Page Nav

HIDE

Grid

HIDE_BLOG

అధిక రక్త పోటును నిలువరించడం ఎలా - How to control High-Blood pressure

అధిక రక్త పోటు వలన చనిపోయేవారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువౌతోంది. ఈ వ్యాధి లక్షనాలు ఎక్కువగా బయటకు కనబడవు, కానీ గుండె పోటు, పక్షవాతం మరియూ క...

అధిక రక్త పోటును నిలువరించడం ఎలా - How to control High-Blood pressure
అధిక రక్త పోటు వలన చనిపోయేవారి సంఖ్య రోజు రోజుకీ ఎక్కువౌతోంది. ఈ వ్యాధి లక్షనాలు ఎక్కువగా బయటకు కనబడవు, కానీ గుండె పోటు, పక్షవాతం మరియూ కిడ్నీ ఫైల్యూర్ కి ఇది ఒక ముఖ్య కారణం. మీ బరువు తగ్గించుకుంటూ (తగినంతగా), మీ నిత్య జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ రక్త పోటుని మీరు కట్టుదిట్టంగా ఉంచుకోవచ్హు.

ఈ క్రింద చెప్పినవి మీకు ఉపయోగపడతాయి. 

నడక: నడక ఒక మందు. నడకని సక్రమంగా వాడితే ఈ వ్యాధియే కాకుండా మరెన్నో వ్యాదులను రాకుండా చేసుకోవచ్హు. రోజూ ప్రొదున్నే (అంటే పరగడుపున) వేగంగా ఒక గంట సేపు నడిస్తే రక్తపోటు కట్టుదిట్టంగా ఉంటుంది. వేగమైన నడక వలన మీ హ్రుదయం ఎక్కువ ప్రాణ వాయువును ఉపయోగించుకుని క్రమ పద్దతిలో పనిచేస్తుంది.ఇది మీకు ఎంతో ఆరొగ్యాన్ని ఇస్తుంది. మోదట రోజుకు 15 నిమిషాల నడక తో ప్రారంభించి మెల్ల మెల్లగా ఆ నడకని గంటకు పెంచండి.

గాలి పీల్చడం: ఒక చోట కూర్చుని నిదానంగా గాలిని లోపలికి పీల్చుకోవటం మరియూ బయటకు వదలటం చేస్తే ఇది మీ రక్తపోటుని కట్టుదిట్టం చేయడమే కాకుండా మిమ్మల్ని ఆరొగ్యవంతులుగా చేస్తుంది. 10 నిమిషములు ప్రొద్దున, 10 నిమిషములు రాత్రి చేస్తే చాలు. దీనిని ఎలా చేయాలో మీకు దగ్గరగా ఉన్న యోగా మరియూ మెడిటేషన్ నేర్పే వాల్ల దగ్గర నేర్చుకుంటే మంచిది..

పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారపదార్ధాలను తినండి: సోడియం (ఉప్పు) వలన మనకు జరిగే హాని గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది రక్తపోటును అధికరిస్తుంది. ఈ హాని నుండి తప్పించుకోవటానికి మనం పోటాషియం ఎక్కువగల పదార్ధాలను తినాలి. పండ్లు, కూరలలో పోటాషియం ఎక్కువగా ఉంది. అలాగే మీరు ప్రతిరోజూ భోజనంలో చిలకడ దుంప, టొమేటో, అరటిపండు, వేరుశెనగ పప్పు మరియూ ఆరెంజ్ జ్యూస్ చేర్చుకోండి.

ఉప్పు బాగా తక్కువగా తినండి: మీ వంశ పారంపర్యంలో ఎవరికీ రక్త పోటు లేకపోవచ్హు. అయినా మీరు ఉప్పు తక్కువగా వాడటం చాలా అవసరం మరియూ చాలా ఆరొగ్యకరం. ఉప్పుకు బదులు నిమ్మ రసం, వెలుల్లి, మెంతులు లేక రుచికోసం ఇంకేదైనా వాడండి. సాధ్యమైనంతవరకు తయారు చేయబడ్డ ఆహారపదార్ధాలను తినకుండా ఉండండి. ఎందుకంటే వాటిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉంటుంది. ఊరగాయ పచ్హడులు చాలావరకు తగ్గించండి. దీనికి బదులు అప్పుడే చేసుకున్న పచ్హడులు వాడండి. మీరే గనక ఒక డైరీ రాసుకుని, రోజూ ఎమేమి తిన్నారో చూసుకుంటే, మీరు ఎంత ఉప్పు తింటున్నారో మీకు తెలిసి అది మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది.

డార్క్ చాక్లెట్లు : డార్క్ వెరైటీ చాక్లెట్లలో "ఫ్లావనాల్స్" అనే ఒక పదర్ధం ఉంది. ఇది మన రక్త నాలాలను పెద్దదిగా చేసే శక్తి కలిగినది. కాబట్టి, 70 శాతం కోకో ఉన్న చాక్లెట్స్ తినండి.

ఆల్కహాల్ హెచ్హరిక: కోంచంగా ఆల్కహాల్ తీసుకోవటం ఒంటికి మంచిదే....కానీ అదే ఆల్కహాల్ ఒంటికి చాలా చెడు కూడా చేస్తుంది. ఒక గ్లాసు తాగితే ఆరోగ్యం. అదే రెండు గ్లాసులు తాగితే అనారొగ్యం. కాబట్టి మీరు ఆల్కహాల్ తాగే విదానాన్ని పరిశీలించుకోండి. మీరు రెండు లేక మూడు గ్లాసులు తాగుతున్నారంటే, మీ అలవాటును తగ్గించుకోండి.

టీ వలన కలిగె లాభాలు: హెర్బల్ టీలు తాగితే చాలా మంచిది. ఎందుకంటే హెర్బల్ టీలలో హిబిస్కస్ అనే పదార్ధం ఉంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. మామూలు టీ మంచిది కాదు. కాఫైన్ ఉన్న టీ, తాగిన వెంటనే రక్తపోటును అదికరిస్తుంది. అందుకని హెర్బల్ టీ తాగండి లేకపోతే గ్రీన్ టీ తాగండి.

పని తక్కువ చేసుకోండి..రెస్ట్ తీసుకోండి: ఆఫీస్ పనుల టైములను మరీ ఎక్కువ చేసుకోకండి.. అంటే మరీ ఎక్కువసేపు పనిచేయకండి. ఎక్కువసేపు పనిచేస్తే అది మీ రక్తపోటును అదికరిస్తుంది. పనుల ఒత్తిడులు మీకు అలసట తెప్పిస్తుంది. ఆ సమయములో మంచి శాస్త్రీయ సంగీతమో, సోలో ఇన్స్ ట్రుమెంటల్ సంగీతం వినండి.

జీవితం కష్ట మైనదే, కానీ దాన్ని సుఖవంతం చేసుకోవచ్హు, చేసుకుంటే, జీవితాన్ని ఆనందంగా, ఆరొగ్యంగా గడపవచ్హు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి