నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, March 4, 2018

క్షయ వ్యాధి, ఉదరకోశ క్షయ - ప్రధమ చికిత్స, నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు - Abortion tuberculosis - first aid, preventive care

ఇప్పుడు -ఉదరకోశపు క్షయ అవగాహన(Abdominal T.B-Awareness)- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

క్షయ వ్యాధికి గురైన మొత్తం బాధితుల్లో సుమారు 5 శాతం మంది ఉదరకోశ క్షయతో బాధపడుతున్నారని గణాంకాలు తెలియజేస్తు న్నాయి. వీరిలో 25 నుంచి 60 శాతం మందికి పెరిటోనియల్‌ క్షయకు గురవుతున్నారు ఊపిరి తిత్తులకు సోకే క్షయతోపాటు, ఉదరకోశానికి సోకే క్షయ వ్యాధికి గురైన వారు 20 నుంచి 50 శాతం వరకూ ఉన్నారు.
 • వివిధ కారణాల వల్ల మనిషి వ్యాధి నిరోధక శక్తిని అణచివేసే మందులను (ఇమ్యునో సప్రెసెంట్స్‌) వాడటం, హెచ్‌ఐవి / ఎయిడ్స్‌ మొదలైన వ్యాధుల కారణంగా ఉదరకోశపు క్షయ తిరిగి విజృంభిస్తూ ఆందోళన కలిగించే స్థాయికి చేరుతోంది.
 • ఉదరకోశంలోని పెరిటోనియం, మీసెట్రీ, లింఫ్‌నోడ్స్‌, పేవులు ఇతర అవయవాలు క్షయ వ్యాధికి గురి కావచ్చు. ఇది అనేక రకాల వ్యాధుల లక్షణాలను ప్రదర్శించవచ్చు. ఉదా హరణకు ఇన్‌ఫ్లమేటరీ బొవెల్‌ డిసీజ్‌, కేన్సర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్స్‌లో కనిపించే లక్షణాలు ఈ వ్యాధిలో కూడా కనిపించే అవకాశాలున్నాయి.
 • ఈ వ్యాధి సరైన సమయంలో తగిన చికిత్స తీసుకోని పక్షంలో దీర్ఘకాలిక వైకల్యానికి లేదా ఇతరత్రా ఇక్కట్లకు దారి తీయవచ్చు. ఈ కారణంగా వ్యాధిని తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం.
 • ఉదరకోశపు క్షయ వ్యాధి సోకిన ఉదరంలోని అవయవాన్ని అనుసరించి వివిధ రకాలైన లక్ష ణాలను ప్రదర్శిస్తుంది కనుక వాటిని నిర్ధారిం చడానికి కంప్యూటెడ్‌ టోమోగ్రఫీ (సి.టి.) స్కాన్‌ పరీక్ష చేయాల్సి ఉంటుంది. సి.టి. పరీక్ష ద్వారా ఉదరకోశంలోని అన్ని అవయవా లను ఒకేసారి పరీక్షించడానికి అవకాశం ఉంటుంది.
 • ఉదరకోశంలో క్షయ వ్యాధి సోకడానికి ప్రధాన కారణం మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యు లోసిస్‌ లేదా మైకోబాక్టీరియం ఏవియం అనే సూక్ష్మక్రిములు. వ్యాధి నిరోధక శక్తిని అణచడా నికి ఔషధాలు సేవించే వారిలో రెండవరకం సూక్ష్మక్రిమి సాధా రణంగా కనిపిస్తుంటుంది.
 • కలుషిత ఆహారం ద్వారా ఈ బాక్టీరియా శరీ రంలోకి చేరుతుంది. చిన్న ప్రేవులు, లింఫ్‌ నోడ్స్‌ మొదలైనఅవయవాల క్షీణతకు ఈ బ్యాక్టీ రియా కారణమవుతుంది. ఈ అవయవాలు చిట్లిపోవడం ద్వారా బాక్టీరియా పెరిటోనియం లోకి చేరి పెరిటోనియల్‌ ట్యుబర్‌క్యులోసిస్‌కు దారి తీస్తుంది.
 • ఉదరకోశ క్షయ వ్యాధుల్లో అత్యంత సాధార ణంగా కనిపించే వ్యాధి పెరిటోనియల్‌ టిబి. పెరిటోనియల్‌ టిబి మూడు రకాలు.
 • ద్రవాలతో నిండిన సంచులు లేదా జలో దరంతో కూడిన తడితో కూడిన (వెట్‌ టైప్‌) టిబి ఒక రకం.
 • లింఫ్‌ ఎడినోపతి, ఉదరకోశ కండరాలు ముద్దలాగా కనిపించే పొడి రకపు (డ్రై టైప్‌) టిబి రెండవ రకం. ఒమెంటమ్‌ మందంగా మారడం వల్ల కంతుల మాదిరిగా కనిపించే క్షయ మూడవ రకం.
 • వీటిలో మూడవరకం క్షయను ఉదర కుహ రంలో ఏర్పడిన కంతులని పొరబడటం జరుగు తుం టుంది. ఆహార నాళానికి సోకే క్షయ వ్యాధి అత్యంత సాధారణంగా ఇలియమ్‌, సీకమ్‌ భాగాలకు సోకుతుంది. ఇతర భాగాల విషయంలో పెద్దపేగు, జెజునమ్‌, మలా శయం, డుయోడినమ్‌, జీర్ణకోశ భాగాలకు ఆరోహణా క్రమంలో సోకుతుంది.
 • ఆహార నాళానికి సోకే క్షయ అల్సర్‌ రకంగా కానీ, హైపర్‌ప్లాస్టిక్‌ రకంగా కాని, ఈ రెండింటి కలయికగా కానీ కనిపిస్తుంది. ఇలియమ్‌, సీకమ్‌ భాగాలకు (ఇలియో సీకల్‌) సోకే క్షయ ఎక్కువగా హైపర్‌ప్లాస్టిక్‌ రకంగా ఉంఉంది.
 • ఉదరకోశంలో సోకే క్షయ వివిధ రూపాలుగా కనిపి స్తుంది. సి.టి. స్కాన్‌ ద్వారా దీనిని సమగ్రంగా పరీక్షిం చడం సాధ్యమవుతుంది.
 • ఉదరకోశ క్షయ వ్యాధికి గురైన వారిలో కనిపించే లక్షణాలు - కడుపు నొప్పి, వాపు, జ్వరం, రాత్రి వేళల్లో చెమటలు పట్టడం, ఆకలి లేక పోవడం, బరువు తగ్గిపోవడం మొదలైనవి.
 • ఉదరకోశ క్షయ వ్యాధికి గురయ్యే వారిలో అత్యధికులు పేదవర్గాలకు చెందిన వారే. ఉదర కోశ క్షయ వ్యాధికి గురైన వారికి ఛాతీ ఎక్స్‌రే తీసినప్పుడు, ఊపిరితిత్తుల క్షయకు గురైన దాఖలేవీ కనిపించలేదు. చర్మానికి సంబంధిం చిన క్షయ కోసం చేసే పరీక్షల ఫలితాలు కూడా కొన్ని కేసుల్లో నెగటివ్‌గా వచ్చాయి.
 • ఉదరకోశ క్షయ వ్యాధికి గురైన వారిలో అత్యధికులు కడుపు నొప్పి, కడుపులో నీరు చేరి ఉబ్బిపోవడం (అసైటిస్‌) వంటి లక్షణాలతో చికిత్స కోసం వైద్యుల వద్దకు వస్తుంటారు. కొందరిలో అసైటిస్‌ లేకుండా కడుపు నొప్పి మాత్రమే ఉండవచ్చు.
 • ఉదరకోశానికి క్షయ వ్యాధి సోకినప్పుడు హిస్టొపాథొలాజికల్‌ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించవచ్చు. అంతేకాకుండా, కేన్సర్‌ వంటి ఇతర వ్యాధులు సోకిన విషయాన్ని కూడా పరీక్షించవచ్చు.
చికిత్స :
టి.బి. జబ్బులో వాడే మందులే వాడలి . ఒక కోర్సు పూర్తి కాలము వాడాలి .

శరీరంలో క్షయ వ్యాధి ఏ భాగంలో ఉన్నప్పటికీ చికిత్సా విధానం మాత్రం ఒకటే. రిఫాంపిసిన్‌, ఐసోనెక్స్‌, ఇతాంబ్యుటాల్‌ వంటి మందులతో వ్యాధిని పూర్తిగా నయం చేయ వచ్చు. ఈ వ్యాధికి కనీసం 6 నెలలు క్రమం తప్పకుండా వైద్య సలహాపై మందులు వాడాలి. మందులు వాడటం మొదలుపెట్టిన నెల రోజుల్లో రోగికి చాలా వరకూ ఉపశమనం వస్తుంది. కానీ ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా మందులు వాడాలి. కొంత మంది ఉపశమనం లభించిందని మందులు వాడటం మానేస్తుంటారు. ఇటువంటి వారికి వ్యాధి తిరిగి ఆరంభమవుతుంది.

వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతతోపాటు ఇళ్లలో గాలి, వెలుతురు మొదలైనవి బాగా ఉండేలా చూసుకోవాలి. దగ్గినప్పుడు, తుమ్మిన ప్పుడు చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ కళ్లె ఉమ్మేయకూడదు.ఉమ్మి వేయడానికి మూత ఉన్న కప్పు ఉప యోగించాలి. మంచి పోషకాహారం తీసుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింప జేసుకోవాలి.

పూర్తీ వివరాలకోసం వైద్యున్ని సంప్రదించండి 

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com