నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Monday, January 15, 2018

మహానంది ఆలయం - Mahanamdi

 మహానంది:

మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము మహానంది ఆలయము 

నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్నది ఈ మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7 వ శతాబ్ధినాటిది. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది.
పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్పటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. 
ఇక్కడి పుష్కరిణి నీరు అమృతం వలె ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి దారా వాహకంగా వస్తుంటుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తున్నది ఎవరికి తెలియదు. ఆ నీరు పుష్కరిణిలోనె బయటకు కనబడు తుంది. ప్రధాన ఆలయం క్రింది బాగంనుండి వస్తుంటుంది. ఆలయం వెనుక పెద్ద కొండ వున్నది. అక్కడ జలపాతమేమి లేదు. బహుశ కొండ క్రింది బాగం నుండి ఊట వస్తుండొచ్చు. ఇలాంటి ఊట బుగ్గలు ఈ ప్రాంతంలో చాలానె వున్నాయి. ఈ నీరు ఎంత స్వచ్చంగా వుంటుందంటే నీటి పై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదు అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. నిరంతరంగా ప్రవహిస్తున్నందున నీరు ఎల్లప్పుడు పరిశుబ్రంగా వుంటుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరె వున్నది. ఈ నీటిని తీర్తంగా భక్తులు తీసుకెళతారు.
నందీశ్వరుడు 
ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు కలవు. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కలదు. అదేమంటే..... గర్బాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం కలదు. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రుల పై తనకున్న భక్తిని చాటుకున్నాడు. అదే విధంగా స్థంబాలపై, గాంధి మహాత్ముని ప్రతిమ, ఇందిరా గాంధి ప్రతిమ, జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశ భక్తిని చాటుకున్నాడు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది. నంద్యాల నుండి ప్రతి అర్ద గంటకు ఒక బస్ కలదు.
గిద్దలూరు నుండి గాజులపల్లి స్టేషనులోదిగి వెళ్ళవచ్చు. గాజులపల్లికి సుమారు 6 కి.మీటర్లుంటుంది, మహానంది. ఇది కూడా పేరెన్నికగన్న శైవక్షేత్రాల్లో ఒకటి. నంధ్యాల నుండి 16 కిలోమీటర్లుంటుంది. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్.
ఇక్కడ మహానందీశ్వరాలయం - ఆలయానికెదురుగా కోనేరు. కోనేరులోకి నీరు ఒకనంది నోటిగుండా నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. చాలా తేలికై నీరు స్వచ్ఛంగా వుంటుంది. కోనేరు సుమారు 6 అడుగుల లోతుంటుంది. నీటి అడుగున ఎంత చిన్న వస్తువైనాసరే స్పష్టంగా పైకి కనబడుతుంది. కోనేటి నీటిమట్టం ఒకే విధంగా వుండటానికి కొన్ని తూములు కట్టబడినాయి. నీరంతా కాలువలద్వారా కొన్ని వందల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తూ విస్తారంగా అరటి తోటలు పెంచటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడి అరటిపండ్లు చాల ప్రసిద్ధం. తిరిగి నంద్యాల వచ్చి అక్కడినుండి శ్రీశైలమునకు రావచ్చును.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com