సంసారం అంటే ఏమిటి, అది ఎక్కడ వుంటుంది? - What is samsaram, where is that?

0
What-is-samsaram-samsaram-ante-yemiti.


సంసారము ఎక్కడ ఉంటుంది?:
సంసారము బయట కాదు హృదయంలో ఉంటుంది. విషయ వాసనలు బంధుప్రీతి, అన్నీ హృదయంలో ఉంటాయి. హృదయంలో ఎంత ఎక్కువ విషయ వాసనలు ఉంటే, భగవంతుడు హృదయములో అంతా ఇరుకుగా ఉంటాడు.

ఉదా:- ఏమండీ ఏదో ఫలాన వస్తువు కొందాము అందుకు లక్షరూపాయలు అవుతుందట. అంటే వెంటనే మనము మన బ్యాంకులో అంత డబ్బు ఎక్కడుంది ఉన్నవి 80 వేలే కదా అంటాము. అంటే బ్యాంకు పాసు బుక్కు చూడకుండా ఎప్పుడో 20 రోజుల క్రితం జరిగిన (విత్ డ్రాయులు/డిపాసిట్) దానిని గుర్తు పెట్టుకొని, బ్యాంకులో మన అక్కౌంటు బాలన్స్ చెప్పగలిగామంటే, అర్ధంచేసుకోండి, విషయ వాసనలు ఎక్కడున్నాయి. అదే పూజ చేయాలంటే పుస్తకం కావాలి పుస్తకంలో చూస్తే గానీ మంత్రాలు తెలియవు భగవంతుని నామాలు తెలియవు. అవునా?

తన్మాత్రులు ఐదు
 1. శబ్ద
 2. రూప
 3. స్పర్శ
 4. రస
 5. గంథములు
పంచభూతములు:-
 1. పృథివి, 
 2. ఆపః, 
 3. తేజో, 
 4. వాయు, 
 5. ఆకాశము
లౌల్యం అంటే చూద్దాం, విందాం, ముట్టుకుందాం, తిందాం, అశోకము, అరవిందము, కూటము, నీలోత్పలము.

భగవత్ పూజలో పంచేంద్రియా విష్కరణము

1. పూజలో దీపం ఎందుకు?
కన్నుకు ప్రతీక దీపం. మనస్సు యొక్క కృతజ్ఞతావిష్కరణ మనకు ఆరాధనలో దీపం వెలిగించి “సాక్షాత్ దీపం దర్శయామి” అని ప్రార్థన చేస్తాం.

2. పూజలో పుష్పం ఎందుకు?
పుష్పము శబ్దమునకు ప్రతీక. పుష్పంలో శబ్దం ఎలా వస్తుంది? పుష్పము (మకరందము) కొరకు వచ్చే తుమ్మెద ఝుంకారము పుష్పమునకే చెందుతుంది. ఆ ఝుంకార శబ్దమును గ్రహించేది చెవులు కాబట్టి చెవులకు ప్రతీక పుష్పం. “పుష్పం సమర్పయామి” అని ప్రార్థన చేస్తాం.

3. పూజలో ఫలాలెందుకు?
ఫలం (పళ్ళు) కు ప్రతీక నాలుక. పరమేశ్వరుడు సాత్వికాహారి కనుక ఫలములను సమర్పించి పూజా చేస్తాము.

4. పూజలో ధూపము ఎందుకు?
ముక్కుకు ప్రతీక సుధూపం. పరమేశ్వరునకు ధూపము చూపించి “సుధూప మాగ్రాహయామి” అని ప్రార్థన చేస్తాం.

5. పూజలో గంథం ఎందుకు?
చర్మమునకు ప్రతీక స్పర్శేంద్రియములకు ప్రతీక గ్రంథము.”గాంథాం ధారయామి , గంథం సమర్పయామి” అని ప్రార్థన చేస్తాము.

పంచాయతన పూజ
 1. పరమ శివుడు:- పరమ శివుని పూజకు పరమశివ సంబంధమైన సాలగ్రామము నర్మదానది ఓంకార కుండంలో “బాణలింగం” సాలగ్రామమును పూజ చేయాలి.
 2. అమ్మవారు:- అమ్మవారు జ్ఞానప్రసూనాంబికా మాతగా శ్రీ కాళహస్తి దగ్గర స్వర్ణముఖీ నదిలో అమ్మవారు బంగారు తీగలా ఉంటుంది. “సువర్ణముఖీ సాలగ్రామము”ను పూజ చేయాలి.
 3. వినాయకుడు:- వినాయకుడు శోణానదీ దగ్గర “శోణభద్ర సాలగ్రామము” ను పూజ చేయాలి.
 4. విష్ణువు:- విష్ణువు నేపాల్ లో గండకీ నది వద్ద దొరికే సాలగ్రామము” విష్ణు సాలగ్రామము” పూజ చేయాలి.
 5. సూర్యుడు:- తంజావూరు వద్ద వల్లమ్మన్న దగ్గర తెల్లగా ఉంటుంది “స్పటిక సాలగ్రామమును” పూజ చేయాలి.
సుబ్రహ్మణ్య స్వరూపం హారతి:
పై చెప్పబడిన ప్రదేశములలో ఆయా మూర్తుల సాలగ్రామములను తెచ్చుకొని, ప్రతిరోజు ఐదు సాలగ్రామములను, శుభ్రముగా కడిగి బొట్టుపెట్టి, ఎండు మారేడు దళములు, ఎండు తులసి దళములతో, నామాలతో పూజ చేయాలి. బెల్లం నైవేద్యం చేయాలి. నైవేద్యం అంటే ఏదో పళ్ళు పలహారములు నివేదించరాదు. మన బాధలను సుఖాలను వినయంతో స్వామి వారికి నివేదించాలి.

వారి వారి ప్రధాన దేవతలను, మధ్యలో ఉంచి మిగిలిన నాలుగు దేవతలను, వారి వారి స్థానములలో ఉంచవలయును.
 • ఆరోగ్యమునకు- సూర్యుడు: సూర్యో పాసకులు స్పటిక సాలగ్రామమును మధ్యలో ఉంచాలి.
 • విఘ్నములకు- వినాయకుడు: గణాపత్యము వారు గణపతిని మధ్యలో ఉంచాలి.
 • జ్ఞానమునకు- శివుడు: శివోపాసకులు శివారాధనకు శివుని మధ్యలో ఉంచాలి.
 • స్థితికార రక్షణకు- విష్ణువు: విష్ణోపాసకులు విష్ణువును మధ్యలో ఉంచాలి.
 • కదలికలకు- పరదేవత: ( అమ్మవారు)
 • హారతి అగ్నిహోత్రమునకు సుబ్రహ్మణ్యేశ్వరుడు.
ఏ గృహము నందైనా వయోవృద్దులు, అనారోగ్యవంతులు ఉండి, వారికి ఇక ప్రాణము పోతుంది,

అని అనుకున్నప్పుడు ఇవి ఆ ఇంటి యందు తప్పక ఉండవలయును.
శాస్త్ర ప్రకరణము ప్రకారం.
 1. శివప్రసాదము:- పరమేశ్వరునికి అభిషేకము చేసిన విభూతి, ప్రత్యేకించి దక్షిణామూర్తికి అభిషేకించిన విభూతి. (పొడి విభూతి)
 2. విష్ణుప్రసాదము:- ఆరబెట్టి పొడిగా ఉన్నటువంటి తులసి.
 3. గంగ:- శుద్ద జలము (జల ప్రార్థన చేసిన జలము)
“గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలే ఽ స్మిన్ సన్నిదింకురు||”
అని శ్లోకముతో శుద్దిగావింపబడిన శుద్ద జలము. ప్రాణోత్కరణము ముందు గోదానము శుభప్రదము


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top