నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
మానవ సంబంధాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మానవ సంబంధాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, ఆగస్టు 2019, శుక్రవారం

బంధాలు, భవబంధాల - Bhandam


“ బంధనం ”
దశావతారాల్లో వరాహావతారం ఒకటి. వరాహస్వామిగా ఆయన్ని మనం పూజిస్తాం. అయితే, నిజ జీవితంలో ఒక పందిని చూస్తే మనం చీదరించుకుంటాం. పటాలపైన, సినిమాల్లో అమ్మవారో, లేదా అయ్యవారో నాలుగు చేతులు, నాలుగు తలలు కలిగివుంటే, ఎంతో పరవశంతో నమస్కారాలు చేస్తాం. అదే నిజ జీవితంలో అలాంటివాళ్ళు కనిపిస్తే మరోమాటలేకుండా పారిపోతాం. ఇది మనిషియొక్క ఒక విచిత్రమైన మానసిక స్థితి.

మన పురాణాలలో ఇంద్రుడికి కలిగినన్ని శాపాలు మరెవరికీ కలగలేదు. ఒకానొక సమయంలో, ఒకానొక సందర్భంలో, ఒక ముని ఇంద్రుడు చేసిన పనివల్ల కోపించి, ‘నీవు మగ పందివై, భూమ్మీద ఒక సంవత్సరకాలం జీవింతువుగాక’ అని శపించాడు. ముని వాక్యం అమోఘం. వెంటనే ఇంద్రుడు భూమ్మీద ఒక మగ పందిగా పుట్టాడు. కొంతకాలానికి, ఆ పంది ఒక సుందరమైన ఆడ పంది ప్రేమలోపడి, మోహించి, వ్యామోహితుడై, ఆ సుందరాంగి లేకపోతే బ్రతుకే వృధాఅని, ఇక బ్రతుకలేనని అనుకోని, ఆ ఆడ పందిని సమీపించి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. వారి ప్రేమ సుఖాంతం అయింది. వారి పెళ్ళి అయింది. కొంతకాలం వారి ప్రణయ జీవితం హాయిగా జరిగింది. అప్పటికే సంసారమనే పాముతో కాటేయబడ్డ ఇంద్రుడికి (మగ పంది) విషం పైపైకి ఎక్కటం మొదలైంది. ఆ జంటకి అనేకంగా పిల్లలు పుట్టారు. ఆ పిల్లలను, తన భార్యను చూస్తూ, ఎంతో ఆనందిస్తూ, బురదగుంటల్లో పొర్లుతూ, దొర్లుతూ, వారిద్దరూ ఆనందంగా జీవిస్తున్నారు.

చూస్తుండగానే ఒక సంవత్సరకాలం తెలియకుండానే కరిగిపోయింది. ఇంద్రుడికి స్పృహేలేదు. ఆనందంగా, విలాసంగా వున్నాడు. ఇంతలో, అక్కడ ఇంద్రలోకంలో, దేవతలందరూ ఇంద్రుడి రాకకై ఎదురుచూస్తూ, స్వాగత ఏర్పాట్లు అన్నీ చేసుకొని సిద్ధంగావున్నారు. సమయానికి, ఇంద్రుడు రాలేదు. కారణం తెలియక, వారు అగ్నిదేవుడ్ని పిలిచి, భూమ్మీదకువెళ్ళి, ఏంజరిగిందో తెలుసుకొని రమ్మన్నారు. అగ్నిదేవుడు వెళ్ళి, బురదగుంటలో భార్యా, పిల్లల సమేహితుడై ఇంద్రుడు ఆనందంగా వుండటం చూసాడు. అప్పుడు, అగ్నిదేవుడు, ఆర్యా, మీరు ఇందృడు, స్పృహలోకిరండి; మీ శాపం సమయం తీరిపోయింది. కాబట్టి, వెంటనే ఇంద్రలోకానికి విచ్చేయండి, అందరూ మీ రాకకై వేచిచూస్తున్నారు అని విన్నవించాడు. ఆ మాటలువిన్న ఇంద్రుడు, అగ్నిదేవా, నాకు ఇక్కడ చాలా బాగుంది, అంతేకాకుండా నేను నా భార్యని, ముద్దులొలికే నా పిల్లల్ని వదిలి ఇప్పుడు రాలేను. కాబట్టి నీవు వెళ్ళిపో. నేను కొంతకాలం తరువాత వస్తాను అని చెప్పాడు. అయినీ, అగ్నిదేవుడు చాలాసార్లు వచ్చేయమని బతిమాలాడు. ఇంద్రుడుకి కోపంవచ్చి, నేను ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళీపో అని అన్నాడు. చేసేదిలేక ఆయన వెళ్ళిపోయి, జరిగిందేమిటో దేవతలందరికీ చెప్పాడు. ఆతరువాత వరుణుడుకూడా వెళ్ళి ప్రయత్నంచేసి, విఫలుడై తిరిగి వచ్చాడు. ఏంచేయాలో వారికి తెలియలేదు. ఇంద్రలోకంలో ఇంద్రుడులేక పరిపాలనంతా ఆగిపోయింది. అప్పుడు మరొక దిక్పాలకుడు యముడుని పిలిచి నీవు వెళ్ళి ప్రయత్నంచేసి రమ్మన్నాడు. నేను వెళ్ళినా అదే జరుగుతుందికదా ఏమిటి ప్రయోజనం? అని అన్నాడు. అప్పుడు ఆ దిక్పాలకుడు, యమా, ఒకవేళ ఇంద్రుడు నీమాట విని రాకపోతే, వరాహరూపంలోవున్న ఆయన్ని చంపివేయి. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది, వెళ్ళిరా అని పంపించాడు.

యమధర్మరాజు వెళ్ళి ఇంద్రుడిని స్వర్గలోకాని రమ్మని బతిమాలాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది. మీరందరూ, ఒకరితరువాత మరొకరువచ్చి, నన్ను విసిగిస్తున్నారు. ఇక్కడ నేను నా భార్యా,పిల్లలతో నేను చాలా సుఖంగావున్నాను. మీరు నన్ను ఇన్నిసార్లు విసిగించారుకనుక, నా నిర్ణయం చెబుతున్నాను విను: నేను స్వర్గలోకానికి ఇక ఎప్పటికీ రాను. నాకు ఇక్కడే స్వర్గలోకంల్లాగావుంది. ఇక వెళ్ళిపో అని హూంకరించాడు. సరేనని చెప్పి, యముడు కొంచెం దూరం వెళ్ళి, వెనుకగా వచ్చి, ఆ మగపందిని తన కత్తితో చంపేసాడు. పంది శరీరం పడిపోయిందికాబట్టి, చేసేదేమీలేక, ఇంద్రుడు ఆ పంది శరీరాన్ని వదిలివేయాల్సివచ్చింది. అప్పటివరకూ ఆ వరాహ శరీరంతోవున్న బంధనం తెగిపోయింది. వాస్తవాన్ని తెలుసుకున్న ఇంద్రుడు స్వర్గలోకానికి చేరుకున్నాడు.

సామాజిక జీవనంలో మనిషికి మరొక మనిషి తోడుకావాలి. తప్పులేదు. వివాహం చేసుకోవటం, ఒక భార్యని కలిగివుండటం, చక్కటి పిల్లల్ని కలిగివుండటం సహజం, తప్పులేదు; కోరదగ్గదే. మానవజాతి మనుగడకు ఇదంతా కావాల్సిందే. అయితే, కేవలం శరీరంమీదవున్న వ్యామోహంతో, ఈ శరీరమే నేను అన్న ఒక అపోహతో, మనిషి అనేక బంధనాలని తనకుతానుగా కల్పించుకొని, వాటితో పెనవేసుకొని, వాటిని విప్పుకోలేక, వాటిలో ఎల్లకాలం ఇమడలేక, సతమతమవుతూ వుంటాడు. ఎప్పటికో, వయసుమీరిన సమయానికి ఆ బంధనాలనుంచి బయటపడినా, అప్పుడు అతడు ఏమీ చేసే స్థితిలో వుండడు. మిగిలింది విచారం; అసంతృప్తి; అసంతృప్తితో కూడిన మరణం; పాతవాసనలతోకూడిన మరొక క్రొత్త పుట్టుక!!

మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, మనిషి జీవితం, అమ్మ పొట్టలోవున్నప్పటినుంచే గట్టి బంధనంతో మొదలవుతుంది. ‘ మాయ ’ అనబడే ‘ మావి త్రాడు ’తో తల్లీ,బిడ్డల బంధనం మొదలవుతుంది. భూమ్మీదకు వచ్చాక, అతనికి ఒక జన్మ నక్షత్రంతో, ఒక రాశితో, ఒక ఋషి గోత్రంతో, ఒక స్వంత పేరుతో, ఒక లింగభేదంతో, ఒక కులం, మతంతో, ఒక ఊరు, దేశంతో, ఒకరికి కొడుకుగా, మరికొందరికి అన్న/తమ్ముడుగా/మేనల్లుడుగా/బాబాయిగా/మామగా ఇలా ఎన్నో చుట్టరికపు అనుబంధాలతో బంధనాలు ఏర్పడుతాయి. అందరూ మనకు కావాల్సిందే. అయితే, వారితో, వాటితో మనకు అవసరమైనంతమేరకే సంబంధం పెట్టుకుంటే, వారిపై, వాటిపై వ్యామోహం లేకుండావుంటుంది. లేకపోతే, ఇంద్రుడిలాగా సంసారమనే బురదగుంటలో కూరుకొని, ఇరుక్కుపోతాము.

నాకనిపిస్తుంది, పూర్వకాలంలో ఒక్కొక్కరి ఇంట్లో పదిమంది పిల్లలు వుండేవారు. అంతమందితో సతమతమవుతూ, ఏ ఒక్కరిమీదా అతిగా ప్రేమ, వ్యామోహాలు పెంచుకునేవారుకారు. కానీ, సంసార తాపత్రయంలో కొట్టుమిట్టులాడుతూ వుండేవారు. ప్రస్తుత కాలంలో, ఒకరు లేక ఇద్దరు పిల్లలున్న సంసారాల్లో, తల్లి,తండ్రులకి పిల్లలమీద, పిల్లలకు అమ్మా,నాన్నలమీద ప్రేమ, అనుబంధాలు చాలా ఎక్కువైపోతున్నాయేమో అని అనిపిస్తున్నది. వున్నదంతా, సంపాదించినదంతా పిల్లలికి కాకపోతే మరెవరికి ఇస్తాం? అనే ధోరణి; మా అమ్మా,నాన్నలు మాకు కాకపోతే మరెవరికి ఇస్తారు ఈ ఆస్తినంతా అన్న ధోరణి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నది. అతిగా దేనినీ కోరుకోకూడదు; అతిని విడిచి పెట్టాలి అని పెద్దలు చెప్పారు. ఇది పాటించకపోతే, మన శరీరానికి, మన మనస్సుకు కలిగే నష్టం అంతాఇంతకాదు.

గమనిక: ఎన్నో, ఎన్నెన్నో బంధాలను, భవబంధాలను మనం చూస్తూనేవున్నాము. అయితే, ఒక క్రొత్త, విచిత్రమైన అనుబంధం ఈ మధ్య మనుషులకు ఏర్పడింది. ఆ విషయం చెబితే అందరూ ఆశ్చర్యపోతారు. తెలిసికూడా ఈ వ్యామోహాన్ని, బంధాన్ని తెంచుకోలేకపోతున్నారు మనుషులు. అదే, ‘ సెల్ ఫోన్ మరియు అంతర్జాల ’ బంధం. దీనిని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీనివలన, ప్రమోదమా లేక ప్రమాదమా అనేది జనులే తెలుసుకోవాలి. స్వస్తి.

గమనిక: “ పూజ్య స్వామీజీ తత్వవిదానంద చెప్పిన కథను ఆధారంగా వ్రాసిన వ్యాసం ఇది ”.

రచన: పబ్బరాజు మాధవరావు 

10, మే 2018, గురువారం

భారతీయ పల్లె ప్రజల ఆత్మీయత - Palle prajala Athmiyata, atithi devo bhava

ఆత్మీయత
పల్లె ప్రజలు ఆత్మీయతకు పెట్టింది పేరు అనే మాటకు ఈనాడు అర్థం లేకుండా పోయింది. ఎవరికి వారె యమునా తీరె అనె తరహాలో ఉన్నారు. దానికి తగ్గట్టు ప్రజల సామూహిక సామాజిక కార్యక్రమాలైన పండగలు, జాతరలు, బుర్రకతలు, వీధినాటకాలు, హరికథలు, వంటివి రాను రాను కనుమరుగౌతున్నవి. ప్రజలను ఒక్కతాటిపై నిలబెట్టే ఇటువంటి ప్రక్రియలు లేనందున పల్లె ప్రజలు ఎవరికి వారు విడి పోతున్నారు.

ఒకరికొకరు, ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకునే సంస్క్రుతికి రాను రాను దూరమై పోతున్నాడు. నేటి పల్లెల్లో జనాభా తగ్గింది. రాష్ట్ర వ్వాప్తంగా ఏ పల్లెలో జనాభా తీసుకున్నా కచ్చితంగా గత 50 సంవత్సరాల క్రితం వున్నంత జనాభా ఈ రోజున లేదు. నిజానికి అర్థ శతాబ్దంలో దేశ వ్వాప్తంగా జనాభా ఎంతో పెరిగింది. ఆ దామాషా ప్రకారం పల్లెల్లో కూడా పెరిగి వుండాలి. కాని దానికి విరుద్దంగా.

ఆశ్చ్యర్య కరంగా పల్లెల్లో జనాభా తగ్గింది. కారణమేమంటే వర్షాలు సరిగ పడక, వ్యవసాయం గిట్టుబాటు కాని వ్వవ హారంగా మారడము ఇలాంటి కారణాల వల్ల యువత ఉద్యోగాలను, ఇతర వ్వాపారలని పట్టణాలు, నగరాల బాట పట్టారు. ఆ కారణంగా పల్లెల్లో జనాభా తగ్గి, పట్టణాలలో పెరిగింది. ప్రస్తుతం పల్లెల్లో మిగిలిన వారిలో ఎక్కువ మంది వృద్దులు ఏ పనిచేయలేని వారు మాత్రమే. వ్యవసాయం చేయలేక ఇతరత్రా, వ్వాపార, ఉద్యోగాలలో స్థిరపడి పోతున్నారు.

పల్లె వాసుల్లో రాజకీయ చైతన్యం పెరిగి తత్కారణంగా కక్షలు కార్పణ్యాలు పెరిగి ఈర్ష్యా ద్వేషాలు పెచ్చు మీరి కల్లా కపటం తెలియని రైతులు నేడు ఈర్ష్యాల ద్వేషాల మధ్య బిక్కు బిక్కు మంటు బతుకీడుస్తున్నారు. ప్రతి పల్లెలోని నెలకొన్న పరిస్థితి ఇది. కేవలం ఒక యాబై సంవత్సరాల లోనె ఇంతటి మార్పు వచ్చిందంటే ఇక రాబోవు యాబై సంవత్సరాలలో ఇంకెంత మారుపు వస్తుందో వూహించు కోవడానికే భయం వేస్తుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

5, మార్చి 2018, సోమవారం

గృహిణి ధర్మమము మరియు గృహస్థాశ్రమము - House Wife Dharma, Gruhini dharmamu

Grhasthasramamu


గృహస్థాశ్రమము: Grhasthasramamu

గృహస్థాశ్రమము:
గృహస్తాశ్రమ ధర్మములో గృహిణిదే ఇల్లు. ఆ ఇంటిలో గృహస్తు(భర్త) ఉంటాడు. భర్త యొక్క సంపద గృహిణిది మాత్రమే. అది భర్తది కాదు. అమ్మాయి ఇంటిలో అబ్బాయి ఉంటాడు. అంతే కానీ భర్త ఇంటిలో భార్య ఉండదు.

షష్టిపూర్తి:- అనగా 59 సంవత్సరాలు పూర్తి అయి 60 సంవత్సరాలలోకి రావడం. మనకు ఉన్నవి 60 సంవత్సరాలు మాత్రమే. ప్రభ వాది క్షయ నామ సంవత్సరం వరకు. మన సనాతన ధర్మములో సంవత్సరములు 60. ఒక సంవత్సరంలో పుట్టిన వ్యక్తికి ఆ సంవత్సరమునకు ఒక పేరు ఉంటుంది. ఉదా:- సర్వజిత్ నామ సంవత్సరము జన్మించిన వారికి, వ్యయ నామ సంవత్సరంతో 59 సంవత్సరములు పూర్తి అయి, వ్యయ నామ సంవత్సరం తర్వాత మరలా,సర్వజిత్ నామ సంవత్సరం వస్తుంది కాబట్టి, షష్టి పూర్తి అని, ఆ జనన నామ సంవత్సరమును సంకల్పముగా చెప్పుకొని,చేసుకొని చేయు పండుగ షష్టి పూర్తి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

సంసారం అంటే ఏమిటి, అది ఎక్కడ వుంటుంది? - What is samsaram, where is that?

What-is-samsaram-samsaram-ante-yemiti.


సంసారము ఎక్కడ ఉంటుంది?:
సంసారము బయట కాదు హృదయంలో ఉంటుంది. విషయ వాసనలు బంధుప్రీతి, అన్నీ హృదయంలో ఉంటాయి. హృదయంలో ఎంత ఎక్కువ విషయ వాసనలు ఉంటే, భగవంతుడు హృదయములో అంతా ఇరుకుగా ఉంటాడు.

ఉదా:- ఏమండీ ఏదో ఫలాన వస్తువు కొందాము అందుకు లక్షరూపాయలు అవుతుందట. అంటే వెంటనే మనము మన బ్యాంకులో అంత డబ్బు ఎక్కడుంది ఉన్నవి 80 వేలే కదా అంటాము. అంటే బ్యాంకు పాసు బుక్కు చూడకుండా ఎప్పుడో 20 రోజుల క్రితం జరిగిన (విత్ డ్రాయులు/డిపాసిట్) దానిని గుర్తు పెట్టుకొని, బ్యాంకులో మన అక్కౌంటు బాలన్స్ చెప్పగలిగామంటే, అర్ధంచేసుకోండి, విషయ వాసనలు ఎక్కడున్నాయి. అదే పూజ చేయాలంటే పుస్తకం కావాలి పుస్తకంలో చూస్తే గానీ మంత్రాలు తెలియవు భగవంతుని నామాలు తెలియవు. అవునా?

తన్మాత్రులు ఐదు
 1. శబ్ద
 2. రూప
 3. స్పర్శ
 4. రస
 5. గంథములు
పంచభూతములు:-
 1. పృథివి, 
 2. ఆపః, 
 3. తేజో, 
 4. వాయు, 
 5. ఆకాశము
లౌల్యం అంటే చూద్దాం, విందాం, ముట్టుకుందాం, తిందాం, అశోకము, అరవిందము, కూటము, నీలోత్పలము.

భగవత్ పూజలో పంచేంద్రియా విష్కరణము

1. పూజలో దీపం ఎందుకు?
కన్నుకు ప్రతీక దీపం. మనస్సు యొక్క కృతజ్ఞతావిష్కరణ మనకు ఆరాధనలో దీపం వెలిగించి “సాక్షాత్ దీపం దర్శయామి” అని ప్రార్థన చేస్తాం.

2. పూజలో పుష్పం ఎందుకు?
పుష్పము శబ్దమునకు ప్రతీక. పుష్పంలో శబ్దం ఎలా వస్తుంది? పుష్పము (మకరందము) కొరకు వచ్చే తుమ్మెద ఝుంకారము పుష్పమునకే చెందుతుంది. ఆ ఝుంకార శబ్దమును గ్రహించేది చెవులు కాబట్టి చెవులకు ప్రతీక పుష్పం. “పుష్పం సమర్పయామి” అని ప్రార్థన చేస్తాం.

3. పూజలో ఫలాలెందుకు?
ఫలం (పళ్ళు) కు ప్రతీక నాలుక. పరమేశ్వరుడు సాత్వికాహారి కనుక ఫలములను సమర్పించి పూజా చేస్తాము.

4. పూజలో ధూపము ఎందుకు?
ముక్కుకు ప్రతీక సుధూపం. పరమేశ్వరునకు ధూపము చూపించి “సుధూప మాగ్రాహయామి” అని ప్రార్థన చేస్తాం.

5. పూజలో గంథం ఎందుకు?
చర్మమునకు ప్రతీక స్పర్శేంద్రియములకు ప్రతీక గ్రంథము.”గాంథాం ధారయామి , గంథం సమర్పయామి” అని ప్రార్థన చేస్తాము.

పంచాయతన పూజ
 1. పరమ శివుడు:- పరమ శివుని పూజకు పరమశివ సంబంధమైన సాలగ్రామము నర్మదానది ఓంకార కుండంలో “బాణలింగం” సాలగ్రామమును పూజ చేయాలి.
 2. అమ్మవారు:- అమ్మవారు జ్ఞానప్రసూనాంబికా మాతగా శ్రీ కాళహస్తి దగ్గర స్వర్ణముఖీ నదిలో అమ్మవారు బంగారు తీగలా ఉంటుంది. “సువర్ణముఖీ సాలగ్రామము”ను పూజ చేయాలి.
 3. వినాయకుడు:- వినాయకుడు శోణానదీ దగ్గర “శోణభద్ర సాలగ్రామము” ను పూజ చేయాలి.
 4. విష్ణువు:- విష్ణువు నేపాల్ లో గండకీ నది వద్ద దొరికే సాలగ్రామము” విష్ణు సాలగ్రామము” పూజ చేయాలి.
 5. సూర్యుడు:- తంజావూరు వద్ద వల్లమ్మన్న దగ్గర తెల్లగా ఉంటుంది “స్పటిక సాలగ్రామమును” పూజ చేయాలి.
సుబ్రహ్మణ్య స్వరూపం హారతి:
పై చెప్పబడిన ప్రదేశములలో ఆయా మూర్తుల సాలగ్రామములను తెచ్చుకొని, ప్రతిరోజు ఐదు సాలగ్రామములను, శుభ్రముగా కడిగి బొట్టుపెట్టి, ఎండు మారేడు దళములు, ఎండు తులసి దళములతో, నామాలతో పూజ చేయాలి. బెల్లం నైవేద్యం చేయాలి. నైవేద్యం అంటే ఏదో పళ్ళు పలహారములు నివేదించరాదు. మన బాధలను సుఖాలను వినయంతో స్వామి వారికి నివేదించాలి.

వారి వారి ప్రధాన దేవతలను, మధ్యలో ఉంచి మిగిలిన నాలుగు దేవతలను, వారి వారి స్థానములలో ఉంచవలయును.
 • ఆరోగ్యమునకు- సూర్యుడు: సూర్యో పాసకులు స్పటిక సాలగ్రామమును మధ్యలో ఉంచాలి.
 • విఘ్నములకు- వినాయకుడు: గణాపత్యము వారు గణపతిని మధ్యలో ఉంచాలి.
 • జ్ఞానమునకు- శివుడు: శివోపాసకులు శివారాధనకు శివుని మధ్యలో ఉంచాలి.
 • స్థితికార రక్షణకు- విష్ణువు: విష్ణోపాసకులు విష్ణువును మధ్యలో ఉంచాలి.
 • కదలికలకు- పరదేవత: ( అమ్మవారు)
 • హారతి అగ్నిహోత్రమునకు సుబ్రహ్మణ్యేశ్వరుడు.
ఏ గృహము నందైనా వయోవృద్దులు, అనారోగ్యవంతులు ఉండి, వారికి ఇక ప్రాణము పోతుంది,

అని అనుకున్నప్పుడు ఇవి ఆ ఇంటి యందు తప్పక ఉండవలయును.
శాస్త్ర ప్రకరణము ప్రకారం.
 1. శివప్రసాదము:- పరమేశ్వరునికి అభిషేకము చేసిన విభూతి, ప్రత్యేకించి దక్షిణామూర్తికి అభిషేకించిన విభూతి. (పొడి విభూతి)
 2. విష్ణుప్రసాదము:- ఆరబెట్టి పొడిగా ఉన్నటువంటి తులసి.
 3. గంగ:- శుద్ద జలము (జల ప్రార్థన చేసిన జలము)
“గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదా సింధు కావేరీ జలే ఽ స్మిన్ సన్నిదింకురు||”
అని శ్లోకముతో శుద్దిగావింపబడిన శుద్ద జలము. ప్రాణోత్కరణము ముందు గోదానము శుభప్రదము


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

4, మార్చి 2018, ఆదివారం

ప్రతిదినం మాతృదినోత్సవమే కదా - మరి మాతృమూర్తికి ఒక రోజంటూ ఎందుకు ఈ తిక్క సన్నాసులు పెట్టారు? - Mother's Day ?

Mother's Day

ఇప్పుడు మీ ఈ శరీరంలో మీ తల్లి గర్భం నుంచి సంక్రమించింది దాదాపు లేనట్లే, అది చాలా వరకు బయటికి వెళ్లిపోయింది. మీరు మోస్తున్న మీ శరీర బరువంతా భూమాత నుండి గ్రహించినదే. ఇలా మాట్లాడి నేను మీకు జన్మనిచ్చిన తల్లిని కించపరచట్లేదు. మీరు ఆధ్యాత్మికాన్వేషకులు అయితే, ప్రతిదానిని సరైన దృష్టి కోణంతో అర్థం చేసుకోవడం అత్యంత అవసరం. మీరు కనుక ఏ విషయాన్నైనా మీ మనస్సు లేదా మీ మనోభావాలతో ఎక్కువ చేసి చూస్తే, మిమ్మల్ని మీరు తప్పుదోవ పట్టించుకుంటారు. తద్వారా చాలా విలువైన మీ సమయాన్ని, జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటారు.

ఉదాహరణకు, మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే దానిని పదింతలు ఎక్కువ చేసి చూపిస్తారు. ఎవరినైనా ద్వేషించినా అంతే చేస్తారు. అలాగే ఇష్టపడినా ఎక్కువ చేసి చూపిస్తారు. ఇష్టం లేకపోయినా అలాగే చేస్తారు. ఎక్కువ చేసి చూపడమంటే అర్థం, అప్రయత్నంగానో లేక ప్రయత్న పూర్వకంగానో మీరు వాస్తవం నుంచి ప్రక్కకు వెళుతున్నారు. వాస్తవం నుంచి ప్రక్కకు వెళ్ళడమంటే మీకు మీరే వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు. తనకు తానే వ్యతిరేకంగా పనిచేసుకుంటున్న వ్యక్తికి వేరే శత్రువులు అవసరం లేదు. దీనినే తనకు తానే సహాయం చేసుకోవడం అంటాం. మీ జీవితంలోని అందం ఇదే. అంటే మీరు సంపూర్ణ స్వయం సమృద్ధులు.
మనం ఇద్దరి పట్ల, అంటే మన తల్లి, భూమాతల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాము. ఇద్దరినీ అభినందిస్తాము. మనం ఇక్కడ ఉన్నాం అంటే అది ఆ ఇద్దరి తల్లుల చలువే. 
అందువల్ల మనం ఇద్దరి పట్ల, అంటే మన తల్లి, భూమాతల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాము. ఇద్దరినీ అభినందిస్తాము. మనం ఇక్కడ ఉన్నాం అంటే అది ఆ ఇద్దరి తల్లుల చలువే. మీరు ఈ రోజు మీ జీవితం ఇలా ఉండడానికి సహాయపడ్డ ప్రతిదానినీ, ప్రతివారినీ ప్రతిరోజు అభినందించాలి. మీ శ్రేయస్సుకి కావాల్సిన సర్వం సృష్టికర్త చూసుకుంటున్నాడు. ప్రతిక్షణం మీరు వేసే ప్రతి అడుగుకి భూమి బ్రద్దలై, మీ కాళ్ల కింది నుండి తొలిగిపోవటం లేదు. మీరు తీసుకునే ప్రతి శ్వాసకి, గాలి వాతవరణం నుంచి తప్పించుకుని మీకు శ్వాసకు అందకుండా పోవడం లేదు. ఇలా లక్షలాది మాతృత్వ, పితృత్వ శక్తులు నిరంతరం మీ జీవితంలో పనిచేస్తూనే ఉన్నాయి. మీరు వీటిని కావాలని అడగలేదు. అలాగే వాటి కొరకు ఏ మూల్యం చెల్లించడం లేదు. కాని సహజంగానే అవన్నీ మీ కోసం అలా ఏర్పరచబడ్డాయి.

మరి అటువంటప్పుడు ఈ ప్రకృతికి, మీ చుట్టూ ఉన్న వారు మీకు అందిస్తున్న ప్రతి దానికి మీరు తలవంచి కృతజ్ఞతలు తెలుపవలసిన అవసరం లేదా? మీరు కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే అడగకుండానే సహకారం అందిస్తున్న ఈ శక్తుల సహాయం లేకుండా మీరు మీ జీవితాన్ని కొనసాగించలేరు. అటువంటి వీటిని మీరు అభినందించకపోతున్నారంటే, మీరు వాటి పట్ల అసలు స్పృహతో లేరంటే, దానికి కారణం మీ బుర్రలో జరుగుతున్న ఏవో వ్యర్ధమైన వాటితో  మీరు బిజీగా ఉండటమే. ఇదంతా గమనించ లేకపోవడానికి అదొక్కటే కారణం. మీ గురించి మీరు చాలా ఎక్కువగా భావించడం వల్లే మీ బుర్రలో జరిగేది మీకు ముఖ్యం అనిపిస్తుంది.

నిశితంగా గమనించినట్లయితే ఈ సృష్టిలో ఏ ఒక్కటి కూడా మీకు అవసరం లేకుండా సృష్టించబడలేదు. ఆందుకే మిమ్మల్ని నేను ప్రతిదానిలోను ఒక తల్లిని చూడమంటున్నాను. ఈ రోజు వృక్షమాతృ దినోత్సవం, రేపు పర్వతమాతృ  దినోత్సవం, ఆ పై మీకు జన్మనిచ్చిన తల్లికి సంబంధించిన మాతృ దినోత్సవం. ఇలా ప్రత్యేకమైన రోజులను పెట్టింది ఎందుకంటే అవి లేకపోతే ప్రజలు తమ మాతృమూర్తులను అసలే గుర్తుతెచ్చుకోరు. సంస్కృతి అలా తయారైపోయింది. కాని కొంచెం స్పృహతో, మీకు మీరే ఈ విషయాలను గుర్తు చేసుకొని, “ఓఁ, ఈ చెట్లు నాకు ప్రాణవాయువును ఇస్తున్నాయి. ఇవి ప్రతి క్షణం నాకు సహాయపడుతున్నాయి”  అని తలచుకుంటే, ఇలా దీనిని మీరు ప్రతి విషయంలో, మీరు వేసే ప్రతి అడుగులో గుర్తించగలిగితే, మీరు చైతన్య మూర్తులవుతారు.  ....సద్గురు

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

26, జనవరి 2018, శుక్రవారం

స్మార్ట్ ఫోన్లతో పెరుగుతున్న సామాజిక రుగ్మతలు ! - Growing social disorders with smart phones

స్మార్ట్ ఫోన్లతో పెరుగుతున్న సామాజిక రుగ్మతలు ! - Growing social disorders with smart phones

స్మార్ట్ ఫోన్ల సమాజం
కాళ్ళు చేతులు, కళ్ళు చెవులు లేనివారున్నారు. సెల్ లేనివారు అరుదు. అది అమ్మనాన్నల, భార్యాభర్తల, సంతాన‌ స్థానాలను ఆక్రమించి భ్రష్టు పట్టించింది. మానవ శరీర బాహ్య భాగమైంది. చివరికి మనిషే మొబైల్ లో దూరాడు.     
స్మార్ట్ ఫోన్లలో సామాజిక మాధ్యమాలు: కంప్యూటర్ సౌకర్యాలుగల మొబైల్ ఫోన్ ను స్మార్ట్ ఫోన్ అంటారు. అది బహుళ ప్రయోజన నిస్తంత్రీ హస్త యంత్రం. నేటి విద్యార్థులు, యువత గంటకు 10 సార్లు సెల్ ఫోన్ చూస్తారని పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాపితంగా యువకులు సామాజిక మాధ్యమాలకు బానిసలు. స్మార్ట్ ఫోన్లతో సమాచార సామర్థ్యం, నైపుణ్యత పెరుగుతాయి. అరబ్ వసంత విప్లవం, నిర్భయ నిరసనలు, ప్రజాసంఘాల‌ ఆందోళనా కార్యక్రమాలలో సామాజిక మాధ్యమాలు ప్రధాన పాత్ర పోషించాయి. మాధ్యమాల ప్రభావాల అధ్యయనం, విశ్లేష‌ణల అమెరికన్ సంస్థ 'కామ్స్కోర్' 2017 నివేదికలో, పెద్దలు సగం మొబైల్ వీక్షణ‌ సమయాన్ని మొబైల్ యాప్స్ లో గడుపుతున్నారని పరిశోధనా నిర్దేశకుడు డేవిడ్ గిన్స్బర్గ్, శాస్త్రజ్ఞుడు మొయిర బర్క్ సూత్రీకరించారు. ఫేస్ బుక్ లో ప్రయోజనంలేని వాదసంవాదాలు, చర్చలు వ్యసనంగా మారాయి. రాత్రంతా ఈ రాచకార్యాలు కొనసాగుతాయి. సమయ సదుపయోగ జ్ఞానముండదు. ఈ వ్యసనం ఓపియం, హెరాయిన్ల కంటే ఎక్కువ మత్తుల్లో ముంచుతుంది. భ్రమల్లోపడి నిస్సార అంశాలపై అనుత్పాదక ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. మానవీయత మాయమవుతోంది. పిల్లలు కళ్ళ‌ ముందే చెడిపోతున్నారు. అసాంఘిక, అశ్లీల‌ మాధ్యమ సాధనాలను, అంతర్జాలాన్ని ఆవిష్కరించి జనాల మీదికి వదిలిన శాస్త్రజ్ఞులకు మానవత్వ, సమాజ వినాశనాలు పట్టవు. ధనసంపాదనే వీరి లక్ష్యం.   

స్మార్ట్ ఫోన్ల ప్రభావం:
మొబైల్ ఫోన్ల అతివినియోగంతో అలసట, తలనొప్పి, నిద్రలేమి, మతిమరుపు, చెవుల గింగుర్లు, నడుము, కీళ్ళ నొప్పులు వస్తాయి.
స్మార్ట్ ఫోన్లతో ఉద్యోగ, వ్యక్తిగత జీవితాలు కలగాపులగమయ్యాయి. ప్రైవేట్ కంపెనీలలో ఈ జీవితాల విభజన రేఖ ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలలో వ్యక్తిగత జీవితాలు ఉద్యోగసమయాలలో కొనసాగుతాయి. పనివేళల్లో, సమావేశసమయాల్లో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు ఫోన్లలో లీనమవుతున్నారు. ఉద్యోగుల సంభాషణ ముగిసేటప్పటికి ముందున్న కంప్యూటర్ ఆగిపోతుంది. మరలా వేళ్ళ గుర్తులేసి ఆన్ చెయ్యాలి. ఈ సహస్రాబ్ది తరం మనస్తత్వం బతకడానికి పనిచేయడం కాకుండా పనిచేయడానికి బతకడంగా మారింది. స్మార్ట్ ఫోన్లు ఉద్యోగులను తికమక పెట్టి పరధ్యానంలో ముంచి ఉత్పాదకతను తగ్గిస్తున్నాయని, అవి లేనప్పుడు ఉత్పాదకత 26% పెరిగిందని అమెరికా కాస్పర్స్కి ప్రయోగశాల రుజువుచేసింది. ఉత్తమ సేవలందించి సంస్థల ప్రతిష్ట నిలపడానికి స్మార్ట్ ఫోన్ వినియోగ విధానాన్ని అమలుచేయాలి. ఉద్యోగసమయాల్లో స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని నియంత్రించాలి.

మాధ్యమాలతో మానవ ప్రవర్తన:
 • సామాజిక మాధ్యమాలతో సమస్యాత్మక ప్రవర్తన, స్పందనాప్రతిస్పందనలు, అతి కాలయాపన‌ సామాజిక మాధ్యమాల వ్యసనం. 
 • సామాజిక మాధ్యమాలకూ రెండు పార్శ్వాలున్నాయి. 
 • కాలయాపన, పరధ్యానం, తప్పుడు అంచనాలు, అవాస్తవ ఆకాంక్షలు, సామాజిక ముసుగు, అణచివేత ఒకవైపు. 
 • ప్రపంచ అనుసంధానంతో జ్ఞానసముపార్జన, వ్యాపారాభివృద్ధి, నూతన సంబంధాలతో వ్యక్తిగత ప్రగతి, సమాజాభివృద్ధి అవకాశాలు మరోవైపు. 
 • కంప్యూటర్ల పని ఇప్పుడు స్మార్ట్ ఫోన్లతో సాధ్యం. 
 • ఫోన్ చూడకపోతే ఏదో కోల్పోతామన్న భయంతో దానికి బందీలై విధులను, ఉద్యోగాలను అశ్రద్ధచేస్తున్నారు. 
 • భార్యాబిడ్డలతో గడపరు. 
 • దాంపత్య జీవితానికీ దూరమవుతున్నారు. 
 • మనుషుల మనస్తత్వం, ప్రవర్తన, విద్య, సమాచార నైపుణ్యతలు, సామాజిక సంబంధాలు, అనుభవాలు దిగజారాయి. 
 • సామాజిక మార్పిడి సిద్దాంతం మందగించింది. 
 • సామాజిక అభిజ్ఞ సిద్దాంతం పతనమైంది. 
 • వృత్తి ప్రాధాన్యతలు మారాయి.
ఇలా పరస్పర ప్రభావాలకు గురయి కల్పితాలలో ఊహలలో కూరుకుపోయారు. ఇతరులు మనకంటే పరిపూర్ణ‌ జీవితాలు గడుపుతున్నారన్న భ్రమలో మెరుగైన జీవితాల వేటలో విలువైన సమయం వృధా అవుతున్నది. చాలామంది సామాజిక మాధ్యమాలలో ఇరుక్కొని ధన మాన ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ప్రపంచంలో ఎవరి జీవితమూ సంపూర్ణం కాదు. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క జీవనశైలిలో ఉంటుంది. మాధ్యమాలలో పొగడ్తలను చూసి తీవ్ర మోహాన్ని పెంచుకుంటారు. ఎవరో ఆదర్శంగా ఉన్నారని భ్రమించి అనుకరించి జీవితాలను కోల్పోతారు. పరులతో పోలిక పోటీలతో ఆతురత వత్తిడి మానసికాందోళన పెరుగుతాయి. మానసిక, ఆర్థిక, సామాజిక ఆరోగ్యాలు చెడి ఆత్మవిచ్ఛిత్తికి, ఆత్మహత్యలకు దారితీస్తుంది. ఫేస్ బుక్ లో లైకులు మన సామర్థ్యానికి కొలబద్ద కాదు. మా నాన్న చనిపోయాడన్న సమాచారాన్ని వందలమంది లైక్ చేశారు. దినచర్యను మార్చుకొని అవకాశాలను వినియోగించుకుంటూ ప్రణాళికాబద్దంగా పనిచేస్తూ పొదుపుగా ఖర్చుపెడుతూ మరింత కష్టపడటమే కలల సాకారానికి మార్గం. సామాజిక మాధ్యమాలు అహంకార సాధనాలు కారాదు. అందిన సమాచారాన్ని విశ్లేషించి సరైందని నిర్ధారించుకొని ఇతరులతో పంచుకొని సామూహిక, సామాజిక ప్రగతికి దోహద‌ పడాలి. పరుల ప్రాపకాన్ని పొందాలి. వైవిధ్యంగా ప్రవర్తించి ఎదిగినవారి జీవితాలను అధ్యయనం చేయాలి. సొంత ప్రతిమను నిర్మించుకోవాలి. సౌకర్యం చావుకు అసౌకర్యం సృజనాత్మకతకు దారితీస్తాయని ఫ్రెంచ్ రచయిత, కళాకారుడు జీన్ కాక్టో అన్నారు.       

పరిష్కారం: ఫ్రాంస్ పాఠశాలల్లో విద్యార్థులకు మాధ్యమ‌ పరికరాలను నిషేధించారు. మన దేశంలో కొన్ని పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో విద్యార్థినులకు మాత్రమే మొబైల్ ఫోన్లను నిషేధించారు. బహుళ‌ ప్రయోజన పరికర వినియోగాన్ని పెద్దలకు కొనసాగిస్తూ పిల్లలకు నిషేధించడం సమంజసమా? సాంకేతికత దురుపయోగాన్ని అరికట్టాలి కాని ఫోన్లను నిషేధించి ప్రయోజనం లేదు. హింస, అసభ్య దృశ్యాలు, అసత్య‌ ప్రచార ప్రకటనలకు భయాందోళనలు చెందినా పిల్లలకు నేర్చుకునే అవకాశాలు, క్రియాశీలత మెరుగుపడతాయని తల్లిదండ్రుల ఆశ. 16 ఏళ్ళ లోపు పిల్లలకు తల్లిదండ్రుల అనుమతితో సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండాలి.
8 ఏళ్ళ పిల్లలు యు ట్యూబ్ లో, వీడియో ఆటలలో మునుగుతున్నారు. పేదల పిల్లలే ఈ వ్యర్థవ్యాపకంలో నిష్ప్రయోజనంగా సమయాన్ని కోల్పోతున్నారని సర్వేలలో తేలింది. 
రెక్కాడితే గాని డొక్కాడని శ్రమజీవులకు పిల్లలపై శ్రద్ధ పెట్టగల సమయముండదు. ఈ వ్యసనం కొత్త‌ మత్తుకు రహదారి అని పేదలకు తెలియదు. అందువలన ప్రయోజనాలను పొందుతూనే పరధ్యానాలను నివారించే మాయజాలాన్ని కనుగొనాలి. స్మార్ట్ ఫోన్లలో మన సమయాన్ని హరిస్తున్న అనవసర వెబ్ సైట్లను నిషేధించవచ్చు. లేదా పరిమితం చేయవచ్చు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, ఫైర్ వాల్స్, కంటెంట్ ఫిల్టర్స్, బ్లాకింగ్ టూల్స్ ఉపయోగించి అనవసర, అపాయకర సమాచారాలను అరికట్టవచ్చు. అభ్యంతర అంతర్జాల అంశాలను మొబైల్ ఫోన్ల నుండి తొలగించవచ్చు. వీక్షణ సమయాన్ని పరిమితం చేసే యాప్ లను స్థాపించవచ్చు. అపాయకర యాప్ లు తెరుచుకోకుండా, అవసరమైన యాప్ లు మాత్రమే తెరుచుకునేటట్లు తాళాలు ఏర్పాటు చేయవచ్చు. నిర్దిష్ట సమయాలలోనే స్మార్ట్ ఫోన్లు పనిచేసేటట్లు చేయవచ్చు. మిగతా వేళల్లో కేవలం ఫోన్ పనిచేస్తుంది. మనసు నిషేధాల వైపు లాగుతుంది. ఇది పిల్లల విషయంలో మరింత తీవ్రతరం. ఈ రోజు కాకపోతే రేపు పిల్లలు ఫోన్లను వాడవలసినవారే. అనంతరీతుల్లో ప్రయోజనాలనందించే ఫోన్లను వారికి దూరం చేయరాదు. వాటి దురుపయోగాన్ని నివారించాలి. మొబైల్ ఫోన్లను సులభంగా సర్దవచ్చు. మెదళ్ళ‌ను దిద్ద‌లేము. అందుకే మానవోన్నతికి అనుగుణంగా పరికరాలను నియంత్రించాలి. అవరమైన యాప్ లనే ఆవిష్కరించాలి. మొబైల్ అడిగినప్పుడల్లా కాకుండా అవసరమొచ్చినప్పుడే ఫోన్ చూడాలి. సాంకేతికత, సమస్యలను పరిష్కరించాలి. కొత్త సమస్యలను సృష్టించరాదు. జీవితాలను సుఖమయం చేయాలి. సంక్లిష్టం చేయరాదు. మానవత్వాన్ని పెంచాలి. తుంచరాదు. ప్రజలను దగ్గరచేయాలి. దూరం చేయరాదు. మానవత్వీకరించాలి. దానవత్వీకరించరాదు.
సెల్ ఫోన్ రేడియేషన్ క్యాన్సర్ కారకమన‌డం అపోహ. కొన్నిఆరోగ్య సమస్యలు రావచ్చు. రేడియేషన్ ప్రభావం తగ్గించడానికి ఇయర్ ఫోన్లు వాడాలి. సిగ్నల్ బాగా ఉన్నప్పుడే ఫోన్ ఉపయోగించాలి. సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ విద్యుత్తు ఖర్చయి రేడియేషన్ పెరుగుతుంది. మొబైల్ ను గంటల తరబడి వాడరాదు. ఎక్కువసేపు మాట్లాడడానికి లాండ్ లైన్ వినియోగించాలి. వాహనాలు నడిపేటప్పుడు, విద్యుత్తు పరికరాల పరిసరాలలో మొబైల్ వాడరాదు. చిన్న పిల్లలు మొబైల్ వాడకపోవడమే మంచిది.
స్మార్ట్ ఫోన్ సామాజిక మార్పుకు సాధనం: ప్రస్తుతం మతవాదులు, మూఢవిశ్వాసకులు, అసత్య, అశాస్త్రీయ, పాలక వర్గాలు ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకోడానికి, రాజకీయ లబ్ధికి సామాజిక మాధ్యమాలను దురుపయోగం చేస్తున్నారు. హేతువాదులు, ప్రగతి కాముకులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజాసంఘాలు, ప్రత్యామ్నాయ పక్షాలు స్మార్ట్ ఫోన్లను విరివిగా ఉపయోగించాలి. ప్రజాప్రయోజనం సామాజిక మాధ్యమాల ధ్యేయం కావాలి. విజ్ఞానశాస్త్ర ఉపయోగంలో నిర్మాణ వినాశనాలకు మానవ ప్రవర్తనే మూలం. స్మార్ట్ ఫోన్లతో జీవితాలను నిర్మించుకుంటారో, నాశనం చేసుకుంటారో అంతా మనుషుల చేతుల్లోనే ఉంది.

______నవ తెలంగాణ

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

గురువు తన విద్యార్ధులకు ఏం చెప్పాలి ! - What does the teacher say to his students?

గురువు తన విద్యార్ధులకు ఏం చెప్పాలి ! - What does the teacher say to his students?

మానవులందరూ న్యాయవంతులూ, సచ్చీలురూ కాదని అతడు నేర్చుకోవాలి. అయితే స్వార్ధపర రాజకీయ నాయకులతో పాటు అంకితభావం గల నాయకులూ వున్నారని , దగాకోరులతోపాటు ధీరోదాత్తులైనవారూ వున్నారని అతనికి నేర్పించండి.

గురువు తన విద్యార్ధులకు నేర్పవలసిన సూత్రాలు:
 • శత్రువులున్నట్లే మిత్రులు కూడా వుంటారని చెప్పండి. 
 • కొంత సమయం పట్టినాసరే , దొరికిన ఐదు డాలర్లకంటే సంపాదించిన ఒక్క డాలరే విలువైనదని అతనికి తెలియచెప్పండి. 
 • పోగొట్టుకోవడాన్ని భరించగలగాలనీ , గెలుపుకు సంతోషించాలనీ నేర్పించండి. అసూయకు దూరంగా వుండడం, నిశ్శబ్దంగా సంతోషించడం నేర్పించండి. 
 • సోమరిపోతులు ఆశపోతులనే విషయం అతనికి తొందరగా తెలియజెప్పండి. 
 • వీలుంటే పుస్తకాలలోని అద్భుతాలను అతనికి వివరించండి. అయితే ఆకాశంలో పక్షులు ఎగరగలగడం, మండుటెండలో తేనెటీగలు సంచరించడం, పచ్చని కొండచరియల్లో పువ్వులు వికసించడం తాలూకు రహస్యాలు ఛేదించడానికి అతనికి తగిన సమయం ఇవ్వండి.
 • మోసం చెయ్యడం కంటే విఫలమవడంలోనే గౌరవముందని మీ బడిలో నేర్పండి. 
 • ప్రతివొక్కరూ తప్పు అని చెప్పినాసరే తన స్వంత ఆలోచనలమీద విశ్వాసముంచాలని అతనికి తెలియజేయండి. 
 • ఉన్నతమైన వ్యక్తులతో ఉన్నతంగా మెలగాలనీ, దుండగులతో కఠినంగా వ్యవహరించాలనీ నేర్పించండి. 
 • అందరూ గుంపుగా చేరినప్పుడు అతను కూడా వాళ్ళలో కలసిపోకుండా వుండగలిగే శక్తిని సంపాదించుకోమనండి. 
 • ఎవరు చెప్పినా వినాలనీ, అయితే వాస్తవ దృక్పథంతో పరిశీలించిన తరువాత మాత్రమే అంగీకరించాలని నేర్పించండి. 
 • మీకు వీలయితే విచారంలో ఉన్నప్పుడు కూడా నవ్వుతూ వుండగలగడం నేర్పించండి. 
 • అయితే కన్నీళ్ళు పెట్టుకోవడానికి సిగ్గుపడ నక్కరలేదని చెప్పండి. 
 • తప్పులెన్నేవారిని లెక్కచేయకూడదనీ, తియ్యటి మాటలు చెప్పేవారితో జాగ్రత్తగా వుండాలనీ తెలియ జెప్పండి. 
 • శరీర దారుఢ్యాన్నీ, మేధాశక్తిని ఎక్కువ వెల ఇవ్వగలిగిన వారికే అమ్ముకోవాలనీ, అయితే హృదయానికీ, ఆత్మకూ మాత్రం ఎన్నటికీ వెలకట్టగూడదనీ అతనికి తెలియజేయండి. 
 • అల్లరి మూకల కేకలు చెవినిపెట్టకుండా , తన ఆలోచన సరియైనదైతే నిలబడి పోరాడాలని నేర్పించండి. 
 • సున్నితంగా బోధించండి గానీ గారాబం చెయ్యవద్దు. కాల్చినప్పుడేకదా ఉక్కు గట్టిపడేది. అసహనంగా వుండడంలో గల సాహసాన్ని గుర్తించమనండి. 
 • ధైర్యశీలికి కావలసిన సహనాన్ని అలవరచుకోమనండి. తన మీద తనకు అచంచలమైన విశ్వాసం కలిగివుండాలని బోధించండి. 
 • అప్పుడే అతడు మానవత్వంపై ఎన్నటికీ సడలిపోని విశ్వాసాన్ని నిలుపుకోగలడు.

10, జనవరి 2018, బుధవారం

ఋణానుబంధం అంటే అర్ధమేంటో మీకు తెలుసా ! - Runanubhandam

ఋణానుబంధం అంటే అర్ధమేంటో మీకు తెలుసా ! - Runanubhandam
ఎన్నటికీ వీడనిది ఋణానుబంధం

"పువ్వు తొడిమనుండి విడిపోతుంది, పండు చెట్టునుండి రాలిపోతుంది, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు’ అని మహాభారతం చెబుతోంది. పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో కృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయావేదనను ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది.

శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోద దుఃఖసాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదను చూసి నందుడు కూడా ’కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం’ అని కన్నీరుమున్నీరు కాసాగాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్తావేదనతో యశోదమ్మను తలచుకుంటూ ఉద్ధవునితో, "ఉద్ధవా! నాకన్నయ్య భోజనం చేస్తే గానీ నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను’ అని మొండి పట్టుదలతో కూర్చొనే నాతల్లి యశోదమ్మను నేను మరువలేకున్నాను" అని చెబుతూ కృష్ణుడు విలపించసాగాడు.

కంసుని చెరాలనుంచి దేవకీ వసుదేవులను విడిపించిన తరువాత బలరామకృష్ణులు వారికి పాదాభివందనాలు చేసి, వారి పట్ల కృతజ్ఞతాభావాన్ని ఇలా వ్యక్తపరిచారు:
మాకు నిన్నాళ్ళు లేదయ్యె మరియు వినుడు
నిఖిల పురుషార్థ హేతువై నెగడుచున్న
మేనికెవ్వార లాఢ్యులు మీరు కారె
యా ఋణము దీర్ప నూరేండ్లకైన జనదు (దశమస్కంధం - పోతన భాగవతం).
’అమ్మా! నాన్నా! మేము ఇన్నాళ్ళూ మీ ప్రేమ, ఆప్యాయతలను పొందే అదృష్టానికి నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్నిప్రసాదించిన వారు మీరు. అలాంటి దుర్లభమైన మానవదేహాన్ని ఇచ్చిన మీ ఋణం తీర్చడానికి మాకు నూరేళ్ళైనా సాధ్యం ాదు.’

బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లితండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. నిరంతరం తల్లిదండ్రులు మన చెంత ఉండడం వల్ల వారి విలువ ఏమిటో మనం గుర్తించలేకపోతున్నాం. అందువల్ల వారిపట్ల నిర్లక్ష్య వైఖరినీ, నిర్దాక్షిణ్యాన్నీ చూపుతున్నాం. తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్షదైవాలనీ, వారి ఋణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదనీ నిరూపించిన వినాయకుడు, శ్రీకృష్ణుడి జీవితాలు మనకు ఆదర్శం కావాలి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

25, నవంబర్ 2017, శనివారం

పని-జీవితానికి మధ్య సాధించడం ఎలా ? - Achieve Work-Life

achieve-work-life-pani-jivitam

మనమందరం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది. అదేమిటంటే పనికి సంబంధించిన వివిధ అంశాల గురించి మన కుటుంబంతో సంభాషించడం. ఇలా కుటుంబంతో పని గురించి చర్చించడం పక్కన పెట్టాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు, కానీ నేను మాత్రం అలా చేయడం తప్పంటాను. పని గురించి కుటుంబంతో చర్చించడం ఒక విభిన్నమైన నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. మీ వ్యాపారాన్ని, పనిని బయటనుండీ గమనిస్తున్న మీరు నమ్మే వ్యక్తుల నుండి అందే సలహాలు ఏ రకంగా ఉంటాయో చెప్పలేం. వాళ్ళెవరో ఏదో వ్యాఖ్యానాలు చేసే బయటి వారు కాదు. వారు మీరు నమ్మే వ్యక్తులు, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు, మీరు గెలవాలని కోరుకునే వ్యక్తులు. వాళ్ళు అందించే సూచనలు చాలా విలువైనవి కావచ్చు. అది మీ భార్య కావచ్చు లేదా మీ ఐదేళ్ళ పిల్లాడు కావచ్చు, చెప్పలేం.
ఉన్నది జీవితం, జీవితం, జీవితం, అంతే! జీవితంలోని వివిధ అంశాలతో మనం ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి, అంతే!
వారంలో ఐదు రోజులు పనిచేసి, రెండు రోజులు జీవించడం చాలా తప్పని నేనకుంటాను. అది దారుణమైన రీతిలో జీవించడమవుతుంది. మీరు ఏడు రోజులూ జీవించాలి

మీరు ఏదైనా కొత్తగా సృష్టిస్తూ ఉన్నట్లైతే, పని(వృత్తి)కి సంబంధించిన సంభాషణలు ఆసక్తికరంగా ఎందుకుండవు? కుటుంబం కూడా అందులో పాల్గొనవచ్చు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీరు ప్రత్యక్షంగా పని చేస్తుండకపోవచ్చు, కానీ మీరు రేపటికి లేదా భవిష్యత్తుకి అవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ, వాటిని విస్తృతపరుస్తూ ఉండవచ్చు. కాబట్టి, పని-జీవితం అనే విభజన ఉండకూడదని నేనంటాను.
వారంలో ఐదు రోజులు పనిచేసి, రెండు రోజులు జీవించడం చాలా తప్పని నేనకుంటాను. అది దారుణమైన రీతిలో జీవించడమవుతుంది. మీరు ఏడు రోజులూ జీవించాలి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

16, నవంబర్ 2017, గురువారం

స్త్రీ - తల్లి, భార్య, ఎవరు ఎక్కడున్నారు !

stri-thalli-bharya


స్త్రీ పాత్ర - తల్లి, భార్య, ఎవరు ఎక్కడున్నారు:
“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః
యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః ”
మనుస్మృతి
ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను పరదేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వ సంపదలూ ఉండడమేకాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుంది.

మనము అమ్మవారి ఆలయానికి వెళతాము అక్కడ అమ్మవారికి పడీ పడీ దండాలు పెడతాము. అప్పుడు అమ్మవారు ఏమనుకుంటారో తెలుసా? నీవు నీవు చేయు ఈ పూజ, ఈ సేవ, ఈ దండాలు నేను కాక ఎవరో నిన్ను చూడాలని చూచి వారు నిన్ను మెచ్చుకోవాలని, లేదా ఏ బంధు ప్రీతి కొరకో లేదా బుధ జన ప్రీతి కొరకో అంతే కానీ నీకొరకు నాకొరకు కాదు. బంధు జనము ప్రీతి చెందుతారేమో కానీ, బుధజనము, నీగురించి తెలిసిన వారు, ధర్మమును ఆశ్రయించినవారు, ధర్మపరులు హర్షించరు. ఎందుకంటే అమ్మవారు అంటారు ఇక్కడకు వచ్చి, పడి పడి దండాలు పెడుతున్నావు. ఇక్కడ నేను సమిష్టి రూపంలో ఉన్నాను. అక్కడ మీ గృహములో వ్యష్ఠి రూపంలో ఉన్నాను. నీకు తల్లిగా, నీకు భార్యగా, నీకు చెల్లిలిగా, నీకు అక్కగా, నీకు ఒక వదినగా, మరదలుగానే కాక, ప్రతి స్త్రీ మూర్తిలోనూ వ్యష్ఠి రూపములో ఉన్నాను, కాబట్టి ముందు అక్కడ నుండి మొదలుపెట్టరా, నీ సేవ, నీ పూజ. అక్కడ అమ్మకు పట్టెడు అన్నం పెట్టవు. అమ్మా నీకు ఆరోగ్యం ఎలా వుంది అని అడిగిన పాపాన పోవు.
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కులధర్మపత్నీ. అని కదా అన్నారు ? మరి అలాంటి ధర్మపత్ని, నీకు, మీ వంశానికి, వంశోద్ధారకుణ్ణి ప్రసాదించి,నిన్ను, నీ ముందు తరతరాలవారినీ, పున్నామనరకము నుండి తప్పించడానికి తన ప్రాణాలనే ఫణముగా పెట్టి యోగ్యమైన సంతానాన్నిచ్చి, మిమ్ములను, మీ వంశన్నీ ఉద్ధరింపచేసే స్త్రీ మూర్తి, నీ సహధర్మచారిణిని, కట్నం తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు.
ఇక్కడ ఒకవిషయం ఎవరైనా సరే మనస్పూర్తిగా ఆలోచించాలి మనకు ఆరోగ్యం బాగా లేక
stri-thalli-bharya
పడకవేస్తే, ఆమె బాధపడుతుంది, ఆక్రోశిస్తుంది, అల్లాడి పోతుంది, తల్లడిల్లిపోతుంది, వివిలలాడుతుంది మన అలనా పాలనా చూచి,సమయానికి మందులు, మాత్రలు, సరియైన ఆహారం ఇవ్వడం, మనకు సేవలు చేయడం, కన్నతల్లి లాగా, ఎక్కువగా మనలను సేవించి మనకోసం, మనకుటుంబముకోసం, అన్నీ తానై పాటుపడే సహనమూర్తి, త్యాగశాలి ధ్ర్మపత్ని. అందుకే కదా కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, ఇత్యాది రూపాలుగా మన పూర్వులు ధర్మపత్నిని గౌరవించి స్త్రీ మూర్తికి అగ్ర తాంబూలం ఇచ్చారు. మరి అలా తల్లిడిల్లినపుడు, బాధతో ఆక్రోశించినపుడు, విలవిలలాడేటప్పుడు, రాత్రంతా నీ మంచము ప్రక్కన కుర్చీలో కూర్చొని కునికిపాట్లు పడుతూ సేవలు చేస్తూ నీకోసం అహోరాత్రము శ్రమిస్తుంది.

మనము బ్రతికి (ఆరోగ్యం కుదుటబడి) బట్టకడితే ఈ జనులు, బుధజనులు ఏమంటారో తెలుసా “ఆ తల్లి మాంగల్యం గట్టిది, ఆతల్లి పూజాఫలము ఆయనకు పునర్జన్మ నిచ్చింది” అంటారే కానీ నీ గొప్పనో లేక నీ అదృష్టమనో అనరు. మన ఆకలిని ఎరిగి తనకు లేకపోయినా తన అమృత హస్తాలతో కొసరి కొసరి వడ్డించి అన్నము పెట్టే నీ సహధర్మచారిణి (భార్య) లో భోజన సమయములో అమ్మ కనిపించడములేదా? అమ్మతనాన్ని చూడలేవా? దాసిగా సేవలు చేయు నపుడు, మన కోపాలను, దుర్భాషలను, రాక్షసప్రవృత్తిని ఆ స్త్రీమూర్తి భరించు నపుడు ఆమె క్షమా గుణంలో భూమాతను దర్శించలేని నీవు, కట్నం తేలేదని లేదా, మీ మామగారు నీ గొంతెమ్మ కోరికలను తీర్చలేదని, నరక యాతనలకు గురిచేయు ధూర్తుడా, నీ వా ఇక్కడకి వచ్చి పడి పడి దండాలు పెడుచున్నావు. ఎవరికి కావాలి ఇలాంటి ఈ నటనల పూజ. ఇక్కడ ఆలయంలో అమ్మవారికి పూజచేస్తూ ఒక సెకను నీ పంచేంద్రియాలను అమ్మవారి పాదముల చెంత ఆవిష్కరించలేవు, పూజ చేస్తూ కూడా పక్కన ఓ అమ్మాయి కనబడ్డా, ఒక స్త్రీమూర్తి కనబడ్డా ఇక్కడే నీ బుద్ధి, మనము వెర్రివేషాలు వేస్తుంటే చూస్తూ అన్నందిస్తావు. పరస్త్రీలో శయనేషు రంభే తప్ప భోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు.పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవత ను, తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా! అని అమ్మవారు ఛీద రించుకుంటుంది తెలుసా?

ఇవే కాక మన పిల్లలకు తల్లి దగ్గర, నాన్నమ్మ, అమ్మమ్మ దగ్గర ఉండే చనువు, ప్రేమ, విశ్వాసము అపారము అనిర్వచనీ యము. ప్రతీది బిడ్డ తల్లితో చర్చిస్తుంది. తల్లిని అడుగుతుంది. మరియు తల్లులు తన బిడ్డల నడవడి, చేసే పనుల పట్ల తనకు తెలియకుండానే చాలా అప్రమత్తతతో ఉంటారు. ఎందుకంటే అది తన రక్తం, పేగుబంధం కాబట్టి బిడ్డలు ఎక్కడ వున్నాతల్లి ఆ బిడ్డను వేయి కళ్ళతో వారి ప్రతి అలోచనను, ప్రతి అడుగును గమనిస్తూ ఉంటుంది.

stri-thalli-bharya

కావున కేవలం తల్లి కే (ఆ పరదేవతకే) అది సాధ్యం. బిడ్డలు చేసిన పనులను, ఆలోచ నలను, వారి అసంతృప్తు లను, మంచి చెడులు ఎప్పటి కప్పుడు వివరించి, ధర్మాధర్మములను వివరించి, బిడ్డలను తీర్చిదిద్ద కలిగే శక్తి ఒక్క తల్లికి మాత్రమే ఉంది. తండ్రికి కాదు. వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి వారిని సమాధానపరచ గలదు తల్లి. అందుకే వేద వేదాంగములలో మొదటి నమస్కారము తల్లికే “మాతృదేవోభవ” అన్నారు. ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించింది కావున ఈ సమాజము ధర్మమార్గమునకు, న్యాయ మార్గమునకు మన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శముగా పూజనీయ మైనది గౌరవప్రదమైనది. ప్రతి తల్లి బాధ్యతలు స్వీకరించి తన బిడ్డలను ధర్మమార్గంలో నడపగలిగితే ఈ సమాజము ధర్మమార్గమునకు, న్యాయ మార్గ మునకు మన భారతదేశము ఇతర దేశములకు భావితరాలకు కూడా ఆదర్శము కాగలదు.

కాబట్టి ఈ సమాజమును మార్చగలిగే శక్తి ఒక్క స్త్ర్రీమూర్తికి మాత్రమే ఉంది. ఇందు పురుష పాత్ర ధర్మ జీవనం, ధర్మ సంపాదన, ధర్మ వర్తనము (స్త్రీ అయిన పురుషుడైన) కలిగి మన పిల్లలకు మనమే తొలి గురువులు కాబట్టి,మన పిల్లలు మనలను ఆదర్శంగా తీసుకొని, వారి భావి జీవితాన్ని వారి చుట్టు ప్రక్కల సమాజానికి, ఆదర్శపాత్రులైన నాడు, మనం మన బిడ్డలను చూచి, మనము సగర్వంగా గర్వపడతాము. “నేటి బాలలే రేపటి పౌరులు” కదా మరి ఆలోచించండి గృహస్తాశ్రమము (సంసారజీవనము) లో స్త్రీ పాత్ర ఎంతటిదో. అలాంటి స్త్రీ మూర్తిలో శయనేషు రంభే తప్పభోజ్యేషు మాతా, కార్యేషు దాసీ, క్షమయా ధరిత్రీ, కనపడదు. పర దేవత అసలు కనపడదు. పరస్త్రీలో పర దేవతను,తల్లిని దర్శించలేని, నీవు, నీ పూజ, నీవు చేసే ఈ పడి పడి దండాలు ఎవరికి కావాలిరా? ధూర్తుడా! విశ్వాస ఘాతకూడా!అని అమ్మవారు ఛీద రించుకుంటుంది తెలుసా?

తన ధర్మపత్నిలో పర దేవతను చూచిన మహానుభావులు పుట్టిన దేశంమనది, అంతగొప్ప సంస్కృతి మనది.

ఉదా:- శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణ పరమహంసగారు తన ధర్మపత్నిలో పరదేవతను చూచిన మహాపురుషుడు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

15, నవంబర్ 2017, బుధవారం

మనసు, బుద్ధి ఈ రెండింటిలో దేనిని ఏది సంస్కరించాలి?

manasu-bhuddi-mind-sou

మనసు బుద్ధి దేనిని ఏది సంస్కరించాలి?:

భగవంతుడు కేవలం శరీరమును మాత్రమే సృజింపడు. దానితో పాటు ఒక మనస్సును కూడా ఇస్తాడు. ఈ మనస్సు ఉందే, అది తోకలేని కోతి. ఈ మనస్సు ఎప్పుడూ సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. ఇందులో స్పందన వేరు, కదలిక వేరు, కార్యము వేరు.

ఉదా: ఒక బావిలో కానీ, ఒక కొలనులో కానీ, నీరు చాలా ప్రశాంతముగా ఎలాంటి స్పందన, కదలిక లేకుండా ఉంటాయి. అందులో మనము ఒక రాయి వేస్తే, ఆ రాయి వెళ్ళి నీళ్ళ పై పడినపుడు, ఆ నీళ్ళలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల వలన స్పందన కలుగుతుంధి. ఆ స్పందన వలన సంకల్పము జరుగుతుంది. ఎప్పుడూ సంకల్పము జరిగిందో అది కార్యరూపము దాల్చుతుంది. కార్యమైతుంది.

మనసు నిజంగా చిన్నపిల్లవాడు లాంటిది. పిల్లవాడికి, నీటికి-మూత్రమునకు తేడా తెలియదు. అన్నానికి-మలమునకు తేడా తెలియదు. అగ్గికి-చల్లదనమునకు తేడా తెలియదు. మనస్సు కూడా అంతే.
 1. సంకల్పము - పట్టుకోవడం
 2. వికల్పము - విడిచిపెట్టడం
 3. మనస్సు - చిన్నపిల్లవాడు
 4. బుద్ధి - అమ్మ
ఉదా:- చిన్న బిడ్డ తెలియకుండా మట్టిలేదా, మలము తింటుంటాడు. అప్పుడు అమ్మ చూచి బిడ్డను ఒక దెబ్బ కొట్టి దూరంగా తీసుకెళ్ళి, బిడ్డ చేతులు కాళ్ళు శరీరం అంతా శుభ్రంగా కడిగి, ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చోబెట్టి, తర్వాత బిడ్డ ఉన్నచోట శుభ్రం చేసి తర్వాత వస్తుంది. ఔనా? ఆలోచించండి? ఇక్కడ ఒక విషయం గమనించండి. ఆ బిడ్డను మరలా మట్టిగాని మలము తినాలని అనిపించినా దొంగతనంగా తింటాడు ఔనా? ఎందుకు? అమ్మ చూస్తే కొడుతుంది అని. బుద్ధిమంతుడైతే ఇక దానిని ముట్టుకోడు. దాని జోలికి వెళ్ళడు. ఔనా? కాదా? కాబట్టి బుద్ధి (అమ్మ) ఎప్పుడూ మనసు(బిడ్డ) పట్ల సర్వావస్తల యందు జాగృతమై బలంగా ఉండి మనస్సును (బిడ్డను) గమనిస్తూ ఉండాలి. లేదంటే మనస్సును అలా వదిలేస్తే బిడ్డ తినకూడని వన్నీ తిని అనారోగ్యం పాలై చివరకు బిడ్డ దక్కకుండా పోతుంది. ఔనా ఆలోచించండి.

కాబట్టి బుద్ధి బాగా పనిచేస్తే మనస్సు సంస్కరింపబడుతుంది. ఆ మనసు సంస్కరింపబడితే మనసు బుద్ధి రెండూ కలసి మంచి పనులు చేస్తాయి. అందుకే ఒక కవిగారన్నారు.
“గొరుగుచుందురు జుత్తు కొన్నివందల సార్లు
దాని పాపమేమె కానరాదు
అఖిల పాపములకు నిలయమైన
మనసు గొరగడేమి మానవుండు”
చూశారా మనసు పరిస్థితి.

మనసు ముందుకెళ్ళడానికి సాధన అవసరంలేదు. ముందుకు అంటే అనవసర ఆలోచనలకు అరిషడ్వర్గావలంబనకు సాధన సహాయము ఆసరా అవసరం లేదు.

ఉదా:- చిన్న బిడ్డను ఏదైనా అడిగితే “ఆ ఇది నాది” అంటాడు. ఎవరునేర్పారు. అలాగే మనస్సును వెనుకకు సత్యశోధనకు లాగడానికి సాధన కావలయును. హంస అంటే నీటిని, పాలను వేరు చేయగలదు. అవునా?ఎవరైనా హంసను చూచిన దాఖలాలు, చూచినట్లు సాక్ష్యం ఉందా? లేదు. అందుకే పరమహంస అంటే పరమాత్మను,జగత్తును విడకొట్టి సత్యాసత్యములను తెలియజేయునది. ఇది గ్రహిస్తే మనము ఏమిటో, మనకు మన పరిస్థితి తెలుస్తుంది. పూజ ఎందుకో భక్తి ఎందుకో మనకే అర్థమవుతుంది. మనము ఏమి చేయాలి అనే విషయం మనకే తెలుస్తుంది.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

5, సెప్టెంబర్ 2017, మంగళవారం

ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ ఆహారం వృధా ~ మరోవైపు ఆకలి కేకలు? - Wasting food

ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ ఆహారం వృధా ~ మరోవైపు ఆకలి కేకలు? - Wasting food


అన్నం పరబ్రహ్మస్వరూపం:  ఇది మన పెద్దలు చెప్పే మాట, అన్నమే కాదు తినే ఏ పదార్థమైనా పరబ్రహ్మ స్వరూపమే.
 • ఒకప్పుడు ఆహార పదార్థాలను పెద్దగ వృధా చేసేవారు కాదు.
 • రాత్రి మిగిలిన అన్నాన్ని కూడా ఎవరికైనా ఇవ్వడమో లేదా తెల్లవారి తినడమో చేసేవారు. కాని ఇప్పుడు అలా లేదు.
 • ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఒక ఫంక్షన్లో వృధా ఐన ఆహారాన్ని చూసిన
 • తర్వాత రాయాలనిపించింది.
 • తిన్న దానికంటే వృధా చేసిందే ఎక్కువ అనిపించింది.
 • అందరూ ఆకలి కంటే రుచికే ప్రాధాన్యతనిస్తూ ఎక్కువగా పారవేసారు.
 • ఇది ఫంక్షన్ జరిగినప్పుడు లోపల సీన్ బయట ఈ వృధా కోసం కొంతమంది కొట్టుకుంటున్నారు, తినడానికి.
రెండింటికి మధ్య కేవలం ఒక్క గోడ మాత్రమే అడ్డు.....

ప్రపంచంలోని ఆహారం మొత్తంలో దాదాపు 35శాతం పండించిన చోటు నుండి ఇంటికి చేరకముందే  వృధా అవుతోందని లెక్కలు చెప్తున్నాయి, ఇక మన దేశంలో మాత్రం మన అవసరానికి మించి రెండితల ధాన్యాలు ఉన్నాయని అంచనా. కాని ప్రతి రోజు ఖాళీ కడుపుతో నిద్రపోతున్న వాళ్ళు కోట్లల్లో ఉంటున్నారు.

వృధా అవుతున్న ఆహారాన్ని సేకరించి అవసరం ఉన్న వారికి అందిస్తున్న తమిళనాడులోని "నో ఫుడ్ నో వేస్ట్" లాంటి  సంస్థలు ఉన్నప్పటికీ , వృధా అవుతున్న దానిలో కేవలం ఒక్క శాతాని మాత్రమే వినియోగించగలుగుతున్నాయి.

రోజు ఒక పిడికెడు అన్నాన్ని వృధా చేస్తే అది ఒక సంవత్సరంలో ఒక బస్తా బియ్యానికి సమానం.
వృధాని అరికట్టండి. అవసరం ఉన్నంతే వండుకోండి, కొనుక్కోండి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

2, సెప్టెంబర్ 2017, శనివారం

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలివేస్తున్నారు ఎందుకు ? - Why parents are being dropped in the caregiver?


తమ తల్లిదండ్రులపై ప్రేమ లేదనుకుంటే  అది పొరపాటే వారి పితృ భక్తిని శంకించాల్సిన అవసరం లేదేమో కాని తల్లితండ్రులను సరిగ్గా చూసుకొకపొవడం, ఒకే ఊరి లొ ఉండి వృద్ధాశ్రమాలలొ పెట్టడం తప్పు.

ఇటువంటి వారిని నిరుత్సాహపరిచి శిక్షించే  విధంగా చట్టాలు వస్తే బాగుంటుంది. ఇప్పటికే కొన్ని కోర్టులు వేరుకాపురం గురించి తీర్పులివ్వడం మంచి పరిణామం.

కని  పెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం మంచిది కాదని కోర్టులు మందలించటం మన జీవన విధానంలో అన్ని  బంధాలను ఏ విధంగా దూరం చేసుకుంటున్నామో
గుర్తు చేస్తోంది.

మాతృ దేవో భవ పితృ దేవో భవ అన్న వేధ మంత్రాన్ని వల్లే వేసిన నోటితోనే బయటికెల్లిపోమ్మని ఎలా అనగలుగుతున్నారు.

కడుపు కట్టుకొని వారు సంపాదించిన ఆస్తులను మాత్రం అక్కున చేర్చుకొని అనాథలుగా వారిని వ్రుద్దశ్రమాల్లో చేర్చేముందు మీకూ అదే గతి అత్యంత వేగంగా వచ్చేస్తుందని గమనించండి
మీక్కూడా చావుకు ముందు వచ్చే చివరి మజిలీఅదే కాగలదు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

మనకు ఇష్టమైన వారు మరణిస్తే, ఆ బాధను తట్టుకోవడం ఎలా? - How can we cope with the pain when our loved ones die?

మనకు ఇష్టమైన వారు మరణిస్తే, ఆ బాధను తట్టుకోవడం ఎలా? - How can we cope with the pain when our loved ones die?
ప్రతిరోజూ ఈ ప్రపంచంలో ఎంతోమంది  మరణిస్తున్నారు. ప్రతి నిమిషం రెండు వందలమంది మరణిస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా ‘వీళ్ళంతా ఎందుకు మరణిస్తున్నారు’ – అని ఆలోచించారా..? మీరు ఎప్పుడైనా ఈ జీవితానికి మూలం ఎక్కడుంది – అని ఆలోచించారా..? కానీ ఇప్పుడు మీ నాన్నగారు మరణించారు. ఒకవేళ ఆయనే మీ నాన్నగారు – అన్న విషయం మీకు తెలియకపోతే, ఆ మనిషి మరణిస్తున్నా, మీరేమీ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మరణించినది మీ నాన్నగారు. అందుకనే ఇదంతా..! నిజానికి మీ ఆతృత మరొక మానవుడు మరణించడం గురించి కానీ, మరొక జీవం గురించిగానీ కాదు. మీ ఆతృత అంతా మీ గురించే..! మీ ఆందోళన ఈ విధంగా ఉన్నప్పుడు, ఇది వక్రీకరించబడిన ఆందోళన. అంటే, మీరు జీవితాన్ని ఒక వక్రీకరించిన కోణంలో చూస్తున్నారు. మీరు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడనప్పుడు, బాధ అన్నది తప్పని సరి..! ఇప్పుడు, మీ నాన్నగారు వెళ్ళిపోయారు.   మనం ప్రేమించినవాళ్ళు, మనతో ఎంత కాలం వీలైతే అంత కాలం ఉండడానికి అన్నీ చేస్తాం. కానీ, ఎప్పటికైనా వారు వెళ్లిపోవలసిందే…కదూ..?

నేను మీకొక కథ చెబుతాను. ఒకసారి మీలాంటి ఒకతను, క్రొత్త ఇంటిని కట్టుకున్నారు. మన సాంప్రదాయంలో ఒక సాధువుని కానీ, సన్యాసినికానీ ఇంటికి పిలిచి వారి ఆశీర్వచనం తీసుకుంటారు. అందుకని ఒక యోగిని వారు ఇంటికి తీసుకునివచ్చారు. వారందరూ ఆయనని సాదరంగా ఆహ్వానించారు. ఒక రాజులాగా చూసుకున్నారు. బాగా భోజనం పెట్టారు. ఆ తరువాత  ”మీరు మమ్మల్ని, మా ఇంటిని ఆశీర్వదించండి” అన్నాడు. అప్పుడు ఆ యోగి “సరే..!  ముందు మీ నాన్నగారు చనిపోవాలి. ఆ తర్వాత మీరు.. ఆ తరువాత మీ పిల్లలు…”అన్నారు. దీనికి వారికి ఎంతో కోపం వచ్చింది.
“మూర్ఖుడా, మిమ్మల్ని ఇంటికి పిలుచుకువచ్చి ఒక రాజులాగా మిమ్మల్ని చూసుకుని మీకు భోజనం పెట్టాం,  బహుమతులిచ్చాం..! ఆశీర్వదించమని అడిగితే, మీరు మా నాన్నగారు చనిపోవాలి, తరువాత నేను చనిపోవాలి, తరువాత నా పిల్లలు చనిపోవాలి అంటారా..?” అన్నాడు. 
అతనికి ఒక భయం కూడా ఉంది – యోగి అన్నారు కాబట్టి అదే విధంగా జరుగుతుందేమోనని ..! దానికి ఆ యోగి, “నేను చెప్పినదాంట్లో తప్పేముంది..? ముందర మీ నాన్నగారు.. తరువాత మీరు.. తరువాత మీ పిల్లలు. ఇది మంచిదే కదా..?ఒకవేళ మీ నాన్నగారికంటే ముందర,  మీరు మరణిస్తే మంచిదా..? లేక మీ పిల్లలు మీకంటే ముందర, మరణిస్తే – అది మంచిదా..? మీ నాన్నగారు ముందు మరణించాలి.. తరువాత మీరు.. తరువాత మీ పిల్లలు. ఇది సహజమైన జీవన క్రమమే కదా..? ఈ విధంగానే కదా,  జీవితంలో జరగాలి… ఔనా..? అందుకే అలా చెప్పాను” అన్నాడు.

మీరు జీవితంతో ఒకటిగా లేరు కాబట్టి మీరు మీ నాన్నగారు మరణించకూడదు అనుకుంటున్నారు. సరే..! మీ నాన్నగారికి బదులు మీరు మరణించారు అనుకోండి, అప్పుడు పరిస్థితులు ఏమైనా మెరుగ్గా ఉంటాయా..? లేదా మీ పిల్లలు ముందర మరణించారనుకోండి అప్పుడేమైనా మెరుగ్గా ఉంటాయా..? ఉండవు కదా..? ఇది ఈ విధంగానే జరగాలి. అవును.. మనం ప్రేమించినవాళ్లని, జాగ్రత్తగా అట్టిపెట్టుకోవడానికి, శాయశక్తులా ప్రయత్నించాలి..కానీ, వారు మనల్ని వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు, మనం హుందాగా ఉండాలి. అలాగే మనం వెళ్లిపోవలసిన సమయం వచ్చినప్పుడు కూడా హుందాగానే ఉండాలి. ఇది మీకు చెందినది కాదు. మీరు, దీనిని కేవలం అప్పు తీసుకున్నారు… అంతే! దీనికి ఎటువంటి వడ్డీ లేదు. కానీ, మీరు దీనిలో ప్రతీ అణువు తిరిగి ఇచ్చేయవలసిందే..! ఇది,  ఆ విధంగానే ఉంది. అందుకని మీ నాన్నగారు ఆ ఋణం తీర్చేశారు. ఇందులో, మీ సమస్య ఏమిటి..? ఆయన పద్దులను సరిసమానం చేసేసుకున్నారు. ఆయన బ్యాలన్సుషీటు ఖాళీ అయిపోయింది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

పాతతరాల, కొత్తతరాల మధ్య ఘర్షణ ఎందుకు వస్తోంది ? - Why is the confrontation between old and new?


ఇప్పుడు పాతతరాల, కొత్తతరాల మధ్య ఘర్షణ కనిపిస్తోంది. వయోధికుల అనుభవమూ, యువతకున్న శక్తీ రెండూ కలిసి పనిచేసేటట్లు చేయడం ఎలా?

వాళ్లు ఇప్పుడే కాదు, ఎప్పుడూ పరస్పర వ్యతిరేకంగానే ఉన్నారు. అసలు సమస్య ఏమిటంటే ముసలితరం తాము ముసలి వాళ్లమనుకోవడం లేదు. యువతరం తీసుకోవాలనుకుంటున్న స్థానాన్ని వృద్ధతరం ఖాళీ చేయడం లేదు. ఇది కేవలం మనుషుల్లోనే కాదు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే జంతువుల పరిస్థితీ ఇదే. మీరు కొన్నిసార్లు గమనించవచ్చు. యౌవనావస్థలోని మగ ఏనుగు క్రోధంతో అన్నీ విరిచి వేయడం, ధ్వంసం చేయడం చూడవచ్చు. గుంపులోని మరో పెద్ద మగ ఏనుగుతో అది పోరాడ వలసి రావడమే దీనికి కారణం. ఆ మగ ఏనుగు తన స్థానం ఖాళీ చేయడంలేదు,  ఆ స్థానం కోసం ఈ యువ మగ ఏనుగు పోరాడుతూ ఉంది. కాని దానికింకా ఆ శక్తి రాలేదు, అందుకే అంత కోపం – అదే కౌమారం..!

అందుకే భారతీయ సంస్కృతిలో వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచారు. 0-12 సంవత్సరాల వరకు బాలావస్థ, ఈ దశ కేవలం ఆట పాటలకే – శరీరమూ, బుధీ వృద్ధి చెందాలి. 12-24 సంవత్సరాల మధ్య బ్రహ్మ చర్యం – మీ శరీరానికి, మనస్సుకు క్రమశిక్షణ అలవారిచే సమయం. మీ శక్తిని అభివృద్ధి చేసుకోవాలి, శక్తిమంతులు కావాలి. 24 ఏళ్ల వయస్సులో జీవితాన్ని మీరు స్పష్టంగా చూడగలిగితే, ఈ సంసారాన్ని సాగరాన్ని ఈద దలచుకోకపోతే, సన్యాసులవుతారు. లేకపోతే పెళ్లి చేసుకుని, గృహస్థులవుతారు. మీరు 24 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటే, రెండు సూర్య ఆవృత్తుల తర్వాత అంటే మరో 24 ఏళ్ల తర్వాత మీరు 48 ఏళ్ల వాళ్లవుతారు. అంటే ఆ సమయానికి మీ పిల్లలు యుక్తవయసుకు వస్తారు-  పొట్ల గిత్తల స్వభావం ఉంటుంది. మీరు తప్పుకోవాలని వాళ్లనుకుంటారు, కానీ చెప్పలేరు.

అందువల్ల 48 సంవత్సరాల వయసులో దంపతులు వేరు వేరు మార్గాలలో వెళతారు. భర్త ఒక సంస్థలోకి, భార్య మరో సంస్థలోకి. 12 ఏళ్లపాటు తమ తమ ఆధ్యాత్మిక సాధనలో గడుపుతారు. 60 ఏళ్లకు మళ్లీ కలుసుకొని, పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మీరు వేరువేరుగా పోవడం లేదు కాని 60లో మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మీరు పన్నెండేళ్లు ఎడంగా వెళ్లాల్సి ఉంది. మొదటిసారి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు దేహావసరాలో, భావోద్వేగాలో, మరొకటో మిమ్మల్ని వశీకరించుకొని ఉండవచ్చు. ఇప్పుడవన్నీ అయిపోయాయి. మీరు 12 ఏళ్ల ఆధ్యాత్మిక సాధన చేశారు. మీరు భిన్న పద్ధతిలో ఒకటి కావడానికి వచ్చారు. కలిసి వాన ప్రస్థానానికి వెళతారు. మీ జీవితంలో చివరి భాగం గడపడానికి అడవికి వెళతారు.
ఇప్పుడు వెళ్ళదచుకోవడం లేదు, పిల్లలు వెళ్లాలనుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ప్రపంచంలో తమ కాళ్లూనుకుంటే వాళ్లు ఎట్లాగూ వెళతారు. వాళ్లు కూళ్లూనుకోకపోతేనే సమస్య, అప్పుడే ఘర్షణ.
ఎవరిస్థలం వారికి కావాలి:

తమంతట తాము తల్లిదండ్రులనో, పిల్లలమనో అనుకొంటున్నారు, దీనికి కారణం మనోభావాలే. కాని జీవిత వాస్తవంలోకి వస్తే స్థానంకోసం, ఆధిపత్యం కోసం సంఘర్షించే పెద్ద వృషభం, చిన్న వృషభం. పురుషులు ఒక విధంగా ప్రవర్తిస్తే, స్త్రీలు ఒక రకంగా ప్రవర్తిస్తారు. కాని ప్రాథమిక సమస్య ఒకటే – మీకు స్థానం కావాలి, వాళ్లు స్థానం ఖాళీ చేయడం లేదు – ఘర్షణలు జరుగుతాయి. తల్లిదండ్రులకు దూరంగా జీవించే పిల్లలు ఎప్పుడూ వారిని ప్రేమిస్తుంటారు. కానీ, వాళ్లు మీతో ఉంటే ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉంటారు – దీనికి కారణం మీరు చెడ్డవారో, వాళ్లు చెడ్డవారో కావడం కాదు. మీకు ఒక రకమైన వాతావరణం అవసరమైతే, వాళ్లకు మరో రకమైన వాతావరణం అవసరం. ఇద్దరూ ఒకే చోట ఉంటే వేడి పుడుతుంది.

ఇది కొత్త సమస్య ఏమీ కాదు. మానవుడు గుహల్లో జీవించినప్పుడు కూడా ఈ సమస్య ఉండి ఉంటుంది. మనం దీన్నెలా పరిష్కరించుకోవాలి? పెద్దలు పక్కకు తప్పుకోవడం నేర్చుకోవాలి. పిన్నలను ఆ స్థలం ఆక్రమించుకోనివ్వాలి. పెద్దలు ఒక స్థాయి వివేకాన్ని, అనుభవాన్ని ప్రదర్శించాలి, అది పిన్నలకు వారిపట్ల గౌరవాన్ని కలిగించాలి. మీరలా చేయకపోతే యువత మిమ్మల్ని ఏవగించుకుంటుంది, అనేక విధాలుగా మొరటుగా ప్రవర్తిస్తుంది. మీరు పెద్ద వాళ్లయ్యే కొద్దీ ఒక స్థాయి వివేకాన్ని, జీవితంలో అంతః దృష్టిని సంపాదించుకుంటే – దాన్ని పిన్నలింకా సంపాదించుకోవలసి ఉంటుంది – వాళ్లు ఆదర్శం కోసం మీ వైపు చూస్తారు. అప్పుడు దాదాపుగా మీరు అదే స్థలంలో ఉండవచ్చు. మీరు మొదటి అంతస్తులో ఉండండి.. వాళ్లను కింది అంతస్తులో ఉండి మీ కోసం పైకి చూడనీయండి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

మనసు - Mind, Heartstrings

మనసు - Mind, Heartstrings

నసుకు రూపమంటూ లేదు. కాని, అది విశ్వమంతటా విస్తరిస్తుంది. రెక్కలు లేకుండానే అంబరవీధిలో ఎగిరిపోతుంది. పాదాలు లేకుండానే నేలమీద పరుగులు తీస్తుంది' అన్నాడో మహాకవి. నిజమే... రంగు, రుచి, వాసన ఏమి లేకపోయినా మనిషిని జీవించినంతకాలం నడిపించేది మనసే. అది తలచుకుంటే హిమోన్నత శిఖరాల మీద కూర్చోబెడుతుంది. లేదా అధఃపాతాళానికైనా తొక్కేస్తుంది. 'నేరం నాది కాదు, నా మనసుది' అంటే చెల్లదు. మనసు బుద్ధి చెప్పినట్లు నడుచుకోక తప్పదు.

మనసును అదుపులో ఉంచుకోగలిగితే మనిషి మహోన్నతుడు. లేకుంటే మహాపతితుడు. ప్రతి దినమూ మనసును సాధనతో ఆరాధనతో శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోక తప్పదు. మనసు మన అధీనంలో ఉండక పోవడానికి ప్రధాన కారణాలు- మన తిళ్లు, ఒత్తిళ్ళు. ఈ రెంటిమీద శ్రద్ధవహించడం అత్యవసరం. సాత్వికాహారం మనసును క్రమపద్ధతిలో నియంత్రించ గలుగుతుంది. ధ్యానం దాన్ని పవిత్రంగా ఉంచగలుగుతుంది. అప్పుడే ఏకాగ్రత పెరుగుతుంది. మానవ జీవన పయనంలో నేడు మానసిక ఒత్తిడి రాజ్యమేలుతోంది. ఈ ఒత్తిడికి బానిసైన మనిషి వివేకం, జ్ఞానం కోల్పోయి- ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. మనుషుల్లో పెరుగుతున్న మానసిక రుగ్మతల వల్లనే దౌర్జన్యాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, హత్యలు విశృంఖలంగా పెరుగుతున్నాయి.
మానసిక సమస్యలు, సంఘర్షణలు ఏదో ఒక కారణంవల్ల, పరిస్థితుల ప్రభావంవల్ల ఎదురైనా వివేచనతో, విజ్ఞతతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.
మనసు తాలూకు ప్రవృత్తి తరంగంలా చంచలమైనది. దాని తేజస్సు అగ్నికన్న వేడైనది. దాన్ని అతిక్రమించడం పర్వతారోహణకన్న కఠినమైనది. అనంతమైనది. అనంతమైన సుఖదుఃఖాది భావాలు, అనుభూతులు మనసునుంచే ఆవిర్భవిస్తున్నాయి. మనసుది ఓ బాల్య చాపల్యం. క్షణికానందం, క్షణికావేశం, క్షణిక సంతృప్తి, క్షణిక రౌద్రం మొదలైనవన్నీ చంచల హృదయం దుర్లక్షణాలు. ఈ దుర్లక్షణాలను మనం దూరం చేసుకోవాల్సి ఉంటుంది.

మనసే జగత్కర్త. మనసే పురుషుడు. మనోనిశ్చయంవల్ల సంపాదితమయ్యేది మనసు తాలూకు ప్రతిబింబమే అవుతుంది. ఏకీకృత మనసుతో చేసే ఏ కార్యమైనా సఫలీకృతమవుతుంది. సత్ఫలమిస్తుంది. చివరికి బ్రహ్మ వరకు అన్నీ మనసు ద్వారా సాధించవచ్చునంటారు. మనసు దేనికి అనుసంధానమవుతుందో, కర్మేంద్రియాలు దానికి అనుగుణంగా స్పందిస్తాయి. విత్తనం నుంచి వృక్షం, లత, పుష్పం, ఫలం- ఇవన్నీ పుట్టినట్లు మనసునుంచే ప్రేమ, శాంతం, క్రోధం, ద్వేషం మొదలైనవన్నీ పుడుతున్నాయి. అయితే మనసులోని ఆలోచనలు సక్రమంగా ఉన్నంత వరకు కర్మలు కూడా సక్రమంగా, సధార్మికంగా ఉంటాయి. మనసు గతి తప్పితే మనిషికి దుర్గతే! మనసు అమలినంగా ఉంటే లోకమంతా పవిత్రంగానే కనపడుతుంది. తనను గురించి మనసులో ఆలోచించేవాడు మానవుడు, అందరి గురించి ఆలోచించేవాడు భగవంతుడు. మనసుకు, సత్వ-రజ-స్తమో గుణాలని మూడు గుణాలున్నాయి. సత్వగుణం మంచిమనిషి లక్షణం. మిగిలిన రెండు గుణాలూ మనోదోషాలు. అంటే మనసును పదిమందిలోనూ దూషింపజేసేవి, వ్యాధులకు కారణం అయ్యేవి. మానసిక ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు కారణభూతమైన సత్వగుణాన్ని సర్వదా పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి.

మనోవేగాన్ని మించిందిలేదు. అయితే మనసుకంటె శక్తిమంతమైంది బుద్ధి. దానికన్న శక్తిమంతమైంది ఆత్మ. ఆత్మ, బుద్ధి ప్రేరణతో మనసు సద్భావనా ప్రవాహంలో ప్రయాణిస్తూంటుంది. ధర్మాధర్మాలకు, బంధమోక్షాలకు మనసే కేంద్రం. 'ఈ మనసు ప్రమధనశీలమైంది. అంటే, క్షోభ కలిగిస్తుంది. ఎంత మొండిదో, అంత బలవంతమైంది. దీన్ని అధీనంలో ఉంచుకోవడమంటే గాలిని గుప్పెటలో పట్టుకున్నంత కష్టతరమైంది. అయితే అభ్యాసం, వైరాగ్యం ద్వారా మాత్రమే మనసును స్వాధీనంలో ఉంచుకోవచ్చు' అంటాడు కృష్ణపరమాత్మ భగవద్గీతలో.

మనసనేది ఈ నేలమీద పుట్టిన ప్రతి మనిషినీ ప్రభావితం చేస్తుందన్నది అక్షర సత్యం. మనసు మనిషిచేత తప్పుచేయించిందీ- అంటే, వెంటనే ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం కలగజేయడమూ ఆ మనసు పనే. అప్పుడే అది నిజమైన పథనిర్దేశిక, దిక్సూచిక అనిపించుకుంటుంది.

జితేంద్రియుడైనవాణ్ని, విరాగిని, జ్ఞానిని, అనుభవశీలిని, సాధకుణ్ని మనసు ఏ విధంగాను ప్రలోభపెట్టలేదు. నీరు పల్లంవైపు ప్రవహించినట్లే, మనసు చెడువైపే మొగ్గుతుంది. అప్పుడు మనసును పరిపరివిధాల చరించకుండా నిరోధించాలి. నియంత్రించాలి. మనసు రెండు విధాలు- శుద్ధ మనసు, కల్మష మనసు. కామసంకల్పంతో నిండింది కల్మష మనసు. కామవాసనా రహితమైనది శుద్ధ మనసు. అనుచితమైన కోరికలకు బానిసవుతున్న మనసును అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. ఏ విషయ వాసనాసక్తీలేని మనసు ముక్తి పొందడానికి అర్హత సంపాదిస్తుంది. ఆధ్యాత్మిక చింతనను స్వచ్ఛంగా ఆహ్వానిస్తుంది. మనసు కవ్విస్తే, మనిషి తలొగ్గితే అన్నీ అనర్థాలే!

ఆదిశంకరులన్నారు- 'నా మనసనే కోతి మోహమనే అడవిలో సంచరిస్తోంది. డబ్బు, కోరికలనే చెట్లకొమ్మలపైన ఎగురుతోంది. ఈ కోతిని అధీనంలో ఉంచుకో ప్రభూ!'... ఈ ఆవేదన సకల మానవజాతి ఆవేదన. కాముడి బారినుంచి బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా తప్పించుకోలేక భంగపడ్డారు. అయితే మానవజాతికి ఉన్న గొప్ప అవకాశమేమంటే- మనసును సర్వదా నిర్మలంగా ఉంచుకోవడానికి భగవన్నామస్మరణం చేయడం. ఈ కలియుగంలో మనసును ముక్తిమార్గాన నడిపించేందుకు శంకర భగవత్పాదులే చెప్పారు.- 'భజగోవిందం' అని అంతకుమించిన ధన్యోపాయం లేదు. మానవుడు ఇదొక్కటి ఆచరణలో పెడితే చాలు, తెరుచుకుంటాయి మోక్షద్వారాలు!

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

31, ఆగస్టు 2017, గురువారం

మానసిక ఒత్తిడిని తట్టుకొనే మార్గం - Way to face mental Stress

నలో చాలామంది ఎంతో విజ్ఞానమున్నప్పటికీ, నిజజీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అవసరమైన జ్ఞానంలేక ఒత్తిడి నుంచి విముక్తి పొందలేకపోతున్నారు.
మనకు సంస్కృతం తెలిసి ఉండవచ్చు, భౌతిక శాస్త్రం తెలిసి ఉండవచ్చు. బోటనీ తెలియవచ్చు. కాని మనకు దుఃఖసముద్రాన్ని దాటడం లేదా ఒత్తిడిని తట్టుకొనడం తెలియకపోతే, ఇతర పాండిత్యం ఎందుకూ కొరగాదు.

ఒత్తిడిని తట్టుకుని ఒక పకడ్బందీ యోగిగా ఉండగలగడం ఎలాగో తెలుసుకుందాం.

యోగశాస్త్ర రంగంలో ఒత్తిడిని నిర్వహించడానికి మూడు ముఖ్యమైన వాస్తవికతలు ఉన్నాయి:
 • బాహ్య వాస్తవికత, అంతర్గత వాస్తవికత, భావాతీత వాస్తవికత.
 • బాహ్య వాస్తవికత వస్తు ప్రపంచానికి సంబంధించినది.
 • అంతర్గత వాస్తవికత భావ ప్రపంచానికి సంబంధించినది.
 • యోగ శాస్త్రంలో చెప్పే భావాతీత వాస్తవికత వస్తువులకు, తలపులకు అతీతమైనది.
మనలో చాలామంది ఈ వస్తుప్రపంచంలో- బాహ్య వాస్తవికతలో, అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునే వాస్తవికతలో బతుకుతున్నాం. ఆనందంగా ఉండటానికి మనమింకా ఎక్కువ వస్తువులను, బాహ్య ప్రపంచంలో లౌకికపరమైన విషయాలను ఇంకా ఎక్కువగా చేర్చుకోవాలని భావిస్తాం. ప్రాపంచిక వస్తువులు చేరడంతో మనం ఒత్తిడి నుంచి విముక్తులమవుతామని, మన సుఖసంతోషాలు ఎక్కువవుతాయని తలుస్తాము. అందుకే విజయం సాధించడానికి తీరుబడి లేకుండా ప్రయత్నిస్తాం. మనం ఈ విషయంలో లోతుగా ఆలోచిస్తే, ఒక వ్యక్తి విజయం సాధించవచ్చునేమోగాని సంతృప్తి చెందగలడనలేము. మనం ఎన్నో వస్తువులను సంపాదించుకోగలమేమో గానీ అవి తెలివిగా వినియోగించకపోతే మనకు తృప్తినీయలేవు. అందుకే ఈ బాహ్య వాస్తవికత అన్నది వస్తు ప్రపంచం.

మనుషులకు అందమైన బంగళాలు ఉండవచ్చు. బయటికి ఎంతో సౌఖ్యంగా ఉన్నట్లు కనిపించవచ్చు. కానీ అంతరంగంలో తలపుల ఉద్వేగంతో, అస్తవ్యస్తంగా ఉంటే వాళ్లు అసౌకర్యంగా ఉన్నట్టే లెక్క. బయట మనం చూసే ప్రపంచం మనలోపల కూడా చూడగలమని యోగశాస్త్రం మనకు తెలుపుతోంది. అందుకే అంతర్గతంగా మనం సరియైన విధంగా శక్తిమంతులం కాకపోతే, వివేకంతో మనం మనల్ని పరిస్థితులకు అనుగుణంగా మలచుకొనకపోతే ఈ వస్తు ప్రపంచం మనకు ఆనందాన్ని ఇవ్వలేదు. మనకు ఒత్తిడి నుంచి విముక్తిని ఇవ్వదు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

29, ఆగస్టు 2017, మంగళవారం

మన ప్రతికూల భావాలని మరియు కోపాన్ని జయించడం ఎలా? - How to overcome our negative feelings and anger?

మన ప్రతికూల భావాలని మరియు కోపాన్ని జయించడం ఎలా? - How to overcome our negative feelings and anger?
వరైనా ఎంతో విలువైనదాన్ని జయించాలని అనుకుంటారు. మీకు అవసరం లేనిదానిని ఎందుకు జయించాలని అనుకుంటారు? అందుకని,  మొదట జయించడం అన్న ఆలోచనని వదిలెయ్యండి. ఎప్పుడో ఒకసారి మీకు కోపం వస్తుంది. ఎందుకంటే, ఉన్నట్టుండి  మీ శరీరం, మీ మనస్సు, మీ శక్తి మీకు కావలసిన విధంగా ప్రవర్తించడం లేదు కాబట్టి..! కోపం అన్నది ఎల్లప్పుడూ లేదు. ఏదైతే సృష్టిలో ఎల్లప్పుడూ లేదో, దానిని జయించడం లేదా నియంత్రించడం అన్నది – ఉట్టి వ్యర్థమైన శ్రమ. ఒక్కొక్కసారి మీ మనస్సు చికాకుగా మారుతుంది. అందులో ఒక రూపాన్ని మనం కోపం అంటాం.
ఎలాగూ ఈ ప్రపంచంలో తగినంత చిరాకు ఉంది. మీరు కూడా మీ లోపల చిరాకుగా ఉండవలసిన అవసరం ఏమి ఉంది..?
ఎవరైనా తనని తాను, చిరాకుగా ఎందుకు మలచుకుంటారు..? ఎలాగూ ఈ ప్రపంచంలో తగినంత చిరాకు ఉంది. మీరు కూడా మీ లోపల చిరాకుగా ఉండవలసిన అవసరం ఏమి ఉంది..? మీ చుట్టూరా పరిస్థితులు గనుక చిరాకుగా ఉంటే, మీరు కూడా చిరాకుగా మారిపోతారు..! కానీ ఇందులో ఏ రకమైన మేధస్సు ఉంది, చెప్పండి..? ముఖ్యంగా,  మీ చుట్టూరా పరిస్థితులు గనుక చిరాకుగా మారినప్పుడు, మీలో మీరు ప్రశాంతంగా ఉండడం, ప్రసన్నంగా ఉండడం ఇంకా ఎక్కువ ముఖ్యం.. అవునా..? కాదా..? నేను మిమ్మల్ని కోపం తెచ్చుకోవద్దు – అని చెప్పడం లేదు. అది మీ ఇష్టం. ఒకవేళ అది మీకు మధురానుభూతిగా ఉంటే, మీరు ఎప్పుడూ కోపం తెచ్చుకోండి. కానీ, సహజంగా బాధితులకంటే కూడా కోపం వచ్చినప్పుడు మీరే ఎక్కువ బాధపడతారు. అప్పుడు ఇంక ఉపయోగం ఏమి ఉంది..?

మీకు మీరే ఎందుకు చిరాకు కలిగించుకుంటున్నారు..? ఈ ప్రపంచంలో తగినంత చిరాకు ఉండనే ఉంది. మీరు, ఈ ప్రపంచంలో నడుస్తూ ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులలో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడో – అక్కడో చిరాకులన్నవి ఉన్నాయి. మీరు ఎంత ఆపాలని చూసినా సరే, మీరు ఎక్కడోక్కడ చిరాకులోనికి ఆడుగు పెడుతూనే ఉంటారు. అలాంటప్పుడు ప్రత్యేకించి మీకుగా మీరు చిరాకుని తయారు చేసుకోవలసిన అవసరం ఏముంది..? అలాంటి అవసరమే లేదు..! అందుకని మీకు అక్కర లేనివాటిని ఎందుకు సృజించుకుంటున్నారు..?

మీకు, “మీతో మీరు”  ఏమి చేసుకుంటున్నారో తెలియడం లేదు. ఎరుకతో లేకపోవడం వల్ల మీరు ఇలా చేస్తున్నారు. మీరు ఒక పని చేయండి. మీ కళ్ళు మూసుకొని మీ ఇంటికి డ్రైవ్ చెయ్యడానికి ప్రయత్నం చేయండి. ఎంతో కష్టపడి, వారిని వీరినీ గుద్ది ఎలాగో ఒక లాగ ఇల్లు చేరుకోగలరేమో..! కాని ఇలానే ప్రతీరోజూ ప్రయత్నం చేస్తే, కొద్ది రోజుల తరవాత జీవించి ఉండరు. ఇప్పుడు మీరు చేసేది కూడా ఇలానే ఉంది. మీరు మీ శ్రేయస్సుని కళ్ళు మూసుకొని నియంత్రించాలని చూస్తున్నారు. ఇలా మీరు ఏమి చేసినా సరే, మీకు శ్రేయస్సు దొరకదు. దీనిని మీరు కళ్ళు మూసుకొని కాదు కళ్ళు తెరుచుకుని నియంత్రించాలి. కదూ..?

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి