నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label కర్మ సిద్ధాంతము. Show all posts
Showing posts with label కర్మ సిద్ధాంతము. Show all posts

Friday, June 26, 2020

శ్రీ కృష్ణుని వ్యక్తిత్వము - Sri Krishnaకర్షయతి ఇతి కృష్ణః అనే వ్యుత్పత్తి ఆధారంగా జనించిన అర్థానికి సార్థకత కల్గించినవాడు కృష్ణుడు.

“బ్రహ్మణో వయసా యస్యనిమేశ ఉపచార్యతే
సచాత్మా పరమం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే”
(శ్రీ బ్రహ్మవైవర్త పురాణంలోని ద్వితీయ ఖండంలో గల రెండవ అధ్యాయం)

ఎవని కనురెప్పపాటు కాలం బ్రహ్మ ఆయుర్దాయమో అటువంటి ఆత్మ స్వరూపుడైన పరబ్రహ్మమే కృష్ణుడు అని అర్థం.

కృష్ణుడు పరమ యోగీశ్వరేశ్వరుడు. నిర్వికల్ప సమాధిలో ఉంది తిరిగి సామాన్య స్థితికి రాగలిగిన సామర్థ్యం కలవాడు. కర్మలను చేస్తూ కూడా ఆ కర్మవాసన తనకంటకుండా తామరాకు మీది నీటి బొట్టులాంటి జీవనం గడిపిన యోగి. ఇతని యోగీశ్వరత్వానికి భగవద్గీత చక్కని ఉదాహరణ.

వాస్తవానికి భగవద్గీత మొదటి సారిగా సూర్యునికి ఉపదేశింపబడింది. అయితే ఇక్కడ సూర్యశబ్దం సాంకేతిక పరమైనది. సూర్య శబ్దం జ్ఞానమయం అని గ్రహిస్తే తొలిసారిగా భగవద్గీత జ్ఞాన మార్గాన ఈ లోకానికి అంద చేయబడింది అనుకోవచ్చును. సహజంగా జ్ఞానం ఒకరినుంచి ఇంకొకరికి అందచేయబడేదే. కాబట్టి సూర్యశక్తి ఆధారంగా జ్ఞానం లోకానికి అందచేయ బడిందని అర్థం చేసుకోవాలి. కాబట్టే ఈ గీత అతి ప్రాచీనమైనది. అంటే చరిత్ర కందిన నాగరికతల కంటే కూడా ప్రాచీనమైనది అనుకోవాలి. సూర్యుని దగ్గరనుంచి శాసనకర్తయైన మనుచక్రవర్తి ఈ జ్ఞానాన్ని అందుకున్నాడు. అనేక కారణంతరాల వలన ఈ జ్ఞానం కోంత మరుగున పడింది. అయినప్పటికీ బ్రహ్మకీ, యాజ్ఞావల్క్య మహర్షికి కూడా ఈ జ్ఞానం అందుబాటులో ఉందని తెలుస్తోంది.

కర్మ సిద్ధాంతం భగవద్గీతలో వివరంగా చెప్పబడింది. అంటే సమాజంలో అనాటికీ కర్మలపట్ల విశ్వాసం, నమ్మకం ఉందనుకోవాలి. ఈ భావన అప్పటికే బలపడింది. అంటే ఇదెంతో ప్రాచీనమైన విశ్వాసం అని తేలుతోంది. ఈశావాస్య ఉపనిషత్తు కర్మ సిద్ధాంతపు బీజాలను ఈ రకంగా ప్రకటించింది.

“కురువణ్ణే నేహ కర్మాణి జిజివిషేత్ శతమ్ సమోః
ఏవమ్ త్వయిన అస్యతా ఇతః అస్తి నకర్మ లిప్యతే నరే”

ఈ మంత్రంలో కర్మయోగానికి సంబంధించిన బీజాలు కనిపిస్తున్నాయి. ఇది సూర్య భగవానుడు చెప్పినట్లు తెలుస్తున్నది. ఇది సూర్య భగవానుడు చెప్పినట్లు తెలుస్తున్నది. తనకు తెలిసన జ్ఞానాన్ని బహుశః సూక్ష్మంగా చెప్పి ఉండవచ్చును. నిస్వార్థమైన కర్మ ఎన్నటికి వృథాకాదు. వాసనారహిత జీవనాన్ని జీవన్మరణ చక్రం నుంచి విముక్తిని, మోక్షాన్ని అందిస్తుందని ఈ మంత్రం స్పష్టం చేస్తున్నది. ఈ విషయాన్ని భగవద్గీత పదేపదే వక్కాణించింది. సర్వకాలాలకు అన్వయిమ్పబడే ఈ విషయం అందరికి శిరోధార్యమే. యుద్ధరంగంలో కృష్ణుడు ఆ విషయాన్ని రేఖా మాత్రంగా అర్జునునికి జ్ఞప్తికి తెచ్చాడు. అర్జునునితో పాటు ఆ గీతాబోధకు ఆంజనేయుడు, సంజయుడు ప్రత్యక్ష సాక్షులు. ఇంత మహిమోపేతమైన భగవద్గీతను చెప్పిన కృష్ణుని వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైనదో ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. భగవద్గీతతో పాటు హరివంశం, విష్ణుపురాణం, మహాభారతం, భాగవతం కూడా పరిశీలిస్తే తప్ప కృష్ణుని సంపూర్ణం వ్యక్తిత్వం అర్థం కాదు.

యయాతి కుమారుడైన యదు యాదవుల యొక్క మూల పురుషుడుగా చెప్పబడుతున్నాడు. కాని, యాదవులలో కాలక్రమేణ ఎన్నో శాఖలు ఏర్పడ్డాయి. వృష్టి భోజ, శూర, అంధక, యాదవ మొ|| అందులో కొన్ని. వీరందరూ ఎంతో శౌర్యపరాక్రమాలు గలవారు అయినప్పటికీ స్వేచ్చాప్రియులు. సామాజికంగా, రాజకీయంగా వీరందరికీని ఏకం చేయాలని సంకల్పించాడు కృష్ణుడు. 

సంఘటితమైన మంచితనం ఎప్పుడూ చెడును ఎదుర్కొనటానికి తగిన సామర్థ్యాన్ని కల్గి ఉంటుంది. విడివిడిగా చెడును ఎదుర్కోనలేము. ఇది వాస్తవం. సంఘంలో ప్రబలిపోయిన చెడును సమర్థవంతంగా ఎదిరించాలంటే ఈ సమీకరణ చాల అవసరం. అందుకే తనకు తానుగా నాయకత్వం వహించి యాదవులందరిని ఏకం గావించగలిగాడు. ఈ నాయకత్వ లక్షణాలు అతనికి పసితనం నుంచే ఉన్నాయి. లోక రక్షణ కోసం, ధర్మకోసం కృష్ణుడు పడిన తాపత్రయం చిన్నప్పటి నుంచే కన్పిస్తుంది. అన్నిటా తానే ఉంటూ కూడా తామరాకు మీద నీటిబొట్టు లాంటి సాధుజీవనం గడిపాడు. తనకొక, కీర్తి రావాలని కాని, ధనం సంపాయించాలని గాని ఎన్నడూ ప్రయత్నించలేదు. 

ఆదర్శవంతమైన సంఘాన్ని నిర్మించాలని, అందులోని ప్రజలందరూ ఏ కలతలు లేకుండా సుఖజీవనం గడపాలని, మనస్ఫూర్తిగా నమ్మినవాడు, దానికి ప్రయత్నించి సఫలీకృతుడైన వాడు, కృష్ణుని ఏ చర్య గమనించినా దాని వెనకాల గల అతని ధర్మసంరక్షణ మనకతని వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపుతుంది. ఈ ధర్మ సంరక్షణలో కృష్ణుడు ఎంతో మంది అసురురులను సంహరించాడు. సంసుడు, సాళ్వుడు, సృగాల వాసుదేవుడు, పౌండ్రక వాసుదేవుడు శిశుపాల దంత వక్త్రులు, కాలయవనుడు, జరాసంధుడు, నరకుడు – ఇట్లా చెప్పుకుంటూ పొతే ఎందరో … జరా సంధుడు, నరకుడు బంధించిన రాజన్యులకు, రాకుమర్తెలకు విముక్తి కలిగించాడు. వారందరికి తానే నీడగానిలిచాడు. ఇదొక విప్లవాత్మకమైన నిర్ణయం. ఇంత ధైర్యం, విచక్షణ, సానుభోతూ ఇంకొక వ్యక్తిలో మనకు కనిపించవు.

స్వజానాన్ని చంపుకోవతంలో వెనకంజ వేసిన అర్జునునికి కర్మసిద్ధాంతాన్ని విన్పించి, జాగారూకుడిగా చేసాడు. ఇది కేవలం అర్జునుడు తనకు బంధువన్న ప్రీతితో కాదు. పాండవులు ధర్మ రక్షకులు కాబట్టి అన్నివేళలా వారికి అండగా నిలిచాడు. 

కృష్ణుడు నిర్యాణం చెందే సమయానికి చాలా వృద్ధుడు. బోయవాని బాణఘాతంలో తనవు చాలించాడు. తనకు గాయం చేసిన బోయవానిని చిరునవ్వుతో క్షమించాడు. మృత్యువును నిర్వికారంగా ఆహ్వానించడం కృష్ణునికి తగింది. అందుకే కృష్ణుడు యోగీశ్వరేశ్వరుడేగాదు. యోగీశ్వరతత్వానికి సరైన నిర్వచనం కూడా. ఇంతటి ఆధ్యాత్మికత గల ఇంకొక వ్యక్తి నభూతో నభవిష్యతి. యోగీశ్వరులను చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం. కాని, యోగీశ్వరేశ్వరుడు కృష్ణుడోక్కడే. అతని కంటే ముందు కాలంలో గాని, అతని తర్వాతి కాలంలోకాని ఇంటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి లేడు. యోగీశ్వరేశ్వరుడు అంటే యోగులకు మంత్రదీక్ష ఇవ్వడమో, యోగులకు యోగ రహస్యాలు ఉపదేశించాదమో కాదు. వీటన్నింటికి అతీతమైనదాస్థానం. 

కృష్ణుడు అత్యంత సులభంగా నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించగల్గుతాడు, తిరిగి రాగలుతుగాడు కూడా. నిర్వికల్ప సమాధి స్థాయికూడా దాటి సచ్చిదానందాన్ని అనుభవించగల్గుతాడు. నిజానికి కృష్ణుడే సచ్చిదానంద స్వరూపుడు. అందుకే యోగీశ్వరేశ్వరుడనే పదానికి అర్హుడు. సోహం, తత్వమసి,ఆయావ్యక్తులు సంపూర్ణంగా  పరబ్రహ్మం అన్న పదాలకు ఆధార భూతుడు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచాడు. అంటే కొడుకుగా, స్నేహితుడుగా, భర్తగా, తండ్రిగా, రక్షకునిగా, శిష్యునిగా ఏ పాత్ర గమనించినా, తనవల్ల ఆయావ్యక్తులు సంపూర్ణంగా సంతృప్తి చెందినట్లు కన్పిస్తుంది. ఇవన్ని అతని వ్యక్తిత్వంలో లీనమై అతని నొక గీతాచార్యునిగా, జగద్గురువుగా నిలబెట్టాయి. అందుకే గీతలోని ప్రత్యక్షరము ఎంతోవిలువైనది, అమూల్యమైనది, విశ్వజనీనమైంది, మానవాళిని ఉద్ధరించడానికి హేతుభూతమైనది.

కర్మ, సాంఖ్య భక్తి, హఠయొగాలను మొక్షానికి మార్గాలుగా చెప్పారు.  మన ప్రాచీనులు. కృష్ణుడు మొదటి మూడు మార్గాలను ఎంతో హేతుబద్ధంగా, విజ్ఞానయుతంగా వివరించాడు. 
 • అతను చూపిన మార్గం ఎంతో సులభమైనది. 
 • సాధారణంగా మోక్ష సాధకులకు ఎన్నోసార్లు మార్గం దుర్గమంగా కన్పిస్తుంది. 
 • కాని కృష్ణుడు ఉపదేశించిన తీరు అత్యంత రమ్యమైనది. 
 • బాధ్యతల నుండి తప్పించుకొని పారిపోయే వారిని నిలబెట్టి గమ్యాన్ని చూపిస్తుంది. 
 • సాధకులను సరైనమాగ్రం వైపు నడిపిస్తుంది. 
 • ఇటువంటి అధ్బుతమైన వ్యక్తిత్వంకల వ్యక్తి అష్టమి తిథి నాడే ఎందుకు జన్మించినట్లు అని సందేహం రాకపోదు. 
నిజానికి అష్టమి తిథి ఎన్నో కష్టాలు కల్గిస్తుందని జన సామాన్యం నమ్మకం. కాని కృష్ణుని జీవితమ గమనిస్తే అష్టమి తిథి కార్యసాధకులకు, శతృంజయులకు అనుకూల మైనదని అర్థమవుతుంది. జ్యోతిష శాస్త్రం కూడా ఈ విషయాన్ని నిర్థారిస్తున్నది. అట్లాంటప్పుడు అష్టమి నవమితిథులు మంచివి కావేమోనన్న మూఢనమ్మకాలతో మనవి మనం మోసపుచ్చుకుంతున్నామేమో! సాధారణంగా గోవును మనం ధర్మానికి ప్రతీకగా భావిస్తాం. కృష్ణుడు వృషభ రాశిలో జన్మించటం అతని ధర్మ సంరక్షణను సూచిస్తున్నది. అదే విధంగా రోహిణీ నక్షత్రం ఆకర్షణీయ శక్తి కలది. కృష్ణునిరూపు డానికి తార్కాణం, కృష్ణ శబ్దవ్యుత్పత్తి కూడా ఇదే నిర్ధారిస్తున్నది. కర్షయతి ఇతి కృష్ణః – జీవాత్మలకు ఆకర్షించే పరతత్త్వం అది.

‘కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సజ్గోస్త్వుకర్మణి’

ఆ స్వామిది అనితరసాధ్యమయిన వ్యక్తిత్వం. మనకు ఆదర్శప్రాయం.

సంకలనం: నాగవరపు రవీంద్ర

Tuesday, June 23, 2020

ధర్మబద్ధమైన కర్మ - Dharma, Karmaధర్మబద్ధమైన కర్మ - Dharma, Karma

ధర్మబద్ధమైన కర్మను చేయాలి !

కురుక్షేత్ర సంగ్రామంలో మోహంలో పడి యుద్ధ విముఖుడైన అర్జునుడికి తన ధర్మాన్ని గుర్తు చేసేందుకు భగవాన్ శ్రీకృష్ణుడు గీతను బోధించాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి ? అనే విషయాలతో పాటు సమన్వయాత్మక దృష్టి కోణాన్ని ఈ గీత మనకు అందిస్తోంది. భగవద్గీతలో బోధించిన కర్మ సిద్ధాంతాన్ని మనం జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. గీతలో కర్మ గురించి చెప్పబడిన క్రింది విషయాలు గమనిద్దాం. 

నిజానికి కర్మ చేయకుండా ఒక్క క్షణం గడవదు. అయితే ఆ కర్మ ఎలాంటిది ఉండాలి? అనేదే ప్రశ్న. ఉదాహరణకు దొంగతనం చేయడం కూడా కర్మే. అయితే ఇలాంటి కర్మ వల్ల వ్యక్తికీ, సమాజానికి కీడు కలుగుతుంది. అందువల్ల ధర్మబద్ధమైన కర్మ చేయాలని గీతా వాక్యం చెబుతుంది. కర్మను చేయటమే కాదు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని నిస్వార్ధ బుద్ధితో పరిత్యాగం చేయడం గీతా ధర్మం యొక్క పరమ లక్ష్యం. కర్మ చేయకపోవటం వల్ల వ్యక్తి సమాజానికి భారం అవుతాడు. సమాజంలో ఇతరుల కర్మఫలం వల్ల తాను లాభపడతాడు.  

అంటే ఇతరుల శ్రమ ఫలాన్ని అక్రమంగా దోచుకున్న వాడవుతాడు. అందుకే వ్యక్తి కర్మ చేయాలి, ఆ కర్మ ఫలాన్ని తాను కోరక భగవంతుడికి అర్పించాలి. అట్లాగే విశ్వరూప సందర్శన యోగంలో భగవంతుడంటే ఈ చరాచర సృష్టి అనే భావం అర్జునుడికి స్పష్టమైంది. భగవదర్పణ చేయడమంటే ఏ సృష్టిలో తాను జీవిస్తున్నాడో, ఆ సృష్టికే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా అర్పించడం. భగవద్భావనలో మరో విశేషం ఉంది. సామాజిక స్పృహ అనేది మనుషులకు మాత్రమే పరిమితమైనది. భగవద్భావన సమస్త సృష్టికి వ్యాప్తమైంది. 

సంకలనం: కోటేశ్వర్

Friday, May 1, 2020

కర్మ వివరము - Karma Vivaramu

కర్మ వివరము - Karma Vivaramu
కర్మ
మానసిక స్పందనతో చేయబడే పని కర్మ. రాగద్వేషములతో స్వార్థముతో, అరిషడ్వర్గముతో ప్రయోజనమును ఆశించి చేయబడే కర్మ తలపులలో వచ్చినా, మాటల ద్వారా వచ్చినా, చేతల ద్వారా జరిగినా అది కర్మయే. కర్తృత్వ, భోక్తృత్వము, ఇష్టాయిష్టములున్నచో అది కర్మ. విషయీకరించుకొనుచున్న మనస్సు కర్మను అంటించుకొనును. త్రిగుణముల పాత్ర ఉన్నచో జరిగిన పనియు, ఆ పనుల ఫలితములు కర్మను జమచేయును.

కర్మ వాసన:
కర్మ జరుగుచున్నంతసేపు ఆ విషయములు గుర్తులుగా మారి, తిరిగి ఎప్పుడో ఒకప్పుడు అనుభవమునకు వచ్చును. ఆ గుర్తులనే కర్మవాసన అందురు.

సంస్కారము:
కర్మవాసనను తిరిగి అనుభవించబడుటకు గాను, ఒక స్వభావముతో కూడిన వ్యక్తిత్వము ఏర్పడును. కర్మ విషయము వ్యక్తియొక్క స్వభావము కలిసి సంస్కారమనబడును.

వ్యక్తిత్వము:
అనేక జన్మలలో పొందిన అనుభవములు, గుణపాఠముల నుండి పరిణమించిన స్వభావము, అహంకారముతో కూడినది వ్యక్తిత్వమన బడును. ఈ వ్యక్తిత్వము అనేక జన్మల అనుభవ సారాంశమును బట్టి నిర్మితమగును. ప్రతి జన్మకు మార్పు చెందుతూ, ముముక్షువైన వానిలో ఆ వ్యక్తిత్వము నశించి అతడు ముక్తుడగును.

నిసర్గము:
పుట్టుకతో వచ్చిన స్వభావము, విధి, ప్రారబ్ధము, దైవదత్తము అని పేరులు.

ప్రారబ్ధము:
వర్తమాన దేహమును కలుగజేసి సుఖ దుఃఖములను కలుగజేయుటకు కనిపెట్టుకొని యున్న కర్మ. ప్రారబ్ధము అనేక జన్మార్జిత కర్మల సంచితమునుండి వర్తమాన జన్మలో వాటి ఫలితములను అనుభవింప జేయుటకు విడిబడిన భాగము. ఈ భాగము అనుభవించక తప్పదు. అంతమేరకు ఖర్చై సంచిత కర్మరాశి తరిగి పోవుచుండును.

కర్మ నాశనము:
తత్త్వ జ్ఞానికి అనారబ్ధ కర్మ నశించును. కాని ప్రారబ్ధము మాత్రము భోగించుట పూర్తియగుట వలన క్రమముగా నశించును. అందువలన జ్ఞానికి వెంటనే వర్తమాన దేహము పతనమగుటలేదు. జీవన్ముక్తుడుగా ఆయుష్షు తీరువరకు శరీర ప్రారబ్ధము ననుభవించుచూ ఉండవలెను.
ఆగామికర్మ:
ప్రారబ్ధము అనుభవించబడుచుండగా ప్రతిస్పందన కలిగిన మనస్సు క్రొత్త కర్మ వాసనలను ముద్రించుకొనును. క్రొత్త కర్మలను ఆగామి కర్మలందురు. ప్రతి జన్మలోను ఏర్పరచుకొన్న ఆగామి కర్మలు మొత్తముగా జమయైన రాశిలో కలసి సంచితము పెరుగుచుండును.

సంచితకర్మ:
ఆగామి వలన జమ, ప్రారబ్ధము బోగించుట వలన ఖర్చు అగుటచే ఎప్పటికప్పుడు మిగిలియున్న కర్మరాశిని సంచిత కర్మ అందురు. ఇవి వాసనారూపములో ఉండి కార్యరూపము గానివి. ప్రారబ్ధముతో ఖర్చై తరుగుచుండగా, ఆగామివలన పెరుగుచుండును. ఈ సంచితరాశియే కారణ శరీరము. రాబోవు జన్మలకు కారణము.

కారణ శరీరము:
సంచిత కర్మరాశి. ఇది జన్మలకు కారణముగా నుండును. స్థూల శరీరమును పనిముట్టుగా చేసుకుని, సూక్ష్మ శరీరము భోగించును. ఏ జన్మకా జన్మలో స్థూల శరీరములు పుట్టి నశించుచుండును. కాని సూక్ష్మ శరీరము నశించక కొనసాగుచుండును. కారణ శరీరము నశించినప్పుడు సూక్ష్మ శరీరము భంగమగును. ఇవి జరుగుటకు తత్త్వజ్ఞానము అవసరము . లింగ శరీర భంగమే ముక్తి.

మలిన వాసన:
అజ్ఞాన కారణముగా యే వాసనలు భ్రమలను కలిగించుచూ, అహంకారముతో కలిసి యుండునో తరువాత పునర్జన్మలకు హేతువగునో ఆ వాసనలు మలినవాసనలనబడును.

శుద్ధ వాసన:
తత్త్వము తెలుసుకొనుటకును, పునర్జన్మలను నివారించుటకు హేతువగు సత్కర్మల వలన, భక్తి జ్ఞాన వైరాగ్యాభాసము వలన, యేర్పడు వాసనలు శుద్ధ వాసనలనబడును. ఇవి మలిన వాసనలను చెరిపివేయును.

కర్మ రాహిత్యము:
నిష్కామ కర్మవలన ఆగామి యేర్పడదు. జ్ఞానము వలన సంచితము దగ్ధమగును. ప్రారబ్ధము అప్పటికే వదలిన బాణమువలె ఉండి లక్ష్యము చేరగానే పడిపోవునట్లు శరీర పతనము వరకు ఉండి ముక్తాత్మల విషయములో లేకుండా పోవును.

నిష్కామ కర్మ
మజ్జిగ చిలుకునప్పుడు బయటకు చిందకుండా పాత్రలోనే చిందునట్లు చేయుటవలె, ఎలాంటి భావము బయటికి సాగిరానీయక, లోపలివి లోపలనే అణగిపోయేటట్లు అభావముగా అనగా కీలుబొమ్మలా వర్తించే శాంత మనస్కులకు అన్నిటికీ మూలమైన బుద్ధి నిశ్చలమగును. అట్టి నిర్మల బుద్ధిగా ఉంటూనే అప్పుడు చేయబడే కర్మలు, అభావమందు, పాప పుణ్యకర్మలు ఫలించవు.

నైష్కర్మ్యమునకు ఉపాయము :
సమస్త కర్మలను భగవంతుడే చేయుచున్న కర్మలుగాను, అందువలన కర్మల ఫలితము కూడా ఆ భగవంతుని లీలా విలాసము కొఱకేనని భావించుచూ కర్మలను ఆచరించవలెను. అన్ని కర్మల ఫలితములను ఆ భగవంతునికే అర్పించవలెను. అంతా భగవదేచ్ఛ అని ఊరకుండుట.
 • సత్కర్మలు : తనకు, ఇతరులకు హితము చేకూర్చే కర్మలు
 • దుష్కర్మలు : తనకు, ఇతరులకు చెరుపు కలిగించే కర్మలు
కర్మలో అకర్మ:
స్థూల కర్మాచరణమందున్న యోగి నిర్లిప్త భావముతో జగత్కల్యాణము కొఱకు రాగద్వేష రహితముగా ఫలాకాంక్ష లేకుండా చేసే కర్మ.

అకర్మలో కర్మ:
సదా ఆత్మరతుడై, జ్ఞానులైన మునులు దేనినీ ఇచ్ఛగించని వారు. ఇది కూడా కర్మయే. దీనిని అకర్మలో కర్మ అందురు.
 • పక్వకర్మలు : క్రమముగా ప్రారబ్ధానుభవమునకు వచ్చుచున్నవి.
 • అపక్వకర్మలు : అనుభవమునకు రాకుండా వాసనా రూపములో నుండేవన్నీ అపక్వ కర్మలు.
కర్మకు సాధారణ అర్థములు:
కర్మ అనగా విద్యుక్తమైన కర్మ. అకర్మ అనగా కర్మ చేయకుండుట. వికర్మ అనగా చేయకూడని కర్మ చేయుట. నైష్కర్మ్యమనగా కర్మ చేసియు, చేయనివాడై యుండుట అనగా కర్తృత్వ భోక్తృత్వ రహిత కర్మాచరణ.
హతోదితకర్మలు
జీవన్ముక్తులచేత చేయబడు కర్మలు. అవి మానసిక స్పందనతో చేయబడు కర్మలు కావు. అందువలన ఆ కర్మలు ఫలించవు. అనగా ఆగామి ఏర్పడదు. ఆ కర్మలన్నీ నిష్కామకర్మలు, కర్తృత్వ రహిత కర్మలు.

కర్మ ఫలితములు 4 విధములు :
 • 1. ఉత్పాద్యము : కుండ చేయబడెను అన్నట్లు జరిగే కర్మ.
 • 2. ప్రాప్యము : ధనము ప్రాప్తించనిది అన్నట్లు జరిగే కర్మ
 • 3. వైకారము : బియ్యము ఉడికి అన్నము అయినట్లు జరిగే కర్మ.
 • 4. సంస్కార్యము : అద్దము తుడిచి, మురికి, దుమ్ము లేకుండా చేయునట్లు జరిగే కర్మలు.
సాత్విక కర్మలు
ఫలకాంక్ష లేకుండా, సంగరహిత బుద్ధితో, రాగద్వేషములు కలుగని రీతిగా, ధర్మబద్ధముగా నిష్పక్షపాతముగా, నియతితో జరుపబడు కర్మలు. నిస్వార్ధముగా, విద్యుక్త ధర్మముగా, పేరు ప్రతిష్ఠలకోసము కాకుండా జరుపబడు కర్మలు.
 • ➣ రాజస కర్మలు : ఫలకాంక్షతో, అహంకారముతో, బహు ప్రయాసపడి చేసే కర్మలు.
 • ➣ తామసిక కర్మలు : పౌరుషముతో హింసాత్మక బుద్ధితో, మూర్ఖముగా చేసే కర్మలు. పాపకర్మ అనాలోచితముగా చేసినను, పరోక్షముగా చేసినను, అది పాప కర్మయే.
 • ➣ పశ్చాత్తాప కర్మలు : చేసిన పాపములకు పశ్చాత్తాపపడుట వలన సగము పాపము తగ్గును. ఇంక ఎప్పుడూ అట్టి పాపకర్మలు చేయనని నిశ్చయించుట వలన మరియు చేయకుండుట వలన మిగిలిన సగము పాపము నశించును. తాను చేసిన పాపము వలన నష్టపడినవారిని ఆదుకొని, మేలు చేయుట వలన పుణ్యము వచ్చును.
సత్కర్మల వలన కలిగే ఫలితములు:
ఏ పదార్థము దానము చేసిన, ఆ పదార్థములు సమృద్ధిగా లభించును.
 • ➣ మౌనము పాటించిన, జ్ఞానము వృద్ధి యగును. 
 • ➣ తపస్సు అధికమైతే, అధిక భోగము కలుగును. 
 • ➣ అహింస వలన రూపము, బలము, ఐశ్వర్యము కలుగును. 
 • ➣ బ్రహ్మచర్యము వలన ఆయువు వృద్ధి యగును. 
 • ➣ ఉపవాసము వలన చిత్తశుద్ధి కలుగును. 
 • ➣ వేద పఠనమువలన సౌఖ్యము, వేదార్థబోధ, సుగతి లభించును. 
 • ➣ సత్యమును వ్రతముగా ఆచరించినచో ముక్తి కలుగును.
శుభాశుభ కర్మలు నష్టమగుట:
 • 1. బ్రహ్మజ్ఞానము వలన సకల కర్మలు నష్టమగును.
 • 2. భోగించుట వలన కొన్ని ఖర్చు అగును. మరికొన్ని మిగులును. ఆగామి వలన కొత్తవి ఏర్పడును.
 • 3. పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్త కర్మల వలన కొన్ని కర్మలు కొంతవరకు నష్టమగును.
పంచమహాపాతకములు:
 • 1. మద్య సేవనము, 
 • 2. బ్రహ్మ హత్య, 
 • 3. బంగారము మొదలగువానిని దొంగిలించుట, 
 • 4. గురుపత్నిపై మోహము, 
 • 5. ఇట్టివారితో స్నేహము చేయుట.
పంచ నరకములు:
 • 1. రౌరవము, 
 • 2. మహా రౌరవము, 
 • 3. కంటకావనము, 
 • 4. అగ్నికుండము,
 • 5. పంచకష్టములు. 
 • ఇవి పాపకర్మల ఫలితము తక్కువ ఎక్కువలను బట్టి ఉండును.
కర్మక్షయము:
సంసారమునకున్న మూడు వేరులు మూడు కర్మలు. సంచితము, ఆగామి, ప్రారబ్ధము. ఈ మూడూ నశించినప్పుడు మూడు ప్రతిష్ఠలు సిద్ధించును.
 • 1. సత్య ప్రతిష్ఠ అనగా అసతోమా సద్గమయ
 • 2. ప్రాణ ప్రతిష్ఠ అనగా తమసోమా జ్యోతిర్గమయ
 • 3. ఆనంద ప్రతిష్ఠ అనగా మృత్యోర్మా అమృతంగమయ
స్వర్గము:
ఔపరమికము, నిరపకరణము, సోపకరణము అని మూడు విధములు.
 • 1. ఔపరమికమనగా పాపములను వర్జించుట, నరకలోకాది భీతి కలిగియుండుట. పాప కర్మలను చేయక, చేయించక, ప్రోత్సహించక వాటికి దూరముగా ఉండుట. మంచి మాటలు వినుట. పెద్దలతోడి సాంగత్యము. ఇంద్రియ నిగ్రహము వలన కలిగే స్వర్గము.
 • 2. నిరపకరణమనగా శౌచము, శాంతి, దాంతి, ఆర్జవము, వ్రత నియమము బ్రహ్మచర్యము, తీర్థాటనము, నదీ సాగర సంగమస్నానము, నదీనద సంగమ స్నానము, దేవతార్చన, గోబ్రాహ్మణ పూజల వలన పొందబడే స్వర్గము.
 • 3. సోపకరణమనగా ధన ధాన్యాది సమృద్ధితో గృహస్థుల వైదిక పితృకాది పుణ్య క్రియల విశేష ఆచరణ, దాన ధర్మములు, న్యాయార్జిత సంపదను వేదవిదుడైన శాంతుడైన శుద్ధ బ్రాహ్మణునికి చేసే దానములు, శక్తికి మించి కూడా చేసే త్యాగములు, అహంకారము లేకుండా చేసే క్రియలు, చేసిన పిదప వాటిని చింతించకుండుట వలన పొందబడే స్వర్గము.
సంసార పాశము :
అనాది కర్మవాసన చేత, అనిర్వచనీయ మాయా శక్తిచేత, ఆత్మ అనాత్మతో కలిసియున్నట్లు తోచుటచేత, అనాత్మ గుణములన్నీ ఆత్మ గుణములే అయినట్లు కనిపించుటచేత సంసార పాశము కలుగుచున్నది. దీనినే అజ్ఞానము, అవిద్య, మాయ, ప్రకృతి, మనస్సు, కర్మ అని సందర్భోచితముగా పిలిచెదరు.

యజ్ఞముగా నిర్వర్తించే కర్మ: 
విధి నిర్వహణగా, ఈశ్వర సమర్పితముగా, నిస్వార్థముగా, లోక కళ్యాణార్థము, పెద్దల సూచనలు ఆదేశాలకు అనుగుణముగా చేయబడే కర్మలు యజ్ఞమనబడును. ఉపాసనా దృష్టితో జరిపే కర్మ యజ్ఞము. యజ్ఞ భావమనగా పదిమందితో కలిసి చేయబడే కర్మలో తాను ఒక పాత్రధారి మాత్రమేననే భావము. సమష్టి కర్మ నిర్వహణ యందు వ్యష్టిపాత్రలో అనుకూలముగా గాని, వ్యతిరేకముగా గాని భావనలు కలుగక, వ్యక్తిగత ప్రయోజనమును ఆశించక చేయబడే కర్మ యజ్ఞ మనబడును. ఇట్టి యజ్ఞ భావ కర్మలు మిక్కిలి సత్ఫలితముల నందించును.

సూక్ష్మాతిసూక్ష్మ కర్మ :
ఆత్మ రతులై ఆనందము ఆస్వాదించుచుండుట అనే కర్మ పరమాత్మ సాన్నిధ్యమును అందించును. ఇది సూక్ష్మాతి సూక్ష్మ కర్మ.

ముమూర్షువు :
ప్రస్తుత జన్మలో ప్రారబ్ధ కర్మ ఫలములన్నింటినీ అనుభవించి, ఈ జన్మయొక్క, ఈ లోకముయొక్క వ్యవహారములన్నింటినీ పూర్తిచేసి ముందు జన్మకు రాబోవు దేహప్రాప్తికి సిద్ధమయ్యేవాడు, ప్రస్తుత జన్మను చాలించుట కొఱకు చనిపోవువాడు ముమూర్షువు.

లోకవాసన : 
ఈ లోకములో ఇతరులు నన్ను ఏ ప్రకారముగా ఉంటే స్తుతించుదురో ఆ ప్రకారముగా ప్రవర్తించెదను అనెడి వాసన లోక వాసన అనబడును. పదునాలుగు లోకములు సత్యమనెడి వాసన లోక వాసన. లోకములు, లోకేశులు, లోకస్థులు, మిథ్యయనెడిది జ్ఞానము.

శాస్త్రవాసన:
 • 1. పాఠ్యవ్యసనము : 3 వేదములు చదివిన భరద్వాజ ముని సారమును గ్రహించక నాల్గవ వేదమును కూడా అధ్యయనము చేయవలెనని, దేవేంద్రుని వద్ద తన కోరిక వెలిబుచ్చగా, దేవేంద్రుడు నిరాకరించెను. మోక్షసాధనయగు సగుణ బ్రహ్మ విద్యను బోధించెను. భరద్వాజ ముని సద్గతి పొందెను.
 • 2. బహుశాస్త్ర వ్యసనము : అనేక శాస్త్రములు చదివిన దుర్వాస మునిని నారదుడు గంధపు చెక్కలు మోసే గాడిదగా పరిహసించగా, ఆ శాస్త్రములన్నిటిని సముద్రములో పారవైచి సాంబమూర్తి వద్ద బ్రహ్మవిద్య ఉపదేశము బడసి కృతార్థుడయ్యెను.
 • 3. అనుష్ఠాన వ్యసనము : ఋభు మహర్షి నుండి సమస్త వేదాంగములను తెలుసుకున్న నిదాఘుడు అనే శిష్యుడు, గృహస్థాశ్రమమున కర్మానుష్ఠానమునకు ప్రాధాన్యమిచ్చెను. గురువైన ఋభు మహర్షి రెండు మూడు పర్యాయములు ఆ శిష్యుని పరీక్షించి, అనేక ఉపాయములతో బ్రహ్మ విద్యను బోధించిన పిదప గాని, నిదాఘుడు తన కర్మానుష్ఠాన వ్యసనము నుండి బయట పడలేదు. చివరకు బ్రహ్మనిష్ఠ కుదిరి ఊరక ఉండెను.
దేహవాసన:
 • 1. దేహాత్మత్వ భ్రాంతి :
 • దేహమే ఆత్మయని చార్వాకుల మతము. వీరి గురువు బృహస్పతి అందురు. ఇంద్రియ గోచరమగు ప్రపంచమే సత్యమనునది వీరికి ప్రత్యక్ష ప్రమాణము. వీరి మతమును లోకాయితికమని అందురు. బలి చక్రవర్తి కుమారుడు విరోచనుడు 33 సంవత్సరములు బ్రహ్మచర్యము, గురు శుశ్రూష చేసి కూడా పరతత్త్వము నెరుగక, దేహమే ఆత్మయని స్థిరపడెను. దైత్య దానవులందరికిని అదే బోధించెను.  జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4 కలిసి అష్ట తనువులలో ఏది బంధించినను, అది దేహవాసనయే. అనగా ప్రత్యగాత్మ, పరమాత్మ యనెడి శరీర వాసనలు కూడా దేహవాసన క్రిందికి వచ్చును. ఈ వాసనను క్షయము చేసేది పరిపూర్ణ బోధ మాత్రమే.
 • 2. గుణాదాన భ్రాంతి :
 • దీనిలో లౌకిక గుణాదాన, శాస్త్రీయమగు గుణాదానములని రెండు విధములు. గాన సౌందర్యమునకు, చర్మ సౌందర్యమునకు, లోక సంబంధమైన ఆహారము భుజించుట, లేపనములను ఉపయోగించుట వంటివి లౌకిక గుణాదానమనబడును. గంగాస్నానము, సాలగ్రామ తీర్థ సేవనము మొదలగునవి శాస్త్రములో చెప్పినట్లు చేయుట శాస్త్రీయ గుణాదానమనబడును. అద్వైతము సిద్ధించుటకు చరమ దశలో ఈ వాసనాత్రయము అనగా లోకవాసనా, శాస్త్రవాసన, దేహవాసనలు పూర్తిగా క్షయము కావలెను.
ప్రాప్తకాలత్వము :
ఏది ఎలా జరుగనున్నదో, దానిని అలాగే జరుగనిచ్చుటను ప్రాప్తకాలత్వము అందురు. సాధకుడు ప్రారబ్ధ కర్మ ఫలితమును అంగీకరించుచు, ఆగామి యేర్పడకుండా చేసే పురుష ప్రయత్నము ప్రాప్తకాలత్వము క్రిందికి వచ్చును.

నైష్కర్మ్యయ సిద్ధి:
కర్మ, జ్ఞాన, యోగాభ్యాసములను సమన్వయపరచుకొని, కర్తృత్వ రహితముగా, సహజముగా నుండుట.
శ్లో||  ప్రారబ్ధం భోగతో నశ్యతే | తత్త్వ జ్ఞానేన సంచితః ||
       ఆగామి ద్వివిధం కర్మత | ద్వేషీ ప్రియావాదినః ||
తా|| ప్రారబ్ధము అనుభవించుట వల్లనే నశించును. సంచిత రాశి తత్త్వ జ్ఞానము వలన లేనిదగును. నిష్కామ కర్మ యోగము వలన ఆగామి ఏర్పడదు. రాగ ద్వేషములనెడి ద్వంద్వములు లేకుండా పోయి, ముక్తుడగును.

శ్రు||  నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానశుః ||
తా||    అమృతత్వమును కర్మచే పొందరు. సంతానము, ధనములతో పొందలేరు. సర్వ త్యాగముతో మాత్రమే సిద్ధించును.

సంకలనం: చల్లపల్లి 

Saturday, February 15, 2020

మంచి కర్మల ఫలితము - Good Karma Results

క రాజు..తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి.. వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తా బ్యాగ్ లను చేతికిచ్చి అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు,ఫలాలను అందులో నింపి సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు.

ముగ్గురూ అరణ్యం లోనికెళ్లారు
మొదటి మంత్రి ఇలా ఆలోచించాడు..
రాజు గారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండిఉండాలి.. కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి.. అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు.

రెండో మంత్రి ఆలోచన.
రాజు గారికి పండ్లకి కొదవ లేదు. అయినా మాకు పంపారు. సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు.. అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజా,వాడిన,పుచ్చిన భేదభావం లేకుండా నింపసాగాడు.

ఇక మూడో మంత్రి.
చాలా చతురంగా ఆలోచించాడు.. రాజు గారికి చాలా పనులు..పండ్ల అవసరం అతనికి లేదు., పై పైన చూస్తే చూడొచ్చు.బస్తా ఖాళీచేసి చూసే సమయం కూడా ఉండదు..చూడనిదానికి కష్టపడి అడివంతా తిరగాల్సిన అవసరం ఏముంది.. అనుకుంటూ ఆకులు అలములతో బస్తానింపి.. పైన కొన్ని పండ్లతో అలంకరించేసాడు..

సాయంత్రం ముగ్గురూ పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు.
 • మూడో మంత్రి ఊహించినట్లే. 
 • రాజు గారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు.. కనీసం బస్తాలు వంక చూడనైనా చూడకుండా సైనికులను ఆదేశించారు. "ఈ ముగ్గురినీ చెరసాలలో నెల రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి. తినడానికి ఏమి ఇయ్యరాదు వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం." ముగ్గురిని చెరసాలలో బంధించారు..
 • మొదటి మంత్రి..
 • చక్కని తాజా పండ్లు మూలంగా ఎలాంటి ఆకలిబాధలు లేకుండా శిక్షాకాలం పూర్తిచేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు.
 • రెండవ మంత్రి..
 • కొన్నిరోజుల వరకు బాగానే తిన్నా..కుళ్ళిన,వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన పడ్డాడు..
 • శాశ్వతంగా.
 • మూడవ మంత్రి.. పైపైన అలంకరించిన పండ్లతో 2 రోజులు గడిపి..
 • ఆకులు,అలములు తో మరో వారం పాటు మాత్రమే గడిపి.. పై లోక యాత్రకు వెళ్ళిపోయాడు శిక్షాకాలం ముగిసే లోపే..
కర్మ:
మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది..
 • *మంచి కర్మలకి మంచి.
 • *పాప కర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు.
1000 గోవుల మంద ఉన్నా దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో మంచి,చెడు కర్మలు కూడా అలానే మనల్ని వెదుక్కుంటూ వచ్చేస్తాయి.

అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి

Friday, November 29, 2019

వ్యభిచారిణి స్వర్గానికి చేరుట - Vyabhicharini Swarganiki Cherutaవ్యభిచారిణి స్వర్గానికి చేరుట - Vyabhicharini Swarganiki Cheruta
మానసిక వ్యభిచారమే అనర్ధాలకు మూలము :

మానవుడై పుట్టిన ప్రతి వాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారి తెలుసుకోమని ఏర్పరచినాడు. 
మానవుడు పుట్టిన తరువాత ఈ ప్రకృతి మాయలో పడి దాన్ని మరచిపోయి జీవిస్తున్నాడు. ఎప్పుడైతే జీవికి ఆత్మ జ్ఞానం కలుగుతుందో అప్పుడు మానవుడు సక్రమ మార్గంలో జీవించడానికి వీలు కలుగుతుంది.

నిషిద్దమైన కర్మలను ఆచరించకుండా ఉంటె మనో మాలిన్యమనే పాపం పేరుకోకుండా ఉంటుంది. పాపం చెయ్యకుండా ఉండటమే కాదు. మానసికమైన వ్యభిచారం కూడ లేకుండా చూసుకోవాలి. మనిషి మాత్రం ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. కాని మనస్సు పరిపరివిధాల వ్యభిచారిస్తూ ఉంటుంది. మానవుడు కర్మేంద్రియాలను అరికట్టిన మనస్సు మాత్రం విషయాలన్నిటిని తలపోస్తూ బహిర్ముఖంగా సంచరిస్తూ గడుపుతుంది. దాన్ని అరికట్టడానికి మనస్సుకి తోడుగా ఆత్మ అనే భగవంతునిని దానికి అందించి, ఆత్మతో మనస్సు అనురక్తమై జీవించే విధానాన్ని అలవడేట్లు చెయ్యాలి. దానివల్ల అంతఃకరణశుద్ధి ఏర్పడుతుంది. దీనికి వివేకం మరియు వైరాగ్యం తోడయితే లక్ష్యం సిద్దిస్తుంది.

ఈ మానసిక వ్యభిచారం వలన కలిగే దుస్ఫలితం గురించి ఒక చిన్న వివరణ:
ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ సన్యాసి మరియు ఒక వ్యభిచారి ఉండేవారు. బ్రాహ్మణుడు చాల ఉత్తమోత్తముడు . కాని ఆ బ్రాహ్మణుడు ఆ వ్యభిచారికి నువ్వు నరకానికి వెళతావు అని ఆయన హెచ్చరిస్తుండేవాడు. పేదరికంలో ఉన్న ఆ స్త్రీ జీవనోపాధికి తనకున్న ఒకేఒక మార్గాన్ని మార్చుకోలేక తన దైన్యస్థితిని భగవంతునికి తెలియజేస్తూ, రోదిస్తూ, విలపిస్తూ తనను క్షమించమని ఆమె ప్రార్దించేది. ఆ విధంగా వారు ఇద్దరు జీవనాన్ని కొనసాగిస్తుండేవారు.

బ్రాహ్మణుని మనస్సు ఎప్పుడు ఆమె వ్యభిచారిణి అనే ఒక మానసిక ధోరణిలోనే ఉంటూ కాలం గడిపేవాడు. కాల క్రమేణ ఆ ఇద్దరూ చనిపోయారు. వేశ్య స్వర్గానికి వెళ్ళింది. సన్యాసి నరకానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ సన్యాసి అది ఏమిటి నేను బ్రాహ్మణున్ని పైగా ప్రతి నిత్యము భగవంతుణ్ణి ప్రార్ధన చేస్తూ ఉండేవాడిని కదా. నన్ను నరకానికి తెచ్చారు. ఆ వేశ్యను స్వర్గానికి తీసుకెళ్ళారు అని అడిగాడు యమభటులను. అప్పుడు యమ భటులు ఆమె నిర్మలమైన మనస్సుతో భగవంతుణ్ణి, నా శరీర యాత్ర కోసం నేను ఈ విధంగా చేయవలసి వస్తుంది స్వామి, నన్ను క్షమించు అని ఆమె దేవుణ్ణి వేడుకోనేది. కాని నువ్వు మాత్రం అలా కాదు నీ మనస్సు ఎప్పుడు ఆమె గురించే ఆలోచిస్తూ ఉండేది. అందువలన నీకు నరకం అని చెప్పారు.

అందువలన ప్రతి ఒక్కరు నిషిద్దమైన కర్మలను చేయకుండ ఉండడమే కాకుండా మానసికమైన వ్యభిచారం కూడ లేకుండా చూసుకోవాలి.       

అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి 

Saturday, October 19, 2019

సన్యాసము మరియు వైరాగ్యము - వ్యత్యాసము - Sanyasamu Vairagyamu

వైరాగ్యము – సన్యాసము
వైరాగ్యము అంటే మమతానురాగముల నుండి భయముతో పారిపోవడము, సోమరిగా, నిర్వీర్యముగా, అర్థరహితముగా జీవించుట కాదు. జీవిత సమస్యల నుండి దూరముగా పారిపోవుట కాదు. నీవు ఎక్కడికి పారిపోయినను నీ సంసారము నీతో పాటే వస్తుంది (సంసారము మానసికము కనుక). వైరాగ్యము అంటే నిష్క్రియా పరమైనది కాదు.

వైరాగ్యము అనగానే గుర్తుకు వచ్చేది సన్యాసము:
సన్యాసము అనునది సంసార బాధలను భరించలేక వాటినుండి విముక్తి కొరకు స్వీకరించునది కాదు. కర్మ ఫలత్యాగము సన్యాసము. కర్తృత్వ భావన లేకుండా కర్మ చేయగలుగుట సన్యాసము. జీవిస్తూ జీవించని వాడిగా ఉండుట సన్యాసము. కర్మను చేయుటయందు కుశలత్వము కలిగియుండుట సన్యాసము. తామరాకుపై నీటిబొట్టులాగా సంసారము యందు మెలగగలుగుట సన్యాసము.

సన్యాసం : బాహ్యంగా అన్ని పనులు చేస్తూ, అంతరంగా మనసులో సమస్తాన్ని త్యజించడాన్నే ‘‘సన్యాసం’’ అంటారు. (భగవద్గీత)
వైరాగ్యం : ప్రతి పనిని చేస్తూ (ఆచరిస్తూ) దాని మీద అనురాగాన్ని మరియు మమకారాన్ని మనసులో వదిలి వేయడాన్ని ‘‘వైరాగ్యం’’ అంటారు. (భగవద్గీత)

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Tuesday, March 6, 2018

కర్మ మరియు కర్మరాధన సిద్ధాంతం - Karma and Karmardhana Siddantam

కర్మ మరియు కర్మరాధన సిద్ధాంతం - Karma and Karmardhana Siddantam

కర్మే ఆరాధన .
నిన్ను నువ్వు దిద్దుకో, నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ముందుకు పో, చేస్తున్న పని ఏదైనా సరైన సమయంలో సక్రమపద్ధతిలో నియమపూర్వకంగా చెయ్యి!' అని అప్పుడప్పుడు పెద్దవాళ్ళు మనల్ని ఆదేశిస్తారు, హెచ్చరిస్తారు. ఆ ప్రకారం విధుల నిర్వహణను బతుక్కి భరోసాగా చేసుకొని నడచుకొంటే జీవిత నౌక ఆనంద తరంగాల్లో తేలియాడుతుంది. బతుకులో బంగారం పండుతుంది.

పొలంలో బంగారం పండాలంటే రైతుబిడ్డ అదునుపదును చూసుకొని పొలంపనులు చేస్తూ ఉండాలి. ఉద్యోగి తన పనిని తాను సకాలంలో నియమబద్ధంగా చేసుకుంటూపోతే అతని జీవితం నల్లేరుపై బండిలా సాఫీగా హాయిగా సాగిపోతుంది. క్రమశిక్షణతో విద్యనార్జించిననాడే ఆ విద్యార్థి కన్న పసిడికలలు భావిజీవితంలో మేలైన రీతిలో పండుతాయి. కుటుంబ సంరక్షణలో తల మునకలై ఉన్న గృహస్థు కూడా సంఘజీవిగా సాటి మానవుల కష్టసుఖాల్లో పాల్గొని వారికి చేయూతనివ్వాలి. తనకున్న ధన భుజ బుద్ధి బలాలతో ఇరుగుపొరుగు వారికి సాయపడాలి. వృద్ధులైన తల్లిదండ్రుల సేవ చేయాలి. అప్పుడే అతని గృహస్థ జీవితం పది కాలాల పాటు పచ్చగా ఉంటూ పండంటి జీవితంగా అలరారుతుంది. ఈ విధుల నిర్వహణలో ఎన్నో ఆటంకాలు, విఘ్నాలు ఎదురవుతాయి. వాటికి లొంగకుండా నిర్భయంగా ముందుకే సాగిపోవాలి!

ప్రతీవ్యక్తీ తన విధిని తాను సక్రమంగా నిర్వహిస్తే బతుకుబండి గతుకుల్లో పడకుండా సాఫీగా ముందుకు సాగిపోతుంది. బతుకు బంగారమవుతుంది. అదే జీవిత పరిపూర్ణ్త .ప్రకృతి నుండి పుట్టిన ప్రతిజీవి దేవుడే .ప్రకృతే దైవము .రాముడు , యేసు , అల్లా , బుద్ధుడూ ప్రకృతినుండి పుట్టినవారే . అందరి పుట్టుకకు మూలమైన ప్రకృతి అనంతము ,అభేదము ,అజామరము .మిగతా వారంతా ఆప్రకృతి దూతలే .

ప్రకృతి పంచభూతాల సమ్మేళనము:
జీవికి జీవే శత్రువు.
జీవికి జీవే మిత్రుడు ,
జీవికి జీవే దెయ్యము ,
జీవికి జీవే దేవుడు ,
విశ్వదాభిరామ వినురవేమ.
ప్రకృతి ఇచ్చిన జీవే దేవుడు, మనకిచ్చిన వరము .దేవుడు ఎక్కడో లేడు ... మనలోనే ఉన్నాడు . నీలోఉన్న దైవత్వాన్ని మేల్కొపు.. నీ కర్మని సక్రమము గా నిర్వర్తించుము ...ఫలితము దానంతట అదే వస్తుంది .

భారత దేశ ఆధ్యాత్మికత అఖండం. అనితరసాధ్యం. అనాదిగా వారసత్వంగా, రక్తగతంగా వస్తున్న ఆత్మభావన, ఏకాత్మతా అవగాహనే దీనికి కారణం. భారతీయులం కొండల్ని, వృక్షాల్నీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తాం. మన భగవత్‌ జిజ్ఞాస అలాంటిది. ధ్యానంలో నిమగ్నమైన యోగి పుంగవుల్లా, రుషి శ్రేష్ఠుల్లా నిశ్చలంగా, ఏకాగ్రతతో ధ్యానిస్తున్న ఉన్నత పర్వతమూర్తుల్ని ముగ్ధులై భావనా తత్పరతతో తిలకిస్తుంది భారతీయ భక్తిభావం.

భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? కొండలు, వృక్షాల్లోనా? కాదు. అంతేకాదు. పుట్టలు, గుట్టలు, పశువులు, పక్షులు, విషసర్పాలు, హీన, దీన బడుగు జీవులు, జంతువులు, చరాచర జీవ వస్తుజాలం... ఇందుగల డందు లేడను సందేహం లేకుండా అంతటా, అన్నిటా, ఎల్లెడలా అణుమాత్రం కాదు కాదు- పరమాణు మాత్రం తేడా లేకుండా నిండిఉన్నాడు. ఈ ప్రకృతి, ప్రపంచం యావత్తూ పంచభూత నిర్మితం అయినప్పుడు, పంచభూతాలను దైవాలుగా కొలుస్తున్నప్పుడు... ఇక దైవం కానిదేముంది? దైవానికి అతీతంగా ఏం మిగిలిఉంది? అద్వైతాన్నీ, ఏకాత్మతా భావాన్నీ గ్రహించి ఆరాధించే భారతీయ తత్వం అణువణువునా ఆత్మ చైతన్యాన్ని గమనిస్తూనే ఉంది. గుర్తిస్తూనే ఉంది. అందుకే కొండలు, వృక్షాలు, సర్పాలు, పక్షులు, పుట్టలు, గుట్టలు, మనుషులు, నదీనదాలు... ఏది కాదు... అన్నీ, అన్నింటా భగవదంశను గుర్తించి వెలికితీసి లబ్ధిపొందే అవకాశాన్ని వదులుకోలేదు. అయితే అక్కడే ఆగిపోకుండా నేతి భావంతో అసలు తత్వంవైపు, ఆత్మభావంవైపు పయనం సాగుతోంది.

ఆనందాలను పంచాలి 
ఎవరి బాధ వారికి ఎక్కువ. ఎవరి దుఃఖం వారికి దుర్భరం. ఎవరి వేదన వారికి భారం. ఇంకెవరైనా ఓదార్చబోతే 'అనుభవిస్తే కాని నా బాధ నీకు తెలిసిరాదు' అని అంటుంటారు. నిస్పృహలో ఎలాంటి మాటైనా వస్తుంది. అది సహజం.

కష్టాలు, దుఃఖాలు, బాధలు - అందరివీ ఒక్కలా ఉండవు. పెద్దగీత, చిన్నగీతల అంతరాలతో ఉన్నట్టుంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి ఆశాజీవిగా బతకటం ఎంత అవసరమో, ఇంకొకరి బాధ చూసినప్పుడు తమ బాధను మరచి వారికొక ప్రోత్సాహకరమైన మాట చెప్పటం అంత అవసరం.

దైవ ప్రసాదితమైన ఈ జీవితంలో మనకు అవకాశాలు ఎప్పుడో కాని రావు. ఎన్నో కాని రావు. వచ్చినప్పుడు వాటిని చటుక్కున అందిపుచ్చుకోవాలి. ఒకర్ని సాంత్వనపరచి సేదతీర్చడంలోని ఆనందాన్ని తనివితీరా అనుభవించాలి. ప్రతి జీవితానికీ ఒక అర్థముందని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేకపోతున్న వాళ్లకు తెలియజెప్పాలి.

మనస్సే సర్వస్వం:
ఏది లేకుంటే మనిషి ఒక్కక్షణమైనా జీవించలేడో అది- 'మనస్సు'. మనస్సును కవులు అనేక విధాలుగా పోల్చారు. కోతి అనీ, హంస అనీ, వూయల అనీ, పీఠం అనీ, ఆకాశం అనీ, పువ్వు అనీ ఎన్ని ఉపమానాలు చెప్పినా- అవన్నీ మనస్సుకు హత్తుకొనిపోయేవే! అయితే మనస్సు స్వరూపం ఈ పోలికలతోనే ఆగిపోలేదు. ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్లి తరచి చూడటం మొదలైంది. ఇలా శోధించడం సనాతన కాలంనుంచే ప్రారంభమైంది. అందుకే ఉపనిషత్తుల్లో రుషులు మనస్సును జగత్తుకు ప్రతిరూపంగానూ, జీవిత సర్వస్వంగానూ చెప్పారు.
'మనస్సే ఈ సమస్త జగత్తు. అందువల్ల ఈ మనస్సును ప్రయత్నపూర్వకంగా సంస్కరించుకొంటూ జీవనాన్ని సాగించాలి. మనస్సు ఏ విధంగా ఉంటే ఫలితం ఆ విధంగానే ఉంటుంది. ఇది సనాతన రహస్యం. ఎప్పుడు మనస్సు సంపూర్ణంగా ప్రశాంత స్థితికి చేరుతుందో అప్పుడు అశుభకర్మలన్నీ నశించిపోతాయి. ప్రశాంతచిత్తంతో ఉండేవారే జీవితానందాన్ని అనుభవించగలుగుతారు. అప్పుడే తరగని ఆనందం వశమవుతుంది. మనిషి తన మనస్సును ఇంద్రియాలపై ఎంత దృఢంగా లీనం చేస్తాడో, అంత దృఢంగా భగవంతుడిలో లీనంచేస్తే అన్ని బంధాలకూ దూరం అవుతాడు' - ఇదీ, రుషి బోధల సారాంశం.
మనస్సు లేకుంటే ఏ ఇంద్రియమూ పనిచేయదు. అన్ని ఇంద్రియాలూ మానవుడికి అవసరమైనవే. వాటిని తన సమున్నత లక్ష్యసాధనకు సాధనాలుగా ఉపయోగించుకోవాలిగానీ, దుర్వినియోగం చేస్తే - ఆరోగ్యానికే ప్రమాదం ఏర్పడుతుంది.

ఇంద్రియాలు గుర్రాలనీ, మనస్సు ఆ గుర్రాలను నియంత్రించే పగ్గమనీ, శరీరం రథమనీ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ప్రబోధిస్తాడు. ఇంద్రియాలనే గుర్రాలను పగ్గంద్వారా అదుపులో పెట్టుకొని మనిషి విజయగమ్యాన్ని చేరుకోవాలేగానీ, పగ్గాల్ని విడిచిపెట్టి ఇంద్రియాల గుర్రాలను స్వేచ్ఛగా వదిలేస్తే ఎలా? అలా విచ్చలవిడిగా పరుగులు తీస్తుంటే శరీరం అనే రథాన్ని పడదోసి, అవి పగ్గాలు విప్పుకొని విశృంఖలంగా పరుగులు తీస్తాయి. అందుకే మనస్సు పగ్గాలను ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి.

ఆదిశంకరులు 'శివానందలహరి'లో మనస్సును కోతిగా అభివర్ణిస్తూ- అది ఎల్లప్పుడూ కోరికల మహారణ్యాల్లో తిరుగుతూ ఉంటుందనీ, ప్రేమ అనే కొమ్మలమీద గంతులు వేస్తుందనీ, స్వేచ్ఛగా అంతటా తిరుగుతుందనీ, అలాంటి చంచలమైన మనస్సు అనే కోతిని భక్తి అనే తాడుతో కట్టివేసి, నీ అధీనంలో ఉంచేలా వరమీయాలనీ శివుణ్ని కోరతారు. ఈ ఆదిశంకరుల ప్రార్థన అఖిలమానవుల ప్రార్థనే! కనుక మనస్సే సర్వస్వమని భావించి దాన్ని విచ్చలవిడిగా వదిలేయకుండా అదుపులో పెట్టుకోవడం మానవ కర్తవ్యం!

కార్యసాధనలోని రహస్యం:
లోకంలో మనిషి ఏ పని చేయాలన్నా దానికి తగిన ఉపకరణ సామగ్రి అవసరం. అన్నం వండాలంటే మొదట పొయ్యి ఉండాలి. ఆ తరవాత బియ్యం, గిన్నె, నీళ్లు, పొయ్యి వెలగడానికి కావలసిన ఇంధనం ఉన్నప్పుడు వంట చేయడం సులభసాధ్యం. ఇవేమీ లేకుండా, అన్నీ ఉన్నట్లు ఊహించుకుంటే అన్నం వండటం సాధ్యమవుతుందా? కానేకాదు. బ్రహ్మదేవుని సృష్టిలోని విచిత్రం ఏమిటోగానీ, కొన్ని పనులు సాధనాలు సరిగ్గా లేకున్నా గొప్ప ఫలితాలను ఇస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో సాధకుల ఆత్మశక్తి ఎంత గొప్పదో స్పష్టమవుతుంది.

మన్మథుడు జగన్మోహనకారకుడు. ఒక్క పూలబాణంతో ఎందరినైనా మరులుగొనేటట్లు చేయగల సమర్థుడు. ప్రేమికుల హృదయాలను గిలిగింతలు పెట్టగలడు. చివరికి కామపురుషార్థానికి 'దాసోహం' అనే విధంగా మార్చివేయగలడు. అలాంటి మన్మథుడికి ఉపకరించే సాధనాలను చూస్తే విస్తుపోవలసివస్తుంది. పురాణాల ప్రకారం- అతడు చేపట్టిన విల్లు పూలతో అల్లింది. ఆ వింటికి ఉండే తాడు తుమ్మెదలబారు. ఆ తుమ్మెదలు స్థిరంగా ఉండక, కదులుతుంటాయి. కామినుల చూపులే బాణాలు. అతనికి సహాయంచేసే మిత్రుడు జడపదార్థం లాంటి చంద్రుడు. ఇంతకూ మన్మథుడికి శరీరావయవాలన్నీ చక్కగా ఉన్నాయా అంటే అవీలేవు. అతడు ఏ శరీరావయవాలూ లేని అనంగుడు. ఇన్నిలోపాలు ఉన్నా మన్మథుడు సమస్త ప్రపంచాన్ని తన వశం చేసుకుంటున్నాడంటే విచిత్రమేకదా!

సూర్యుడు కూడా ఇలాంటివాడే. ఉదయాస్తమయాలూ, నిర్విరామంగా ప్రపంచం చుట్టూ పరిభ్రమించే సూర్యుడు తన ప్రయాణానికి తగిన ఉపకరణాలున్నాయో లేదో అసలే పట్టించుకోడు. అవక్రవిక్రమంగా ముందుకు సాగుతూనే ఉంటాడు. అతడి రథానికి ఉండే చక్రం ఒకటే. రెండు చక్రాలు ఉన్నా, కుదుపులతో సాగే పరిస్థితుల్లో సూర్యుడు ఏకచక్రరథంతోనే ఎల్లలు దాటుతున్నాడు. అతడి రథాన్ని నడిపే సారథి తొడలులేని అనూరుడు. అసలే కదలలేడు. పౌరాణిక కథనాల మేరకు, ఆ రథానికి కట్టిన గుర్రాలు ఏడు. ఆ గుర్రాలను అదుపుచేసే పగ్గాలు వక్రంగా నడిచే పాములు. ఇలా ప్రయాణ సాధనాలు లోపభూయిష్ఠంగా ఉన్నా, వాటిని పట్టించుకోకుండా సూర్యుడు పరుగులు తీస్తున్నాడంటే- కార్యసాధకులకు ఆత్మశక్తి ఉంటే చాలు, సాధనాలు అంతగా ఉండవలసిన అవసరం ఏమీలేదని తెలుస్తుంది.

రాముడు ఇలాంటి కార్యసాధకుల్లో అగ్రగణ్యుడు. దండకారణ్యంలోని పర్ణశాల నుంచి సీతాదేవిని రావణుడు అపహరించుకొనిపోయిన తరవాత, రాముడు సీతను అన్వేషిస్తూ కాలినడకతో ముందుకు సాగాడు. సీత ఏమైందో తెలుసుకొని, రావణసంహారం కోసం లంకపై యుద్ధం చేయడానికి పూనుకొంటాడు. లంకకు వెళ్లాలంటే నూరు యోజనాలుగా విస్తరించి ఉన్న సాగరాన్ని దాటాలి. తనకు సహాయంగా ఉన్నది వానర సమూహమే కాని అపార సైన్యసంపద కాదు. కడలికి వంతెన కట్టడం తనవల్ల సాధ్యమవుతుందా అని చింతించలేదు రాముడు. సకల వానర మృగపక్షిసంఘాలూ, చివరికి ఉడుత బుడుత సహాయాన్ని కూడా వదలక, లక్ష్యాన్ని సాధించాడు. జలధికి వారధికట్టి, రావణాసురుణ్ని కొట్టి, చివరికి సీతను చేపట్టాడు. ఇదంతా ఉపకరణాలవల్ల జరిగిందేనా అంటే, కానేకాదు. సాధకుడిలోని అంతశ్శక్తి మాత్రమే విజయానికి సోపానం అనే సత్యం ఈ వృత్తాంతాలద్వారా తెలుస్తుంది.

ఈ కారణంగా మనిషి ఉన్నత లక్ష్యాలను సాధించాలనుకొన్నప్పుడు సాధనాల్లో కొంత కొరత ఉన్నా పట్టించుకోరాదు. చిన్నచిన్న ఆటంకాలను లెక్కచేయరాదు. అనుకున్న పనిని సాధించేదాకా అలసిపోరాదు. ధైర్యంతో ముందడుగు వేయాలే తప్ప, భయపడి వెనుదిరగరాదు. ఇదే కార్యసాధనలోని రహస్యం.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కర్మ అంటే ఏమిటి - What is karma?

కర్మ అంటే ఏమిటి - What is karma?

'కర్మ అంటే మరేదో కాదు విద్యుక్త ధర్మకు కర్మ అది శుచియై, పవిత్రమై ఉంటుంది. అబద్ధం, కపటం, చౌర్యం, హింస, మోసం, వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు. అందుకే ధార్మికులు వీటిని వదిలి జీవించుటకు ఉత్తమ జీవనగతిగా పేర్కొంటారు. ఈ ధర్మాలు ఆయా వర్ణాలకు విడిగా ఉంటాయి. కాబట్టి వారి విధులు, మరొక వర్ణానికి, తేడా వర్గానికి, తప్పని తోచవచ్చు.
ఉదా.: క్షత్రియుడు, పాలకుడిగా, ప్రజాసంరక్షణ ధ్యేయంతో శత్రువు లను చంపవచ్చు ఇది దోషం కాదు. విద్యుక్త ధర్మమే అవుతుంది. వీటినే ధర్మసూక్ష్మాలుగా భావించాలి. కర్మలు విధిని ధిక్కరించలేవు. వాటి స్వాధీనంలోనే ఉంటాయి. విధి భగవంతుని నిర్ణయం. అయితే తెలిసి, తెలిసి విషితత్త్వాలు ధిక్కరించేవారు మాత్రం దోషులే!

విహిత కర్మలంటే
ప్రాచీనులు వర్ణవ్యవస్థలో ఆయా వర్ణాలకు కొన్ని విహిత కర్మలు నిర్ణయించినారు. వారు సామాజిక సంఘటిత స్వరూపం కాపాడమనే ఈ వ్యవస్థ నేడు కులాలలో ఎబిసిడి అని ఏర్పాటు చేసి నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అనేది తదాచర కాలంలో మరింత స్వార్థబుద్ధితో కల్పించినవే. అందరికి సమాన అవకాశాలు కల్పించటం నేటి ప్రభుత్వాల విధి. ఒకవిధంగా ఇది ప్రభుత్వ విషిత కర్మనే అవు తుంది.

బ్రాహ్మణులతో యజ్ఞయాగాది క్రతువులు, విహిత కర్మలు, క్షత్రియులకు, యుద్ధాలు చేయుట, దుష్టశిక్షణ, శిష్టరక్షణ విహితకర్మలు. ఈవిధంగా మిగతా వర్ణాలకు విహిత కర్మలు న్నాయి. వీటన్నింటిని ధర్మం తప్పక అనుభవంలో పెట్టాలన్న భగవంతుడు, తాను మాత్రం అందరికి సమానుడు అని చాటాడు. భగవంతుడే సృష్టికర్త. అతన్నిసృజించి తరించటం విషయంలో అందరూ సమానమే. అందుకే మానవులందరిని సంభో దిస్తూ ఈ శ్లోకం చెప్పాడు.
శ్లోః యతః ప్రవృత్తి దూతానం మేన సర్వమిదం తతమ్‌, స్మకర్మణాః తమభ్యర్చ్యసిద్ధిం విదంతి మానవః -మోక్షసద్వినియోగం
అని సమస్త సృజనాధిపతి అయిన ఆ దేవదేవుని స్వాభావిక ధర్మ, కార్యాచరణ ద్వారా పూజించి, మానవులు తరించుచున్నారు. అని అన్ని వర్ణాల, వర్గాల ప్రజలు దేవుని పూజించి, తనలో ఏకం కావచ్చునన్నాడు.

అంటే, మానవజాతిలోగాని, వర్ణవర్గాల్లో గాని, ఏవిధమైన విచక్షణ, లేదా భిన్న త్వం కానీ లేదని సూచించినట్టే కదా. కర్మలలో భిన్నత్వం సామాజిక ధర్మాల విభజనకు మాత్రమేనని, ఆయా కర్మలు వారివారి స్వాభావిక క్రియలు మాత్రమే అని తనని చేరటానికి ప్రతిబంధకం కాదు అని స్పష్టం చేసాడు.

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com