నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

9, మే 2018, బుధవారం

కూర్చుంటే కరిగిపోతుంది ఆయుర్దాయం, వస్తుంది ఊబకాయం - Vubakayam, Baruvu thagguta - Fat person

కూర్చుంటే కరిగిపోతుంది ఆయుర్దాయం, వస్తుంది ఊబకాయం - Vubakayam, Baruvu thagguta - Fat person
కూర్చుంటే కరిగిపోతుంది!
కూర్చుని తింటే కొండైనా కరిగిపోతుందనేది మన నానుడి! ఇప్పుడు తెలుసు కోవాల్సిందేమంటే రోజులో ఎంత సేపు కూర్చుంటే మన ఆయుర్దాయం అంత తరిగిపోతుందని...  హాయిగా కాలు మీద కాలు వేసుకుని కుర్చీల్లో కూర్చోవటాన్ని ఒకప్పుడు గొప్పగా భావించేవాళ్లం.

కానీ ఆధునిక వైద్య పరిశోధనలన్నీ కూడా ఎక్కువసేపు కూర్చుని ఉండటం ఏమాత్రం మంచిది కాదని ఘోషిస్తున్నాయి. రోజులో ఎక్కువ సేపు కూర్చుని ఉండేవారిలో.. కూర్చుని ఉండే ప్రతి గంటకూ.. 14% గుండె జబ్బు ముప్పు పెరుగుతోందని తాజాగా అమెరికా పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు.ఒక్క గుండె జబ్బులే కాదు.. అధిక రక్తపోటు, వూబకాయం, కొలెస్ట్రాల్ స్థాయులు పెరగటం, బొజ్జ దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకోవటం.. ఇలాంటి సమస్యలన్నీ వరస కడుతున్నాయని అధ్యయనాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి.

మరో కీలకమైన అంశమేమంటే రోజులో ఓ గంటపాటు నడక/యోగా వంటివి చేసేసి.. ఆ తర్వాత ఏకధాటిగా 8 గంటలు కూర్చుని ఉండిపోయినా కూడా ఏమంత మంచి ఫలితాలు కనబడటం లేదట. కూర్చుని ఉండటం వల్ల ఒంటికి జరిగే నష్టాన్ని ఆ గంట నడకా ఏమాత్రం పూడ్చలేకపోతోందని, కాబట్టి ఏకబిగిన కూర్చుని ఉండటం కాకుండా.. మధ్యమధ్యలో ప్రతి 30 నిమిషాలకూ లేచి నాలుగు అడుగులు నడవాలని పరిశోధకులు చెబుతున్నారు.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »