శ్రీ రాముడి ఫై నమ్మకం - విలువ - Sri Ramudu Nammakam

0
శ్రీ రాముడి ఫై నమ్మకం - విలువ - Sri Ramudu Nammakam
🙏🙏 నమ్మకం విలువ 🙏🙏

👉శ్రీరాముడు రావణునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడుయుద్ధం ముగిసింది, ఆ రాత్రి రామలక్ష్మణులు కపి సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు.

అర్థరాత్రి అయింది రాముడు లేచి సముద్రం దగ్గరకు వెళ్ళాడు ఒక్కొక్క రాయి తీసుకొని సముద్రం నీటిలో వేస్తున్నాడు వేసిన ప్రతి రాయి మునిగిపోతుంది.

రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం గమనించిన హనుమంతుడు తాను రాముని వెంట వెళ్ళాడు. రాముడు రాళ్ళను సముద్రంలో వేయడం గమనించాడు రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి, 👉'మహాప్రభూ., ఎందుకిలా రాళ్ళను అంబుధిలో వేస్తున్నారు? అని ప్రశ్నించాడు

' హనుమా.. నువ్వు నాకు అబద్ధం చెప్పావు' అన్నాడు రాముడు

'అదేమిటి స్వామీ' నేను మీతో అబద్ధం చెప్పానా?

ఏమిటి స్వామీ అది?' ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు "వారధి కట్టేటప్పుడు నా పేరు జపిస్తూ రాళ్ళను కడలిలో వేశామని అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయని చెప్పావు నిజమేనా? అన్నాడు రాముడు

'అవును స్వామీ'

'నా పేరు జపించి వేసిన రాళ్ళు తేలడం నిజమైతే నేను స్వయంగా వేసిన

రాళ్ళుఎందుకు తేలడం లేదు?

మునగడానికి కారణమేమిటి?

నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదా!" అని అడిగాడు రాముడు.

హనుమంతుడు వినయంగా చేతులు కట్టుకుని ఇలా అన్నాడు

👉"రామచంద్ర ప్రభూ!

మేము మిమ్ము మీ శక్తిని నమ్మాము మీ మీద నమ్మకంతో రాళ్ళు వేశాము మా నమ్మకం వలన అవి తేలాయి మీకు మీ శక్తి మీద నమ్మకం లేదు అనుమానంతో అపనమ్మకంతో రాళ్ళను వేశారు
అందుకే అవి మునిగిపోయాయి నమ్మకం విలువ అది.

🙏జై శ్రీ రామ్ 🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏జై శ్రీ రామ్ 🙏


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top