మనకు ఇష్టమైన వారు మరణిస్తే, ఆ బాధను తట్టుకోవడం ఎలా? - How can we cope with the pain when our loved ones die?

0
మనకు ఇష్టమైన వారు మరణిస్తే, ఆ బాధను తట్టుకోవడం ఎలా? - How can we cope with the pain when our loved ones die?
ప్రతిరోజూ ఈ ప్రపంచంలో ఎంతోమంది  మరణిస్తున్నారు. ప్రతి నిమిషం రెండు వందలమంది మరణిస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా ‘వీళ్ళంతా ఎందుకు మరణిస్తున్నారు’ – అని ఆలోచించారా..? మీరు ఎప్పుడైనా ఈ జీవితానికి మూలం ఎక్కడుంది – అని ఆలోచించారా..? కానీ ఇప్పుడు మీ నాన్నగారు మరణించారు. ఒకవేళ ఆయనే మీ నాన్నగారు – అన్న విషయం మీకు తెలియకపోతే, ఆ మనిషి మరణిస్తున్నా, మీరేమీ పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మరణించినది మీ నాన్నగారు. అందుకనే ఇదంతా..! నిజానికి మీ ఆతృత మరొక మానవుడు మరణించడం గురించి కానీ, మరొక జీవం గురించిగానీ కాదు. మీ ఆతృత అంతా మీ గురించే..! మీ ఆందోళన ఈ విధంగా ఉన్నప్పుడు, ఇది వక్రీకరించబడిన ఆందోళన. అంటే, మీరు జీవితాన్ని ఒక వక్రీకరించిన కోణంలో చూస్తున్నారు. మీరు జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడనప్పుడు, బాధ అన్నది తప్పని సరి..! ఇప్పుడు, మీ నాన్నగారు వెళ్ళిపోయారు.   మనం ప్రేమించినవాళ్ళు, మనతో ఎంత కాలం వీలైతే అంత కాలం ఉండడానికి అన్నీ చేస్తాం. కానీ, ఎప్పటికైనా వారు వెళ్లిపోవలసిందే…కదూ..?

నేను మీకొక కథ చెబుతాను. ఒకసారి మీలాంటి ఒకతను, క్రొత్త ఇంటిని కట్టుకున్నారు. మన సాంప్రదాయంలో ఒక సాధువుని కానీ, సన్యాసినికానీ ఇంటికి పిలిచి వారి ఆశీర్వచనం తీసుకుంటారు. అందుకని ఒక యోగిని వారు ఇంటికి తీసుకునివచ్చారు. వారందరూ ఆయనని సాదరంగా ఆహ్వానించారు. ఒక రాజులాగా చూసుకున్నారు. బాగా భోజనం పెట్టారు. ఆ తరువాత  ”మీరు మమ్మల్ని, మా ఇంటిని ఆశీర్వదించండి” అన్నాడు. అప్పుడు ఆ యోగి “సరే..!  ముందు మీ నాన్నగారు చనిపోవాలి. ఆ తర్వాత మీరు.. ఆ తరువాత మీ పిల్లలు…”అన్నారు. దీనికి వారికి ఎంతో కోపం వచ్చింది.
“మూర్ఖుడా, మిమ్మల్ని ఇంటికి పిలుచుకువచ్చి ఒక రాజులాగా మిమ్మల్ని చూసుకుని మీకు భోజనం పెట్టాం,  బహుమతులిచ్చాం..! ఆశీర్వదించమని అడిగితే, మీరు మా నాన్నగారు చనిపోవాలి, తరువాత నేను చనిపోవాలి, తరువాత నా పిల్లలు చనిపోవాలి అంటారా..?” అన్నాడు. 
అతనికి ఒక భయం కూడా ఉంది – యోగి అన్నారు కాబట్టి అదే విధంగా జరుగుతుందేమోనని ..! దానికి ఆ యోగి, “నేను చెప్పినదాంట్లో తప్పేముంది..? ముందర మీ నాన్నగారు.. తరువాత మీరు.. తరువాత మీ పిల్లలు. ఇది మంచిదే కదా..?ఒకవేళ మీ నాన్నగారికంటే ముందర,  మీరు మరణిస్తే మంచిదా..? లేక మీ పిల్లలు మీకంటే ముందర, మరణిస్తే – అది మంచిదా..? మీ నాన్నగారు ముందు మరణించాలి.. తరువాత మీరు.. తరువాత మీ పిల్లలు. ఇది సహజమైన జీవన క్రమమే కదా..? ఈ విధంగానే కదా,  జీవితంలో జరగాలి… ఔనా..? అందుకే అలా చెప్పాను” అన్నాడు.

మీరు జీవితంతో ఒకటిగా లేరు కాబట్టి మీరు మీ నాన్నగారు మరణించకూడదు అనుకుంటున్నారు. సరే..! మీ నాన్నగారికి బదులు మీరు మరణించారు అనుకోండి, అప్పుడు పరిస్థితులు ఏమైనా మెరుగ్గా ఉంటాయా..? లేదా మీ పిల్లలు ముందర మరణించారనుకోండి అప్పుడేమైనా మెరుగ్గా ఉంటాయా..? ఉండవు కదా..? ఇది ఈ విధంగానే జరగాలి. అవును.. మనం ప్రేమించినవాళ్లని, జాగ్రత్తగా అట్టిపెట్టుకోవడానికి, శాయశక్తులా ప్రయత్నించాలి..కానీ, వారు మనల్ని వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు, మనం హుందాగా ఉండాలి. అలాగే మనం వెళ్లిపోవలసిన సమయం వచ్చినప్పుడు కూడా హుందాగానే ఉండాలి. ఇది మీకు చెందినది కాదు. మీరు, దీనిని కేవలం అప్పు తీసుకున్నారు… అంతే! దీనికి ఎటువంటి వడ్డీ లేదు. కానీ, మీరు దీనిలో ప్రతీ అణువు తిరిగి ఇచ్చేయవలసిందే..! ఇది,  ఆ విధంగానే ఉంది. అందుకని మీ నాన్నగారు ఆ ఋణం తీర్చేశారు. ఇందులో, మీ సమస్య ఏమిటి..? ఆయన పద్దులను సరిసమానం చేసేసుకున్నారు. ఆయన బ్యాలన్సుషీటు ఖాళీ అయిపోయింది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top