నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
రామాయణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రామాయణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జులై 2020, మంగళవారం

మంధర యొక్క పూర్వజన్మ - Manthara

మంధర - పూర్వజన్మ

ఒకానొక కాలంలో విరోచనుడు అనే పేరు కల్గిన ఒక రాక్షసుడు ఉండేవాడు. అవ్వటానికి రాక్షసుడు అయినా బ్రాహ్మణత్వం పొంది, సకల సుకర్మలు చేస్తూ రాజుగా ఉన్నాడు. రాజుగా దేవతలపై దండెత్తి వారిని ఓడించి దేవలోకమును స్వాధీన పరచుకున్నాడు.

దేవలోకం నుండి పారిపోయిన దేవతలు వారి గురువు బృహస్పతి వద్దకు వెళ్లారు. వారి పరిస్థితిని తెలుసుకున్న బృహస్పతి, ఆ ఆపదకు నివారణ ఉపాయం కేవలం అతనికి గల దానగుణమును ఉపయోగించుకొనుట మాత్రమే అని చెప్పాడు.

అతని మాటలు విన్న దేవతలు వెంటనే బ్రాహ్మణ రూపములు ధరించి విరోచనుని వద్దకు వెళ్లారు. ఆలా తనవద్దకు వచ్చినవారు దేవతలు అని తెలిసి కూడా విరోచనుడు వారికి అతిధి సత్కారములు చేసి, ఏమి కావాలో కోరుకొమ్మని చెప్పాడు. అప్పుడు వారు విరోచనుని దేహమును ఇవ్వమని కోరారు. ఇంటికి వచ్చి అర్ధించిన అతిధులకు ఇవ్వటానికి పనికి రాకపోతే, అటువంటి శరీరం ఉన్న లేకపోయినా ఒకటే అని చెప్పి అతని శరీరమును వారికి ఇచ్చివేసాడు.

అప్పుడు రాక్షసులు ఆనాధలు అవ్వటం వలన కోలాహలం చెలరేగింది. ఆ కోలాహలమునకు విరోచనుని కుమార్తె బయటకు వచ్చింది. ఆమె అనేక రాక్షస కృత్యములలో ఆరితేరినది. అనేక క్షుద్రవిద్యలు తెలిసినది అవ్వటం వలన వారికి దైర్యం చెబుతూ, అన్యాయంగా తన తండ్రిని మోసగించిన దేవతల పై తాను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి రాక్షసులను తన అధికారంలోనికి తెచ్చుకున్నది. అలా ఆమె అధీనంలో ఉన్న రాక్షసులు తిరిగి దేవలోకంపై దండెత్తారు. కానీ వారు మరలా దేవతలా చేతిలో ఓటమి పొందుతున్న సమయంలో, కొందరు రాక్షసులు విరోచనుని కుమార్తె వద్దకు వచ్చి యుద్ధం లో వారు ఓడిపోతున్న విష్యం చెప్పగా, ఆమె స్వయంగా దేవలోకమునకు వెళ్లి నేరుగా దేవతలతో తలపడింది. తన విద్యలతో దేవతలను, వారి వాహనములు బందించింది.

అలా బంధించబడిన దేవతలు శ్రీమహావిష్ణువు ను శరణు వేడుకున్నారు. ఆర్త త్రాణపరాయణుడు అయిన ఆ శ్రీ మహా విష్ణువు ఉన్నపళంగా అక్కడకు వచ్చి, దేవతలను బంధముల నుండి విడిపించి, ఆ విరోచనుని కుమార్తెను చంపటానికి ఇంద్రుడిని ప్రేరేపించాడు. అప్పుడు ఇంద్రుడు ఆమె పై వజ్రాయుధమును ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం తగిలిన ఆమె అలా కిందకు భూలోకమునకు పడిపోతూ, తనకు అటువంటి గతి పట్టటానికి కారణం ఇంద్రుడే అయినా , ఇంద్రుడు అలా ప్రవర్తించటానికి కారణం శ్రీమహావిష్ణువు కాబట్టి, తాను ఎలాగయినా విష్ణువునకు అపకారం చేయాలి అని తన మనస్సులోనే శపధం చేసుకుంది. ఆమె శరీరం భూమిపై పడినప్పుడు మూడు వంకరలుతిరిగింది. పెద్దగా అరుస్తూ ఆమె ప్రాణములు వదిలింది. అలా చివరి క్షణంలో ఆమె విష్ణువు నకు అపకారం చేయాలి అని అనుకున్నది కనుక ఆమె మరు జన్మలో, మానవ కాంతగా, గూని దానిగా జన్మించి, ఎంతో సంతోషంగా శ్రీరాముని పట్టాభిషేకమునకు సిద్ధపడుతున్న అయోధ్యను ఆశ్చర్యకరంగా బాధపెట్టిన మంధరగా జన్మించి, తన పూర్వజన్మ పంతమును నెరవేర్చుకున్నది.

సంకలనం: దీపికా గోగిశెట్టి

17, మే 2020, ఆదివారం

రామాయణం 108 ప్రశ్నావళి - 108 Questions about Ramayanam

రామాయణం 108 ప్రశ్నావళి - 108 Questions about Ramayanam

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
జ: వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
జ:  నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
జ: తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
జ: 24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
జ: కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
జ: సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
జ: కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
జ: సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
జ: కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు
జ: పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
జ: కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
జ: జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
జ:  దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
జ: హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
జ: శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
జ: కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
జ: లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
జ: వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
జ: 12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
జ: మారీచ, సుబాహులు.

21.  రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
జ: బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
జ: సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
జ: సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
జ: అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
జ: భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
జ: జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
జ: గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
జ: శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
జ: నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
జ: దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
జ: విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
జ: మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
జ: జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
జ: కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
జ: వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
జ: యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
జ: మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
జ: గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
జ: శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
జ: గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
జ: భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
జ: మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
జ: తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
జ: జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
జ: నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
జ: అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
జ: విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
జ: అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
జ: గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
జ: శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
జ: జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
జ: మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
జ: బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
జ: జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
జ: దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
జ: కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
జ: మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
జ: ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
జ: హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
జ: అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
జ: కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
జ: రుమ.

63. వాలి భార్యపేరు?
జ: తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
జ: కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
జ: మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
జ: దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
జ: మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
జ: అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
జ: ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
జ: ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
జ: వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
జ: అంగదుడు.

73. సుగ్రీవునికి,  సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
జ: మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
జ: శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?
జ: మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
జ: దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
జ: తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
జ: స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
జ: సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
జ: పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
జ: మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
జ: మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
జ: సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
జ: సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
జ: నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
జ: లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
జ: అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
జ: రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
జ: త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
జ: రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
జ: చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
జ: ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
జ: ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
జ: విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
జ: మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
జ: మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
జ: ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
జ: నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
జ: నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
జ: అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
జ: ఇంద్రుడు.

102.  రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
జ: మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
జ: కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
జ: హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
జ: శత్రుంజయం.

106.  శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
జ: స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
జ:  బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన  బహుమతి ఏమిటి?
జ:  తన మెడలోని. ముత్యాలహారం.

సంకలనం: ఎన్ కిశోర్

27, ఏప్రిల్ 2020, సోమవారం

విభీషణుడి ధర్మ నీతి - Vibhishan Dharma Neethiనిషి పుట్టిన వంశం, కులం, జీవన విధానాలు ఎటువంటివైనా ఆశయాలూ, లక్ష్యాలూ, విలువలూ ఉన్నతంగా ఉంటే మనిషి మహనీయుడవుతాడనీ, తాను మానసికంగా ఎంతటి వ్యథను  అనుభవించినా, తనవారినే నిరోధించాల్సి వచ్చినా ధర్మమార్గమే తన మార్గమని తలంచి చివరిదాకా దానికి కట్టుబడి జీవించిన మనిషే మనిషనీ నిరూపించిన మహానుభావుడు విభీషణుడు. 
రాక్షసకులంలో జన్మించినా రత్నంగా, ధార్మిక జగతిలో శిరోమణిగా, రామాయణ గాథలో కీలకమైన వ్యక్తిగా సమాజానికి పరిచయమైన విభీషణుని మనో విజ్ఞానం అత్యద్భుతం, భావితరాలకు ఆదర్శం.
కైకసీ విశ్రవుల మూడో కొడుకు, రావణుని సోదరుడూ, మంత్రి, శ్రీరామచంద్రునికి అత్యంత ఆప్తుడు విభీషణుడు. శైలూషుడనే గంధర్వరాజు కూతురు సరమ ఈతని భార్య. రాక్షస లంకలో రామనామ జపాన్ని రహస్యంగా ధ్వనిస్తూనే ఆ నామ తరంగాలను రాక్షసత్వాన్ని పావనం చేసేందుకు తపించిన రాక్షసోత్తముడు విభీషణుడు. ఒక వ్యక్తి జీవితాన్నీ, అతనిలోని భావోద్వేగాలనూ సంపూర్ణంగా ఓ అంచనాకు తేవడం అసాధ్యం. మన జీవితాన్నే సరిగ్గా వ్యక్తపరచలేని మనం ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో వెనుకడుగు వేయక తప్పదు. విభీషణుని జీవితాన్ని కూడా అర్థం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే రాక్షసత్వంలోంచి పరిమళించిన ధార్మికత, నైతికత లోకకళ్యాణం కోసం మరింత నిగ్గుదేలాయనడానికి విభీషణుని వ్యక్తిత్వమే ప్రతీక.

పుట్టుక రాక్షసజాతి నిర్దేశించింది. కానీ విభీషణుని వ్యక్తిత్వం మానవీయ కోణంలో ఎదిగింది. తనజాతి లక్షణాలు స్వతాహాగా మనిషి కోణంలో ఎదిగాయి. తన జాతి లక్షణాలు స్వతహాగా మనిషిలో ప్రభావితమవుతున్నా వాటి జోలికి పోకుండా ఎటువంటి ప్రలోభాలు ప్రేరేపించినా తలొగ్గక, ఎంతటి భోగాలు ఆకర్షించినా ఏమాత్రం సడలక తనదైన వ్యక్తిత్వంతో ధర్మసాధన చేసి విభీషణుడు మహోన్నతుడయ్యాడు. తన కుటుంబం, తన లంకానగరం, తన అన్న రావణుడూ ధర్మం నీడలో బతకాలని కాంక్షించి దానిని కొనసాగించడం కోసం అహర్నిశలూ తపించాడు.

మహావీరుడూ, ధర్మశాస్త్ర, నీతిశాస్త్ర సారమెరిగినవాడూ, సకల కళలలో ప్రావీణ్యం గలవాడూ, లంకను సర్వస్వతంత్ర సామ్రాజ్యంగా నిలబెట్టిన చక్రవర్తి. బంగారు లంకను స్థాపించిన రావణుడంటే విభీషణునికి అభిమానం, ప్రేమ, గౌరవం. రావణుడు తన అన్న అయినందుకు ఒకింత గర్వం. కానీ ఒక స్త్రీ వ్యామోహంతో లంకాపతనానికి పూనుకున్నందుకు రావణున్ని వారించిన తీరు ధర్మజగతిలో ఓ మైలురాయి. 

దండకారణ్యం నుంచి సీతాపహరణం చేసుకొని వచ్చాడన్న వార్త వినగానే ఆగామి రోజుల్లో జరుగబోయే పీడను శంకించిన విభీషణుడు రావణుడు చనిపోయేంత వరకూ తను చేసేది, చేస్తుంది అధర్మమని చెబుతూనే ఉన్నాడు. బతిమాలాడూ, వాదించాడూ, చర్చించాడూ, హెచ్చరించాడు. అయినా రావణుడు పంతం వీడలేదు. 
శ్రీ రామునితో విభీషణుడు
విభీషణుడి ధర్మ నీతి:
 • ⭄ హనుమంతుడు దూతగా వచ్చినప్పుడు రావణుడు ఒక కోతి వచ్చి నాకు ధర్మబోధ చేస్తుందా! అని పరిహసిస్తూ హనుమను చంపమని ఆదేశిస్తే, విభీషణుడు దూతను చంపడం అత్యంత దుర్మార్గమనీ, కావాలంటే అతను మనకు చేసిన నష్టానికి గానూ ఏదైనా శిక్షను విధించి వదిలేయమని సమాధానపరుస్తాడు. 
 • రావణునితో ప్రశాంతంగా ఆలోచించు! నీ శత్రువుకు నీవేంటో తెలియాలంటే దూతను వదిలేయడమే ధర్మమని చెబుతాడు.
 • ⭄ రామరావణ యుద్ధాన్ని వారించేందుకు విభీషణుడు పడ్డపాట్లు అన్నీ, ఇన్నీ కావు. రావణునితో విభీషణుడు చెప్పిన మాటలు నాడు త్రేతాయుగాన్నే కాదు, నేటి కలియుగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. 
 • అహంకారం నాడే కాదు, నేడు కూడా కుటుంబాలు నాశనమయ్యేందుకు, జీవితాలు పతనమయ్యేందుకు కాచుకొని కూర్చుంటుందనే గుణపాఠం ఆ మాటల అంతరార్థం.
విభీషణుడు రావణునితో.. 
స్త్రీ వల్లే ధనం, కీర్తి వస్తాయి. స్త్రీ వల్లే సర్వం తుడిచిపెట్టుకుపోతాయి. దేవతలకు కూడా లభించని అమరసుఖాలు మన లంకలో ఉన్నాయి. వాటిని అనుభవించే అదృష్టాన్నీ చేజేతులా పాడుచేసుకోవద్దు. నిన్నే నమ్ముకొని ఉన్న లంకానగరవాసుల్ని ఒక స్త్రీ కారణంగా మృత్యుఒడిలోకి నెట్టొద్దు. నేను నీకు ఆప్తుడనూ, మంత్రినీ. అహాన్ని వదిలి సీతమ్మను సగౌరవంగా శ్రీరామునికి అప్పగిద్దాం. అన్నింటినీ సమూలంగా నాశనం చేసే కోపాన్ని విడిచిపెట్టు. అన్నింటికీ ఆలవాలమైన ధర్మాన్ని పాటించు. కోపాన్నీ అహాన్ని, మైథిలినీ వదిలి రావణుడు కీర్తిని పోందాలనీ, అధర్మాన్ని వీడి ధర్మమార్గంలో నడవాలనీ భావించే ఈ విభీషణుడు నీ మంచే కోరుకుంటాడని ప్రాధేయపడతాడు.

రావణుని మిగతా సోదరులూ, మంత్రులూ, కొడుకులూ రావణుని వైభవాన్ని చాటుతున్నామనుకొని రావణున్ని రెచ్చగొడుతుంటే చూసి సహించలేని విభీషణుడు వారితో రాచధర్మాన్ని నిలబెట్టాలనుకుంటే రాజుకు మంచే చెప్పాలి. అది కఠినంగా ఉన్నా సరే. అధర్మంతో రాక్షస వినాశనానికి పూనుకుంటుంటే సమర్థించడం ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించాడు.

ఇలా ఎన్నో విధాలుగా చెప్పీ, చెప్పీ అలిసిపోయిన విభీషణుడు ధర్మమే నిలబడుతుందనీ, న్యాయమే గెలుస్తుందనీ నమ్మి రాముని శరణుకోరాడు. రావణుని జయించడానికి అనేక ఉపాయాలూ, రహస్యాలూ రామునికి తెలిపి సహకరించాడు. రావణుడు నేలకొరగడం చూసి తట్టుకోలేక విలపించాడు. అనుకున్నదంతా అయ్యిందనీ, ఒక స్త్రీ వ్యామోహంతో రావణుడంతటి వాడూ, అనంతమైన లంక పతనం అయ్యిందనీ బాధపడి రావణునికి అంతిమ సంస్కారం చేసి సద్గతులకై ప్రార్థించాడు విభీషనుడు.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

15, ఏప్రిల్ 2020, బుధవారం

సింహాసనం కాదని వనవాసానికి - Simhasanam Kaadani Vanavasaniki Ramudu

శరథునికి మనసులో తాను వృద్ధుడయి నట్లుగా అనిపించింది. శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం చేయాలనీ కోరిక కలిగింది. కానీ ఆ పనిలో అనేక విఘ్నాలు కలుగవచ్చుననే అనుమానం కూడా కలిగింది. సర్దారులను, రాజులను, మంత్రులను, పురోహితులను ప్రజలను రాజదర్బారులో సమావేశ పరిచాడు. నిండు దర్భారులో తన ఆలోచనలు ప్రజలముందుంచాడు.
"నేను వృద్ధుడనయ్యాను. వంశాచారం ప్రకారం జ్యేష్ఠ పుత్రుడయిన శ్రీరామునికి యువరాజు పట్టాభిషేకం జరపాలని నాకు అనిపిస్తోంది. నా ఆలోచన సరైంది అనిపిస్తే అనుమతి ఇవ్వండి. అనుచితమనిపిస్తే ప్రత్యామ్నాయం సూచించండని” పలికాడు. 
ఒక్క రామాయణంలో తప్ప మరే ఇతర పురాణాలలో జ్యేష్ఠపుత్రునికి రాజ సింహాసనాధికారం కలిగించేందుకు ప్రజల అనుమతి కోరడం కనిపించదు. అదే నేటి పాలకులు తమ వారసులను అందలం ఎక్కించడానికి ఎన్ని పన్నాగాలు పన్నుతున్నారో చూస్తున్నాం.

      యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన శ్రీరాముడు తండ్రి మాటకోసం వనవాసానికి సిద్దమ య్యాడు. వాస్తవంగా కైక వలన ఒక నిరపరాధి అడవులపాలయ్యాడని, రాజ్యాధికారం పొందలేక పోయాడని భావిస్తూ ఉంటారు. కానీ రాముడి వలన జరుగవలసిన మహత్కార్యం ఎంతో ఉంది. సమస్త భూమండలంపై ఉన్న రాక్షసులను నాశనం చేసి “సజ్జన రక్షణ” అనే బృహత్కార్య నిర్వహణ ఆయన చేయాలి. అందుకే సింహాసనం కాదని వనవాసాన్ని స్వీకరించాడు.

శ్రీరాముని వనవాసానికి అసలు ఒక్క రుషిగాని, కుల గురువైన వశిష్టుడు కానీ అడ్డు చెప్పనేలేదు. రాజైన దశరథునికి నచ్చచెప్పి రాముడిని విశ్వామిత్రు నితో అడవులకు పంపగలిగిన వశిష్టునికి, కైకేయి మాట చెల్లనీయకుండా చేయడం ఏమాత్రం కష్టం కాదు, కానీ అది వారి ఆకాంక్ష కాదు.

శ్రీరాముడి చేత రాక్షస సంహారం జరగాలన్నది మహర్షులందరి అభిష్టం లోకకళ్యాణం కోసం ఆనాడు అదే అత్యవసరం. *

-జాగృతి

11, ఏప్రిల్ 2020, శనివారం

రామాయణంలో సుగ్రీవుడు సీత దేవి జాడ కోసం వివరించిన నాటి భూగోళ రూపు రేఖలు - Ramyanam, Sugrivaరామాయణంలో సుగ్రీవుడు సీత దేవి జాడ కోసం వివరించిన నాటి భూగోళ రూపు రేఖలు - Ramyanam, Sugriva
రామాయణం ఒక భూగోళ శాస్త్రము.  మాత సీత దేవి జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నాకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి. ఒకసారి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వివరాలు అవలోకించండి. 
శ్రీ రాముడు ప్రయాణించిన దారి పటము 
తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు:
 • ముఖ్యమైన నదులు: గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి , సరస్వతి , సింధు;
 • నగరాలు : బ్రహ్మమాల , విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ,
అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి పరికించండి)
 • ⭄ తరువాత శిశిరము అను పర్వతము పిమ్మట సముద్రము (అండమాన్ సీ)
 • ⭄ యవద్వీపము, సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపం, – బంగారు వెండికు నెలవైనవి (బర్మా, లాఓస్, ఇతరత్రా) ఇక్కడ చేపలను పచ్చిగా తింటారు. కొన్ని నేడు సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చును.
 • ⭄ తరువాత శోననదము, అటుపై నల్లగా వుండే ఇక్షు సముద్రం ( నేడు ఒక సారి చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో – సుమారు నలుపు రంగులో కనబడుతుంది సౌత్ చైనా సి )
 • ⭄ అటుపై లోహితము, మధు సముద్రము (ఈస్ట్ చైనా సి)
 •  తరువాత శాల్మలీ ద్వీపము (తైవాన్)
 • ⭄ ఋషభము అని పర్వతము
 • ⭄ మధుర జలధి (జపనీస్ సి )
 • ⭄ ఔర్వుడు వలన హయముఖము (అగ్నిశిఖరం) (కొరియా)
 • ⭄ 13 యోజనాల దూరం లో బంగారు పర్వతము – జాత రూప శిలము
 • ⭄ ఉదయాద్రి (ల్యాండ్ of రైసింగ్ sun ) (జపాన్ )
 • ⭄ తరువాత క్షీరోదము అను సముద్రము (నార్త్ పసిఫిక్ ఓషన్)
 • ⭄ అక్కడ వరకు మాత్రమె అతను చెప్పగలిగాడు. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ పరికించి చూడమని మనవి.
 • ⭄ దక్షిణ దిక్కుకు అంగదుడు, హనుమంతుడు వంటి వీరులను పంపుతూ అక్కడి వివరాలిలా చెబుతాడు.
 • ⭄ నదులు : గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద , మహాభాగా
 • ⭄ దేశాలు : మేఖల, ఉత్కళ, దశార్ణ , అవంతి, విదార్ధ, మూషిక, వంగ, కాలింగ, కౌశిక దండకారణ్యం, గోదావరి పాయఆంద్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, మలయ పర్వతం అటుపై కావేరి,
 • ⭄ పాండ్య దేశానంతరం మహా సముద్రం (బే of బెంగాల్ ) దానిలో మహేంద్రగిరి అటుపై 100 యోజనాల దూరంలో లంక
 • ⭄ మరొక 100 యోజనాల దూరంలో పుష్పితకము (ఆస్ట్రేలియా ) , అటుపై 14 యోజనాల దూరంలో సూర్యవంతము(న్యూ జీలాండ్) ,విఅడుత్యము , కుంజరము, భోగవతి ,వృషభ పర్వతము (అంటార్క్టిక)
 • ⭄ అది దాటాక భూమి సరిహద్దు
విభీషణ - సుగ్రీవ - హనుమ
పశ్చిమ దిక్కుకు సుషేణుడు
 •  వున్న రాజ్యాలు : సౌరాష్ట్ర, బాహ్లిక, శూరా, భీమ, అటుపై మరుభూమి మిట్ట నెలలు ( ఎడారులు ) ఆఫ్ఘనిస్తాన్ తరువాత సముద్రము
 • ⭄ మురచీ , అవంతి , అటుపై సింధు నదము (మనలను సింధు నాగరికత పేరుతో నేడు ఆంగ్లేయులు హిందూ అని పిలుస్తున్నారు), అటుపై హేమగిరి, పారియాత్రము, చక్రవంతము – కొండ
 • ⭄ 60 యోజనాల దూరంలో వరాహగిరి – ప్రాగ్జోతిష పురము (భారతంలో చెప్పిన ప్రాగ్జోతిష్ పురము వేరు), సర్వ సౌవర్ణ పర్వతము, మరి కొన్ని పర్వతాలు
 • ⭄ మేరు పర్వతము ( ఇతః పూర్వం మనము ముచ్చటించుకున్న మేరు పర్వతం మన భూగోళానికి రిఫరెన్స్ గా వున్న పాయింట్)
 • ⭄ 10000 యోజనాల దూరంలో అస్తాద్రి ( యునైటెడ్ కింగ్డమ్) (రవి అస్తమించని దేశం )
తరువాత సరిహద్దు
ఉత్తర దిక్కుకు శతవాలి
 • ⭄ ముందుగా హిమవత్పర్వతము అటుపై మ్లేచ్చ దేశములు, పులిందులు, ఇంద్రప్రస్థ, Tankana, చీనా, పరమ చీనా,(నేటి చైనా ) కాల ప్రవతము,(కజాక్స్తాన్ ), హేమగర్భము (మంగోలియా) సుదర్శనము
 • ⭄ దేవసాఖ శైలము అటుపై శూన్య ప్రదేశము (రష్యా) తరువాత తెల్లని హిమం తో కూడుకున్న పర్వతము – కైలాసము, అటుపై క్రౌన్చగిరి, ఇంకా హిమం తో వున్నా మరి కొన్ని పర్వతాలు (రస్యా )
 • ⭄ లవణ సముద్రము ( కార సి), సోమగిరి (బోల్షెవిక్) పిమ్మట సరిహద్దు
 • ⭄ అంతకు మునుపు టపాలలో మనకున్న టెక్టోనిక్ ప్లేట్ లు కదులుతున్నాయని ప్రస్తావించడం జరిగింది. కాలగర్భంలో ఎన్నో భౌగోళిక మార్పులు జరిగాయి. కొన్ని ఖండాలకు ఖండాలు సముద్ర గర్భంలో కాలిపోయాయి, కొత్తవి వెలికి వచ్చాయి. కానీ కొన్ని మార్పు లేకుండా వున్నాయి.
ఇక్కడ మనం గమనించ వలసినది ఏమిటంటే ఇంత టెక్నాలజీ లేకుండా ఎప్పుడో రచించ బడిన రామాయణంలో ఇంత ప్రస్ఫుటంగా భౌగోళిక వివరాలు పొందు పరచబడి వున్నాయి.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

1, ఏప్రిల్ 2020, బుధవారం

శ్రీరామ నవమి పండుగ - భారతీయులందరి పరమ పవిత్రమైన దినం, Srirama Navami festival

Srirama Navami festival

శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత

శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు.
 • శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 
 • రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.
 • శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. 
 • శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. 
 • శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది 
 • శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్ట్భాషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. 
 • శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. 
శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

శ్రీరాముడి జాతకం వివరాలు - Sri Rama Jatakam

శ్రీరాముని  జాతకం.
వాల్మికి మహర్షి రామాయణంలో బాలకాండలో 18 వ సర్గ లో 8. 9. 10  శ్లోకాలలో శ్రీరాముని జనము అప్పటి గ్రహస్తితిని, లగ్నాన్ని ఇలా చెప్పాడు.  లగ్నం కర్కాటకం ,లగ్నములో గురు చంద్రులు. మరియు  రవి మేషంలోను, మకరంలో కుజుడు, కర్కాటకంలో గురువు.  మీనంలో శుక్రుడు, తులలో శని. ఈ ఐదు గ్రహములు  ఉచ్చ స్తితి పొందియున్నవి. మిగిలిన గ్రహముల స్తితి వాల్మీకి చెప్పలేదు.  ఇలా గ్రహములు ఉన్నచో  ఫలాలు ఎలా ఉండునో , శాస్త్రమున ఏమి చెప్పిరో  వివరించెదను. ఈ గ్రహములు  కుడా లగ్నమునుండి , 1 వ  4 వ, 7 వ, 9 వ  10 వ  స్తానాలలో ఉన్నారు.  ఇందులో 1, 9,  కొణములుగను, 4,7,10 కేంద్రములగను  శాస్త్రమున చెప్పబడినవి.  
  శ్రీరాముడి జాతకం వివరాలు - Sri Rama Jatakam
 • లగ్నము కర్కాటకము - ఈ రాశికి అధిపతి చంద్రుడు  లగ్నములో నున్నాడు. మరియు వృద్ధి చంద్రుడు ఫలములు.  దృఢ శరీరము కలవాడు, చిరంజీవి, నిర్భయుడు, బలిష్టుడు, అగును.
 • రవి మేషమున ఉచ్చస్తితి  పొందిన. - భూములు, ధనము, భార్య పుత్రులు, కీర్తి, శౌర్యము, పరాక్రమము, కలుగును. కాని విరోధము, దేశము విడిచిపోవుట,సంచార వినోదము కలుగును. 
 • కుజుడు మకరమున  ఉచ్చస్తితి పొందిన - రాజ్యము, రాజస్నేహము, భూమి ధనము, వాహనములు, విదేశ యానము, రాజ సన్మానము, భార్యవలన దుఃఖము,  కలాహము, జయము కలుగును.ఇక్కడ కొంచం కుజదోషముచెప్పాలి  7 వ ఇంట కుజుడు బలదోషమైనా, కర్కాటక లగ్నం వలన, చంద్ర, గురు దృష్టి వలన కొంత  దోషం నివృత్తి అయినది.   అందుచే కొంత కాలము భార్యతో ఎడబాటు తప్పలేదు.
 • గురుడు కర్కాటకమున ఉచ్చస్తితి పొందిన - రాజ్యము, మహా సౌఖ్యము, కీర్తి, మనోవిలాసము, రాజ్యాభిషేకము, స్వకులమునకు అధిపతి అగుట, విదేశయానము, కృశించిన శరీరము, దుఃఖము కలుగును.
 • శుక్రుడు మీనమున ఉచ్చస్తితి పొందిన -  స్తీ మూలమున నష్టము, లోకవిరుద్ధమైన ధర్మాచరణము, తల్లి తండ్రులకు దుఃఖము,  రాజ సన్మానము, భార్యతో భోగములు, భోజనము,,  భార్యా పుత్రులతో సుఖము కలుగును.  ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్నను శత్రువు ఇంట నున్నాడు.  అందుచే  అంత శుభములు కలుగవు.
 • శని తులలో ఉచ్చలో నున్న ఫలములు -   గ్రామములకు సభలకు అధిపతి. వినోద శీలము, పిత్రునాశనము, బంధువులతో కలహము, దేశాటన చేయుట, దుఃఖము, రోగభయము, రాజులతో వైరము, యుద్ధము సంభవించును. 
జ్యోతిష శాస్త్రమున చెప్పిన ఈ ఫలములు శ్రీరాముని జీవితమున  ఎక్కువ భాగము కనిపించును.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

రామాయణం, అప్పటి ప్రాచీన ప్రదేశాలు - ఇప్పటి ఆధునిక క్రొత్త పేర్లు - Ramayanam appati pradesalu, Ippati Adhunika Perlu

ramayanamlo-ippati-aadhunika-perlu
 • భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
 • కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
 • కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
 • రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు) - లాంగకో, టిబెట్, చైనా
 • పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
 • సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
 • మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
 • కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
 • దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.
 • సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.
 • ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
 • తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
 • అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
 • కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
 • గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
 • దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
 • చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
 • పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.
 • కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
 • శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.
 • హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
 • ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం - తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక
 • విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.
 • శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు - రామేశ్వరం,తమిళనాడు
 • రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.
 • అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
 • శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
 • సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.
 • వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
 • కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.
 • లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
 • తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
 •  పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

31, మార్చి 2020, మంగళవారం

నేటికీ థాయిలాండ్ లో రామరాజ్యం - Thailand, Rama Rajyam

నేటికీ థాయిలాండ్ లో రామరాజ్యం - Thailand, Rama Rajyam
థాయిలాండ్ దేశంలో ఇప్పటికీ రామరాజ్యం ఉంది..!

థాయిలాండ్ లో రామరాజ్యం మీకు తెలుసా?
థాయిలాండ్ లో  రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అని మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్ " అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు.

సంక్షిప్తంగా ఇతిహాసాలలో శ్రీరాముని చరిత్ర.
వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండ లోని 70,71 &73 సర్గలలో రాముని వివాహాన్ని , తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే -

మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీనది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ , మాండవి , శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా (పేజీ 354), సీతారాములకు లవకుశులు , ఊర్మిళాలక్ష్మణులకు అంగద చంద్రకేతులు , మాండవీభరతులకు పుష్కరుడు - తక్షుడనే వాళ్ళు , శృతకీర్తిశతృఘ్నులకు సుబాహువు - శతృఘాతకుడనేవాళ్ళు జన్మించారు.

శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.
 • పశ్చిమంలో లవునకు లవపురం ( లాహోర్ )
 • ⭄ తూర్పున కుశునకు కుశావతి  
 • ⭄ తక్షునకు తక్షశిల 
 • ⭄ అంగదునకు అంగదనగరం 
 • ⭄ చంద్రకేతునకు చంద్రావతి లను ఇవ్వడం జరిగింది. 
కుశుడు తన రాజ్యాన్ని తూర్పుదిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణుభగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా ! అందువలన వీళ్ళు తమ పేర్లచివర #రామ్ అన్న పేరు తగిలించుకుని , వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే భూమిబల్ అతుల్య తేజ్.

థాయిలాండ్ యొక్క అయోథ్య
థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok అని అంటున్నాము కదా ! అయితే ప్రభుత్వరికార్డులలో అధికారిక రాజధాని పేరువింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధాను లలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్ , ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి - "  క్రుంగదేవ మహానగర
అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి " .

థాయిభాషలో పైపేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకోవిశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు , పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోథ్యలోనే నివసిస్తారు.

థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది.
థాయిలాండ్ లో 1932 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా , రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వారనెవరినీ విమర్శించడం గానీ , వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులని విశ్వసిస్తారు. రాజవంశంవారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూధర్మశాస్త్ర పరిజ్ఞానముంది.

థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం
థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా , వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో  రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణశక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మనదేశంలోలాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం.

థాయిలాండ్ లో రామ్ కియేన్ ( రామాయణం) ని అనుసరించి నాటకాలు , తోలుబొమ్మలాటలు ఉన్నాయి. వారి నాటకాలలోని పాత్రలు చూద్దాం:
 •  1. రామ్ ( రాముడు )
 •  2. లక్ ( లక్ష్మణుడు )
 •  3. పాలీ ( వాలి )
 •  4. సుక్రీప్ (సుగ్రీవుడు )
 •  5. ఓన్కోట్ ( అంగదుడు )
 •  6. ఖోంపూన్ ( జాంబవంతుడు )
 •  7. బిపేక్ ( విభీషణుడు )
 •  8. తోతస్ కన్ ( దశకంఠ ) రావణుడు
 •  9. సదాయు ( జటాయు )
 • 10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ )
 • 11. మారిత్ ( మారీచుడు )
 • 12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్ ) మేఘనాదుడు.
థాయిలాండ్ లో హిందూదేవీదేవతలు
ఇక్కడ బౌద్ధులు అధికసంఖ్యాకులు. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు.
 • 1. ఈసుఅన్ ( ఈశ్వర్ ) శివుడు
 • 2. నారాయి (నారాయణ్ ) విష్ణువు
 • 3. ఫ్రామ్ ( బ్రహ్మా )
 • 4. ఇన్ ( ఇంద్రుడు )
 • 5. ఆథిత్ ( ఆదిత్య ) సూర్యుడు
 • 6. పాయ్ ( వాయు )
థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు
గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈజాతి లుప్తమైపోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite )  అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షిశాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణుభగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక , ఆ రాముడు విష్ణువు అవతారమనీ , ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతేకాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు.

థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి
మన దౌర్భాగ్యం కొద్దీ మనదేశంలో ముస్లిం ఆక్రమణదారులు మన సంస్కృతిని నాశనం చేసి ముస్లింపేర్లతో మన పట్టణాలనూ , పట్టణాలలోని వీథులనూ మార్చివేసారు. స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ , హిందూ సంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ , థాయిలాండ్ లోని రాజధాని లోని ఎయిర్ పోర్ట్ కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణభూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 563,000 sq.mt. ఎయిర్ పోర్టు ముందు "సముద్రమంథనం " ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు , రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది.
థాయిలాండ్ ఎయిర్ పోర్టు ముందు "సముద్రమంథనం " ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు , రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది
థాయిలాండ్ ఎయిర్ పోర్టు ముందు "సముద్రమంథనం " ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు , రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది
ఈ వ్యాసం ఉద్దేశ్యం
అసలైన సెక్యులరిజం అంటే ఏమిటో మనం థాయిలాండ్ ని చూసైనా నేర్చుకోవాలి. మన సంస్కృతిని మనమే మర్చిపోతే జాతికి మనుగడ ఉండదు అని గ్రహించాలి. మన పిల్లలకు, రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి.

(సౌజన్యము:- విశ్వహిందూ పరిషత్ వారి విశ్వధర్మ వాణి పుస్తకం నుండి)

20, డిసెంబర్ 2019, శుక్రవారం

ధర్మో రక్షతి రక్షితః - ఈ వాఖ్యము నకు అర్ధం, పరమార్ధం - Dharmo Rakshati Rakshitah

ధర్మో రక్షతి రక్షితః - ఈ వాఖ్యము నకు అర్ధం, పరమార్ధం - Dharmo Rakshati Rakshitah
卐 ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం అందరికి తెలిసినదే ఆ పదము ఎక్కడిది అంటే మహర్షి వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది. ఈ వాఖ్యము ప్రజా ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
卐 వాల్మీ రామాయణంలో ఈ వాక్యం ఉన్న శ్లోకం 

ధర్మ ఏవహతో హంతి
ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మోన హత వ్యో
మానో ధర్మాహతో వధీత

ధర్మో రక్షతి రక్షితః అనే అర్యొక్తిని అనుసరించి ధర్మముని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇట్టి ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎట్టి నిష్ట కలిగి ఉండాలి అనే విషయాలను తెలియపరుస్తూ మానవుడి మనుగడను తీర్చి దిద్దడానికి ఏర్పడినవి.

ప్రస్తుత కాలమానము ప్రకారము ధర్మము ఎక్కడుంది. ఎలావుంటుంది. అప్పుడు వాల్మికీగారు ధర్మాన్ని ఎలావుంటుంది అంటే రామో విగ్రహాన్ ధర్మః (మూర్తీభవించిన ధర్మమే రాముడు ) అని అన్నారు . మరి ఈ కాలములో ధర్మము ఎలావుంది. ఎక్కడుంది. సరే అది వదిలైయండి. ప్రస్తుతము ఈ వాక్యములో అన్నట్టు ధర్మో రక్షతి రక్షతః అన్నట్టు. ధర్మము ను మనము కాపాడితే , ఆ ధర్మము మనలను కాపాడుతుందా అన్నది నా ప్రశ్న మీకు వీలు అయితే కాపాడుతుంద లేదా అన్నది చెప్పండి.

అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి

18, సెప్టెంబర్ 2019, బుధవారం

పంపా సరోవరం - Pampa Sarovaramపంపా సరోవరం - Pampa Sarovaram

పంపా సరోవరం

పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపిలో ఉంది. ఆ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.

ఆ కథ ప్రకారం, ఒక బోయకాంత అయిన శబరి, పంపానదీతీరంలో మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది.
హంపిలో ఉన్న పంపా సరోవరం ఇదే !
సీతాన్వేషణలో కబంధుని సూచనను అనుసరించి రామలక్ష్మణులు పంపాసరోవర తీరానికి చేరుకున్నారు. రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితురాలైన శబరి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది. "శ్రీ రామచంద్రమూర్తి! మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికి తపః సిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓ పురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించినట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్దురాలినయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్యలోకాలకు చేరుకుంటాను. స్వామీ, మతంగముని శిష్యులకు సేవ చేస్తూండేదానిని. అప్పుడు వారు, మీరు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పట్నుంచీ మీకోసం ఎదురుచూస్తూ, పండ్లు ఫలాలు సేకరించి పెడుతున్నాను. కాబట్టి నువ్వు నీ తమ్ముడు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి" అని అభ్యర్థించగా, శ్రీరాముడు "శబరీ! కబంధుడు నీ గురించి, నీ గురువుల గురించి చెప్పారు. నాకు ఇక్కడి వనాల మహిమలను గురించి తెలుపవలసింది" అని శ్రీరాముడు అడగడం ఆలస్యమన్నట్లుగా, శబరి ఆ విశేషాలను చెప్పసాగింది.

"ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షిగణాలతో ఈ మతంగ వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను చేసేవారు. వారి తపః ప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్తసాగరాలను ఇక్కడున్న పంపా సరస్సులోనికి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది. అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు" అని చెప్పి, తాను సేకరించిన ఫలాలను అందించింది.

రామలక్ష్మణులు ఫలాలను ఆరగించగానే, భక్తితో పులకాంకితురాలైన శబరి, ఆస్వామి అనుగ్రహంతో సమాధియోగ బలం వల్ల మోక్షపథాన్ని చేరుకుంది.

హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు - హుబ్లీ రైలు మార్గంలోనున్న హోస్పెటలో దిగి హంపి చేరుకోవచ్చు. హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది.

రచన: యస్ వరలక్ష్మి

14, సెప్టెంబర్ 2019, శనివారం

రామాయణంలో శబరి - Ramayanam lo Sabari

బరి బోయకులంలో పుట్టింది. పంపానది తీరానవున్న మతంగ మహాముని ఆశ్రమంలో పెరిగింది. ముని కన్యల సాంగత్యం ఆమెకు లభించింది. సహజమైన అమాయకత్వంతో ఉండేది. మాతంగ ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది. మతంగ మహామునిని పరమేశ్వరుడిగా భావించి సేవించేది. ఆశ్రమాన్ని తుడిచి శుభ్రం చేసేది. ఆవులకు మేత పెట్టేది. పూజకు కావలసిన పూలు, పళ్ళు, సమిధులు ఏరి తెచ్చేది. మునులు చెప్పే భక్తి మాటలు వినేది. సేవే మార్గంగా బతికేది.

ఆశ్రమంలోనే మునుల మాటల్లో రాముని గురించి విన్నది, విష్ణుమూర్తి అవతారమని గ్రహించింది. రాక్షస సంహారం చేసే వీరుడని తెలుసుకుంది. సీతా లక్ష్మణ సమేతుడై రాముడు వస్తున్నాడని తెలిసి అతణ్ని చూడాలని ఆశపడింది. ఆ ఆశని మతంగా మహర్షి రాముని గురించి చెప్పిన మాటలు రెట్టింపు చేశాయి. ఒక్కసారి జీవితంలో రాముణ్ని చూస్తే చాలనుకుంది. అంతకుమించి ధన్యత లేదనుకుంది. రాముని రూపురేఖలు చూసి తరించాలనుకుంది.
రాముడు రాలేదు. శబరి ఎదురు చూడడం మానలేదు. మతంగ ముని ముసలి వాడై పోయాడు. తను స్వర్గానికి వెళుతూ కూడా రాముడు వస్తాడనీ చెప్పాడు. దర్శనమిస్తాడనే చెప్పాడు. ఆశ్రమాన్ని అంటి పెట్టుకొనే ఉండమన్నాడు. ఎప్పటికయినా రాముడు వస్తాడని శబరి మనసా వాచా నమ్మింది.
sabari శబరి ఆశ్రమంలో ఒంటిగానే మిగిలింది. లేదు, ఆమెకు రాముడు తోడున్నాడు. రామనామమే శబరికి సర్వమూ అయింది. శబరికే ముసలి తనం వచ్చింది. రాముడు రాలేదు. వస్తాడనే ఆమె నమ్మకం. ఒంట్లో శక్తే కాదు, కంటిచూపూ తగ్గింది. రాముని మీద నమ్మకం తగ్గలేదు. గురువుగారి మాట మీద గురి పోలేదు. అందుకే వేకువ ఝామునే ఆశ్రమ పర్ణశాలను శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టేది. నదిలో స్నానం చేసి కడవతో నీళ్ళు తెచ్చేది. పూలు పళ్ళూ తెచ్చేది. పూలను మాలకట్టేది. అలంకరించేది. పళ్ళను ఫలహారంగా రాముడొస్తే పెట్టడానికి సిద్ధంగా ఉంచేది. ఆ రోజు రాముడొస్తున్నట్టు ఏ రోజుకారోజే ఎంతో ఎదురు చూసేది. రోజులూ నెలలూ సంవత్సరాలూ విసుగూ విరామం లేకుండా ఎదురు చూపులతోనే గడిపింది శబరి.

శబరి గురించి కబంధుడు రామునికి చెప్పాడు. రాముడు లక్ష్మణునితో శబరిని చూడవచ్చాడు. కానరాని కళ్ళని పులుముకొని చూసింది శబరి. రాముని రూపాన్ని మందగించిన కళ్ళు చూడకపోతేనేం ఒళ్ళంతా కళ్ళయినట్టు… చేతులతో తడిమింది. ఆరాటంలో అడుగు తడబడినా మాట తడబడలేదు. “రామ రామ” అని ఆత్మీయంగా పిలిచి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకుంది. పూలు చల్లింది. అప్పటికే ఏరి దాచి ఉంచిన రేగుపళ్ళను తెచ్చియిచ్చింది. కసురుగా ఉంటాయేమోనని కలవరపడింది. కొరికి రుచి చూసి ఇచ్చింది. రాముడూ అంతే ఎంగిలి అనకుండా ఇష్టంగా తిన్నాడు. శబరి ఆత్మీయతకి ఆరాధనకి రాముడు ముగ్దుడైపోయాడు. అమ్మమ్మ దగ్గర మనవడిలాగ! జీవితమంతా ఎదురుచూపులతో గడిపేసిన శబరికి ఇంకో జన్మలేకుండా గురుదేవులు వెళ్ళిన లోకాలకు వెళ్ళేలా వరం ఇచ్చాడు. రాముని రూపం కళ్ళలో నిలుపుకొని పులకించి పునీతమయింది శబరి!.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

7, ఆగస్టు 2019, బుధవారం

మహర్షి వాల్మీకి - Maharshi Valmiki


మహర్షి వాల్మీకి - Maharshi Valmiki
హా పుణ్య కవి , రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి కారణజన్ముడు . వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి తన జీవిత కాలంలో పాపా, పుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు , తన రామాయణ ఇతిహాసం. మానవుడు రచించిన తొలి గ్రంథము , చారిత్రక పురుషుడైన రఘురాముని గురించి ఇతని సమకాలం గురించి చెప్పడమే కాకుండా కథనం మధ్యమంగా ఆనాటి భౌగోళిక విషయాలను క్రోడీకరించాడు.

ఆస్వయుజ పూర్ణిమ – వాల్మీకి జయంతి
సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కధ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు - భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. 

రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది. వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కధకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కధ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాధలున్నాయి. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.
మహర్షి వాల్మీకి
మహర్షి వాల్మీకి
మహర్షి వాల్మీకి చరిత్ర:
త్రేతాయుగములో గంగానదీ తీరములో నైమికారణ్యములో అనేకమంది మునులు ఆశ్రమములు నిర్మించుకొని నియమ నిష్టలతో తపస్సు చేస్తూ ఉండేవారు. మునీశ్వరులందరూ బ్రాహ్మణ కుటుంబాలకు చెందివారే. అందులో ఒక ముని పేరు ప్రచస్థాముని.. ఇతనికి ఒకకుమారుడు ... పేరు " రత్నాకరుడు "  ఒకరోజూ రత్నాకరుడు ఆడుకుంటూ అడవిలో దారితప్పి ఎటుపోవాలో తెలియ భయము ఏడుస్తూ ఉన్న సమయాన ఆ దారినిపోయిన ఒక వేటగాడు ... ఈ పిల్లవాడిని ఓదార్చి తనవెంట తన నివశిస్తున్న గుడెసె తీసుకు పోయి , తనకు పిల్లలు లేనందున తన కొడుకుగా పెంచుకోసాగెను. ప్రచస్ఠా ముని తన భార్యతోకూడి కుమారుని కొరకు వెదికి దొరక పోయేసరికి , ఏ క్రూరజంతువు తినిఉంటుందని భావించి పుత్రశోఖం తో వెనుదిరిగి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇక్కడ బోయకుటుంబానికి చెందిన వేటగాడు, అతని భార్య తమ సొంత కొడుకు గానే రత్నాకరుడు ని పెంచి పెద్దచేసారు. విలువి్ద్యలో మంచి ప్రావీణ్యము, వేట లో నైపుణ్యము సంపాదించిన రత్నాకరుడు మంచి తెలివైనవాడు . తన వేట నైపుణ్యము తో ఆ అడవి లోని పక్షులకు, జంతువులకు యముడుగా తయారయ్యాడు . యవ్వనము వచ్చిన రత్నాకరునికి బోయ తల్లిదండ్రులు వారి వంశములోని అమ్మాయిని చూసి పెళ్ళిచేసారు. కొంతకాలానికి ముగ్గురు పిల్లతో రత్నాకరుడి కుటుంబము పెద్దది కావడము వలన తన సంపాదన పెంచుకొనేనిమిత్తము దారిదోపిడి, దొంగతనము లను వృత్తిగా తీసుకొని అవసరమైన చోట బాటసారులను చంపి ధనాన్నిదోచుకుని తన కుటుంబము హాయిగా బ్రతికేందుకు పాటుపడేవాడు .
నారద మహర్శి

ఒకరోజు అడవి దారిలో ఒకచోట కూర్చోని బాటసారులకోసము పొంచి ఉన్న సమయాన ఆ దారిన " నారద మహర్శి " రావడము జరిగింది. నారద ముని సర్వసాదారణ మానవరూపలో ఉన్నందున రత్నాకరుడు దోచుకునే ప్రయత్నము చేయగా ... తన దగ్గర వీణా , రుద్రాక్షలు , కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవని తెలిపినా ... వినక చంపివేయదును అని భయపెట్టసాగెను. అప్పుడు ఓ బోయవాడా ... దొంగతనము , దోపిడీలు, ఇతరులను హించించి హత్యచేయడము పాపము అని హితబోద పలికినా నమ్మలేదు . " నీవు ఇన్ని పాపకార్యములు ఎవరికోసము చేయుచున్నావని అడుగగా" ... తన కుటుంబపోషనకొరకై తెలిసిన విద్య ఇది ఒక్కటే ... పాప పుణ్యాలు నాకు తెలియవు . అప్పుడు నారదముని ఆ బోయవానికి జ్ఞానోదయము కలిగించే ఉపాయము ఆలోచించి .. " ఓ బోయవాడా నీవు చేయు ఈ పాపాలు నీ కుటుంబ సబ్యులు ఎవరైనా పంచుకుంటారేమో అడిగి తెలుగుకోమని తనతో నారదముని ఆ బోయ ఇంటికివెళ్ళి .. పాపాలు పంచుకుంటారేమో అడుగగా తల్లి దండ్రులు గాని, భార్యా బిడ్డలు గాని అందుకు సమ్మతించగపోగా... కుటుంబపోషణ ఇంటి యజమాని బాధ్యత అని పాపమో, పుణ్యమో అది తనవరకే గాని, తీసుకున్నా వీలు పడదని, పాప పుణ్యాలు ఒకరినుంది ఇంకొరికి ఇవ్వనూలేము, తీసుకోనూలేము అని వారి నిస్సహాయతను తెలియజేసిరి. 

ఆ మాటలు విన్న రత్నాకరుడు పశ్చ్యాత్తాపము చెంది, పాపవిముక్తికై ఉపాయము చెప్పమని నారదుని వేడుకొనెను. అప్పుడు నారదుడు తన నిజ రూపాన్ని బోయవానికి చూపించి భక్తి మార్గానికి " మరా మరా " అనే రెండక్షరాల మంత్రాన్ని బోధించెన. అప్పటినుంది నైమికారణ్యము లో రామ రామ రామ మంత్రము తో కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా తనచుట్టూ మట్టి పుట్టలా కప్పివేయడము జరిగింది. బయట తిరిగే బాటసారులెవరికీ తను  కనబడడము జరుగలేదు. నారద మహర్షి తనకున్న దేవతా శక్తులతో రత్నాకరుని కుటుంబానికి ధన , ధాన్య , అశ్వర్యములను ప్రసాదించెను. నారదమునికి తెలుసు ఈ రత్నాకరుడు కారణజన్ముడని.. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత నారదముని తిరిగి అదే దారిన కావాలనే వచ్చి రత్నాకరుడున్న పుట్టను తెరచి, చిక్కి బక్కై, బయటి ప్రపంచముతో సంబంధము లేని ఆ రత్నాకరుని చెవులో రామ రామ రామ అని పలుకగా కళ్ళు తెరచిన ఆ రత్నాకరుని ఆపాదమస్తం ను తన మృదువైన చేతులతో తడివి పునీతము గావించెను. " ఓ రత్నాకరా నీవు గొప్ప తపశ్సాలివి అయ్యావు . దేవుడు నిన్ను కరుణిచాడు . నీవు మళ్ళీ జన్మించావు ., ఈ పుట్తనుంది పుట్టేవు కావున నీవు  ' వాల్మీకి ' గా పిలువబడుతూ లోక కణ్యానము కోసము మంచి కావ్యాన్ని వ్రాసెదవు అని " దీవించి అదృశ్యమయ్యెను. నాటినుంది వాల్మీకి ఎంతోమంది శెస్యులతో తన జీవితాన్ని గడుపసాగెను. 

అటవీ తెగకు చెందిన వాల్మీకి వలసలు  :
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం (నల్లమల అడవులు) గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.

తెలుగు రాష్ట్రాల పండుగగా వాల్మీకి జయంతి
మహర్షి వాల్మీకి జయంతిని తెలుగు రాష్ట్రాల పండుగగా. ప్రతి (అక్టోబర్) నెలలో వాల్మీకి జయంతి జరుపుకుంటారు.  ఇందుకు అవసరమయ్యే నిధులను తెలుగు రాష్ట్రాల వాల్మీకి, బోయ సహకార సంస్థ ద్వారా వెచ్చిస్తారు. 

రచన: శేషగిరి రావు & కోటి మాధవ్ బాలు చౌదరి

17, జూన్ 2019, సోమవారం

రామాయణం ఒక కధకాదు - Ramayanam Kadhakadu


రామాయణం ఒక కధకాదు. మహత్తరమైన యోగ శాస్త్రం. రాముడు షట్-చక్రాలనబడే పలు పాత్రల ద్వారా ఏవిధంగా యోగా/యుగ పురుషుడు అయ్యాడో చెబుతోంది ఈ ఇతిహాసం. ఈ విధంగా రామాయణ౦ని నిశితంగా పరిశీలనా దృష్టితో చదివితే అద్భుత విషయాలు వెల్లడి అవుతాయి.

౧. చిత్రకూట౦లో [నరుడు-వానరునితో కూడటం చిత్రంకాక మరేమిటి? అందుకే దీనిని చిత్రకూటం.. అంటే చిత్రమైన కలయిక అన్నారు వాల్మీకి] భరతునికి తన పాదుకలు ఇచ్చిన ఘట్టం స్వాదిస్టనానికి సంకేతం.

౨. విశ్వామిత్రుడు రామునికి అస్త్రాలను ప్రసాదించే సన్నివేశ౦-మణిపూరకం..అంటే ఇక్కడ అగ్ని ఎక్కువగా సంచారం చేస్త్తుంది [జట్రాగ్ని-నాభి]. అస్త్ర శక్తికూడా అగ్ని పూరకమే.అది శత్రువును నిర్మూలిస్త్తుందని మనకు తెలుసు.

౩. కబంధుని వధ-[నిజానికి దీనిని వధ అనరాదని ముని ప్రోక్తం]- ఇందులో ఒక రహస్యముంది,అదేమంటే.. కబంధుని అవయవాలన్నీ కూడా మొన్డెంలో కున్దిన్చిబడివుండటం. సరిగ్గా ఈ మొన్దేపు ప్రాంతంలోనే అనాహత చక్రముంటుంది. ఇతని వధ ద్వారా రాముడు అనాహతములో పుట్టిన [హ్రుదయ భాగము] కోరికను [సీత జాడని కనిపెట్టగలవారేవరనే కోరికయే అది].

౪. మో౦డేమును మెడతో కలిపే స్వరపేటిక శబరి. ఆమె ద్వారా సుగ్రీవుని కలుసుకోవడం విశుద్ధ చక్రానికి ప్రతీక.తమాషా ఏమంటే సుగ్రీవునిపేరులోనే ఈ రహస్య్యం దాగివుంది. సుగ్రీవ అంటే మధురమైన,సుద్ధ్హమైన స్వరం వాక్చాతుర్యంకలవాడని అర్ధం.

౫. సుగ్రీవుడు ఆజ్ఞా చక్రానికి ప్రతినిధి అయితే,అటువంటి వానితో రాముని చెలిమి.. దానినికూడా జయించాడని చెప్పడం. సుగ్రీవుడు ఇచ్చిన ఆజ్ఞాలతోనే సీతకోసం వెళ్లారు వానరులు.
౬. వానరులు స్వయమ్ప్రభను కలవడమే సహస్రాకార చక్ర దర్సనం.అంటే సీత ఉన్న చోటును కనిపెట్టడం.

అంటే రామాయణం మొత్తమూ పురుషుడు-ప్రకృతిని అన్వేషించే యోగ సాధన అన్నమాట. శక్తిని [సీతను] చేరనిదే పురుషునికి సంపూర్ణత్వం లేదు కనుక రాముడు భార్య అనే ద్రుస్త్తిలోకాక..ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే ఈ యోగ మార్గాన్ని రామాయణం అనే పేరిట,మనలకు భోధ చేసేందుకు సాధన చేసి చూపాడు.

జయ..జయ రామ జ్ఞానగుణసాగర...బోలో శ్రీరా చంద్రమూర్తికి జై...

ఓం

23, ఆగస్టు 2018, గురువారం

రఘు వంశము - Raghu Vamsamu

దశరథ మహారాజు పూర్వీకులు

చతుర్ముఖ బ్రహ్మ
 • మరీచి 
 • కశ్యపుడు
 • సూర్యుడు
 • మనువు 
 • ఇక్ష్వాకుడు
 • కుక్షి
 • వికుక్షి
 • భానుడు 
 • అనరంయుడు 
 • పృథుడు 
 • త్రిశంకువు 
 • దుందుమారుడు 
 • మాంధాత 
 • సుసంధి కి ఇద్ధరు ధృవసంధి, ప్రసేనజిత్‌
 • ధృవసంధి
 • భరతుడు 
 • అశితుడు 
 • సగరుడు 
 • అసమంజసుడు 
 • అంశుమంతుడు 
 • దిలీపుడు 
 • భగీరతుడు 
 • కకుత్సుడు 
 • రఘువు 
 • ప్రవృద్ధుడు 
 • శంఖనుడు 
 • సుదర్శనుడు 
 • అగ్నివర్ణుడు 
 • శీఘ్రకుడు 
 • మరువు 
 • ప్రశిశృకుడు 
 • అంబరీశుడు 
 • నహుశుడు 
 • యయాతి 
 • నాభాగుడు 
 • అజుడు 
 • దశరథుడు 
 • రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నుడు.
 • జనక వంశ వర్ణన 
జనక మహారాజు పూర్వీకులు
 • నిమి చక్రవర్తి 
 • మిథి 
 • ఉదావసువు 
 • నందివర్దనుడు 
 • సుకేతువు 
 • దేవరాతుడు 
 • బృహధ్రతుడు కి ఇద్ధరు శూరుడు, మహావీరుడు.
 • మహావీరుడు 
 • సుదృతి 
 • దృష్టకేతువు 
 • హర్యశృవుడు 
 • మరుడు 
 • ప్రతింధకుడు 
 • కీర్తిరతుడు 
 • దేవమీదుడు 
 • విభుదుడు 
 • మహీద్రకుడు 
 • కీర్తిరాతుడు 
 • మహారోముడు 
 • స్వర్ణరోముడు 
 • హ్రస్వరోముడు కి ఇద్దరు. జనకుడు, కుశద్వజుడు.
 • జనకుడు --> సీత, ఊర్మిళ
 • కుశద్వజుడు --> మాంఢవి, శృతకీర్తి
 • శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.
శ్రీరామ ప్రవర:
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.
సీతాదేవి ప్రవర:
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...
👉ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

15, మే 2018, మంగళవారం

రామాయణంలో వానరముల పుట్టుక - Vanaras in Ramayana

రామాయణంలో వానరముల పుట్టుక - Vanaras in Ramayana
వానరముల పుట్టుక - శ్రీ రామాయణం
శ్రీ మహా విష్ణువు ఇలాగ దశరథ మహారాజు భార్యల గర్భవాసాలు ప్రవేశించగానే బ్రహ్మదేవుడు దేవతలనందరినీ చూసి, "సత్యసంధుడూ, మహావీరుడూ, మనపాలిటి హితైషీ అయిన శ్రీ మహావిష్ణువు కొత్త అవతారానికి సాయంగా వుండడానికి మహాబలవంతులూ, కామరూపులూ అయిన యోధులను కనండి.

ఆ యోధులందరూ ఎలాంటి మాయలైన తెలిసికోగలవారూ, శూరులూ, వాయువేగులూ, నీతిశాస్త్రం బాగా తెలిసినవారూ, బుద్ధిమంతులూ, శ్రీమహావిష్ణువుతో పోల్చతగిన పరాక్రమవంతులూ, సర్వాస్త్రశస్త్ర సమర్థులూ, మీలాగే ఆకలిదప్పులు లేనివారూ అయి ఉండాలి. వారు వానరరూపులున్నూ అయి ఉండాలి. నేనిదివరకే ఎలుగుబంటి జాతిలో జాంబవంతుణ్ణి సృజించి ఉన్నాను.
అతడు నేనావులిస్తూ వుండగా నా ముఖంలో నుంచి పుట్టుకు వచ్చాడు" అని చెప్పాడు.వెంటనే ఈ శాసనం శిరసావహించి మహర్షులూ, సిద్ధులూ, విద్యాధరులూ, నాగులూ, చారణులూ అనేక లక్షల కుమార్ళను కన్నారు.

రామాయణంలో వానరముల పుట్టుక - Vanaras in Ramayanaదేవేంద్రుడు తనతో సమానుడూ మహాతేజశ్శాలీ అయిన వాలిని కన్నాడు. ప్రతాపవంతులలో అగ్రేసరుడైన సూర్యుడు సుగ్రీవుణ్ణి కన్నాడు. బృహస్పతి తారుణ్ణి కన్నాడు. తారుడు తండ్రిలాగే కుశాగ్రబుద్ధి. వానరులలో అంతటి బిద్ధిమంతుడు మరొకడు లేడు. కుబేరుడు గంధమాదనుణ్ణి కన్నాడు. విశ్వకర్మ నలుణ్ణి కన్నాడు. అగ్నిదేవుడు నీలుణ్ణి కన్నాడు. తేజస్సులోనూ, యశస్సులోనూ, బలపరాక్రమాలలోనూ అతనిని మించిన వానరుడు మరొకడు లేడు. సుందరులూ, ధనికులూ అయిన అశ్వనీ దేవతలు అందగాళ్ళయిన మైందుణ్ణి, ద్వివిదుణ్ణీ కన్నారు. వరుణుడు సుషేనుణ్ణి కన్నాడు.

పర్జన్యుడు మహాబలసంపన్నుడైన శరభుణ్ణి కన్నాడు. వాయుదేవుడు ఆంజనేయుణ్ణి కన్నాడు. అతడు వేగంలో గరుత్మంతునితో సమానుడు. అతని శరీరం వజ్రంలాగ అభేద్యం.వీరే కాక, ఇంకా అనేక లక్షల మంది అసమాన్య బలపరాక్రమవంతులైన అనేకమంది వానరులను కన్నారు. ఏ దేవుడు ఏ రూపంగలవాడో, యే వేషం గలవాడో, ఎంతటి పరాక్రమం కలవాడో అతని కొడుకున్నూ అలాంటి రూపమూ, అలాంటి వేషమూ, అంతటి పరాక్రమమూ కలవాడైనాడు.

ఆ భల్లూక వీరులూ, వానరవీరులూ మేరుమందర పర్వతాలతో సమానులూ, మహాబలశాలులూ అయి అతివేగంగా వృద్ధిపొందారు.ఇలాంటి వానరయోధులు నూరు లక్షలు పుట్టారు. వారితో సేనాధిపతులైనవారు కూడా గొప్ప యోధులైన వానరులను కన్నారు. వారిలో కొందరు ఋక్షవత్పర్వతం మీద నివసించారు. తక్కినవారు మిగతా పర్వతాల మీద నివసించారు. వారిలో చాలా మంది సూర్యపుత్రుడైన సుగ్రీవుణ్ణీ, ఇంద్ర కుమారుడైన వాలినీ ఆశ్రయించుకుని వుండిపొయారు. మహాబలవంతులైన నలుణ్ణీ, నీలుణ్ణీ, హనుమంతుణ్ణి కూడా మరికొందరు ఆశ్రయించుకుని వుండిపోయారు.అందరికంటే గొప్పవాడైన వాలి ఆ యెలుగు గొడ్డులనూ, ఆ కోతులనూ స్వేచ్చగా పరిపాలిస్తూ వుండినాడు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

1, మే 2018, మంగళవారం

రామాయణాన్ని ఎలా అర్థంచేసుకోవాలి - The reading methodology for Ramayana

రామాయణాన్ని ఎలా అర్థంచేసుకోవాలి - The reading methodology for Ramayana
రామాయణాన్ని ఎలా చదవాలి??? ఎలా అర్థంచేసుకోవాలి?????

శ్రీ రాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టాడు. తండ్రి మాట కోసం అడవులు వెళ్ళాడు. సీతను రావణుడు ఎత్తుకపోతే , సుగ్రీవుని సేన తో హనుమంతుని సాయంతో లంకకు వెళ్లి, రాక్షసులని మాట్టు పెట్టి, సీతతో కలసి అయోధ్య తిరిగి చేరి రాజ్యం పాలించాడు. ఇది, ఇలా ఒక కథలా విన్నా, చదివినా, అందులో నుండి పొందే ప్రయోజనం అతి స్వల్పం. ఎప్పుడైతే దీనిని కథగా కాకుండా ఇతిహాసముగా(ఇతిహాసం అంటే, ఇలాగే జరిగినది) చదివి, రాముడు సాక్షాత్తు అది నారాయణుడే అయినా కానీ, తన జన్మాన్తరము అది ఎరుకలోనికి తీసుకురాకుండా, ఒక నరుడిగా మాత్రం జీవించాడు. ఇలా ఎందుకు జీవించాలి? నారాయణుడే కనుక, రావణుడిని చంపడానికి అంతగా ఎందుకు శ్రమించాలి? అంతగా ఎందుకు కష్టపడాలి? ఎందుకంటే అన్ని

అవతారములలో లాగ నారాయణుడు దేవుని గా రామావాతారములో అవతరించలేదు. ఒక నరుడిగా పుట్టి, పెరిగి, నరుడిగా కస్టాలు పడి , నరుడిగా రాక్షసులను అంతమొందించి, నరుడు ధర్మమును పట్టుకొని ఎలా బతకాలో ఈ లోకానికి స్వయంగా తాను జీవించి నిరూపించి, చూపించడానికే రామావతారం ఎత్తాడు.

తాను ఎంత కష్టంలో నైన ఉండ నివ్వండి, తాను ఎప్పుడు పట్టుకొని ఉన్నది మాత్రం ధర్మమే. లోకంలో అప్పటి వరకు రావణుడిని ఓడించ గలిగిన వారు కేవలం ఇద్దరు. ఒకడు వాలి, మరొకరు కార్తవీర్య అర్జునుడు. సుగ్రీవుని బదులుగా , వాలితో చేయి కలిపివుంటే రావణుడిని వధించడానికి కష్టపడవలసిన అవసరమేలేదు. కాని అతి బలవంతుడైన వాలిని కాదని, సుగ్రీవునితో స్నేహం ఎందుకు చేయాలి? వాలిని ఎందుకు చంపాలి? కేవలం ధర్మమే.

తండ్రి మరణించిన తరువాత, భరతుడు, గురువులు, ప్రజలు అందరు కలసి వచ్చి, రామునుని మరల అయోధ్యకు వచ్చి రాజ్య పాలన చేయమని అడిగినా కాని, తన తల్లి కైకేయియే స్వయంగా వచ్చి, తాను కోరిన వరాలను ఉపసంహరించుకుంటాను అని చెప్పినా కాని రాముడు ఎందుకు ఒప్పుకోలేదు? మళ్ళి ధర్మమే.అంత యుద్ధం చేసి, రావణుడిని చంపినా పిదప, శవమై పడి ఉన్న రావణుడిని చూసి, తన సొంత తమ్ముడైన విభీషణుడు అన్నగారికి అంత్యేష్టి సంస్కారములను చేయలేను అని అంటే, అది తప్పని చెప్పి, విభీషణుడికి నీతి చెప్పాడు. అంత శత్రువైన, ఎంత పాపము చేసినవాడైన, మరణించాక ఆ శత్రుత్వం అక్కడితో పోయింది అని ధర్మం చెప్పాడు. ఇలా అడుగడుగునా ధర్మమే. గురువులను గౌరవించడములో కాని , సీత కళ్యాణ విషయములో జనకునితో సంభాషణలో కాని , పితృ వాక్య పరిపాలనలో కాని , భరతునికి చెప్పే రాజ నీతిలో కాని , వాలిని చంపడములో కాని , సుగ్రీవునితో మైత్రిలో కాని, కబంధుడి,జటాయువు అనాధ ప్రేత సంస్కారములో కాని, రావణ వధయందు కాని, వధ తరువాత కాని, ఆఖరికి సీతా అగ్ని ప్రవేశమందు కాని, అన్ని చోట్ల ధర్మమూ తప్ప వేరోక్కటి పట్టి ఎరుగడు రాముడు. అల ధర్మాని పట్టి నిలబడి ఈ జగత్తుకు ఒక నరుడిగా జీవించి ఆదర్శంగా నిలిచినా మహావాతారము శ్రీ రామ అవతారము.

జై శ్రీ సీతారామచంద్ర.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

రామాయణం - శాస్త్రీయమయిన ఆధారాలు - Ramayana - scientific evidence

రామాయణం పుక్కిటి పురాణం కాదు అనేదానికి శాస్త్రీయమయిన ఆధారాలు మన శాస్త్రజ్ఞులకు లభించాయి.... దాని వివరాలలోకి వెళ్ళాలంటే దిగువన ఉన్న లింకు లోకి వెళ్ళండి...
రావణాసురినికి సంభంధించిన ౬(6) విమానాశ్రాయాలు... సీతమ్మ అమ్మవారిని దాచి ఉంచిన ప్రదేశం, ఆంజనేయుడు విశ్రమించిన ప్రదేశం,  నీటి పైన తేలియాడే రాళ్ళు, రాముడు నిర్మించిన వారధి, ఆంజనేయుడు లక్శ్మణుడికై తెచ్చిన సంజీవని పర్వతం ఇవన్నీ ఈ లింకులో గమనించవచ్చు....

ఇప్పుడు నేను వివరించే ప్రదేశాలన్నీ శ్రీలంకలో ఉన్నాయి గమనించ గలరు.
సీతమ్మ వారిని ఉంచిన ప్రదేశం పేరు "నాగులీయ" ,
సీతమ్మ వారిని ఉంచిన ప్రదేశం పేరు "నాగులీయ" ,
ఇది ఒక కొండ గుహ..  బయటనుండి చూడడానికి ఒక పెద్ద నాగు పాము పడగ ఆకారంలో ఈ కొండ ఉండడం గమనార్హం... ఈ శిల  ఏ విధంగాను చెక్కబడలేదు.. ఇది కేవలం ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడినదే నని.. పాశ్చాత్య శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారట...
సీతమ్మ అమ్మ వారు స్నానం చేసిన ప్రదేశం
సీతమ్మ అమ్మ వారు స్నానం చేసిన ప్రదేశం
ఇక జనక మహారాజుకు నాగలి కోడుకు తగిలిన పెట్టెలో సీతాదేవి లభించినది కాబట్టి సీతమ్మకు నాగులీయ అనే పేరుకూడా ఉండేదట... ఆ పేరుమీదనే ఈ ప్రదేశానికి నాగులీయ అనే పేరు వచ్చిందని భావిస్తున్నారు..
ఆంజనేయుడు విశ్రమించిన స్థలం
ఆంజనేయుడు విశ్రమించిన స్థలం
ఆ పర్వతం  ఏరియల్ వ్యూ చూస్తే అక్కడ నిద్రిస్తున్న ఆంజనేయ స్వామి రూపాన్ని మనం గమనించవచ్చు...

ఇక్కడే ఆంజనేయ స్వామి పాద ముద్రలను కూడా చూడవచ్చు.. ఆంజనేయుని పాద ముద్రలు

ఇక్కడే కాక మన ఆంద్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, హిందూపురం మండలంలోని లేపాక్షిలో కూడా ఉంటాయి..

(సీతాదేవి పాద ముద్రలు లేపాక్షిలో ఉన్నాయి.. ఈ పాదాల నుండి నిరంతరం నీటి ఊట బయటకు వస్తూ ఉంటుంది.. ఈ ముద్ర ఒక కొండ మీద ఉంది... మామూలుగా అనంతపురం జిల్లా ఒక రకంగా ఎడారే.. ఇక్కడ నీళ్ళు పడాలంటే కనీసం ౫౦౦ అడుగుల లోతు తవ్వాలి... కానీ సీతమ్మ పాదాల ముద్రలలో మండుటెండల్లోనూ నిరంతరం రావడం గమనించవచ్చు... లేపాక్షికి వెళ్ళిన వారు తప్పక చూడండి...)

యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినపుడు.. ఆ మూర్చనుండి తేరుకోవడానికై తెచ్చిన సంజీవని పర్వతం
సంజీవని పర్వతం
సంజీవని పర్వతం
ఇంకా అక్కడే ఉంది.. దానిని కూడా చూడండి.. ఇక్కడ ఇంకా ఎన్నో వేల మూలికలు, ఔషధాలు లభిస్తున్నయట..

ఇక రావణుడి సోదరుడయిన కుబేరుడినుండి తీసుకోబడిన పుష్పక విమానం గురించి....

దీనిలోనే రావణ సంహారానంతరం.. విభీషణుడి పట్టాభిషేకానంతరం రాముడు , సీతా పరివార సమేతంగా అయోధ్యకు వెళ్ళారట.. రావణుడికి ఇవి కాక ఇంకా ౬ విమానాశ్రయాలు ఉన్నాయట్.. ప్రస్తుతం శ్రీలంకలో వాడుకలో ఉన్న ఆ ప్రదేశాల్ పేర్లు , వాటి అర్ధం , ఆ ప్రదేశాలి ఉన్న స్థలం చూస్తే అవి విమానాలు ల్యాండ్ కావటానికి అనుకూలంగా తీర్చిదిద్దబడ్డాయని తెలుస్తుంది...

రాముడు నిర్మించిన వారధి..
రాముడు నిర్మించిన వారధి..
రామ సేతు ఇప్పటికీ చెక్కు చెదరలేదు... దాని నిర్మాణానికై ఉపయోగించిన నీటిపై తేలియాడే ఇటుకలను


మీరు గమనించవచ్చు.. ఆ రోజుల్లోనే ఎంత సాంకేతికత ఉందో గమనించారా...

ఈ టపా తయారు చేసేటపుడు నేను పొందిన ఆధ్యాత్మిక అనుభూతి... శ్రీరామ దివ్యసుధా ధారను మాటల్లో చెప్పలేను.. చూస్తున్న మీకు కూడా శ్రీరామ కరుణా కటాక్షాలు సిద్ధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి