నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

22, జూన్ 2017, గురువారం

Sikkh Guru ArjanDev - గురు అర్జున్‌ దేవ్‌

Guru ArjanDev - గురు అర్జున్‌ దేవ్‌
సిక్కుల ఐదో గురువు గురు అర్జున్‌ దేవ్‌ వర్ధంతి(June 10th) సందర్భంగా సిక్కు మతస్థులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. క్రీ.శ. 1606లో ఆయన బలిదానం చేశారు. సిక్కుపంత్‌ పరిరక్షణకు జీవితకాలం కృషి చేశారు. ఆయన అమరుడైన రోజును పురస్కరించుకొని దేశంలోని పలు ప్రాంతాల్లో సిక్కులు ప్రార్థనలు చేశారు. సిక్కుల ఐదవ మత గురువు అర్జున్ దేవ్ 402వ వర్ధంతిని సిక్కులు సోమవారం(10-06-2013) దేశవ్యాప్తంగా జరుపుకున్నారు. అమృత్‌సర్ సమీపంలోని తరన్ తరన్‌లోని గురుద్వారాను వేలాది మంది భక్తులు సోమవారం సందర్శించారు. గురు అర్జున్ దేవ్ పరమత సహనాన్ని పాటించి అన్ని మతాలకు చేరువయ్యారు.

సిక్కుల నాల్గవ మత గురువు రాం దాస్ చిన్న కుమారుడు అర్జున్ దేవ్ 1563లో పంజాబ్‌లోని గోండివాల్‌లో జన్మించారు. సిక్కుల పుణ్యక్షేత్రమైన అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో హర్‌మందిర్ సాహెబ్‌ను అర్జున్ దేవ్ నిర్మించారు. పంజాబ్‌లో ప్రముఖ ప్రాంతాలైన అమతృ్‌సర్, కర్తార్‌పూర్‌లను బాగా అభివృద్ధి చేయటమే కాకుండా, తరన్ తరన్ పట్టణాన్ని నిర్మించారు.

సిక్కుల పవిత్ర గ్రంధమైన ఆది గ్రంథ్‌ను అర్జున్ దేవ్ రచించారు. గురు గ్రంథ్ సాహెబ్‌తో సమానమైనదిగా పరిగణిస్తారు సిక్కులు ఆది గ్రంథ్‌ని. హిందూ, ముస్లిం మత ప్రచారకుల రచనలు ఆది గ్రంథ్‌లో ఉన్నాయి. గురు అర్జున్ దేవ్‌‌ను ఆనాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆయనను ఉరి తీయించారు.

రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »