ఆషాడమాసాన ఎడబాటు అంటే ఏమిటి ? What is the meaning of Aashadamasam Yedabaatu

0
భాషలోనూ , ఏ మతములోనూ , ఏ దేశములోనూ అయినా సంవత్సరానికి 12 నెలలే ఉంటాయి.

ఆషాడమాసము : గ్రీష్మ రుతువు ప్రారంభ మాసము ఇది . పౌర్ణమి రోజున ఉత్తరాషాడ నక్షత్రము వచ్చినందువల్ల ఈ నెలకు ఉత్తరాషాడ ... షార్ట్ కట్ లో ఆషాడ మాసము అని పేరు వచ్చినది . ఈ మాసము లో వచ్చే ఆర్ధ్ర కార్తి మూలం గా విపరీతమైన వేడి పుడుతుంది . ఈ వేడే సృష్టికి మూలము . ఆర్ధ్ర కార్తిలో వర్షము పడితే భూమిలో విత్తతనాలు మొలకెత్తుతాయి . ఇదే భగవంతుని లీల . భగవంతుని సృష్టికి వ్యతిరేకంగా మారు సృష్టి జరగ కూడదు . వేడి వాతావరణం లో వర్షము అనేక జీవుల ఉత్పత్తికి దోహదము చేస్తుంది . భూమి పై కొత్త కొత్త జీవుల జననాకి ఆస్కారము అవుతుంది . వర్షము తో నీరు కలుషితమువుతుంది . గాలి వాతావరణము లో ఒక్కసారిగా మార్పు జరుగు తుంది . ఈ విశ్వము లో ఒక జీవి ఇంకొక జీవిని తింటూ బ్రతుకుతాయి . అందువలన మానవులు ఎన్నో రకాల వ్యాదులకు గురవుతారు ... కొత్త సూక్ష్మ జీవులు పుడుతూ మనుషులలో కొత్త జబ్బులు కలుగజేస్తాయి. ఇది సర్వ సాదారణము . ముఖ్యము గా నేటి సమాజము లో వైరల్ వ్యాధులు ఎక్కువ . విత్తనము మొలకెత్తేటపుడు ఈ సీజన్ లో విపరీతం గా జణించిన సూక్ష్మ జీవులు ... మొలకెత్తే జీవులపై దాడి చేసి అనేక వ్యాదులకు గురిచేస్తాయి . ఆషాడమాసము లో కడుపులో పడ్డ బిడ్డకు ఇదే గతి పడుతుంది . పూర్వము వైద్యసదుపాయాలు , పారిశుద్ది పరికరాలు , మంచినీటి సౌకర్యాలు , సురక్షిత ప్రయాణ యేర్పాట్లు మున్నగు సదుపాయాలు , లేని కారణం గా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల సాంగత్యము పనికి రాదని , అనరోగ్యకరమైన సంతానకు కలుగ కుండా ఉండేందుకు ... పెద్దలు ఈ నియమావలి పెట్టేరు . ఈ నెలలో అత్తగారు .. కొత్తకోడలు ఒకేచోట ఉండకూడదని పుట్టింటికి పంపుతారు .. భర్త కూడా అత్తవారింట ఈ నెలరోజులూ అడుగు పెట్టకూడదన్నది ఆచారముగా వస్తోంది .

ఇదే అచారము దైవత్వము తో మిలితం చేసి ... ఆద్యాత్మికము గా ప్రచారము చేసారు నాటి పెద్దలు , శ్రీమహావిష్ణువు 6 మాసాలు ఇద్రలోను ... 6 మాసాలు మెలకువలోను ఉంటారు . ఆషాడము మొదలు కొని ఆరు మాసాలు పాలకడలి పైన శయనిస్తాడు కావున ఈ మాసాలలో ఆయన తేజము తగ్గుతుంది . విష్ణు తేజము లేని ఈ నెలను సూన్యమాసము అంటారు , ఏ శుభకార్యము ఈ నెలలో చేయరు . తదుపరి నిద్రావస్త కాలములో విష్ణు తేజములో అంతగా క్షీనత ఉండదని జ్యోతిశ్యాస్త్ర నిపుణుల నమ్మకము . ఈ నెలలో కడుపులో పడ్డ బిడ్డ విష్ణు తేజము లేని వాల్లు గా పుడతారని , జ్ఞానహీనులవుతారని , రాక్షసతత్వము కలవారుగా పుడతారని ప్రచారము లోనికి తెచ్చారు . నిగూఢ రహస్యము ఏమిటంటే ... ఆరోగ్యకరమైన సంతాతము కోసమే ఈ ఏర్పాట్లన్నీ .

ఆషాడ మాసము లొ తొలకరి జల్లులతో పుడమి పులకరిస్తోంది .. చినుకుల సందడే కాదు పెళ్ళికూతుళ్ళ సందఏఇ కూడా ఎక్కువే . ముసిముసి నవ్వులతోచెప్పలేని భయము తో బెరుకుగా అత్తవారింట అడుగు పెట్టే పెళ్ళికూతుళ్ళకు ఆనందము తెచ్చేది ఈ ఆషాడమాసమే . ఇఒత్త ప్రపంచములోని కూత్త వ్యక్తులతో సహజీవనము సరదాగా , ఆనందముగా , భయము గా ఉన్నాతాము పెరిగిన వాతావరణానికి మళ్ళీరావడం వారికి ఆనందమే . భర్తను వదలి నెల రోజులు దూరంగా ఉండడం ఇబ్బందే అయినా కన్నవారింట్లో ఉండడం వారికి నూతన ఉత్సా హాన్ని తెస్తుంది . కొత్త కోడలిని ఆషాదమాసం ప్రారంభానికి ముందే కన్నవారింటికి పంపుతారు . అమ్మాయిని .. అల్లుడి నుంచి నెల రోజుల పాటు దూరం చేయడం వల్ల అల్లుడు అలగకుండా అతనిని సంతృప్తిపరచడం కోసం కొన్ని కట్నకానుకలు ఇచ్చి తల్లిదండ్రులు తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్తారు .. దీనిని ఆషాడాపట్టీ అంటారు (ఆల్లుడికిచ్చేకానుకలు). అదేవిదంగా శ్రావణమాసము లో కోడలిని తమఇంటికి తీసుకువచ్చే సందర్భముగా అత్తవారు శ్రావణపట్టీ ఇస్తారు(కోడలికిచ్చే కానుకలు) . ఇది ఒక ఆచారము . ఇచ్చిపుచ్చుకునే ఆహ్లాదకరమైన వాతావరణము .

ఆషాడమాసము లో జరిపే " చాతుర్మాస వ్రతము " : - >
ఆషడ , శ్రావణ , భాద్రపద , ఆశ్వీయుజ మాసాల్లో శ్రీ మహావిష్ణువు పాల కడలి మీద శయనిస్తాడు కావున ఈ నాలుగు నెలల్లో ఒక్కోనెల ఒక్కో పదార్ధాన్ని తినరు (వదలివేస్తారు ) దీనినే ' చాతుర్మాస ' వ్రతము అంటారు .
  1. ఆషాడమాసము లో ... ఆకుకూరలు , (విరోచనాలు వాంతులు ఉన్న కాలము కావున ఆకుకూరలు తినకుండా ఉంటే మంచిది ),
  2. శ్రావణ మాసములో ... పెరుగు (గాస్టిక్ ఎసిడిటీ పెరగకుండా ఉండడానికి-- ఈ కాలములో ఎసిడిటీ ప్రొబ్లంస్ ఎక్కువ కాబట్టి ),
  3. భాద్రపద మాసము లో ... పాలు ( గొడ్లు ఎదకట్టే కాలము కావున ),
  4. ఆశ్వీయుజ మాసము నుంచి కార్తీకము వరకు పప్పుదినుసులు వదిలేస్తారు.
ఈ నాలుగు నెలలు ఈ పదార్ధాలు తినరు . ఆశ్వీయుజ , కార్తీక మాసాలలో శాకవ్రతము చేస్తూ ఆకుకూరలు , కంద , చేమ.. తో చాలామంది భోజనం చేస్తారు . ఇవన్నీ అరోగ్యకరమైన సూత్రాలు

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top