsy, paralysis, polio, tetany, whooping cough, bronchitis. Very effective for asthma in children which occurs every month around new moon day.

Chathlingathailam

Rheumatic, facial paralysis, hemiplegia, chorea, epilepsy, polio, delirium, spasmophilia, tetany, numbness.

Erandasukumaram

Flatulence, intestinal colic, hernia. Used as laxative.

Gandharvahastadierandam

Used in habitual constipation, sciatica, and lumbago. Impaired functioning of gastro-intestinal tract.

Karaskara thailam

Used in gout, burning sensation, pain and ulcers found in “rakthavatha”.

Kshirabala Avarthy-7
Kshirabala Avarthy-14
Kshirabala Avarthy-21
Kshirabala Avarthy-41
Kshirabala Avarthy-101

Used in all diseases by vitiated “vatha”. Facial paralysis, hemiplegia, headache, migraine, ear pain, cataract, uterine disorders etc. increases potency by increasing “avarthy”.

Mahanarayana Thailam

For paralysis, facial paralysis. Good for gout and diabetes.

Nimbamrutadi Erandam

Good for gout. Skin diseases and as laxative.

Nirgundyadi Erandam

Intestinal colic, backache, pain in hip and legs due to “vatha”. Used as laxative.

Siddha Balapeeyoosham

For dermatitis, stomatitis, phlegmatic diseases, epigastria pain, intestinal colic, laxative.

Vellarukuthailam

Eczema, scabies, ulcers, tropic ulcers, uterine ulcers, abscess, psoriasis. Purgative.


PILLS

Name of Drug

Indications

Anrdrakudaram

Abdominal colic, flatulence, inguinal hernia, constipation, hemorrhoids, ascitis.

Chandraprabha

Acute and chronic urinary tract infection, diabetes, leucorrhoea, gonorrhea, urinary calculi, polyurea, dysurea.

Chandanadivarthi

Purulent infection of eye, conjunctivitis, blepharitis, trachoma, opthalmia neonatarum. Use externally as eye drops in combination with breast milk, rose water, honey etc.

Dhanwantharam

Respiratory tract infection, allergic and bronchial asthma, hiccough, cough, hyperacidity, indigestion.

Gorovhanadi

All types of fevers, delirium and convulsion, in hyper pyrexia, epilepsy, facial paralysis, hemiplegia. Specially used for children.

Gopichandanadi

All types of fevers, cough, bronchitis, delirium and convulsion in children

Kaishoragulgulu

Eczema, leprosy, chronic ulcers, fistula, sinuses, venereal diseases, gout, tonsillitis. Good antibiotic.

Karuthavattu

Head ache, common cold

Krimishodhini

Infestation with round worms, pin worms particularly in children.

Manduravadakam

Iron deficiency, anemia, hookworm infestation, anorexia, leprosy, and diabetes.

Manasamithra vadakam

Psychosomatic disorders, psychoneurotic disorders, anxiety, tension psychogenesis insomnia, loss of memory, epilepsy, psychosis, mood elevator.

Swasanandam

Asthma, cough, bronchitis

Sundarsanam

All types of fever, cough, bronchitis, anemia, cardiac diseases, jaundice, body pain

Kasakulanthakan

Cough, bronchitis, bronchial, asthma

Suryaprabha

All types of fever, cough, bronchitis

Uramarunnuguilka

Diarrhea, vomiting, intestinal parasites, fever, cough, abdominal colic children)

Vettumaran

All types of fevers, indigestion, abdominal colic, dysurea

Villuadi

All types of insect bites, snake and rat poisoning, food poisoning gastro, enteritis, dyspepsia, vomiting

Vimalavarthy

Eye diseases, allergic inflammatory conditions, photophobia, keratitis, cataract

Vyoshadivadakam

Chronic allergic rhinitis, eosinophilia, cough, asthma, dyspepsia

Yogarajagulgulu

Rheumatic arthritis, chronic ulcer, sprain and muscular spasms, skin diseases, rheumatic fever.


CHURNAMS

Name of Drug

Indications

Agasthyar Nasikachurnam

Headache, Sneezing, Common cold, Teeth ache

Ashtachurnam

Indigestion, Abdominal Pain, Anorexia, Worms infestation

Aswagandhadi Churnam

Cough, intestinal parasites, Rheumatic Disorders, Anemia, Flatulence, Hemorrhoids, Distaste, Cardiac Disease

Avipathy Churnam

Jaundice, Poisoning

Dadimashtakachurnam

Dysentery, Sprue, Abdominal pain, Anorexia

Eladi Powder External)

Eczema, Allergic Dermatitis, Scabies, Uticaria

Gulgulupanchapalam

Fistula, Skin Diseases, Leprosy, Sinus

Hinguvachandi Churnam

Flatulence, Indigestion, Anorexia, Abdominal pain Hiccup, Hemorrhoids, Diarrhea, dysentery

Jadamayadi Lepam (External)

Arthritis, Gout and rheumatic fever, Swollen joints

Kachuradi Churnam (External)

Headache, Burning Sensation of Head, Fainting, Giddiness, Cold, Sinus, Asthma

Kalyanaksharam

Constipation, Flatulence, Ascitis, Anemia, Enlargement of Spleen, Hemorrhoids, Peptic Ulcer.

Karpuradi Churnam

Dry Cough, Bronchitis, Vomiting, Anorexia.

Kottamchukkadi Lepam

Arthritis, Swollen Joints

Nagaradilepam (External)

Traumatic Swelling, Arthritis

Rajanyadichurnam

Teething sprue, Infantile Diarrhea, Vomiting, Jaundice.

Rasanadichurnam (External)

Cold, Headache, Convulsions

Santhigiri Tooth powder

Bleeding of gums, cavities

Shaddharana Churnam

Rheumatic Fever, Leprosy, Hemorrhoids, Constipation, Indigestion

Thalispathradi Churnam

Anorexia, Diarrhea, Cough, Bronchitis, Laryngitis, Diseases of Spleen, Heart Diseases

Thararichurnam

Dandruff, Itching and hair fall

Triphalachurnam

Eye Diseases, Headache, Diabetes, Skin Diseases, Constipation


MISCELLANEOUS

Name of Drug

Indications

Anuthailam

Used as nasal drops in all types of ear, nose and throat diseases.

Elaneer Kuzhambu

Used regularly in eye diseases such as ulcerations, cataract, itching.

Kumkumadilepam

Used in acne and black spots, after-shave lotion.

Manjishtadilepam

Chill brain, infections of skin, ringworm infection, and fissures in soles.

Rasothamadilepam

Eczema, scabies, fungal infection on skin, fissured feet.

 Hridayarenjini

Sprain, muscular and joint pain, headache, insect bite, post traumatic inflammations, common cold, tonsillitis.కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top