జెనెటికలీ మోడిఫైడ్ (జన్యుపరంగా మార్పు చేసిన పంటలు) పంటలు - Genetically modified crops

0
జెనెటికలీ మోడిఫైడ్ (జన్యుపరంగా మార్పు చెందిన పంటలు) పంటలు - Genetically modified crops
పాడిపంటల శాస్త్రవేత్తలు "జెనెటికలీ మోడిఫైడ్" పంటల గురుంచి ప్రజలలో ఉన్న అనుమానాలని తీర్చాలి, లేకపోతే రాబోవుకాలంలో ప్రజలందరూ ఆహారపధార్ధాల కోరతతో ఆకలి బాధకు లోనవుతారని "జెనెటికలీ మోడిఫైడ్ పంటలు మరియూ వాతావర్ణ కాలుష్యం" అనే సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల శాస్త్రవేత్తలు తెలిపేరు.

భీట్.భ్రింజాల్ ని ప్రవేశపెట్టబోతున్నామని కేంద్ర ప్రబుత్వం చెప్పినప్పుడు, దానికి దేశవ్యాప్తంగా వ్యతిరేకత తెలిపేసరికి, ప్రబుత్వం ఆ ప్రయత్నాన్ని నిలిపివేసింది. కానీ ఈ జెనెటికలీ మోడిఫైడ్ బీట్.బ్రింజాల్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, వ్యతిరేకం తెలిపేవారు సరియైన కారణం చెప్పకుండా జీ.ఎం క్రాప్ ఒంటికి ఆరోగ్యకరంకాదని మాత్రమే చెబుతున్నారు.

జీ.ఎం పంటలవలన ఎటువంటి హానీ లేదని ప్రజలకు తెలిపి, ఈ సంవత్సరం నుండి జీ.ఎం పంటలలో శ్రద్ద చూపెడితేనే ఆహారపదార్ధాల కోరత తగ్గుతుంది, దీనితో ధరలుకూడా తగ్గి మన దేశ పురొగతికి దారి తీస్తుంది......అలాకాకుండా కేంద్రముగనుక చేతులు ముడుచుకుని కూచుంటే,మనం ఆహార పదార్ధాల కోరతతో విపరీతముగా అవస్త పడవలసి వస్తుంది. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అప్పుడు మనం ఆహారపదార్ధాలని దిగుమతి చేసుకోవాలి. అలా దిగుమతిచేసుకునే ఆహారపదార్ధాలు జీ.ఎం తో తాయారు చేయబడినవేనని మనం గుర్తుపెట్టుకోవాలి.

జెనెటికలీ మోడిఫైడ్ (జన్యుపరంగా మార్పు చెందిన పంటలు) పంటలు - Genetically modified crops

వాతావర్ణ కాలుష్యము వలన వాతావర్ణములో మార్పులు ఏర్పడుతున్నాయి. ఈ వాతావర్ణ మార్పులవలన మామూలుగా పండే పంటలు సరిగ్గా పండకుండా అటు రైతులనీ ఇటు ప్రజలనీ విపరీతంగా నష్టపరుస్తున్నాయి. ఎన్నో దేశాలు ఈ జీ.ఎం పంటలనే పండిస్తున్నారు. ఎందుకంటే ఈ పంటలు ఎటువంటి వాతావర్ణానికైనా తట్టుకునే శక్తి కలిగినవి. ఎండలు ఎక్కువైనా, వానలు తక్కువైనా మరియూ ఎటువంటి అవాంఛనీయ వాతావర్ణానికైనా తట్టుకోగలవు. అలాగే కాల మార్పులకు లోనవకుండా పెరగగలవు. అప్పుడు మనకు ఆహారపదార్ధాల కోరత రానే రాదు.
ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలకీ ఆరు మిల్లియన్ టన్నుల గోదుమ పంట నాశనమౌతున్నదని యూనైటడ్ నేషన్స్ పంట ఉత్పత్తి పర్యవేక్చక సంఘం తెలుపుతోంది. వాతావర్ణ మార్పులు మన తలుపులను తడుతుంటే, ఆకలిని, పెరుగుతున్న ప్రపంచ జనాభా ను ఎలా కాపాడబోతామని ప్రశ్నిస్తోంది. 
23 దేశాలుకు చెందిన శాస్త్రవేత్తలు ఒక సదస్సులో కలిసినపుడు .. ప్రపంచం ఇకమీదట జీ.ఎం పంటలమీదే ఆధారపడాలి. ఈ జీ.ఎం పంటల గురించి చేసే పరిశోధనల అభివ్రుద్దిని ఒక దేశం అన్ని దేశాలకూ తెలియపరచాలి. పోయిన శతాబ్ధిలో సుమారు 75 శాతం పంట వెరైటీలను మనం పోగోట్టుకున్నాము....ఇప్పుడు ఏవో కొన్ని వెరైటీలమీద మాత్రమే ఆధారపడియున్నాము. ఈ మిగిలిన రకాలను పరిశీలించి, పరీక్చించీ, వాటిని మన పరిశోధనాకేంద్రాలలో బద్రపరచుకొని, వాటి విత్తనాలని మన పరిశోధనాకేంద్రాలలో తయారుచేయాలి. లేకపోతే ఉన్న విత్తనాలనికూడా మనం వదులుకోవలసివస్తుంది. ప్రతిఒక్క దేశమూ వారి పరిశోధనలలో వేసే ముందడుగులను మిగిలిన దేశాలతో పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి.

ఒక ప్రక్క పాత వెరైటీలను బద్రపరచుకుంటూ, రాబోవుకాలంలో ఎటువంటి మార్పులకైనా, ఎటువంటికాలంలోనైనా పండగలిగే పంటలను పండించుకోవటానికి మనం సిద్దపడాలి అని తెలిపేరు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top