 |
Lord Narasimha |
భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో శ్రీ నారసింహుడే స్వయంగా ప్రహ్లాదునితో ఇలా అన్నాడు. ఎవరైతే నా అవతార విశేషాలను, నీ చరిత్రను (ప్రహ్లాదుని) గూర్చి తెలుసుకుంటారో వారికి మరుజన్మ వుండదు అని దీని అర్థము. దశావతారాలలో మొదటి నాలుగు అవతారాలు తరువాతి ఆరింటికంటే ఎంతో భిన్నమైనవి. మొదటి నాలుగు అవతారాలు సద్యోజాతాలు, అంటే వాటంతట అవే సంకల్ప మాత్రముననే సాక్షాత్కరించిన విభూతులు. తరువాత వచ్చే ఆరు అవతారాలలో శ్రీమన్నారాయణుడు అందరి మానవుల వలననే గర్భావాసాన్ని అనుభవించాడు. మొదటి నాలుగింటిలోనూ నాలగవదైన సర్వాంతర్యామి తత్వం కలిగిన శ్రీ నరసింహావతారం ఎంతో విశిష్టమైనది.
చదవండి: నరసింహ వ్రతకల్పము
Download 'నరసింహ వ్రతకల్పము'