శ్రేష్ఠ పాలకుడు - కధ - The Best Ruler - Story

0
శ్రేష్ఠ పాలకుడు - కధ - The Best Ruler - Story
అశోకుడు !
ప్రియదర్శిగా పేరుగాంచిన అశోక సామ్రాట్టు జన్మదినోత్సవం జరుగుతోంది. ఆ సందర్భంగా ఆయన “మీలో ఉత్తమోత్తముదైనప్రనాయకుడికి మంచి బహుమానం ఉంటుంది అని ప్రకటించాడు. సామంతులందరూ బహుమతి కోసం పోటీపడ్డారు.
  • ముందుగా దక్షిణ ప్రాంతాధికారి ఇలా చెప్పాడు: “ఈసారి నా కోశాగారంలో గత సంవత్సరం కంటే ఆదాయం మూడు రెట్లు పెరిగింది”.
  • ఉత్తరప్రాంత సామంతరాజు ఇలా చెప్పాడు: 'గత ఏడాది కంటే నేను నా పాలనా ప్రాంతంలో బంగారాన్ని. మూడు రెట్లు * పెంచాను”.
  • తూర్పు ప్రాంతాధికారి సమాధానమిలా వచ్చింది: “మా ప్రాంతంలో తీవ్రవాదులనందరినీ అణచివేసాను. ఇక అక్కడ ఎవరికీ కన్నెత్తి చూసే ధైర్యం కూడా లేదు.”
  • పశ్చిమ ప్రాంతపు శాసకుడు గర్వంగా ఇలా చెప్పాడు: 'నేను నా సేవకులందరి వేతనాల్ని తగ్గించి వేసాను. ప్రజల మీద పడే పన్నుల సంఖ్యను పెంచాను. దీంతో మా ప్రాంత ఆదాయం బాగా పెరిగింది.
ఇలాగే మిగిలిన ప్రాంత సామంతులు కూడా తమ తమ గొప్పలు చెప్పుకున్నారు. చివరగా మగధ సామంతరాజు వంతు వచ్చింది. ఆ రాజు వినయంగా సామ్రాట్టుతో ఇలా అన్నాడు: “మహారాజా! నన్ను క్షమించండి. ఈ ఏడు నా ప్రాంతంలో గతేడాది వచ్చిన ఆదాయంలో సగం ఆదాయమే వచ్చింది.
  “ఎందుకలా?” అని అశోకుడు ప్రశ్నించాడు. 'ఈ ఏడాది రాజ సేవకులందరికి కొత్తగా కొన్ని కలిగించాను. అందువలన వాళ్ళు మరింత శ్రద్ధగా, నిజాయతీగా శ్రమపడతారు. సాధారణ పౌరులకు పన్నులలో కొన్ని వెసులుబాట్లు కలిగించాను. ఏడాది చివరికి వారి కోసం మరిన్ని. ధర్మసత్రాలు, వైద్యశాలలు, పాఠశాలలు ప్రారంభించాలనే ఆలోచన కూడా ఉంది” అన్నాడు మగధ రాజు.
  అశోక సామ్రాట్టు ఎంతో ఆదరంగా అతడి దగ్గరకు వెళ్ళి ఇలా అభినందించాడు: “నాకు కావాల్సింది ప్రజల రక్తంతో బంగారపు రాశులు ప్రోది చేసేవారు కాదు, ప్రజల సుఖ సౌఖ్యాల విషయం లోతుగా ఆలోచించే ప్రజాపాలకులే! కాబట్టి ఈ ఏడాది సర్వథ్రేష్టుడైన ప్రజా నాయకుడివి నువ్వే!”

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top