అద్భుత సుగుణాలు కలిగిన దాన్నిమ్మ పండు - pomegranate health

0
 సుగుణాల దానిమ్మ
దానిమ్మ పండు పుట్టిల్లు ఆఫ్ఘనిస్తాన్‌. క్రమేపీ భారతదేశంతో సహా ప్రపంచమంతా విస్తరించింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోను, అన్ని కాలాలలోను లభిస్తుంది. దానిమ్మ పండు రెండు రకాలు. ఒకటి పుల్ల దానిమ్మ, రెండు తియ్య దానిమ్మ. క్షయ తదితర కొన్ని రకాల వ్యాధిగ్రస్తులు పుల్లని పండ్లను తినరాదు. అయితే పుల్ల దానిమ్మను మాత్రం నిరభ్యంతరంగా తినవచ్చు. ఇది పుల్ల దానిమ్మ యొక్క విశేష గుణంగా చెప్పుకోవచ్చు. గృహవైద్యంగా ఎక్కువగా ఉపయోగపడే పుల్ల దానిమ్మ పండులో శరీర సౌందర్యాన్ని, ముఖ వర్చ స్సును ఇనుమడింపచేసే గుణ గణాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి చర్మవ్యాధులను అరికట్టడం, నివారించటం దానిమ్మ విశిష్టత. పుల్ల దానిమ్మ కన్నా తియ్య దానిమ్మలో మరెన్నో అదనపు సుగుణాలు ఉన్నాయి. శరీర పోషణకు తియ్య దానిమ్మ దోహదం చేస్తుంది. దానిమ్మ పండులో 75 శాతం తేమ, అధిక మోతాదులో సేంద్రియ లవ ణాలు, పిప్పిపదార్థం ఉంటాయి. "సి" విటమిన్‌ పుష్కలం.


దానిమ్మలో పోషకాల విలువలు: 
 • పిండి పదార్థాలు 14.6 గ్రాములు, 
 • క్రొవ్వు పదార్థాలు 0.1 గ్రాము, 
 • మాంస కృత్తులు 1.6 గ్రాములు, 
 • కాల్షియం 10 మిల్లీగ్రాములు, 
 • భాస్వరం 70 మిల్లీగ్రాములు, 
 • మెగ్నీషియం 12 మిల్లీగ్రాములు, 
 • ఇనుము 0.3 మిల్లీగ్రాములు, 
 • సోడి యం 4 మిల్లీగ్రాములు, 
 • పొటాషియం 171 మిల్లీ గ్రాములు, 
 • పీచు పదార్థం 5.1 మిల్లీగ్రాములు చొప్పున  ఉంటాయి. 
వైద్య సంబంధ ఉపయోగాలు 
 1. చర్మ వ్యాధులను అరికట్టడంలో రారాజు. రక్తమును శుభ్రపరుస్తుంది. 
 2. రక్తములో రోగమాలిన్యములు చేరినందువలన కలుగు అన్ని రకాల చర్మవ్యాధులను దానిమ్మ నయం చేస్తుంది. 
 3. చర్మము మీద కురుపులు లేచినప్పుడు పుల్ల దానిమ్మ రసము నీటితో కలిపి ఆ నీటిలో ముంచిన గుడ్డను పుండ్లపై ఉంచినచో ఆ కురుపులు తగ్గిపోవును. 
 4. దానిమ్మపండు రసమును చర్మమునకు ప్రతిదినము రుద్ది స్నానము చేసిన ఎడల చర్మ సౌందర్యము ఇనుమడించును. 
 5. చర్మము మృదువుగా అగును. చర్మ రంధ్రములు వికసించి, చెమటపోయు స్వభావము వృద్ధి అగును. తద్వారా రక్తములోని దోషము లన్నియు చర్మము ద్వారా (చెమట ద్వారా) బహిష్క రించబడును. 
 6. దానిమ్మ రసమును నేతితో కలిపి ప్రతిరోజు ముఖమునకు రాసుకుని, సున్ని పిండితో నలుగు పెట్టినచో మొటిమలు మాయమగును. 
 7. తియ్య దానిమ్మ పండ్లు క్షయ, ఉబ్బసము, రక్తక్షీణత, మూత్రవ్యాధులు మూత్రపిండాల వాపు, చర్మ వ్యాధులు, జీర్ణకోశ సంబంధమైన వ్యాధులనన్నింటిని నయం చేయుటయేగాక, మానసికోల్లాసమును కలిగించి కన్నులకు, మెదడుకు మేలు చేయును. గుండెజబ్బు, బలహీనరోగులు తియ్యదానిమ్మ గింజలు తినుటవలన బలము, శక్తి చేకూరును. పుల్లదానిమ్మ గర్భవతులకు కలుగు వేవిళ్లను, రక్త క్షీణతను నివారించును. 
 8. అన్నహితవు లేనివారు, అగ్ని మాంద్యమున్నవారు. దానిమ్మ గింజలను నిత్యము తీసుకొనిన ఎడల, ఆ బాధలు తగ్గి అన్న హితవు ఏర్పడును. చిగుళ్లను గట్టి పరచును. 
 9. దంతక్షయాన్ని నివారించును. నోటిలోను, గొంతులోను గల పుండ్లను మాన్పును. రెండు చెంచాల దానిమ్మ గింజల రసాన్ని, రెండు చెంచాల తేనెతో కలిసి రెండు చెంచాల దానిమ్మ గింజల రసాన్ని, రెండు చెంచాల తేనెతో కలిపి ప్రతిరోజు సేవిస్తే పసికర్లు, అధిక రక్తపోటు, బ్రాంఖైటిస్‌, కామెర్లు, హెపటైటిస్‌, తదితర వ్యాధులను నివారించవచ్చు. 
 10. ప్రతిరోజు ఒక చెంచా దానిమ్మగింజల రసాన్ని సేవిస్తే క్యాన్సర్‌, జీర్ణాశయంలో నులిపురుగులు తదితర వ్యాధులను నివారించవచ్చు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top