ప్రాచీన గ్రంథాలు వాటి వివరములు - Prachina Grandhalu

0
ప్రాచీన గ్రంథాలు వాటి వివరములు - Prachina Grandhalu
వేదకాలం నుండే మనదేశంలో అనేక శాస్త్రాల అధ్యయనం జరి గింది. అనేక విజ్ఞానశాస్త్ర గ్రంథాలు వెల్లివిరిశాయి. 

వాటిలో కొన్ని:
 • అక్షరలక్ష: ఇది సర్వశాస్త్ర సంగ్రహం. దీనికర్త వాల్మీకి. రేఖాగణితం, బీజ గణితం, త్రికోణమితి, భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలు, ఖనిజశాస్త్రం, జల (యంత్ర) శాస్త్రం, భూగర్భశాస్త్రం, గాలి, ఉష్ణము, విద్యుత్తులను కొలిచే పద్ధతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెలుపబడ్డాయి.
 • గజశాస్త్రం: కుమారస్వామి ప్రణీతం. ఏనుగుల శరీర లక్షణాల్ని పరీక్షించడానికి 16 పద్ధతులు. ఇంకా అనేక విషయాలు సవివరంగా చర్చించబడ్డాయి.
 • లక్షణశాస్త్రం: శకటాయన ఋషి ప్రణీతం, చైతన్య, జడసృష్టుల లింగ నిర్దారణ శాస్త్రం.
 • రత్నపరీక్ష: వాత్సాయన ఋషి ప్రణీతం. రత్నాల 24 లక్షణాలు సహజ - కృత్రిమ రత్నాలు. వాటి రూపములు, బరువు మొదలైన
 • విషయాలన్నీ తరగతులవారీగా విభజించి తర్కించబడ్డాయి. రత్నాల శుద్ధతను పరీక్షించడానికి 32 పద్ధతులు వర్ణించబడ్డాయి.
 • మల్లశాస్త్రం: మల్ల ప్రణీతం.ఆరోగ్య పరిరక్షణకు కసరత్తులు, క్రీడలు వివరించబడ్డాయి. వట్టిచేతులతో చేసే 24 రకాల యుద్ధ విద్యలు చెప్పబడ్డాయి.
 • శిల్పశాస్త్రం: కశ్యప ఋషిప్రణీతం 22 అధ్యాయాల్లో 307 రకాల శిల్పాలను గూర్చి (101 రకాల విగ్రహాలతో కలిపి) కూలంకషంగా చర్చించబడింది. గుళ్లు, రాజభవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు వెయ్యికి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రంమీద విశ్వామిత్రుడు, మయుడు, మారుతి, ఛాయా పురుషుడు మున్నగువారు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చించబడ్డాయి.
 • ధాతుశాస్త్రం: అశ్వనీకుమార ప్రణీతం. సహజ, కృత్రిమ ధాతువులను గూర్చి 7 అధ్యాయాలలో కూలం కషంగా విశదీకరించబడింది. మిశ్ర ధాతువులు, ధాతువుల రూపాంతరణ, రాగిని బంగారంగా మార్చడం మొదలైన విషయాలు కూడా వివరించబడ్డాయి
 • పరకాయ ప్రవేశం: వాలఖిల్య ప్రణీతం ఒక శరీరాన్ని వదలి ఇంకొక శరీరంలోనికి ప్రవేశించడం పరకాయ ప్రవేశం. 32 రకాల యోగ విద్యలను, అణిమాది అష్ట సిద్ధులను నేర్చుతుందీ శాస్త్రం.
 • అశ్వశాస్త్రం: అగ్నివర్మ ప్రణీతం. గుర్రములు, వాటికి సంబంధించిన శుభాశుభ చిహ్నాలు, దేహధర్మాలు, ఈనడం, తర్ఫీదు మొదలైన సమస్త విషయాలను కూలంకషంగా తెల్పుతుంది.
 • సాముద్రిక శాస్త్రం: సముద్రునిచే చెప్పబడి సాముద్రిక శాస్త్రంగా ప్రసిద్ధి పొందింది. శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనించి ఉన్నప్పుడు ఆయన శరీరంపై నున్న శుభ ముద్రలను సముద్రుడు తెలిపాడు. ఈ శాస్త్రం తదుపరి కాలంలో నారద, మాండవ్య, వరాహ, కార్తికేయాదులచే విస్తరింపబడింది. హస్తరేఖాశాస్త్రం ఇందులోనిదే.
 • సూపశాస్త్రం: సుకేశ ప్రణీతం.పాకశాస్త్రం సుమారు 108 రకాల వ్యంజనాలు, ఊరగాయలు, మిఠాయిలు, కేకులు, పిండి వంటలు మొదలైన అనేక రకాల వంటకాల గురించి ప్రపంచవ్యాప్తంగా వాడుకలో నున్న 3032 రకాల పదార్థాల తయారీ విధానం చెప్పబడింది.
 • విషశాస్త్రం: అశ్వనీకుమార ప్రణీతం. 32 రకాల విషాలు, వాటి గుణాలు, తయారీ, ప్రభావాలు, విరుగుళ్లు మొదలైన సమస్త విషయాలు చెప్పారు.
 • చిత్ర కర్మశాస్త్రం: భీమ ప్రణీతం. చిత్ర లేఖనం గూర్చిన శాస్త్రం. 12 అధ్యాయాల్లో సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియలను గురించి తెలుపబడింది. ఒక వ్యక్తియొక్క తలవెంట్రుకలనుగాని, గోటినిగాని, ఎముకనుగాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది
 • శకునశాస్త్రం: గర్గముని ప్రణీతం, పక్షుల ధ్వనులనుబట్టి, మనుష్యుల మాటలనుబట్టి శుభాశుభములను నిర్ణయించే విధానాలు తెలుపబడ్డాయి.
 • మాలినీ శాస్త్రం: ఋష్యశృంగ ప్రణీతం. పూల అమ రిక గురించి చెప్తుంది. మాలలు తయారుచెయ్యడం, పూల గుత్తులు (దీశీబనబవ్‌ర), పూలతో వివిధ రకాల శిరోలంకర ణలు, గుప్త భాషలో పూరేకుల మీద ప్రేమ సందేశాలు పంపడంవంటి అనేక విష యాలు 16 అధ్యాయాలలో విశదీకరించబడ్డాయి.
 • కాలశాస్త్రం: భగవాన్‌ కార్తికేయ ప్రణీతం. కాలం, కాలవిభన, శుభ-అశుభకాలాలు వాటి అధిదేవతలు మొదలైన విషయాలు విశదీకరించబడ్డాయి.
 • బ్దశాస్త్రం: కండిక ఋషి ప్రణీతం పేరుకు తగ్గట్టు ఇది సృష్టిలోని సమస్త చరాచర పదార్థాల ధ్వనుల్ని, ప్రతిధ్వనుల్నిగూర్చి చర్చించింది. యాంత్రికంగా ధ్వనుల్ని ప్రతి సృష్టించడం, నాటిస్థాయి, వేగాలను కొలవడంవంటి విషయాలు కూడా ఐదు అధ్యాయాలలో వివరించబడింది.
 • కన్యాలక్షణ శాస్త్రం: బభృముని ప్రణీతం కన్యాలక్షణాలను చర్చించిన ఈ శాస్త్రంలో సౌశీల్యాది విషయాలను నిర్ధారించే విధానాలు తెలుపబడ్డాయి.
 • మహేంద్రజాల శాస్త్రం: సుబ్రహ్మణ్యస్వామి శిష్యుడైన వీరబాహు ప్రణీతం. గారడీ విద్య వివరించబడింది. నీటిపై నడవడం, గాలిలో తేలడంవంటి భ్రమలను కల్పించే విధానాలు నేర్పుతుంది.
 • అర్ధశాస్త్రం : వ్యాస ప్రణీతం. 3 భాగాలు. 82 ధన సంపాదనా విధానాలు-ధర్మబద్ధమైనవి వివరించబడ్డాయి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top