చిక్కుడు గింజల తాలింపు - Soyabeans Fry

చిక్కుడు గింజల తాలింపు

కావల్సినవి:
చిక్కుడు గింజలు - కప్పు, మునగాకు - రెండు కప్పులు, తాలింపు దినుసులు - టేబుల్‌స్పూను, నూనె - మూడుచెంచాలు, ఉప్పు - రుచికి సరిపడా, కొబ్బరి తురుము - పావుకప్పు.

తయారీ:
చిక్కుడు గింజల్ని ముందుగా ఉడికించి పెట్టుకోవాలి. మునగాకును కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి తాలింపు దినుసుల్ని వేయించి మునగాకు వేయాలి. బాగా వేగాక ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజల్ని వేయాలి. రెండింటినీ బాగా కలిపి తగినంత ఉప్పువేసి కొబ్బరి తురుము చల్లి.. ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి. ఇది అన్నంలోకే కాదు.. చపాతీల్లోకీ చాలా బాగుంటుంది.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top