గీతా జయంతి, భగవద్గీత ఆవిర్భావం - Geetaa Birthday

గీతా జయంతి, భగవద్గీత ఆవిర్భావం - Geetaa Birthday
మార్గశిర శుక్లపక్ష ఏకాదశి గీతా జయంతిగా చెప్పబడుతోంది . కురుక్షేత్ర యుద్ధం సందర్భం గా అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేసిన రోజిది .

ఈ భగవద్గీత మోక్ష ప్రాప్తికి సాధనం గనుకే గీతాజయంతి కి ఎంతోపవిత్రత లభించినది . భక్తీ జ్ఞానవైరాగ్యాలను అలవరచుకోవడానికి ఏంటో గొప్పగా సహాయపడే గునత్రయాన్ని వవరించే గర్న్చం భవద్గీత . మనలోని అజ్ఞానానికి ప్రతీకగా ఆర్జునుడిని పోల్చుతూ అతనిలోని బంధుప్రేమ , గురుప్రీతి , భార్యాపుతుల అపేక్ష వంటి లక్షణాల్ని తొలగించి సరైన జ్ఞానాన్ని కలిగించి కార్యోన్ముఖుది గా చేసేది గీతా ప్రభోదం.

ఈ ప్రపంచం లో మనధర్మాన్ని మనం నిర్వర్తించక తప్పదు . మంచిదో ,చెడ్డదో మన చర్యకి ప్రతిఫలం అనుభవించక తీరదు . ఏమైనా విధికి ఈ మంచి చెడ్డలు రెండు బానిసలే ... అనువల్ల సుఖమైనా దుక్ఖమైన అనుభవించి తీరాలి .

భగవద్గీత , మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు.
భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
భగవద్గీత ఆవిర్భావం
భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రధసారధి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారూ శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రధాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని "నా కర్తవ్యమేమి?" అని అడిగాడు. అలా అర్జునునికి అతని రధ సారధి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top