నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

26, ఆగస్టు 2017, శనివారం

కుమారస్వామి, సుబ్రహ్మణ్య షష్ఠి - Kumara swamy shashti

కుమారస్వామి, సుబ్రహ్మణ్య షష్ఠి - Kumara swamy shashti
శివుని కుమారుడైన స్కందునికి ఉత్తర భారతదేశం లో కంటే దక్షిణాన ముఖ్యంగా తమిళనాడులో అధిక సంఖ్యలో ఆలయాలు ఉన్నాయి. దండాయు ధాన్ని ధరించి, నెమలి వాహనంపై చిరుదరహా సాన్ని చిందిస్తూ మనోహరరూపంతో దర్శనమిచ్చే ఈ స్వామిని ఎన్నో పేర్లతో పిలుస్తారు.
 • సుబ్ర హ్మణ్య, 
 • మురుగన్‌, 
 • సెందిల్‌, 
 • శరవణన్‌, 
 • కార్తికేయ, 
 • షణ్ముఖ, 
 • కుమార, 
 • గుహన్‌, 
 • స్కంద 
-------------------మున్నగునవి .

సుబ్రహ్మణ్య షష్ఠి - Subrahmanya Shashthi

సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. ముఖ్యముగా తమిళనాడు లోను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మరియి కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు-దీపావళి అమావాస్య తరువాత షష్టి నాడు.. విశేష పూజలు జరుపుతారు. ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు...తెలుగునాట దీపావళి పండుగకి ముందే వచ్చే మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్బరాయుడి షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి, అని, స్కంద షష్ఠి అని అనేక రకాలుగా పిలుచుకోవటం కనిపిస్తుంది.

స్వామి కి ఉన్న పేర్లు :
 1. షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
 2. స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
 3. కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
 4. వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
 5. శరవణభవుడు - శరములో అవతరించినవాడు
 6. గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
 7. సేనాపతి - దేవతల సేనానాయకుడు
 8. స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
 9. సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
 10. మురుగన్ - తమిళం లో పిలుస్తారు
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


« PREV
NEXT »