నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్
అందం ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అందం ఆరోగ్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

మగని ప్రేమకు గుర్తుగ మగువ ముక్కుపుడక - Mukkupudaka, Nose Ring

మగని ప్రేమకు గుర్తు మగువ "ముక్కుపుడక"
'మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక' అన్నాడో కవి. ఆడవారు ముక్కుపుడక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఆడవారు ముక్కుపుడక ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మీకు తెలుసా? సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అని అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఏడు, పదకొండు సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయస్సులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట.
ముక్కుకి కుడివైపున
ముక్కుకి కుడివైపున ముక్కుపుడక ధరించిన స్త్రీ 
ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒకరాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఎడమవైపున చంద్రనాడి టుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు. ముక్కు, చెవులకు రంధ్రాలు చేయడం శరీరారోగ్యానికి మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఆరోగ్య ఫలితాలు:
 • కొండగాలి తగలడం వల్ల తరచూ ముక్కుకు సంబంధించిన రొంప, పార్శ్వ నొప్పి, ముక్కు దిబ్బడ, సైనస్‌లు పూడుకుపోవడ వంటి సమస్యలు వస్తుంటాయి. వీటినుంచి రక్షణ కోసం గిరిజన మహిళలు ముక్కుపుడక వంటివి విధిగా ధరిస్తారు. 
 • మరోవైపు ముక్కు ఎడమవైపున ముక్కుపుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయట. 
 • పురుటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవడానికి సహకరిస్తుందట. 
 • కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. 
 • చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు, చెవుడు వంటివి కలుగకుండా ముక్కుపుడక సహాయపడుతుంది. 
 • అంతేకాదు దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు ధరిచేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెప్తున్నారు.
ఇంకా అందం కోసం ముక్కుపుడకను ధరించే మహిళలు ఎక్కువ. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది. దేవతలందరికీ అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు.

అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.

పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కు కుట్టించి బంగారుతీగ చుట్టించేవారు పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టేవారు ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు .

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

2, సెప్టెంబర్ 2019, సోమవారం

వక్షోజాలు ఉన్నది బిడ్డలకి పాలివ్వడానికే, అదే ఆరోగ్యదాయకం - Breastfeeding


వక్షోజాలు ఉన్నది బిడ్డలకి పాలివ్వడానికే, అదే వాటికి క్షేమ దాయకం కూడా !

మన శరీరంలో ప్రతి అవయవానికీ ఒక నిర్దిష్టమైన పని ఉంటుంది. మనల్ని దేవుడు పుట్టించాడని నమ్మే వాళ్ళు, లేక డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఇద్దరూ ఒప్పుకొనే మాట ఇది. స్త్రీలలో  వక్షోజాలుపాత్ర బిడ్డలకి పాలివ్వడం. మానవుల కన్నా పరిణామ క్రమంలో కింద ఉన్న జంతువులు ఈ పనిని నిర్వహిస్తూ ఉంటే ఉన్నత స్థానంలో ఉన్న మానవులు ఇటీవల దీనిని విస్మరిస్తూ ఉన్నారు. స్త్రీల రొమ్ములని పాలిచ్చే అవయవంగా కాక ఒక లైంగిక వస్తువుగా, సుఖాన్నిచ్చే సాధనంగా మార్చి వేస్తున్నారు.

రొమ్ములు చిన్నవిగా ఉన్నవాళ్ళు సిలికాన్ ఇంప్లాంట్స్‌తో ఆపరేషన్ ద్వారా వాటిని పెద్దవి చేసుకోవడం, బిగి సడలి జారిపోయాయి అనికున్నవాళ్ళు mastopexy అన్న ఆపరేషన్‌తో వక్షోజాలు రూపు మార్చుకోవడం ఇందులో భాగమే. అయితే రొమ్ములు కప్పుకోవడం తెలియని నాగరికత పూర్తిగా నెర్చుకోని తెగల్లోని వారు రొమ్ములని కేవలం పిల్లలలి పాలిచ్చే భాగాలుగా మాత్రమే చూస్తారని, వాళ్లకి అవి శృంగార సాధనాలు అన్న భావన ఉండదని శాస్త్రవేత్తలు చెబుతారు,

సినిమాలలో, మోడలింగ్‌లో రొమ్ములని చూపిస్తూ వాటికి sex objects ముద్ర వేస్తున్నారు. మగవారు చేసే ఈ పనికి ఆడవారు కూడా సహకరిస్తూ తమని తాము sex objects గా మార్చుకుంటున్నారు. అందులో భాగంగా బిడ్డలకి పాలివ్వడం తమ పాలిండ్ల సౌందర్యాన్ని పాడు చేస్తుందన్న అపోహ. రొమ్ముల బిగి సడలిపోతుందని సినిమా స్టార్లు, మోడల్సే కాక చాలా మంది ఆడవాళ్ళు పిల్లలకి తల్లిపాలు దూరం చేస్తున్నారు. చంటి బిడ్డలకి తల్లిపాలు ఆరోగ్యంతో బాటు రోగ నిరోధక శక్తి కూడా ఇస్తుందని డాక్టరు చెబుతున్నా వీరికి ఎక్కడం లేదు. ఇప్పుడు ఇలాంటి వారి కళ్ళు తెరిపించే నిజం మరొకటి నిపుణులు తెలుసుకున్నారు.

పిల్లలకి పాలివ్వడం ద్వారా తల్లికి రొమ్ము కాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కేన్సర్ కలిగించే కొన్ని రకాల హార్మోన్లు తగ్గిపోయి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం ఉండదనీ, అలాగే రొమ్ముల్లో DNA లో మార్పు వచ్చిన కణాలు పాలివ్వడం ద్వారా తగ్గిపోతాయనీ, ఇలాంటి కణాలే ఉత్తరోత్తరా కేన్సర్ కలిగిస్తాయనీ, ఇవి తగ్గి పోవడం ద్వారా కేన్సర్ ప్రమాదం కూడా తగ్గిపోతుందనీ నిపుణులు చెబ్తున్నారు.


సంకలనం: సురేష్

4, సెప్టెంబర్ 2018, మంగళవారం

నుదుట బొట్టు ఎందుకు పెట్టుకోవాలి - Bottu Pettukovadam

నుదుట బొట్టు ఎందుకు పెట్టుకోవాలి - Bottu Pettukovadam
అందం కోసమైతేనేం ఆధ్యాత్మికత కోసమైతేనేం... ఆడామగా పిల్లాపెద్దా అంతా నుదుట బొట్టు ధరించడం సనాతన సంప్రదాయం.
చందనం, విభూతి, కుంకుమ... వీటిలో ఏది ధరించినా మంచిదేనంటోంది హైంధవ ధర్మం.

నుదుటిలో రెండు కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞాచక్రంమీద వేలితో నొక్కుతూ సిందూరాన్ని దిద్దుకోవడంవల్ల అక్కడి నరాలు ఉత్తేజితమై జ్ఞాపకశక్తినీ ఆలోచనాశక్తీ పెంపొందిస్తాయని యోగశాస్త్రం చెబుతోంది. 

పద్మపురాణం, ఆగ్నేయ పురాణం, పరమేశ్వర సంహితలోనూ బొట్టు ప్రస్తావన కనిపిస్తుంది. నుదుటనే ఎందుకు బొట్టు ధరించాలన్నదానికి అనేక కారణాలు ఉన్నాయి. నుదుటి భాగాన్ని జ్ఞాననేత్రం, శక్తికేంద్రంగానూ అభివర్ణిస్తుంటారు.
అయితే అది పీనియల్‌ గ్రంథి స్థానమనీ దీనికీ మూడోకంటి అవశేషానికీ సంబంధం ఉందంటారు. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లని పెంపొందించి ఒత్తిళ్ళను దూరం చేస్తుందనీ మంచి ఆలోచనలు కలిగించేందుకు తోడ్పడుతుందనీ చెబుతారు శాస్త్రనిపుణులు. వీటన్నిటికీ తోడు బొట్టు ముఖానికి ఎనలేని అందాన్నిస్తుంది కూడా.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

9, మే 2018, బుధవారం

అద్భుత సుగుణాలు కలిగిన దాన్నిమ్మ పండు - pomegranate health

 సుగుణాల దానిమ్మ
దానిమ్మ పండు పుట్టిల్లు ఆఫ్ఘనిస్తాన్‌. క్రమేపీ భారతదేశంతో సహా ప్రపంచమంతా విస్తరించింది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోను, అన్ని కాలాలలోను లభిస్తుంది. దానిమ్మ పండు రెండు రకాలు. ఒకటి పుల్ల దానిమ్మ, రెండు తియ్య దానిమ్మ. క్షయ తదితర కొన్ని రకాల వ్యాధిగ్రస్తులు పుల్లని పండ్లను తినరాదు. అయితే పుల్ల దానిమ్మను మాత్రం నిరభ్యంతరంగా తినవచ్చు. ఇది పుల్ల దానిమ్మ యొక్క విశేష గుణంగా చెప్పుకోవచ్చు. గృహవైద్యంగా ఎక్కువగా ఉపయోగపడే పుల్ల దానిమ్మ పండులో శరీర సౌందర్యాన్ని, ముఖ వర్చ స్సును ఇనుమడింపచేసే గుణ గణాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకించి చర్మవ్యాధులను అరికట్టడం, నివారించటం దానిమ్మ విశిష్టత. పుల్ల దానిమ్మ కన్నా తియ్య దానిమ్మలో మరెన్నో అదనపు సుగుణాలు ఉన్నాయి. శరీర పోషణకు తియ్య దానిమ్మ దోహదం చేస్తుంది. దానిమ్మ పండులో 75 శాతం తేమ, అధిక మోతాదులో సేంద్రియ లవ ణాలు, పిప్పిపదార్థం ఉంటాయి. "సి" విటమిన్‌ పుష్కలం.


దానిమ్మలో పోషకాల విలువలు: 
 • పిండి పదార్థాలు 14.6 గ్రాములు, 
 • క్రొవ్వు పదార్థాలు 0.1 గ్రాము, 
 • మాంస కృత్తులు 1.6 గ్రాములు, 
 • కాల్షియం 10 మిల్లీగ్రాములు, 
 • భాస్వరం 70 మిల్లీగ్రాములు, 
 • మెగ్నీషియం 12 మిల్లీగ్రాములు, 
 • ఇనుము 0.3 మిల్లీగ్రాములు, 
 • సోడి యం 4 మిల్లీగ్రాములు, 
 • పొటాషియం 171 మిల్లీ గ్రాములు, 
 • పీచు పదార్థం 5.1 మిల్లీగ్రాములు చొప్పున  ఉంటాయి. 
వైద్య సంబంధ ఉపయోగాలు 
 1. చర్మ వ్యాధులను అరికట్టడంలో రారాజు. రక్తమును శుభ్రపరుస్తుంది. 
 2. రక్తములో రోగమాలిన్యములు చేరినందువలన కలుగు అన్ని రకాల చర్మవ్యాధులను దానిమ్మ నయం చేస్తుంది. 
 3. చర్మము మీద కురుపులు లేచినప్పుడు పుల్ల దానిమ్మ రసము నీటితో కలిపి ఆ నీటిలో ముంచిన గుడ్డను పుండ్లపై ఉంచినచో ఆ కురుపులు తగ్గిపోవును. 
 4. దానిమ్మపండు రసమును చర్మమునకు ప్రతిదినము రుద్ది స్నానము చేసిన ఎడల చర్మ సౌందర్యము ఇనుమడించును. 
 5. చర్మము మృదువుగా అగును. చర్మ రంధ్రములు వికసించి, చెమటపోయు స్వభావము వృద్ధి అగును. తద్వారా రక్తములోని దోషము లన్నియు చర్మము ద్వారా (చెమట ద్వారా) బహిష్క రించబడును. 
 6. దానిమ్మ రసమును నేతితో కలిపి ప్రతిరోజు ముఖమునకు రాసుకుని, సున్ని పిండితో నలుగు పెట్టినచో మొటిమలు మాయమగును. 
 7. తియ్య దానిమ్మ పండ్లు క్షయ, ఉబ్బసము, రక్తక్షీణత, మూత్రవ్యాధులు మూత్రపిండాల వాపు, చర్మ వ్యాధులు, జీర్ణకోశ సంబంధమైన వ్యాధులనన్నింటిని నయం చేయుటయేగాక, మానసికోల్లాసమును కలిగించి కన్నులకు, మెదడుకు మేలు చేయును. గుండెజబ్బు, బలహీనరోగులు తియ్యదానిమ్మ గింజలు తినుటవలన బలము, శక్తి చేకూరును. పుల్లదానిమ్మ గర్భవతులకు కలుగు వేవిళ్లను, రక్త క్షీణతను నివారించును. 
 8. అన్నహితవు లేనివారు, అగ్ని మాంద్యమున్నవారు. దానిమ్మ గింజలను నిత్యము తీసుకొనిన ఎడల, ఆ బాధలు తగ్గి అన్న హితవు ఏర్పడును. చిగుళ్లను గట్టి పరచును. 
 9. దంతక్షయాన్ని నివారించును. నోటిలోను, గొంతులోను గల పుండ్లను మాన్పును. రెండు చెంచాల దానిమ్మ గింజల రసాన్ని, రెండు చెంచాల తేనెతో కలిసి రెండు చెంచాల దానిమ్మ గింజల రసాన్ని, రెండు చెంచాల తేనెతో కలిపి ప్రతిరోజు సేవిస్తే పసికర్లు, అధిక రక్తపోటు, బ్రాంఖైటిస్‌, కామెర్లు, హెపటైటిస్‌, తదితర వ్యాధులను నివారించవచ్చు. 
 10. ప్రతిరోజు ఒక చెంచా దానిమ్మగింజల రసాన్ని సేవిస్తే క్యాన్సర్‌, జీర్ణాశయంలో నులిపురుగులు తదితర వ్యాధులను నివారించవచ్చు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

19, ఏప్రిల్ 2018, గురువారం

తల నూనె ఇంట్లోనే ఎలా తాయారు చేసుకోవాలి - Hair Oil

 కావలసిన పదార్ధాలు ....

1. స్వచ్చ మైన కొబ్బెర నూనె .... 500 ml. ( శుద్ధి చేయని కొబ్బరి నూనె ).

2. ఉసరి కాయల పొడి .... 100 గ్రాములు.

తయారు చేయు విధానము....

కొబ్బెర నూనెను పాత్రలో వేసి కొద్దిగ వేడి చేయ వలెను . ఉసరి పొడిని కలిపి , చిన్న మంట మీద , కొబ్బెర నూనె బాగా నల్లగ అయ్యేంత వరకు మరగించి , చల్లారిన తర్వాత వడ బోసి , నిల్వ చేసు కొన వలెను .

ప్రతి రోజు నూనెను వాడ వలెను.

ప్రతి రోజు నూనెను వాడిన చుండ్రు , జుట్టు రాలడం , వెంట్రుకలు చిట్లి పోవడం  నివారించ బడును . క్రొత్త వెంట్రుకలు వచ్చును . వెంట్రుకలు  silky & shine గా తయారవును .


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

17, ఏప్రిల్ 2018, మంగళవారం

చర్మం మరియు పాదాలపై పగుళ్ళకు - మీ ఇంటిలోనే గృహ వైద్యం - Charmam, Paadala Pagullu

charmam-padalaku-ayurveda-chikista
శరీరం , చేతులు , మోచేతులు , పాదాల పగుళ్ళు ?

అరచేతులు , మోచేతులు నల్లగ వున్నాయా ? శరీరం , పాదాలు పగిలినవా ( Cracks ) ?

గృహ చికిత్సలు .....

1 . పాదాల పగుళ్ళకు

ప్రతి రోజు ..

( A )  ఆముదం + Rose Water + నిమ్మ రసంలను సమ పాళ్ళల్లో కలిపి , పాదాలు పగిలిన చోట ప్రతి రోజు 2 లేక 3 సార్లు పూయవలెను . ( Or )

( B ) పుట్ట మైనంను కొద్దిగా వేడి చేస్తే కరిగి పోవును .
తర్వాత
కరిగిన మైనం + మైనం బరువులో సగ భాగం ఆవాల నూనెను మొత్తం మైనంలో కలుపవలెను .
ఒక పాత్రలో నీళ్ళు పోసి , ఆ పాత్రలో  నూనెను కలిపిన మైనంను వేయవలెను .
కొద్ది సేపటి తర్వాత నీళ్ళను వడబోయవలెను. అప్పుడు క్రింద వున్న పదార్దాన్ని , గాజు సీసాలో నిల్వ చేసుకొనవలెను .
*రాత్రి పడుకునే ముందర కాళ్ళ పగుళ్ళకు పూయవలెను .
( 7 రోజుల్లో సమస్య తొలగి పోవును )

( C )  *రాత్రి పడుకునే ముందర .

వేడి చేసిన కొబ్బెర నూనెను పాదాల పగుళ్ళకు పూయవలెను .
ఉదయం .
Socks లను తీసివేసి , వేడి నీళ్ళల్లో పాదాలను 15 నిమిషాలు వుంచవలెను .
తర్వాత..
పగుళ్ళను నిదానముగా బ్రష్ తో శుభ్రం చేయవలెను .
తర్వాత
శుభ్రంగా పాదాలను తుడిచి నూనెను పూయవలెను . ( Or )

(D ) 1 spoon మైనం ( wax ) + 1 spoon స్వదేశి ఆవు నెయ్యిని కలిపి వేడి చేయవలెను . కరిగిన పదార్ధం , వేడి చుక్కలను పాదాలా పగుళ్ళల్లో వేయవలెను .
( పాదాల పగుళ్ళు తగ్గే వరకు ప్రతి రోజు ఆచరించవలెను )  (or )

( E )  25 గ్రాముల మైనం + 100 గ్రాముల ఆవాల నూనెను వేసి , ఒక పొంగు వచ్చే వరకు మరగించవలెను . నూనె చల్లారక మునుపే ఒక వెడల్పు మూతి కలిగిన పాత్రలో నిల్వ చేసుకొనవలెను .
చల్లారిన తర్వాత  ointment లాగ తయారవును .
చర్మ పగుళ్ళు , పాదాల పగుళ్ళకు పూయవలెను .
( పగుళ్ళు తగ్గిపోవును . ఒక వేళ మొదట పగుళ్ళు పెరిగిన , నిదానముగా తగ్గిపోవును .
ప్రతి రోజు క్రమంగా ointment లాగా పూయవలెను ) .

2. పాదాల  joint దగ్గర వాపు . ( Bunions ) 
 • పాదాల ఎముకల joint దగ్గర వాపు ఉన్న చోట ..
 • గోరింటాకుల పేష్ట్ ని లేపనంలాగా పూసి కట్టు కట్టవలెను . 
 • 2 లేక 3 గంటల తర్వాత కట్టు విప్పి , శుభ్రం చేసుకొనవలెను .
( కొన్ని రోజులలో వాపు , నొప్పి తగ్గిపోవును )

3. చలికాలం ..
 • గ్లిసరిన్ లో + నిమ్మరసం ని కలిపి ..
 • చలికాలం లో నీళ్ళల్లో తడిసి , పగలిన శరీరం , చేతులు మరియు కాళ్ళకు పూయవలెను . 
( పగుళ్ళు తగ్గిపోవును )

4. గోళ్ళు ....
 • నిమ్మ తొక్కని గోళ్ళ పైన పూసిన , గోళ్ళు కాంతివంతంగా తయారవును .
5. నిమ్మ తొక్కతో అరచేతులు , మోచేతి , మోకాళ్ళు , పాదాలలో నలుపు వున్న చోట బాగా రుద్దవలెను .
తర్వాత
వేడి నీళ్ళతో శుభ్రంగా చేసుకొనవలెను .

( నలుపు తొలగి పోవును )

పై పద్దతులను ఆచరించండి , ఆరోగ్యాని పొందండి .

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

22, జనవరి 2018, సోమవారం

ముఖాన ఉన్న నల్లమచ్చలు ఇలా తొలగించాలి ! - An easy tip to remove the Blockheads in the face

ముఖాన ఉన్న నల్లమచ్చలు ఇలా తొలగించాలి ! - An easy tip to remove the Blockheads in the face

ముఖంపై బ్లాక్‌హెడ్స్‌ని తొలగించే సులువైన చిట్కా…
 • ఒక గిన్నె నిండా నీళ్లు బాగా మరగించండి, నీళ్లు బాగా కాగిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి, టవల్‌తో గాని దుప్పటితో గాని తల మీద కప్పుకుని ఆ నీటితో ముఖాన ఆవిరి పట్టండి. 
 • ఇలా 5 నుంచి 10 నిమిషాలు ఆవిరి పట్టండి. 
 • తరువాత ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టీ స్పూన్ నీళ్లు తీసుకుని పేస్ట్‌లా చేయాలి. 
 • ఈ మిశ్రమంతో ముఖంపై బాగా స్ర్కబ్ చేసుకోవాలి. 
 • ఆ తరువాత కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకుని ముఖంపై బ్లాక్‌హెడ్స్‌ ఉన్న ప్రాంతంలో లేయర్‌లా పట్టించుకోవాలి, దానిపై టిష్యూ అతికించాలి, మళ్లీ ఇంకోసారి టిష్యూపై ఎగ్ వైట్ కోటింగ్ అప్లై చేయాలి. 
 • అది బాగా ఆరిన తర్వాత పీల్ ఆప్ చేయాలి. ఆ టిష్యూతో పాటు మీ ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్‌ అన్నీ వచ్చేస్తాయి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

ఆకర్షణీయమైన గోళ్ల కోసం అద్భుతమైన చిట్కా ! - Excellent tip for attractive Nails,

ఆకర్షణీయమైన గోళ్ల కోసం అద్భుతమైన చిట్కా ! - Excellent tip for attractive Nails,

ఆకర్షణీయమైన గోళ్ల కోసం…
నిమ్మరసంలో చేతిగోళ్లు, కాలిగోళ్లు కాసేపు నానబెట్టడం వల్ల అవి బలంగా మారడంతోపాటు, గోళ్లు విరిగిపోకుండా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, గోళ్ల రంగు మారడం వంటి సమస్యలను కూడా నిమ్మరసం అరికడుతుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

15, జనవరి 2018, సోమవారం

పెదాలకు లిప్ గ్లాస్‌ పెట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ! - Pedavulaku lip gloss on the lips

పెదాలకు లిప్ గ్లాస్‌ పెట్టేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ! - Pedavulaku lip gloss on the lips

పెదాలకు లిప్ గ్లాస్‌ను వేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు…

పెదాలకు లిప్ గ్లాస్‌ను వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే అసలైన అందం మీ సొంతం అవుతుంది. పెదాలకు రంగు ఇచ్చే సాధనం పేరే లిప్ గ్లాస్. ఇది పెదాలను కళకళలాడించడమే గాక మృదువుగా ఉంచేందుకు కూడా తోడ్పడుతుంది.

లిప్ స్టిక్ పై దీనిని వాడొచ్చు. లేకుంటే లేతగా కన్పించేందుకు దీనిని మాత్రమే వాడవచ్చు. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కలిగిన లిప్ గ్లాస్‌లు కూడా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. లిప్‌స్టిక్‌పై దీనిని వాడే సమయంలో గట్టిగా రుద్దకూడదు. లేకుంటే లిప్‌స్టిక్ అలాగే కారిపోతుంది.

తక్కువగా అప్లై చేయాలి: లిప్ గ్లాస్ అప్లై చేసే ముందు తక్కువగా అప్లై చేయాలి. తక్కువగా అప్లై చేసినప్పుడు పెదాలు తడిగా, నిండుగా జ్యూసిగా కనబడుతాయి. లిప్ స్టిక్ అప్లై చేసిన తర్వాత మరింత అందంగా కనబడాలంటే, లిప్ స్టిక్ తర్వాత మినిమాల్ లిప్ గ్లాస్ అప్లై చేయాలి. లిప్ గ్లాస్ అప్లై చేసేటప్పుడు పెదవులకు చివరగా అప్లై చేయకూడదు. అలా చేయండం వల్ల పెదవుల క్రిందిగా లిప్ గ్లాస్ కారినట్లు కనబడుతూ అస్యహ్యంగా ఉంటుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

జుట్టు రాలడాన్నినివారించే సులభమైన విధానం - How to Stop hair loss

జుట్టు రాలడాన్నినివారించే సులభమైన విధానం - How to Stop hair loss

జుట్టు రాలడాన్నినివారించే సింపుల్ హెయిర్ ప్యాక్…

మెంతులు జుట్టుని నల్లగా, నిగనిగలాడేలా చేసి చుండ్రుని నివారిస్తాయి. 
 • 4 టేబుల్ స్పూన్ల మెంతులను గోరువెచ్చని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. 
 • ఉదయాన్నే మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. 
 • అందులో అర నిమ్మకాయ రసం, 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. బాగా మిక్స్ చేసి, జుట్టుకి, స్కాల్ఫ్‌కి పట్టించి 20 నిమిషాల తర్వాత మైల్డ్ కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. 
 • ఇలా వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలడాన్ని పూర్తీగా అరికట్టవచ్చు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కురులు చిట్లిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - Juttu samrakshana ( Hair rupture Control )

కురులు చిట్లిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - Juttu samrakshana ( Hair Fall Control )

జుట్టు చిట్లిపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు…

జుట్టు చివర్లు చిట్లిపోవడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా కారణమే. జుట్టుని టవల్‌తో ఎక్కువగా రుద్ద కూడదు, తడి జుట్టుని దువ్వకూడదు. చిక్కు తీయడానికి పెద్ద పళ్లు ఉన్న దువ్వెన ఉపయోగించాలి. అలాగే జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రొటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్, విటమిన్ A, C, సెలీనియం వంటివి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. 

ఈ చిన్న చిట్కాలు మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

మీ పాలిపోయిన చర్మానికి చక్కటి సౌందర్య చిట్కా - Beauty tip for your pale skin

మీ పాలిపోయిన చర్మానికి చక్కటి సౌందర్య చిట్కా - Beauty tip for your pale skin

పాలిపోయిన రూపాన్ని కవర్ చేయడానికి బ్యూటీ చిట్కాలు…
 • కలర్స్ ఉపయోగించండి: పాలిపోయిన చర్మంనకు ప్రకాశవంతమైన మరియు ముదురు రంగు సౌందర్య సాధనాలు అందముగా ఉంటాయి. మేకప్ కోసం ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించండి. ఫెయిర్ చర్మం కలిగిన వారు పింక్, పర్పుల్ మరియు ఎరుపు వంటి ప్రకాశవంతమైన లిప్ కలర్స్ ఉపయోగించాలి.  
 • గోర్లకు: ఫెయిర్ మరియు పాలిపోయిన చర్మం గల వారు గోర్లకు సొగసైన రంగులను ఉపయోగించాలి. రంగులు పాలిపోయినట్లుండే చర్మంను సజీవంగా కనిపించేలా చేస్తాయి.  
 • ఫౌండేషన్ పరిశీలించండి: పాలిపోయిన చర్మం కోసం అవసరమైన మేకప్ చిట్కా ఏమిటంటే చర్మంనకు అనువైన ఫౌండేషన్ ఉపయోగించటం అని చెప్పవచ్చు. చర్మంకి మృదువైన బేస్ రావాలంటే ఫౌండేషన్స్ అవసరం. అంతేకాక ఇది చర్మం టోన్ చేయడానికి కూడా సహాయపడుతుంది.  
 • కళ్ళు: పాలిపోయిన చర్మం కోసం మేకప్ చిట్కా ఏమిటంటే ఒక ముదురు రంగు మస్కార మరియు ఐలైనర్ ఉపయోగించుట వలన మీ కళ్ళు అందముగా ఉండటానికి సహాయపడుతుంది. ముదురు మస్కార కంటి అంచున ఉండే రోమములకు ఉపయోగిస్తే కళ్ళు మరింత పెద్దవిగా కనిపిస్తాయి. తేలికపాటి రంగులను కంటి షాడోస్‌గా ఉపయోగించాలి. పాలిపోయిన చర్మం కలవారు సాధ్యమైనంత కంటి అలంకరణ చేసుకోవాలి. 
 • కాంస్య మరియు బ్రౌన్: పాలిపోయిన చర్మ టోన్‌తో ఉన్నవారు ఆకర్షణీయమైన మరియు కాంస్య మేకప్‌తో అందముగా కనిపిస్తారు. పాలిపోయినట్లుండే చర్మం గల వారి కోసం రాగి జుట్టుతో కాంస్య రూపం ఖచ్చితంగా ఉంటుంది. కాంస్య మేకప్ కొరకు కాంస్య చేరిక కలిగిన ఫౌండేషన్ ఉపయోగించాలి.  
 • మీ బుగ్గలకు బ్లష్ ఉపయోగించండి: మీ బుగ్గలపై ఒక బ్లుష్ ఉపయోగించడం మర్చిపోకండి. మీ మేకప్ కొరకు ఒక బ్లుష్ తప్పనిసరి అవుతుంది. పాలిపోయిన చర్మం గ్లో మరియు అందముగా కనిపించటానికి కొద్దిగా బ్లష్ అవసరం. బ్లుష్ కొరకు గులాబీ లేదా లావెండర్ షేడ్స్ ఉపయోగించండి.

10, జనవరి 2018, బుధవారం

జుట్టు చిట్లిపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు - Juttu Raalakunda undenduku jagrattalu - Hair care

జుట్టు చివర్లు చిట్లిపోవడానికి మనం చేసే చిన్న చిన్న తప్పులు కూడా కారణమే. జుట్టుని టవల్‌తో ఎక్కువగా రుద్ద కూడదు, తడి జుట్టుని దువ్వకూడదు. చిక్కు తీయడానికి పెద్ద పళ్లు ఉన్న దువ్వెన ఉపయోగించాలి.

అలాగే జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రొటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్, విటమిన్ A, C, సెలీనియం వంటివి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఈ చిన్న చిట్కాలు మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి