రక్త పోటు, బి.పి - Blood Pressure

0గుప్పెడంత గుండె మన ఛాతీలో రెండు ఊపిరితిత్తుల మధ్య పెరికార్డియం అనే పోరని కప్పుకొని నియమం గా , నిశ్చలం గా ఉండే ఓ శరీర అవయవము . ఈ గుండె తన క్రమాన్ని , నియమాన్ని తప్పి ఎక్కువగా కొట్టుకున్నా , తక్కువగా కొట్టుకున్నా అది మన జీవనాన్ని శాసించే వ్యాధి ... గుండె జబ్బు. గుండె జబ్బులలో ఒకటి ఈ రక్తపోటు .

గుండె , రక్త నాళా లలో ఉండే రక్తం వాటి గోడలపై చూపించే వత్తిడి ని రక్తపోటు లేదా బ్లడ్ ప్రజర్ అంటారు . ఇది ముఖ్యం గా రెండు స్థితుల పై ఆశారపడి ఉంటుంది . 1.గుండె కండరాలు పంపు చేసే శక్తి , 2. రక్తనాళాలు పంపు చేసిన రక్తాన్ని ఎంతవరకు తీసుకుంటాయో... ఆ శక్తి .
 • బ్లడ్ ప్రజర్ రెండు స్థితులలో గమనిస్తాము ... గుండె పూర్తిగా ముకులించుకునే (ముడుచుకునే) స్థితి ని " సిస్తొ లిక్ (Systolic)" అని , పూర్తీ గా విచ్చుకునే స్థితిని " డయస్టొలిక్(Diastolic)"అని అంటారు . ఈ రెండిటికీ మధ్య తేడాని " పల్స్ ప్రజర్(Pulse Pressure)" అని వ్యవహరిస్తారు .
 • బ్లడ్ ప్రజర్ ని కొలిచే సాదనం -- స్పిగ్మో మనో మీటర్ (Spygmomanometer) ఇందులో మెర్కురి రకము మంచిది . watch type - గాలినివాడే రకము , ఎలక్ట్రానిక్ రకము -సరిఅయిన కొలతలను (Readings) చూపించడం లేదు .
ఆరోగ్యవంతమైన నడివయసు వారికి 120 సిస్తోలిక్ , 80 డయాస్టోలిక్ ఉంటుంది . పుల్సు ప్రజర్
4౦ ఉంటుంది . ఈ రక్తపోటు అనేక అంశాలమీద ఆధారపడి మారుతూ ఉంటుంది . ఇది 140/90 కంటే ఎక్కువైతే " అధిక రక్తపోటు(Hypertension) హై ప్రజర్ " గాను , 90/60 కంటే తక్కువైతే " అల్ప రక్తపోటు (Hypotension) లో ప్రజర్ " గాను అంటాము . ఈ రెన్దూ ప్రమాదకరమైనవే .

రక్తపోటును ఎక్కువ చేసే పరిస్తితులు:
 • శారీరకంగా , మానసికంగా .. ఎక్కువ శ్రమ పొందినపుడు ,
 • ఆవేశము పడినపుడు ,
 • మానసిక ఆందోళన చెందినపుడు ,
 • ఉరకనే కోపం తెచ్చుకోవడం ,
 • తరచూ నిర్లిప్తతకు లోనుకావడం , భయం , ఆత్రుత .
 • వయసు మళ్ళిన వారికి ,
 • రక్త నాళాల లోపలి పోర గట్టిపడి పోవడం " ఆర్టీరియో స్క్లీరోసిస్" వలన ,
 • మూత్రపిండాల వ్యాధులలోను ,
 • రక్తము లో వచ్చే కొన్ని మార్పులు ,
 • లావుగా ఉండడము ,
 • ఉప్పు , కారాలు ఎక్కువగా తినడం ,
 • పొగ , ఆల్కహాల్ .. ఎక్కువగా తాగడం ,
 • వంశపారంపర్యం గా వచ్చే రకము .
హైపోటెన్సన్-లోబి.పి. (Hypotension) కి దారితీసే పరిస్తితులు:
 1. ఏదైనా దీర్ఘకాలిక జబ్బు పడినపుడు ,
 2. ఎక్కువరోజులు ఉపవాసం ఉండటం ,
 3. మానసిక వ్యాధులకు వాడిన కొన్ని మందులవలన ,
 4. తీసుకున్న కొన్ని మందులు వికటించినప్పుడు ,
 5. ఎక్కువ రక్తస్రావం జరిగినపుడు ,
 6. మధుమేహం ఉన్నప్పుడు ,
వ్యాధి లక్షణాలు :
 • తరచూ తలనొప్పి రావడం ,
 • నడినెత్తి లో బరువు , భారం గా ఉండడం ,
 • తలతిరగడం ,
 • చాతి బరువు , నొప్పి గా ఉండడం ,
 • చూపు మందగించడం .
 • వికారము ,వాంతి అనిపించడం ,
 • మాట తడబడడం ,
 • తరచూ చెమట పట్టడడం ,
చికిత్స :
హై బీపీ నివారణ,High B.P prevention

ఈమధ్యకాలంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య హై బీపీ. ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఊబకాయం, కిడ్నీ సమస్య, హార్మోన్లలో మార్పులు, ఉప్పు ఎక్కువగా తినడం, వంశ పారంపర్య లక్షణం లాంటి అనేక కారణాలతో హై బీపీ వస్తుంది. కారణం ఏదైతేనేం అధిక రక్తపోటు సమస్య మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు లాంటి ఆటుపోట్లకు దారితీస్తుంది. బ్రెయిన్ హామరేజ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కనుక హై బీపీని అశ్రద్ధ చేయడానికి వీల్లేదు.

బీపీ అదుపు తప్పకుండా చూసుకోవాలి. అందుకు ఎన్నో సులువైన మార్గాలున్నాయి. వాటిల్లో ఏ కొన్ని పాటించినా హై బీపీ నుండి బయట పడవచ్చు. అలాంటి రెమెడీలు మీ కోసం...
 • రోజూ వ్యాయామం చేయాలి. అందువల్ల రక్తప్రసరణ సవ్యంగా సాగి, హై బీపీ తగ్గుతుంది.
 • పచ్చటి చెట్ల మధ్య అరగంటపాటు వాకింగ్ చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
 • ప్రాణాయామం, వజ్రాసనం, మత్స్యాసనం మొదలైన ఆసనాలు హై బీపీని తగ్గిస్తాయి.
 • తినే పదార్ధాల్లో ఉప్పు బాగా తగ్గించాలి. వత్తిడిని తగ్గించుకోవాలి. అందుకోసం మెడిటేషన్ చేయాలి.
 • సిగరెట్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే తక్షణం మానేయాలి.
 • ఉసిరి పొడిని తేనెతో రంగరించి తింటే హై బీపీ తగ్గుతుంది.
 • పుచ్చకాయ జ్యూసు అధిక రక్తపోటును నివారిస్తుంది.
అన్నీ తేలికైన మార్గాలే. వీటిల్లో ఏ కొన్నిటిని పాటించినా హై బీపీ నుండి బయటపడవచ్చు. ఇంత సులువైన మార్గాలను వదిలి ప్రాణాంతకమైన హై బీపీని నియంత్రించడం అలాటు చేసుకోవాలి.

హై బి.పి. కి - అధికారక్తపోటును నియంత్రించుటకు:
 • ఆహార అలవాట్లలో మార్పూ -- ఉప్పు ,కారము , క్రొవ్వు పదార్దములు తక్కువగా తినాలి , వ్యసనాలు (తాగుడు ,ధూమపానము ) మానివేయాలి .
 • క్రమము తప్పకుండ వ్యాయామము చేయాలి .
వాడె మందులు :

central Acting:
adelphan , levo dopa .

periperally Acting :
 • Alpha blockers---Alfuzosin , * Prazosin * Doxazosin * Tamsulosin * Terazosin
 • Beta blockers --, atenolol,metaprolol
 • Calcium chanel blockers,--- depin ,amlodepin
 • ACE inhibitors ,--=eg.-analapril maleate
 • ARBlockers ,---=eg. all sartans - telmisartan
 • Diuretics eg ;--- frusemide , spiranolactone
LowPressure కి మందులు అవసరం ఉండదు .
 • నీరసంగా ఉన్నప్పుడు ... పడుకొని రెస్ట్ తీసుకోవాలి .
 • నీరు , మజ్జిక త్రాగాలి ,
 • అవసరమైతే .. డాక్టర్ సలహాతో సెలైన్ ఎక్కించుకోవాలి .
 • బి .కాంప్లెక్ష్ మాత్రలు వాడితే లోప్రెజర్ అంతగా రాదు .
మందులు వాడె విసయములో మంచి డాక్టర్ ని సంప్రదించి సరియైన మందును .. సరియున మోతాదులో వాడాలి .

రక్తపోటుకు చెక్‌ కి కొన్ని చిట్కాలు :
 • రక్తపోటు సాధారణ స్థాయి 120/80. ఇది చాలామందికి తెలిసిందే. మరి అధికరక్తపోటు
  అంటే... 140/90. అదే చక్కెరవ్యాధి, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికైతే అది 130/80కి చేరుకున్నా ప్రమాదంలో పడ్డట్టే. దీని బారి నుంచి తప్పించుకోవాలంటే జీవనశైలీ ఆహారపుటలవాట్లూ మార్చుకోవాల్సిందే.
 • ఆహారంలో ఉప్పు తగ్గించగానే సరిపోదు, పొటాషియం అధికంగా లభ్యమయ్యే పళ్లూ కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. బొప్పాయి, అరటి, మామిడి, కమలా, స్ట్రాబెర్రీ పళ్లల్లోనూ బంగాళదుంప, టొమాటో, దోస, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, తాజా క్యారెట్లు వంటి కూరగాయల్లోనూ పొటాషియం అధికం. పచ్చిటొమాటోల్లో ఉండే లైకోపీన్‌ బీపీని తగ్గిస్తుంది. మటన్‌, బీఫ్‌, పోర్క్‌ వంటివాటిని తగ్గించి చేపల్ని ఎక్కువగా తినాలి. వంటల్లో నువ్వులనూనె వాడితే మంచిది. అప్పడాలు, వడియాలు అస్సలు తినొద్దు.
 • రోజుకు ఒక కప్పు మించి కాఫీ తాగొద్దు. అందులో ఉండే కెఫీన్‌ గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. మద్యపానం అలవాటుంటే ఒకటిన్నర పెగ్గుకు మించకూడదు.
 • రోజూ పూలమొక్కల మధ్య కాసేపు నడిస్తే ప్రశాంతంగా ఉంటుంది.
 • నిత్యం ధ్యానం చేయడం వల్ల కూడా ఫలితం కనిపిస్తుంది.
  వృద్ధాప్యంలో అధికరక్తపోటు, తీసుకోవలసిన జాగ్రత్తలు:

  వయస్సు పెరిగే కొద్దీ చాలామందిలో అధిక రక్త పోటు ఉంటుంది. 2005 సంవత్సరంనాటి గణాంకాల ప్రకారం అమెరికాలో 6.5 కోట్లమం దికి అధిక రక్తపోటు ఉండగా, వీరిలో చాలా మంది వృద్ధులే.
  • వృద్ధాప్యంలో అధిక రక్తపోటు వల్ల గుండె పోటు, పక్షవాతం, గుండె వైఫల్యం, మూత్ర పిండాల వైఫల్యం మొదలైన సమస్యలన్నీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
  • వృద్ధుల్లో వయస్సును బట్టి రక్తపోటు కొంత ఎక్కువగా ఉండవచ్చుననే అపోహ ప్రజల్లో ఉండేది. ఇది సరైన అవగాహన కాదని శాస్త్రీ యంగా నిరూపణ అయింది.
  • 70 సంవత్సరాల వయసు వారిలో సిస్టో లిక్‌ రక్తపోటు 170 ఉండవచ్చుననే అభిప్రాయం సరికాదు. ఏ వయస్సులోని వారికైనా సిస్టోలిక్‌ రక్తపోటు 140, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. డయస్టోలిక్‌ రక్తపోటు 90 అంతకంటే ఎక్కువ ఉండకూడదు.
  • వయస్సు పెరుగుతున్నకొద్దీ 80 ఏళ్ల వరకూ సిస్టోలిక్‌ రక్తపోటు పెరుగుతూ ఉంటుందని, 55 సంవత్సరాల వయస్సు తరువాత డయ స్టోలిక్‌ రక్తపోటు పెద్దగా పెరగదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
  • సిస్టోలిక్‌ రక్తపోటు 140, అంతకంటే ఎక్కువ గానూ, డయస్టోలిక్‌ రక్తపోటు 90 అంతకంటే తక్కువగానూ ఉండటాన్ని ఐసోలేటెడ్‌ సిస్టోలిక్‌ అధిక రక్తపోటు అంటారు. ఈ విధమైన అధిక రక్తపోటు 60 సంవత్సరాల వయస్సు దాటిన అధిక రక్తపోటు రోగుల్లో 65 శాతం మందిలో ఉంటున్నదని సర్వేలు తెలుపుతున్నాయి.
  • సిస్టోలిక్‌ రక్తపోటు సంఖ్యనుంచి డయస్టోలిక్‌ రక్తపోటు సంఖ్యను తీసివేయగా వచ్చిన దానిని పల్స్‌ ప్రెషర్‌ (నాడి ఒత్తిడి) అంటారు.
  • మామూలుగా ఉండవలసిన రక్తపోటు 120/80 కాగా, మామూలు పల్స్‌ ప్రెషర్‌ 40. ఒక వృద్ధుడికి రక్తపోటు 170/90 ఉంటే అతడి పల్స్‌ ప్రెషర్‌ 80 అని చెప్పవచ్చు.
  • ఈ విధంగా వృద్ధాప్యంలో పెరిగే సిస్టోలిక్‌ రక్తపోటు, పల్స్‌ ప్రెషర్‌లు తమ దుష్ప్రభా వాలను ఆ వ్యక్తి గుండె మీద, రక్తనాళాల మీద చూపిస్తాయి.
  హెచ్చరిక:
  పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

  రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

  కామెంట్‌ను పోస్ట్ చేయండి

  0 కామెంట్‌లు
  * Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

  buttons=(Accept !) days=(0)

  Our website uses cookies. Learn More
  Accept !
  To Top