పసుపు కలిపిన పాలతో ఆరోగ్యం - Pasupu, Palu - Milk with Turmeric health benefits

0
పసుపు కలిపిన పాలతో ఆరోగ్యం - Pasupu, Palu - Milk with Turmeric health benefits
పసుపు కలిపిన పాలతో ఎంతో మేలు
ఒక గ్లాసు పాలలో టీ స్పూన్‌ చక్కెర, చిటికెడు పసుపు కలిపి పది పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. కొంత సేపటి తర్వాత పాలు గోరు వెచ్చగా అయ్యాక తాగాలి. పసుపు పాల ఫలితం సంపూర్తిగా పొందాలంటే ప్రతిరోజూ క్రమం తప్పక తాగాల్సిందే.

దగ్గు, జలుబుకు ఉపశమనం:
 • నిరంతరాయంగా వేధించే దగ్గు, జలుబు, గొంతు నొప్పులకు పసుపు పాలు చక్కని ఉపశమనాన్ని అందిస్తాయి. 
 • పసుపులో యాంటీసెప్టిక్‌, యాస్ట్రింజెంట్‌ గుణాలుంటాయి. 
 • ఇవి శ్వాస కోశ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. 
 • దగ్గుతో కందిపోయిన గొంతుకు మలామ్‌లా పని చేసే, పాలతో పసుపు కలిపి తీసుకుంటే ఊపిరితిత్తుల్లోని కఫం కరగటంతోపాటు ఊపిరి తీసుకోవటం సులువవుతుంది. 
తలనొప్పులు దూరం:
 • యాంటీ ఆక్సిడెంట్లు, అత్యవసరమరమైన పోషకాలు పుష్కలంగా ఉండే పసుపు యాస్ప్రిన్‌లా తలనొప్పి, ఇతర నొప్పులను తగ్గించేస్తుంది. 
 • ముక్కు దిబ్బడతో తలపట్టేస్తే వేడి పాలలో ఒక టీస్పూన్‌ పసుపు కలుపుకుని తాగి చూడండి. క్షణాల్లో తల నొప్పితోపాటు ముక్కు దిబ్బడ కూడా వదులుతుంది. 
కంటినిండా నిద్ర కోసం:
 • పాలలో సెరటోనిన్‌ అనే బ్రెయిన్‌ కెమికల్‌, మెలబోనిన్‌లు ఉంటాయి. 
 • ఇవి పసుపులో ఉండే వైటల్‌ న్యూట్రియంట్స్‌తో కలిపి ఒత్తిడిని తొలగించటానికి తోడ్పడతాయి. దీంతో మానసిక స్వాంతన చేకూరి హాయిగా నిద్ర పడుతుంది. 
రుతుక్రమం నొప్పులకు: 
 • రుతుక్రమం గాడి తప్పినప్పుడు స్రావం సమయంలో బాధలు అధికమవుతాయి. 
 • ఆ సమయంలో శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం ఫలితంగా పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులు బాధిస్తాయి. 
 • ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే పసుపు పాలు సేవించాలి. రుతుక్రమ నొప్పుల్ని హరించే పసుపును ప్రతి రోజూ క్రమం తప్పకుండా పాలలో కలిపి తీసుకోగలిగితే కొంత కాలంలోనే ఈ సమస్య పరిష్కారమవుతుంది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top