నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label విజ్ఞానం. Show all posts
Showing posts with label విజ్ఞానం. Show all posts

Monday, November 9, 2020

ఐన్ స్టీన్ సిద్ధాంతం - హైందవ దృక్పథం : టైమ్ మెషీన్ - EINSTEIN'S THEORY IN HINDU PERSPECTIVE: The Time Machine

ఐన్ స్టీన్ సిద్ధాంతం - హైందవ దృక్పథం : టైమ్ మెషీన్ - EINSTEIN'S THEORY IN HINDU PERSPECTIVE: The Time Machine
టైమ్ మెషీన్
అసలు కాలంలో ప్రయాణించడం సాధ్యమేనా? టైమ్ మెషీన్ లాంటి యంత్రాల తయారీ సాధ్యమవుతుందా? వాటిలో కూర్చుని మనం భూతకాలానికీ, భవిష్యత్తుకీ వెళ్ళగలమా? అనే విషయాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ఐన్ స్టీన్ సమీకరణాలకు సాధించబడిన పరిష్కారాలు సిద్ధాంతపరంగా కాలంలో ప్రయాణం సాధ్యమేనని తెలియజేసాయి. ప్రిన్స్ టన్ లో ఐన్ స్టీన్ పొరుగువాడైన గణిత శాస్త్రవేత్త కుర్ట్ గోడెల్, కాలంలో ప్రయాణించదానికి ఉపకరించేలా ఐన్ స్టీన్ సమీకరణాలకు ఒక సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నాడు. కాలమనే నదీప్రవాహంలో సుడిగుండాలలాంటివి ఉంటాయనీ, అక్కడ కాలమనేది గుండ్రంగా చుట్టబెట్టబడి ఉంటుందనీ గోడెల్ తెలిపాడు.
   ఈ విశ్వమంతా కాలమనే నదీ ప్రవాహం చక్రంలా పరిభ్రమిస్తూ ఊంటుందనీ, ఆ చక్ర పరిభ్రమణం దిశలో ఎవరన్నా ప్రయాణిస్తే అతడు తిరిగి తను ప్రారంభించిన చోటికే తిరిగి వచ్చినట్లు గ్రహిస్తాడని, అయితే అది భూతకాలమనీ గోడెల్ వివరించాడు. కానీ కాలంలో ప్రయాణానికి ఉపకరించేలా తన సమీకరణాల నుండి పరిష్కారాలు ఉండటం తనను కదిలించి వేస్తోందని ఐన్ స్టీన్ తన స్వీయ చరిత్రలో వ్రాశాడు.

విశ్వమనేది చక్రీయంగా పరిభ్రమించదనీ, అది కేవలం విస్తరిస్తూ ఊంటుందనీ (బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం), కాబట్టి గోడెల్ చూపిన పరిష్కారాలను ఈ కారణంతో పక్కన పెట్టవచ్చని ఐన్ స్టీన్ భావింఛాడు. అంటే ఒకవేళ బిగ్ బ్యాంగ్ అనేది చక్రంలా తిరిగేది గనక అయితే విశ్వమంతటా కాలంలో ప్రయాణీంచడం సంభవమవుతుందని దీని అర్థం.
   1963 లో రాయ్ కెర్ర్ అనే గణిత శాస్త్రవేత్త చక్రీయంగా పరిభ్రమించే కృష్ణ బిలాలకు సంబంధించి ఐన్ స్టీన్ సమీకరణాలకు ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. కృష్ణ బిలాలు నాశనమయ్యాక అవి గిరగిరా తిరిగే ఒక న్యుట్రాన్ల వలయంలా ఏర్పడతాయనీ, అవి గురుత్వాకర్షణ శక్తికి లోనవకుండా అంతటా వ్యాపిస్తాయని ఇతడు తెలిపాడు.
    ఆ వలయాలు కాలంలో ప్రయాణించడానికి ఉపకరించే సొరంగ మార్గాలలాంటివని, వాటి గుండా ప్రయాణీంచే వానికి చావు అనేది ఉండదనీ, దాని గుండా ప్రయాణిస్తే మరో సమాంతర విశ్వానికి చేరుకోవచ్చనీ ఇతడు వివరించాడు. ఈ వలయాలనే “వార్మ్ హొల్స్” లేదా "ఐన్ స్టీన్ - రోసెన్ బ్రిడ్జ్" అంటారు. అప్పటి నుండి, ఐన్ స్టీన్ సమీకరణాలకు సంబంధించి వందలాది “వార్మ్ హోల్” పరిష్కారాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

‘వార్మ్ హొల్స్’ అనేవి శూన్యాకాశంలోని రెండు ప్రాంతాలనే కాక కాలంలోని వివిధ సమయసీమలను కూడా కలుపుతాయి. అంటే సిద్ధాంత పరంగా ఇవి ‘టైమ్ మెషీన్లు’ గా పనిచేస్తాయి. ఈ ‘వార్మ్ హోల్స్’ విశ్వమంతా వ్యాపించి ఉంటాయి. ఇవి కేవలం సైద్ధాంతిక బిలాలు మాత్రమే. ఈ ప్రత్యేక నిర్మాణాలు విశ్వంలో ఉండవచ్చునని శాస్తవ్రేత్తల నమ్మిక. ఇవి కాలంలో ప్రయాణించడానికి అనుకూలమైన రోడ్డు మార్గాలవంటివని ఐన్స్టీన్ భావించారు.
   అయితే ‘టైమ్ మెషీన్’ నిర్మాణంలో ఉన్న సమస్య ఏమిటంటే, కారుకు పెట్రోలు లేదా డీజిల్ ఎలా అవసరమో ఈ ‘టైమ్ మెషీన్’ పనిచేయాలంటే నక్షత్రాల శక్తిని నియంత్రించగలిగే సామర్థ్యం కావాలి లేదా ఏదైనా అసాధారణమైన పదార్థాన్ని కనుక్కో గలగాలి లేదా ఏదైనా మహత్తరమైన శక్తి అవసరం. దీనినే శాస్త్రవేత్తలు “నెగటివ్ ఎనర్జీ” (ఋణాత్మక శక్తి) అంటున్నారు.
   రెండు సమాంతర ప్లేట్ల సహాయంతో అతి కొద్ది పరిమాణంలో ఈ ఋణాత్మక శక్తిని శాస్త్రవేత్తలు సృష్టించగలిగారు. దీనినే ‘కాసిమిర్ ప్రభావం’ అంటారు. అయితే ఒక టైమ్ మెషీన్ పని చేయాలంటే భారీ పరిమాణంలో ఈ నెగటివ్ ఎనర్జీ అవసరమవుతుంది. మరి కొన్ని శతాబ్దాల దాకా ఆ సాంకేతికత మనకు లభించే అవకాశం కనబడట్లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలోని ఇద్దరు ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్తలు మాత్రం కాలంలో ప్రయాణించడం సాధ్యమేనని చెబుతున్నారు. ఒకరు జపనీస్ - అమెరికన్ భౌతికశాస్తవ్రేత్త 'మిఛియో కకు' కాగా, రెండవ వారు బ్రిటన్కు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్త 'స్టీఫెన్ హాకింగ్'.
    "విశ్వంలో మనం స్వేచ్ఛగా ముందుగు వెనక్కు కదలవచ్చు. కాకపోతే వీటిని కాలంలో చేయాలంటే కొంచెం కష్టం." అని మిఛియో కకు అంటున్నారు.
     అయితే ఈ పరిజ్ఞానాన్నంతా కలిగిన వారు మన భవిష్యత్ కాలంలో ఉండవచ్చునని, వారు తమ గతంలోకి ప్రయాణించి ఇప్పుడు వర్తమానంలో ఉన్న మనల్ని సందర్శించే అవకాశం లేకపోలేదని మిఛియో కకు అభిప్రాయపడుతున్నాడు.
అందుకే ఆయన ఇలా అన్నారు :
  • "ఏదో ఒకరోజు ఎవరో ఒకరు వచ్చి మీ ఇంటి తలుపు తట్టి 'నేను మీ ముని ముని ముని ముని మనవణ్ణి' అని చెబితే ఆశ్చర్యపోవద్దు. బహుశా అతడు చెప్పేది నిజమే కావచ్చు."
  • ఈ విశ్వంలో కనిపించే కృష్ణబిలాలు (బ్లాక్హోల్స్) కూడా కాలంలో ప్రయాణించడానికి మరో మార్గమని ఐన్ స్టీన్ చెప్పారు. ఈ కృష్ణబిలాలు, స్థలం-కాలం అల్లికను చాలా వరకు మార్చేస్తాయి.
  • ఈ కృష్ణబిలాలను కాల యంత్రాలుగా చూడవచ్చునని మిఛియో కకు అంటున్నారు.
  • ‘మీరు ఈ కృష్ణబిలం గుండా ప్రయాణించారనుకోండి. స్థలము-కాలానికి సంబంధించిన మరో కేంద్రం వద్దకు చేరుకుంటారు,’ అని కకు వివరించారు.
  • బ్రిటన్కు చెందిన భౌతిక శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా కాలంలో ప్రయాణించడానికి వార్మ్హోల్స్, బ్లాక్హోల్స్ ఉపయోగపడతాయని చెబుతున్నారు.
స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం ప్రకారం ఎవరైనా కాలంలో ప్రయాణించాలంటే అందుకు తగిన వేగం అవసరం. ఆ వేగం ఎంత ఉండాలంటే, ప్రస్తుతం అపోలో నౌక ప్రయాణించే వేగంకంటే రెండువేల రెట్లు అధికంగా ఉండాలి. (అపోలో వ్యోమనౌక గంటకు 25వేల మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది). ఆ వ్యోమనౌక యొక్క త్వరణం, ఇంచుమించు కాంతివేగానికి సమాన స్థాయికి చేరుకోగలిగేలా దాని నిర్మాణం, పరిమాణం ఉండాలి.
   అయితే క్వాంటం సిద్ధాంతాన్ని, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని సమన్వయం చేసే ఏకీకృత సిద్ధాంతం అనేది ఇంకా రూపుదిద్దుకోలేదు. కాబట్టి కెర్ర్ చెప్పిన బ్లాక్ హోల్ లో ప్రయాణీంచే టప్పుడు అది అస్థిరంగా మారినా, కొన్ని క్వాంటం ప్రభావాలు వార్మ్ హోల్ ను నాశనం చేసినా కాలంలో ప్రయాణం అన్నది సాధ్యం కాదు.

కాలంలో ప్రయాణానికి భౌతిక శాస్త్ర నియమాలేవీ సిద్ధాంత పరంగా అడ్డు చెప్పట్లేదు. కానీ ఆచరణలోనే అనేక సమస్యలున్నాయి.
   ప్రస్తుతం కాంతి వేగంతో ప్రయాణించే ఫోటాన్లను కాలంలోకి కాకుండా శూన్యాకాశం(space) లోని ఒక స్థానం నుండి మరో స్థానానికి, వాటి మధ్య దూరాన్ని దాటే అవసరం లేకుండానే పంపడానికి (Quantum Teleportation) మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్నదశాబ్దాలలో మొట్ట మొదటి వైరస్ ను ఇలా పంపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 గతంలోకి ప్రయాణించడం సాధ్యమైతే కొన్ని వైరుధ్యాలు ఎదురవుతాయి. అందులో పితామహుల వైరుధ్యం (Grandfather Paradox) ఒకటి. ఒక వ్యక్తి భూతకాలంలోకి ప్రయాణం చేసి అతడి తల్లితండ్రులను చంపితే ఏమవుతుంది అనే దుర్మార్గపు ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. అలా జరిగితే ఆ వ్యక్తి పుట్టే అవకాశం ఉండదు. కానీ అతడు పుట్టాడు కాబట్టే వెనకటి కాలానికి ప్రయాణం చేశాడు కదా? మరి ఈ వైరుధ్యానికి సమాధానం ఏమిటి?
    దీనికి రష్యా శాస్త్రవేత్త నొవికోవ్ ఒక పరిష్కారాన్నిసూచించాడు. ఈయన అభిప్రాయంలో మనం కాలంలో ప్రయాణిస్తే మన స్వతంత్రేఛ్చ (Freewill) కు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. తన తల్లి తండ్రులను చంపాలనే ఆ వ్యక్తి ప్రయత్నాన్ని ఏదో శక్తి అడ్డుకుంటుంది. అంటే విధి రాతను కాలంలో ప్రయాణించి మార్చలేము.
  మనం కాలంలో ప్రయాణించి 1945లో విమాన ప్రమాదంలో చనిపోయారని భావిస్తున్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను కాపాడుకోగలిగితే? అప్పుడు భారత దేశ ముఖచిత్రం మరోలా ఉండేదేమో? మరి అది సాధ్యమా? గతాన్ని మార్చగలమా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ వైరుధ్యానికి శాస్త్రవేత్తలు ఇస్తున్న మరో వివరణ ఏమిటంటే ఇప్పుడు మనం ఉంటున్న విశ్వమేకాకుండా అనేక విశ్వాలుంటాయి. వాటి కాల రేఖలు వేర్వేరుగా ఉంటాయి. దీనినే బహుళ విశ్వ భావన అంటారు. మనం గతంలోకి ప్రయాణించి నేతాజీని కాపాడినా, అతడు వేరే విశ్వంలో, వేరే సమయసీమలో ఉన్న నేతాజీనే అవుతాడు కానీ, మన విశ్వంలోని, మన కాలరేఖలోని నేతాజీ మాత్రం అదృశ్యమయ్యే ఉంటాడు. ఈ బహుళ విశ్వ భావనలో వైరుధ్యానికి ఆస్కారం ఉండదని మిఛియో కకు అభిప్రాయపడుతున్నాడు. అయితే బహుళ విశ్వాలున్నాయనడానికి ఇంకా శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు. ప్రస్తుతానికి ఇది ఒక ఊహా గానం లాంటిది మాత్రమే.

హిందు పురాణాల్లోని రైవతుడు, ముచికుందుడు వంటి వారు కూడా తమ యోగ శక్తి ద్వారా భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలిగారు కానీ భూత కాలంలోకి ప్రయాణించి అప్పటి సంఘటనలను ప్రభావితం చేసి విధి వ్రాతను మార్చలేదు. కాబట్టి పైన చెప్పుకున్న వైరుధ్యాలకు వారు ఆస్కారం ఇవ్వలేదు.
   పైగా యోగ సిద్ధి పొందిన ప్రాచీన భారతీయ మహర్షులు భూత, భవిష్యత్ కాలాలను తమ తప:శ్శక్తితో దర్శించగలిగారు కానీ దైవ నియమాలను, కర్మ సూత్రాలను వారు అతిక్రమించలేదు.
   ప్రస్తుతం మనకు తెలిసిన శాస్త్ర నియమాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కనబెడితే తప్ప 'కాలంలో ప్రయాణించడం' అనే వాస్తవాన్ని అంగీకరించడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం 'వార్మ్హోల్' లేదా 'బ్లాక్ హోల్' గుండా ప్రయాణిస్తే కలిగే ప్రమాదమేంటి? అనేది ప్రధాన ప్రశ్న. కాబట్టి ప్రస్తుతానికి కాలంలో ప్రయాణం అన్నది కేవలం సిద్ధాంతానికే పరిమితమయింది. దానిని ప్రయోగాత్మకంగా నిరూపించాలంటే చాలా ఆచరణాత్మక సమస్యలున్నాయి.

రచన/సంకలనం: మణి కుమార్

Tuesday, July 28, 2020

సృష్టి - Srushti



సృష్టి - Srushti

ఈ సమస్త సృష్టి వుద్బవించడానికి కారణం ఏమి మరియు ఈ సమస్త సృష్టి పాలకుడు ఎవరు ఈ సమస్తం ఎవరి చేత సృస్టింపబడుతుంది , ఎవరిచేత నాశనమవుతుంది మరియు ఎవరి ఆజ్ఞ చేత ఇది పాలించబడుతుంది అన్న విషయాన్ని ఇందులో మనం తెలుసుకుందాం.
సృష్టి - Srushti
సృష్టి - Srushti

సహస్రయుగపర్యంతం అహర్యద్బ్రహ్మనో విదు !
రాత్రిం యుగాసహస్రాoతాo తే హొరాత్రవిదో జనా !!   
(భగవద్గీత : 8.17)
వేయి ( పెక్కు ) యుగముల కాలము బ్రహ్మ (మూల ప్రకృతి) కి ఒక పగలు. అంతే కాలము తరువాత రాత్రి ముగుస్తుంది .

అవ్యక్తాద్వ్యక్తయః సర్వా ప్రభావoత్యహరాగమే !
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్త్రైవావ్యసoజ్ఞకే !!   
(భగవద్గీత : 8.18)    
( బ్రహ్మ ) పగలు ఆరంభమున సకలము అవ్యక్తమునుండి వ్యక్తమగును. రాత్రి రాగానే అవ్యక్తమునందు లీనమగును. (దీనిని ఒక కల్పమందురు).

సృష్టి ఆరంభమునకు ముందు అంతయూ శూన్యమే(ఆ శూన్యమే శక్తి అదియే భగవంతుడు). ఎక్కడను ఏమియు లేదు. సృష్టి అరంభమవగానే శున్యము నుండి శక్తి బయల్పడి (దానినే యోగమాయ అంటారు) అతి వ్యాపింప నారంభించెను. ఆవిధంగా శూన్యము నుండి లక్షల కోట్ల సౌర మండలాలు ఉద్భవించి వాటిలో ప్రకృతి , పెక్కు చరాచరులు, జీవరాశులు ఏర్పడినవి.

(ఇప్పటి సృష్టి మొదలై సుమారు 1400 కోట్ల సంవత్సరాలైనవని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు . సుమారు 10 వేల కోట్ల సంవత్సరాల తరువాత ఈ సృష్టిలోని సర్వస్వము శక్తిగా మారి అదృస్యమగునని తెలుపుతున్నరు . దీని తరువాత చాల కాలమునకు మరల సృష్టి జరుగునని కొందరు ఖగోల శాస్త్రజ్ఞుల అభిప్రాయము .)

సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్  !
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ !!    
(భగవద్గీత : 9:7)
కల్పాంతమున సకల భూతాలు (మూల ప్రకృతి , పంచభూతాలు, సకల ప్రాణులు ..) నా ప్రకృతిని (అవ్యక్తము) ప్రవేశించును. తిరిగి కల్పారంభమున వానిని నేనే సృజించుచున్నాను.

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః !
భూతగ్రామమిం క్రుత్స్యమ్ అవసం ప్రకృతేర్వశాత్ !!
(భగవద్గీత : 9:8)
తమతమ స్వభావవశమున పరతంత్రమైయున్న భూత సముదాయమును నా ప్రక్రుతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము మరలమరల పుట్టించుచున్నాను.

మయాద్యక్షేణ ప్రకృతిం సూయతే సచరాచరం !
హేతునాణేణ కౌన్తేయ జగద్విపరివర్తతే !!
(భగవద్గీత : 9:10)
నా అద్యక్షతన భౌతిక ప్రకృతి చరచారాలను (ప్రాణుల్ని) సృస్టించును . ఆ కారణంగా జగత్తు పనిచేయుచున్నది .

భూతగ్రామ స ఏవాయం భాత్వా భూత్వా ప్రలీయతే !
రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్యహరాగమే !!   
(భగవద్గీత : 8:19
జీవ సముదయమంతయు ఈ విధముగా మరల మరల జన్మించును (బ్రహ్మకు) రాత్రి అవగానే నశించును, (బ్రహ్మకు) పగలవగానే జన్మింతురు.  ఈ విధంగా  ప్రాణి సముదాయము ప్రక్రుతివశమున మాటిమాటి కిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును. మరల పగటి ప్రారంభ కాలమున పుట్టుచుండును.


కానీ మోక్షమును పొందిన వారు మాత్రం మరల మరల పుట్టరు. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి అని, పరమపదము అనియు అందురు. (భగవద్గీత : 8:21)

అనగా ఈ సమస్త సృష్టి వుద్బవించడానికి కారణం ఒకరే ఆయనే పరమాత్మా (అదియే శక్తి) మరియు ఈ సమస్త సృష్టి పాలకుడు కూడ ఆయనే, ఆయన చేతనే ఈ సమస్తం సృస్టింపబడుతుంది , నాశనమవుతుంది మరియు ఆయన ఆజ్ఞ చేత ఇది పాలించబడుతుంది.

సంకలనం: కోటేశ్వర్

Monday, July 20, 2020

తొలి స్వదేశీ సోషల్ మీడియా వేదిక 'ఏలిమెంట్స్' - Elyments Social Media App

తొలి స్వదేశీ సోషల్ మీడియా వేదిక 'ఏలిమెంట్స్' - Elyments Social Media App

తొలి స్వదేశీ సోషల్ మీడియా వేదిక 'ఏలిమెంట్స్'

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఉన్న విదేశీ యాప్ లకు దీటుగా అవిర్భవించింది "ఎలిమెంట్స్' తెలుగు సహా ఎనిమిది భారతీయ భాషల్లో అభివృద్ధి చేసిన 'ఏలిమెంట్స్' యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఉచిత ఆడియో, విడియో కాల్స్ చేసుకోవడంతో పాటు చాటింగ్ ద్వారా సంభాషించుకునే సౌలభ్యం ఉంది. 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఈ తొలి స్వదేశీ తొలి సోషల్ మీడియా యాప్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. "అనుకరణకు దూరంగా దేశీయంగా మరిన్ని ఆవిష్కరణలను ప్రోత్సహించాలని" పిలుపునిచ్చారు. దేశ యువత, ఐటీ నిపుణుల్లో దాగున్న సృజనాత్మకతను మరింత ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణం నిర్మించుకోవాలన్నారు. తద్వారా 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాలను చేరుకొనేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు.

వీరిని ప్రోత్సహిస్తూ మరిన్ని వినూత్న ఆవిష్కరణలు చేయడానికి సాంకేతిక రంగ సంస్థలు ముందుకు రావాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, రామోజి గ్రూపు సంస్థల శైర్మన్ రామోజీరావు, ప్రముఖ యోగా గురువు బాబారాందేవ్, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, కేంద్రమంత్రి సురేశ్ప్రభు, పారిశ్రామికవేత్త అనంత్ గోయెంకా, విద్యావేతర దివీ మోహన్ దాస్ పాయ్ తదితరులు పాల్గొన్నారు. 

__జాగృతి

Saturday, July 18, 2020

‘గురుత్వాకర్షణ క్షేత్రాలు’ ఐన్ స్టీన్ సిద్ధాంతం - హైందవ దృక్పథం - Einstein Theory in Gravitational fields, Gurutvākarṣaṇa kṣētrālu


గురుత్వాకర్షణ క్షేత్రాలు’ అనేవి ద్రవ్యరాశిత్వం గల వస్తువుల నుండి ఉద్భవించి ఇతర వస్తువులనన్నింటినీ ఆకర్షిస్తాయి. ఈ ‘గురుత్వాకర్షణ క్షేత్రం’ (Gravitational Field) అనేది ఆ వస్తువు చుట్టూ ఉండే శూన్య ప్రదేశాన్ని ప్రభావితం చేసి, ఇతర వస్తువులను ఆకర్షించేలా చేస్తుంది. అంతే కాక ఐన్ స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువుకు ఉండే ‘గురుత్వాకర్షణ శక్తి’ దాని చుట్టూ ఉండే శూన్యాకాశాన్ని వంచుతుంది. తద్వారా దాని రేఖాగణిత ధర్మాలనే మారుస్తుంది.

కృష్ణబిలాలు ఢీకొనే సమయంలోను, న్యూట్రాన్ తారలు ఢీకొన్నప్పుడు, నక్షత్రాల్లో పేలుడు సంభవించినప్పుడు గురుత్వాకర్షణ తరంగాలు జనిస్తాయని, అవి అలలు అలలుగా విస్తరిస్తాయని ఐన్‌స్టీన్ ప్రతిపాదించాడు. ఐన్ స్టీన్ ప్రతిపాదించిన, వందేళ్లుగా మిస్టరీగానే ఉన్న ఈ 'గురుత్వాకర్షణ తరంగాల'ను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 2016 లో ప్రకటించారు. ఈ తరంగాలను గుర్తించేందుకు అమెరికాలో ‘లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ (లిగో)’ పేరిట పరిశోధనశాలను ఏర్పాటు చేశారు.

గురుత్వాకర్షణ తరంగాలు అతి స్వల్ప స్థాయిలో ఉన్నా గుర్తించగలిగే అత్యాధునికమైన రెండు అతి భారీ డిటెక్టర్ల సహాయంతో సుదూర అంతరిక్షంలో 130 కోట్ల ఏళ్ల క్రితం ఢీకొన్న రెండు కృష్ణబిలాలపై పరిశోధన చేశారు. అవి ఢీకొన్నప్పుడు వెలువడి, స్థల-కాలాల్లో అలల్లాగా విస్తరించిన గురుత్వాకర్షణ తరంగాలు గత ఏడాది సెప్టెంబర్ 14న భూమిని చేరాయి. వీటిని అదేరోజు 'లిగో' లోని డిటెక్టర్లు గుర్తించాయి. అయితే ఈ సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించి, నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలకు 5 నెలల సమయం పట్టింది.

ఐన్ స్టీన్ సిద్ధాంతం ప్రకారం, పదార్థం దానియొక్క ఆకర్షణ క్షేత్రం నుండి వేరు కాదు. అలాగే ఆకర్షణ క్షేత్రం వంపు తిరిగిన ఆకాశం నుండి వేరు కాదు. అంటే డెమోక్రటిస్ కాలం నుండి మౌలికమైన వేర్వేరు అంశాలుగా తలచబడ్డ పదార్థము, శూన్యాకాశము అన్నవి వేరు కాదని సాపేక్ష సిద్ధాంతం నిరూపించింది.

అంతే కాక, శూన్యాకాశం నుండి కాలాన్ని వేరు చేయలేము. కాబట్టి ఒక భారీ వస్తువు వల్ల ( ఉదాహరణకు గ్రహాలూ, నక్షత్రాలు వంటివి ) శూన్యాకాశం వంపు తిరగడమే కాక అక్కడ కాలగతి కూడా మారుతుంది. విశ్వమంతా వివిధ ద్రవ్యరాశులు గల వస్తువులతో నిండి ఉంది కనుక ఆయా వస్తువుల సమక్షంలో కాలం వివిధంగా ఉంటుంది. అంటే మన భూగ్రహం శూన్యాకాశాన్ని ఒకలా వంచితే గురు గ్రహం మరోలా వంచుతుంది. ఎందుకంటే వాటి ద్రవ్యరాశులు వేర్వేరు కాబట్టి. దాని వల్ల భూగ్రహం వద్ద కాల గతి ఒకలా ఉంటే గురు గ్రహం వద్ద కాల గతి మరోలా ఉంటుంది.

అంటే విశ్వమంతా పదార్థం ఏ విధంగా ఉంచబడిందో దానిని బట్టి ఆయా పదార్ధాల వల్ల శూన్యాకాశంలో ఏర్పడే వంపు వేర్వేరు గా ఉంటుంది. ఆ వంపును బట్టి కాల గతి కూడా వేర్వేరుగా ఉంటుంది. అంటే స్థల కాలాలకు సంబంధించిన కొలతలు న్యూటన్ చెప్పినట్లు నిర్దిష్టమైనవి కావు. విశ్వంలో పదార్థం ఉంచబడిన తీరును బట్టి అవి మారతాయి.

మనకు సామాన్యంగా కనిపించే వస్తువులు కాంతి కంటే ఎంతో తక్కువ వేగంతో కదలడం వల్లే కాలం వాస్తవం అన్న భావన మనకు కలుగుతోంది. దాదాపు కాంతి వేగంతో సమానమైన వేగంతో ప్రయాణించే సూక్ష్మ కణాలకు కాలభావం వర్తించదని నేటి భౌతిక శాస్త్రం ప్రయోగాత్మకంగా నిరూపించింది. అంటే ఒక జెట్ విమానంలో మనం దాదాపు కాంతి వేగంతో ప్రయాణిస్తే మన వయస్సు పెరగడం ఆగిపోతుంది. అంటే ఆ స్థితిలో కాలమనేది ఉండదు.

మిన్ కౌస్కీ అనే శాస్త్రవేత్త చెప్పినట్లు “శున్యాకాశము (స్థలము), కాలము ఛాయా మాత్రమైనవి. ఆ రెండిటి సంపుటి మాత్రమే వాస్తవం.” అంటే స్థల కాలాలు విడదీయరానివి.

సామాన్య సాపేక్ష సిద్ధాంతం ప్రకారం వస్తువు యొక్క ద్రవ్యరాశి పెరిగిన కొద్దీ దాని సమక్షంలోని శూన్యాకాశం ఎక్కువ వంపు తిరుగుతుంది. ఆకాశానికి, కాలానికీ గల అవినాభావ సంబంధం వల్ల ‘దేశ – కాలము’ (స్పేస్ - టైమ్) కూడా వంపు తిరుగుతుంది. అంటే వస్తువు యొక్క ద్రవ్యరాశిత్వాన్ని బట్టి దాని సాన్నిధ్యంలో కాల గతి గూడా మారుతుంది. ఈ సిద్ధాంతం ప్రయోగాత్మకంగా నిరూపించబడింది కాబట్టి మనకిప్పుడు స్థూలంగా అనుభవమయ్యే ‘దేశ కాలాలు’ వాస్తవమైనవి కావని తేలుతోంది. అంటే మనకిప్పుడు గోచరించే జగత్తు దాని వాస్తవ రూపం కాదు.

కదిలే కడ్డీ దాని వేగాన్ననుసరించి సంకోచిస్తుంది. మనం ఎక్కువ వేగంతో కడ్డీ ని విసిరితే దాని పొడవు తగ్గుతుంది. అంటే ఒక వస్తువు పొడవెంత అని అడగడం సరికాదు. ఒక వస్తువు యొక్క పొడవు దాని వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలనెన్నింటినో ఐన్ స్టీన్ సిద్ధాంతం వివరించింది.

కవలల వైరుధ్యం
  • ➧ ఇద్దరు కవలల్లో ఒకరు జెట్ విమానంలో అత్యంత వేగంగా అంతరిక్షంలో ప్రయాణించి తిరిగి భూమి మీదకు వచ్చేసరికి తన సహోదరుని కంటే వయస్సులో చిన్నవాడై ఉంటాడు. దీనినే “ట్విన్ పారడాక్స్” (కవలల వైరుధ్యం ) అంటారు.
  • ➧ భూమి మీద స్థిరంగా ఉన్న తన సహోదరునితో పోలిస్తే అంతరిక్షంలో అత్యంత వేగంతో ప్రయాణించే అతని శరీర గత వ్యవస్థలన్నీ నెమ్మదిగా పని చేసే గడియారంలా ఉంటాయన్నమాట.
  • ➧ అంటే అతడు ఎంత వేగంతో ప్రయాణిస్తాడో అతడి వయస్సు పెరగడం అంత తగ్గుతుంది. దాదాపు కాంతి వేగంతో ప్రయాణిస్తే అతడి వయస్సు పెరగడం ఆగిపోతుంది. అంటే అతడికి కాల భావం వర్తించదు. (కాంతి వేగం అంటే సెకనుకు దాదాపు మూడు లక్షల కిలోమీటర్లు లేదా ఒక లక్షా ఎనభై ఆరు వేల మైళ్ళు)
  • ➧ ఈ విషయం మరింత అర్థం కావడానికి మరో ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి వయస్సు 28 సంవత్సరాలనుకుందాం. అతడి తమ్ముడి వయస్సు 26 సంవత్సరాలనుకుందాం. 28 నంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి, ఒక జెట్ విమానంలో 20 మానవ సంవత్సరాల పాటు అంతరిక్షంలో ప్రయాణించి తిరిగి భూమి మీదకు వచ్చాడనుకుందాం. అప్పుడు అతడి వయస్సు అదే 28 సంవత్సరాలుగా ఉంటుంది. కానీ అతడి తమ్ముడి వయస్సు మాత్రం 46 సంవత్సరాలుంటుంది. అంటే అతడు తన తమ్ముడి కంటే 20 ఏళ్ళు చిన్నవాడవుతాడన్నమాట.
  • ➧ అంతరిక్ష నౌకల్లో ప్రయాణించే వ్యోమగాములు కూడా ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని నిజమని నిరూపించారు. వారు వ్యోమనౌకల్లో సంవత్సరాల తరబడి ప్రయాణం చేసినా వారికి కొన్ని రోజులే ప్రయాణించినట్లుగా అనుభవమవుతుంది.
  • ➧ ఈ విషయాలు మనకు ఆశ్చర్యకరంగా ఉండడానికి కారణం మన ఇంద్రియాలు నాలుగు నిరూపకాలు గల దేశ కాల జగత్తును చూడలేక పోవడం. మనకు అనుభవమవుతోంది మూడు నిరూపకాలతో కూడిన స్థాయిలోని ప్రపంచం యొక్క ఛాయాచిత్రం మాత్రమే.
మనం ప్రపంచాన్ని మూడుకొలతల్లోనే చూస్తాం. అవే ఎత్తు, పొడవు, వెడల్పు.

అసలు మన విశ్వంలో ఎన్ని కొలతలు (నిరూపకాలు) ఉన్నాయి? మనకు అనుభవం కాని వీటి ఆనుపానులు తెలుసుకోవడం సాధ్యమేనా? అనేదానిపై శాస్తవ్రేత్తలు నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ వారికి సమాధానం అంతుచిక్కలేదు. కాకపోతే నాలుగవ కొలత మాత్రం ఉన్నదని గణితశాస్త్ర పరంగా, ఖగోళశాస్త్ర రీత్యా లెక్క కడుతున్నారు. అయితే 'స్ట్రింగ్ థియరీ' ప్రకారం పది నిరూపకాలుంటాయి.

ధ్యానం ద్వారా మాత్రమే నాలుగు నిరూపకాలతో కూడిన అనుభవం కలుగుతుందని ప్రాచీన ఋషులు చెప్పారు. ధ్యానం ద్వారా అలాంటి అనుభవాన్ని పొందిన శ్రీ అరవింద మహర్షి ఇలా అన్నారు : “ ఆ స్థితిలో మన దృష్టి సూక్ష్మమైన పరివర్తన చెంది నాలుగవ నిరూపకాన్ని (ఫోర్త్ డైమెన్షన్) అనుభవిస్తుంది.”

ధ్యానంలో చెప్పబడే ‘దేశానుభూతి’ (అనుభవం) నాల్గవ నిరూపకానికి సంబంధించింది. ఈ అనుభూతిలో సామాన్యమైన కాల క్రమానికి బదులు అన్ని సంఘటనలు, వస్తువులు ఏకకాలీయతను (అంటే ఒకే కాలాన్ని) కలిగి ఉంటాయి.

వేదం ప్రకారం శూన్యాకాశం బహుళ నిరూపకాలు కలది. అంటే శూన్యాకాశంలో 64 ప్రధాన నిరూపకాలుంటాయి. ఒక్కో నిరూపకంలో తిరిగి అనేక ఉప నిరూపకాలుంటాయి. కానీ మన ఇంద్రియాలు మూడు నిరూపకాలను మాత్రమే అనుభవించగలుగుతాయి. కాబట్టి ఇతర నిరూపకాలతో కూడిన యదార్థ తత్వాన్ని మనం గుర్తించలేక పోతున్నాము.

ప్రాచీన యోగ పద్ధతుల ద్వారానే (ముఖ్యంగా క్రియా యోగం ద్వారా) ఇతర నిరూపకాలను మానవుడు అనుభవించగలుగుతాడనీ, ఆ స్థితిలో ఉన్న యోగి అసాధారణ క్రియలను చేయగలుగుతాడని వైదిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
  • డీ బ్రోగ్లీ అనే శాస్త్రవేత్త ఇలా వివరించాడు : “ మనకు భూత, భవిష్యత్, వర్తమానాలుగా కనిపించేదంతా దేశ కాలాల్లో ఒక్కసారే ఉనికిని కలిగి ఉంటుంది. (మూడు నిరూపకాల స్థాయిలో) పరిశీలకుడు కాలం గడిచిన కొద్దీ ఈ దేశ కాలం యొక్క కొత్త తునకలను చూసి, అవి కాలగతిలో కొత్తగా ఏర్పడ్డ అంశం అనుకుంటాడు. కానీ, ‘దేశ – కాలము’ అనేది అన్ని సంఘటనల సమూహం. ఆ కొత్త సంఘటనలన్నీ అతడు గుర్తించక ముందే ఉన్నాయి. ”
  • ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం – ‘మన స్థూల దృష్టికి వాస్తవంగా ఉన్నట్లు కనిపించే దేశ కాలాలు తత్త్వత: అసత్యాలు’. కానీ ఆధ్యాత్మిక వేత్తలు తాము భూత, భవిష్యత్, వర్తమానాలను ఏక కాలంలో దర్శిస్తామనీ, వివిధ స్థానాలలోని వస్తువుల ఏక దేశీయత తమకు ప్రత్యక్షంగా అనుభవమవుతుందనీ చెబుతారు.
  • తన చివరి రోజుల్లో ఐన్ స్టీన్ ఇలా అన్నాడు : " భౌతిక శాస్త్రాన్ని నమ్మే మాలాంటి వారికి భూత, భవిష్యత్,వర్తమాన కాలాల మధ్య వ్యత్యాసం అనేది కేవలం మనల్ని పట్టి పీడించే ఒక భ్రాంతి మాత్రమేనని తెలుసు." అంటే ఐన్ స్టీన్ కాల ప్రవాహాన్ని ఒక 'మిథ్య' గా భావించాడని చెప్పవచ్చు.
  • స్వామి వివేకానంద ఇలా అంటారు : “ కాలము, దేశము, కారణాత్మకత అనేవి కళ్ళజోడు అద్దాల్లాంటివి. మనం పరమసత్యాన్ని వాటి ద్వారా చూస్తాము. పరమసత్యంలో కాలము, దేశము, కారణాత్మకత అనేవి లేనే లేవు.”
సామాన్య చైతన్య స్థాయిలో గుర్తించబడు ‘కార్యకారణ సూత్రమే’ కర్మ బంధం రూపంలో జీవులను ‘అజ్ఞాన జనిత జనన మరణముల పరంపర’ అనబడే సంసార చక్రానికి బంధిస్తుందనీ, జ్ఞానం ద్వారా దానిని అతిక్రమించడమే ముక్తి అనీ హిందూ, బౌద్ధ గ్రంథాలు చెబుతాయి.
బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం
బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం
“బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం”
విశ్వావిర్భావానికి సంబంధించి నేడు ఎక్కువ మంది శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్న "బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం" ప్రకారం, ఈ విశ్వం ఒక ఒక అగ్ని గోళం యొక్క మహా విస్ఫోటనం తో ప్రారంభమై, నేటికీ అన్ని దిక్కులకు వ్యాపిస్తోంది. ఆ విస్ఫోటనం నుంచీ జరిగిన సంఘటనల ప్రవాహమే కాలం. అంటే ఈ విస్పోటనం ద్వారానే కాలం అనేది కూడా పుట్టింది. దీనికి ముందు కాలమనేదే లేదు.

బిగ్ బ్యాంగ్ కి ముందు ఉన్న “ఏమీ లేని స్థితి” లో పదార్ధం, శక్తి, స్థలము, కాలము, సాపేక్షత - ఇవేవీ లేవు. సైన్స్ ప్రకారం అది పరిపూర్ణమైన శూన్యం. అలాంటి శూన్యాన్ని సైన్స్ పరంగా నిర్వచించలేము (Undefined). ఇలాంటి పరిస్థితులలో బిగ్ బ్యాంగ్ విస్పోటనానికి కావాల్సిన ‘శక్తి’ ఎక్కడ నుండి వచ్చింది? విస్పోటనానికి గురయిన ‘పదార్థం’ ఎక్కడనుండి వచ్చింది? - ఇలాంటి ప్రశ్నలకు సైన్స్ దగ్గర సమాధానాలు లేవు.

బిగ్ బ్యాంగ్ కి ముందు కాలమనేది లేదు. కాలం అనేది ఉండాలంటే ఏదైనా ఒక సంఘటన జరగాలి. ఏ సంఘటనా జరగడానికి వీలు లేని పరిస్థితుల్లో కాలం అనేది ఉండదు. అంటే ఈ విశ్వం యొక్క సృష్టికి కారణమైన ఒకానొక ‘అతీత శక్తి’ (దేవుడు) గనక ఉంటే ఆ ‘చైతన్య శక్తి’కి కాలభావం వర్తించదు. అంటే ఆ శక్తి కాలాతీతం. కాలం లేని చోట చావు పుట్టుకలుండవు. శాస్త్రం భగవంతుడిని కాలాతీతుడని చెప్పింది. కాబట్టి భగవంతుడికి జనన మరణాలనేవి ఉండవు.. అందువల్ల భగవంతుడిని ఎవరు సృష్టించారు? అనే ప్రశ్న ఉత్పన్నం కాదు.

‘భగవద్గీత’ ఇలా చెబుతుంది

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత :
ఉభయోరపి దృష్టోన్త స్త్వనయో స్తత్త్వ దర్శిభి : (2-16)
“లేనిది ఎప్పటికీ ఉండదు. ఉన్నది ఎప్పటికీ లేకపోదు. రెండింటి నిర్ణయం తత్వజ్ఞులకే తెలుస్తుంది.”

భగవద్గీత లో చెప్పబడిన ఈ భావన నేటి సైన్స్ చెబుతున్న “శక్తి నిత్యత్వ నియమం”తో పోలి ఉంది. ఈ నియమం ప్రకారం శక్తిని సృష్టించలేము, నాశనము చేయలేము. ఈ నియమాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన భారతీయ ఋషులు విశ్వంలోని ప్రతీ మూలకానికీ వర్తించే విధంగా చెప్పారు.

‘ఈశోపనిషత్తు’ ఇలా చెబుతుంది : “ఓం పూర్ణమద : పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్యతే ”

దీని అర్ధం – “ఆ అదృశ్య బ్రహ్మము పూర్ణము. ఈ దృశ్య బ్రహ్మము కూడా పూర్ణము. ఆ అదృశ్య పూర్ణ బ్రహ్మమునుండి ఈ దృశ్య పూర్ణ బ్రహ్మమును తీసివేస్తే మళ్ళీ పూర్ణ బ్రహ్మమే మిగిలిఉంటుంది.”

అంటే పూర్ణుడైన భగవంతుని నుండి సంపూర్ణ జగత్తు పుట్టి మరల పూర్ణుడైన భగవంతుని లోనే సంపూర్ణముగా కలిసి పోతుంది అంటే, సర్వవ్యాపకమైన, శాశ్వతమైన (మార్పులేని) ‘చైతన్య శక్తి’ అనేది ఒక్కటే. అది పరిపూర్ణమైనది. అవిభాజ్యమైనది.

రచన: మణి వేమూరి

Sunday, June 21, 2020

నమస్కారం - ఓ సాంస్కృతిక అంశం మరియు ఓ విజ్ఞానం - Namaskara - a cultural aspect and a knowledge

namaskarma - namaskar


నమస్కారం కేవలం ఓ సాంస్కృతిక అంశం మాత్రమే కాదు. దాని వెనుక ఓ విజ్ఞానం ఉంది. మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ ఓ చిన్న శక్తి విస్పోటనం సంభవిస్తుంది.

మీరొక వ్యక్తిని చూసినప్పుడు, అది మీరు పనిచేసే చోటైనా, వీధిలో అయినా, ఇంట్లో అయినా లేదా మరెక్కడైనా సరే, మానవ బుద్ధినైజం ఎలాంటిదంటే, అది చూసిన క్షణమే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికొచ్చేస్తుంది.  “ ఆ మనిషిలో ఇది బాగుంది, ఈ మనిషిలో ఇది బాలేదు. అతను మంచివాడు, అతను మంచివాడు కాదు, అతను అందంగా ఉన్నాడు, అతను వికారంగా ఉన్నాడు” ఇలా ఎన్నో నిర్ణయాలకు వచ్చేస్తుంది. వీటన్నిటిని మీరు ప్రయత్నపూర్వకంగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఒక్క క్షణంలోనే ఈ అభిప్రాయాలు, తీర్మానాలు జరిగిపోతాయి. మీ తీర్మానాలు పూర్తిగా తప్పయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అవన్నీ జీవితంలోని మీ గతానుభావాలనుండీ వస్తున్నవే. దేన్నైనా, ఎవరినైనా  ప్రస్తుతమున్న విధంగా గ్రహించడానికి మిమ్మల్ని ఇవి అనుమతించవు. ప్రస్తుతమున్న విధంగా విషయాలని, మనుషులని గ్రహించడం చాలా ముఖ్యం. మీరు ఏ రంగంలోనైనా సమర్థవంతంగా పని చేయాలంటే, మీ ముందుకు ఎవరైనా వచ్చినప్పుడు, వారిని ప్రస్తుతం ఎలా ఉన్నారో అలా అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. వారు నిన్న ఎలా ఉన్నారనేది ముఖ్యం కాదు. వారు ఈ క్షణంలో ఎలా ఉన్నారనేది చాలా ముఖ్యం. కాబట్టి, మొదట మీరు శిరస్సు వంచి నమస్కరించాలి. ఒక్కసారి మీరలా చేస్తే, మీ ఇష్టాయిష్టాలు బలపడకుండా, మెత్తబడతాయి. ఎందుకంటే వారిలో ఉన్న సృష్టి మూలాన్ని మీరు గుర్తిస్తారు. నమస్కారం చేయడం వెనక ఉన్న ఉద్దేశ్యమిదే.

సృష్టికర్త
సృష్టికర్త హస్తం:
సృష్టికర్త హస్త ప్రమేయం లేనిదేది సృష్టిలో లేదు.  ప్రతీ కణంలోనూ ప్రతీ అణువులోనూ సృష్టి మూలం పనిచేస్తోంది. అందుకే భారత సంస్కృతిలో మీరు పైకి ఆకాశం వంక చూసినా, కిందికి భూమి వంక చూసినా, శిరస్సు వంచి అభివాదం చేయమని చెబుతారు. మీరొక స్త్రీని, పురుషుడిని, పిల్లాడిని, ఆవుని, లేదా ఓ చెట్టుని చూసినా, శిరస్సు వంచి అభివాదం చేయమంటోంది ఈ సంస్కృతి. మీలో కూడా సృష్టి మూలం ఉందన్న విషయాన్ని ఇది నిరంతరం గుర్తుచేస్తూ ఉంటుంది. మీరు దీన్ని గుర్తిస్తే, నమస్కారం చేసిన ప్రతీసారి మీరు మీ సహజ ప్రవృత్తి వైపు అడుగులు వేస్తున్నట్టే.


దీనికి మరో కోణం కూడా ఉంది. మీ అరచేతుల్లో ఎన్నో నాడుల కొసలు ఉంటాయి – దీన్ని ఈనాటి వైద్య శాస్త్రం కూడా కనుగొంది. వాస్తవానికి మీ నాలుక కన్నా, కంఠం కన్నా మీ చేతులే ఎక్కువ మాట్లాడుతాయి. యోగా ముద్రలను గురించి పూర్తి శాస్త్రమే ఉంది. మీ చేతిని కొన్ని ప్రత్యేకమైన రీతుల్లో అమరిస్తే, మీరు మీ పూర్తి వ్యవస్థనే భిన్నంగా పనిచేసేటట్లు చేయవచ్చు. మీరు మీ చేతులని జోడించిన క్షణమే, మీ ద్వైత భావనలు, మీ ఇష్టాయిష్టాలు, మీ కోరికలు, మీరు ఈసడించుకునే విషయాలు, ఇవన్నీ సమమై, తొలిగిపోతాయి. ఇలా మీరెవరో వ్యక్తీకరించుకోవడంలో ఒక రకమైన ఏకత్వం ఉంటుంది. అప్పుడు మీలోని శక్తులన్నీ ఒక్కటిగా పనిచేస్తాయి.
మిమ్మల్ని మీరే సమర్పించుకోవటం
కాబట్టి నమస్కారం కేవలం ఓ సాంస్కృతిక అంశమే కాదు. దాని వెనుక ఓ సైన్స్ ఉంది. మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ చిన్న శక్తి విస్పోటనం సంభవిస్తోంది. ఇలా చేయడం వల్ల మీలో జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతుంది, అంటే మిమ్మల్ని మీరు అవతలి వ్యక్తికి అర్పించుకుంటున్నారు. ఆ సమర్పణంతో మీరు అవతలి ప్రాణిని మీతో సహకరించే జీవిగా చేసుకుంటారు. మీరు ఇచ్చే స్థితిలో ఉంటేనే, మీ చుట్టూ విషయాలు మీకు అనుకూలంగా జరుగుతాయి, వ్యక్తులు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇది ప్రతీ జీవికీ వర్తిస్తుంది. ప్రతీ జీవి కూడా తనకు తన చుట్టూ ఉన్న జీవరాసుల సహకారం ఉంటేనే, వృద్ధి చెందగలగుతుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Saturday, May 30, 2020

"తమసోమా జ్యోతిర్గమయ" పురాణ వైజ్ఞానికాంశాలు - Purana Vaignanikam



‘తమసోమా జ్యోతిర్గమయ’
అంటే చీకటి నుంచి వెలుగుకు రండి అని చెబుతోంది ఉపనిషత్తు. మన వేదాలు, ఉపనిషత్తు జీవితాలకు వెలుగునిచ్చే రీటిలో ఇలా ఎన్నో వైజ్ఞానికాంశాలను భోదిస్తున్నాయి. మన మంత్రాలలో ఎన్నో వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయన్నది సత్యం.

ఉదాహరణకు అణువు నుంచి క్రమంగా పరిణామ వృద్ధి జరిగి జీవరాశి ఏర్పడిందని వైజ్ఞానిక ఆధారాల ద్వారా నిరూపించుకుంటున్నారు. అనంతరం డార్విన్ సిద్ధాంతాన్ని అనుసరించి, కోతి నుంచి మనిషి పరిణామం చెందాడని చెప్పుకుంటున్నాం. 

శ్రీమహావిష్ణువు దశావతారాలను చూసినపుడు మనకు ఈ పరిణామ క్రమం తెలుస్తుంటుంది. నీటిలో నివసించే మత్స్యావతారం, అనంతరం నీటిలో మరియు భూమిపై నివశించగల కూర్మావతారం. అనంతరం వరాహావతార మంటూ సాగి శ్రీరామావతారంలో పూర్ణపురుషునిగా స్వామి మనకు దర్శనమిస్తున్నాడు. ఇలా మన పురాణాలలో ఎంతో విపులంగా పరిణామక్రమాన్ని గురించి విశదీకరించబడింది.
అణువు
అణువు
అణువును చేధించలేమన్నది గతంలో శాస్త్రజ్ఞుల భావన. కానీ, ఆ తరువాత అణువులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూక్లియస్ ల వంటివి ఉన్నాయని తేలింది. అలాగే అనువులోపలనున్న ఎలక్ట్రానులు అలలు అలలుగా తిరుగు తుంటాయనీ, మధ్యభాగంలో న్యూక్లియస్ అనేది ఉంటుందని శాస్త్రజ్ఞులు విశ్లేషించారు. ఈ అమరిక శ్రీచక్రానికి సంబంధించినదంటే అతిశయోక్తి కాదు. శ్రీచక్రంలో కనిపించే తామరరేకుల వంటి గీతలు అలలు అలల్లా తిరిగే ఎలక్ట్రానులనుకుంటే, కోణాలు అడ్డదిడ్డంగా తిరిగే ప్రోటానులే. ఇక శ్రీచక్రం మధ్యనున్న బిందు మండలం న్యూక్లియస్. వైజ్ఞానిక పరంగా అణువుని ఆధారం చేసుకుని సైన్సు ఈ విశ్వ రహస్యాన్ని విశ్లేషించేందుకు ప్రయత్నిస్తుండగా, అందుకు తగిన సమాధానం శ్రీచక్రంలో ఉందన్నది స్పష్టం.
హిరణ్యకశిపుడు సంహరిస్తన్న నారసింహుడు
హిరణ్యకశిపుడు సంహరిస్తన్న నారసింహుడు 
అల దైవశక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. అలాగే హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని, ఎక్కడగల డేక్రియ, సేచక్కటి వర్తించు నెట్టిజాడను వచ్చుం? జక్కడుతు నిన్ను విష్ణుని బెక్కులు ప్రేలేదవు వాని భృత్యుని పగిదిన్... 

అని అడ్డగ్గా, అందుకు ప్రహ్లాదుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు.

కలడంభోది గలండు గాలి గల
డాకాశంబునం గుంభినిం
గల డగ్నిన్ దిశలం బగళ్ళ
నిశలన్ ఖద్యోతచంద్రాత్మలం
గల డోంకారమునం ద్రిమూర్తుల
ద్రిలింగవ్యక్తులం దంతటం
గల దీశుండు గలండు తండ్రి!
వెదకంగా నేల నీయయోడన్ ||

కళ అనేది మానవ జీవనవికాసానికి సోపానం. కళ విజ్ఞాన సముపార్జనకు తోడ్పటమేకాక, జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. మన పూర్వులు అందించిన చతుష్పష్టి కళలలో ‘యంత్రమాతృక’ అనే కళ ఉంది. తద్వారా మన పూర్వీకులు యంత్రనిర్మాణశాస్త్రంలో ఘటికులన్న విషయం తేటతెల్లమవుతోంది. 
పుష్పక విమానం - pushpaka vimanam
పుష్పక విమానం - pushpaka vimanam
విమాన వర్ణన:
  • ➣ పుష్పక విమానం, నవవిమానం గురించి మన పురాణాలలో కనబడుతోంది. 
  • ➣ ఆకాశగమనం, గగన ప్రవేశం గురించి చెప్పబడింది. 
  • ➣ రామాయణంలో కనబడే పుష్పక విమానాన్ని విశ్వకర్మ తయారు చేసి బ్రహ్మదేవునికి ఇవ్వగా, బ్రహ్మదేవుడు కుబేరునికి ఇస్తాడు. కుబేరుని దగ్గర్నుంచి రావణుడు లాక్కుంటాడు. 
  • ➣ రావణుడు ఈ పుష్పక విమానంలోనే సీతమ్మను అపహరిస్తాడు. 
  • ➣ రామ రావణ యుద్ధానంతరం విభీషణుడు పుష్పక విమానాన్ని శ్రీరామునికి బహుకరిస్తాడు. శ్రీరాముడు దీనిని తిరిగి కుబేరునికి  ఇచ్చేస్తాడు.
  • ➣ పుష్పకవిమానం వర్ణన అత్యంతఅద్భుతంగా ఉంటుంది. దాని భాగాలన్నీ బంగారంతో నిర్మించబడ్డాయి. ఆ విమానంలో వైఢూర్య, మణిమయమైన వేదికలు, మంటపాలున్నాయి.
  • ➣ ఇంకా ఆ విమానం అంతస్తులుగా నిర్మించబడింది. ఆ అంతస్తుల శిఖరాలు స్ఫటికాలతో, వైఢూర్యాలతో తాపడం చేయబడి ఉంది. 
  • ➣ అంతటా మణిమయమైన తివాసీలు, ఆసనాలు ఉన్నాయి. 
  • ➣ బంగారు పద్మాలతో చక్కగా అలంకరించబడి ఉంది. 
  • ➣ విమానం కిటికలకు ముత్యాలు, మణులు పొదగబడి ఉన్నాయి. 
  • ➣ దాని వేగం మనోవేగంతో సమమైనది. 
ఇక ప్రళయకాలంలో త్రిమూర్తులు నవవిమానంలో అంబిక కొలువై ఉన్న ప్రదేశానికి చేరుకున్నట్లు కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇలా మన పురాణాలను జాగ్రత్తగా పరిశీలించినపుడు ఇటువంటి వైజ్ఞానికాంశాలు ఎన్నో దృగ్గోచరమవుతుంటాయి. కావాల్సింది పురాణాలను చదవడమే.

సంకలనం: నాగవరపు రవీంద్ర

Saturday, May 23, 2020

ఐన్ స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం - హైందవ దృక్కోణం - Einstein's theory of relativity and the Vedic viewpoint


ఐన్ స్టీన్ సిద్ధాంతం - హైందవ దృక్పథం

1915 లో ఐన్ స్టీన్ ప్రతిపాదించిన “సాధారణ సాపేక్షతా సిద్ధాంతం” శాస్త్రీయ ప్రపంచంలో విప్లవాత్మకమైనది. ఈ సిద్ధాంతం - శున్యాకాశము, కాలము, గురుత్వాకర్షణ వంటి అంశాలపై అప్పటిదాకా ఉన్న శాస్త్రీయ అవగాహనను విప్లవాత్మకంగా మార్చివేసింది. అప్పటికి దాదాపు రెండు శతాబ్దాల పాటు భౌతిక శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి ఆధారంగా ఉన్న న్యూటన్ ప్రతిపాదించిన “యాంత్రిక జగద్భావం” అన్న భావనను ఐన్ స్టీన్ సిద్ధాంతం పూర్తిగా తుడిచి పెట్టింది.

దీనికి ముందు 1905 లో ఐన్ స్టీన్ ప్రతిపాదించిన ‘ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం’ లోని ముఖ్యాంశాలు :
  • ➣ కాంతి కంటే వేగంగా ఏదీ ప్రయాణించలేదు. వివిధ పరిశీలకుల వేగాలతో సంబంధం లేకుండా కాంతి వేగం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది.
  • ➣ ఏ వస్తువు నిశ్చలంగా ఉందో, ఏ వస్తువు కదులుతోందో చెప్పడం వీలు కాదు. అంతా సాపేక్షమే.
  • ➣ మన ప్రయాణ వేగానికి సాపేక్షంగా కాలం ఉంటుంది. మనం ఎంత వేగంగా ప్రయాణీస్తామో కాలం అంత తక్కువగా కదులుతుంది. కాంతి వేగంతో ప్రయాణిస్తే కాలం కదలక నిలిచి పోతుంది.
ఐన్ స్టీన్ “ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం” సమాన వేగంతో ఒకే దిశలో ప్రయాణించే రెండు వస్తువులకే వర్తిస్తుంది. అన్ని రకాల వస్తువులకు, అన్ని రకాల పరిస్థితులలో వర్తించే విధంగా ఐన్ స్టీన్ 1915 లో తాను ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని విస్తరించి “సామాన్య/సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని” ప్రతిపాదించాడు.
 ‘దేశ కాలాలు’ (Space – time)
 ‘దేశ కాలాలు’ (Space – time) 
“సాధారణ సాపేక్ష సిద్ధాంతం” ప్రకారం ‘శూన్యాకాశం’ (Space) అనేది న్యూటన్ చెప్పినట్లు మూడు నిరూపకాలు కలది కాదు. కాలం (Time) అనేది ప్రత్యేకమైన సత్యం కాదు. ‘స్థల కాలాలు’ లేదా ‘దేశ కాలాలు’ (Space – time) కలిసి నాలుగవ నిరూపకం (ఒకే సామూహిక పరంపర) అవుతుంది. అంటే కాలంతో ప్రమేయం లేకుండా స్థాన బేధాన్ని, స్థాన బేధంతో సంబంధం లేకుండా కాలాన్ని గురించి చెప్పలేము. అంటే కాలం స్వత: సిద్ధమైన ప్రకృతి ధర్మం కాదు. ఈ సిద్ధాంతం వల్ల విశ్వమంతా ఒకే రీతిన కొనసాగే కాలమనేది లేనేలేదని తేలింది.

న్యూటన్ ‘యాంత్రిక జగద్భావం’ ప్రకారం మూడు నిరూపకాలతో కూడిన శూన్యకాశము మరియు కాలము అనేవి ఈ జగన్నాటకానికి రంగస్థలం లాంటివి. వివిధ గ్రహాలూ, నక్షత్రాలు, గురుత్వాకర్షణ శక్తి, వివిధ జీవరాశులు  మొదలైనవి ఇందులో పాత్రధారులు.

కానీ ‘సాధారణ సాపేక్షతా సిద్ధాంతం’ ప్రకారం స్థలకాలాలు విడదీయరానివి. ఇవి పదార్థం పై ప్రభావం చూపుతాయి. తిరిగి పదార్థంతో ప్రభావితమవుతాయి. అంటే రంగస్థలం కూడా పాత్రధారులతో కలిసి ఒక పాత్రధారిగా మారింది. ఈ ‘విశ్వ నృత్యం’ (కాస్మిక్ డాన్స్) అనే జగన్నాటకానికి ప్రేక్షకులంటూ ఎవరూ లేరు. అందరూ పాత్రధారులే. గత 30 సంవత్సరాలుగా జరిపిన ఎన్నో శాస్త్రీయ పరీక్షలు ఈ సాపేక్షతా సిద్ధాంతాన్ని నిజమని ఋజువు చేశాయి.

న్యూటన్ కాలాన్ని ఒక నదీ ప్రవాహం గా భావించాడు. అది వింటిని వదిలిన బాణంలాగా గతము నుండి, వర్తమానం గుండా, భవిష్యత్తు వైపుకు అవిచ్ఛిన్నంగా, ఏకరూపంగా ప్రయాణిస్తుందనీ, దాని గతి ఏ కారణంగాను మారదనీ చెప్పాడు.

కానీ, ఐన్ స్టీన్ కాలమనే నదీ ప్రవాహం ఏకరీతిగా సాగదని, గ్రహాలూ, నక్షత్రాలు, గెలాక్సీల వంటి వాటి సమక్షంలో అది వంపు తిరుగుతుందని, వాటి చుట్టూ కాలం వేగంగా సాగడమో లేక నిదానంగా సాగడమో జరుగుతుందని తెలిపాడు. సముద్రంలో ఈదే చేప తన చుట్టు ప్రక్కల ఉన్న నీటిని ఎలా వెనక్కి నెడుతుందో అలాగే ఒక నక్షత్రము లేదా తోకచుక్క లేదా గ్రహము తను ప్రయాణించే అంతరిక్షంలో దాని దిక్కాలాలలో మార్పును తీసుకు వస్తుంది. దిశ: కాలాలు వేర్వేరు కావు. అవి ఒకటి లేకుండా ఒకటి మనలేవు.

వివిధ వేగాలతో ప్రయాణించే వ్యక్తులు ఒకే సంఘటనల పూర్వాపరాలను విభిన్నంగా గుర్తిస్తారు. ఒక పరిశీలకుడిని ఒకే సమయంలో జరిగినట్లుగా కనిపించే రెండు సంఘటనలు వేరొక పరిశీలకునికి వేరొక విధంగా కనిపించవచ్చని ఐన్ స్టీన్ నిరూపించారు.

‘దేశ కాలాలు’ అనేవి ప్రకృతి క్రియలను వర్ణించడానికి ఒక పరిశీలకుడు వాడే భాషలోని అంశాలు మాత్రమే. (ఈ విషయాలను శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తాను వ్రాసిన "విజ్ఞాన వీచికలు" అనే గ్రంథంలో పొందుపరిచారు.)
Albert Einstein E=MC2
ఐన్ స్టీన్ E=MC2
ఐన్ స్టీన్ తన విశిష్ట సాపేక్షతా సిద్ధాంతంలో పదార్ధాన్ని మరియు శక్తిని ఏకీకృతం చేశాడు. పదార్థం అనేది శక్తిగా మారుతుందని, శక్తి అనేది పదార్థంగా మారుతుందని తన E = mc2 సమీకరణం ద్వారా తెలియజేశాడు. ఇంతకు ముందు పదార్థము, శక్తి వేర్వేరు అని భావించేవారు. “పదార్థము – శక్తి” ని ఒకదాని నుండి మరొకదానిని వేరు చేయలేమని, శక్తి యొక్క అభివ్యక్తీకరణమే పదార్థమని ఐన్ స్టీన్ చెప్పాడు. ద్రవ్యరాశిత్వం కూడా శక్తి యొక్క రూపమేనని, స్థిరంగా ఉన్న వస్తువులోని శక్తి దాని ద్రవ్యరాశి రూపంలో ఉంటుందని, ఆ వస్తువు కాంతి వేగంతో ప్రయాణిస్తే అది ‘కాంతి’ అనే శక్తి రూపం ధరించి, దాని ద్రవ్యరాశిత్వం నశిస్తుందని ఐన్ స్టీన్ తెలిపాడు.

ఈ విధంగా ఐన్ స్టీన్ పదార్థము శక్తి దిక్కులు కాలము లను ఏకీకరణం చేశాడు.
కణాద మహర్షి - Acharya Kanada
కణాద మహర్షి - Acharya Kanada
ప్రాచీన భారతీయ వైజ్ఞానికుడు కణాదుడు తాను వ్రాసిన  “వైశేషిక శాస్త్రం” లో  కాలాన్ని ఒక " ప్రాధమిక " పదార్ధంగా పేర్కొన్నాడు.

అకాశం, కాలం, దిక్ అనేవి అనంతాలు.  వీటికి అంతం లేదు.

దిక్, కాలం - ఈ రెండూ సర్వ వ్యాప్త పదార్ధాలు.

కణాద మహర్షి ఇలా చెప్పాడు :  “ పదార్ధానికి రెండు స్థితులున్నాయి. ఒకటి ‘అణు స్థితి’ అయితే రెండవది ‘మహత్ స్థితి’. మెదటిది సూక్ష్మతమమైనదైతే రెండవ స్థితి అతి విశాలతమ బ్రహ్మాండమంతటిది. ద్రవ్యము (పదార్థము) యొక్క స్థితి ఒకేతీరుగా సమానంగా ఉండదు.

కణాదుని సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం లో ఆరు రకాల ధర్మాలు ఉంటాయి.  అవి ద్రవ్యం(Matter), గుణం(Quality), కర్మ(Action),సామాన్యము(Universal), విశేషము(Special), సమవాయము లేక సామూహికము(Inherence).

ఈ ఆరింటినీ కణాదుడు జ్ఞానవిషయాలుగా చెప్పాడు.

‘పదార్థం’ లేక ‘ద్రవ్యం’ అనేది  తొమ్మిది రకాల అస్తిత్వాలను కలిగి ఉంటుందని కణాదుడు చెప్పాడు. 

అవి : పృథ్వి (ద్రవ్యం యొక్క ఘన రూపం), జలము (ద్రవ రూపం), వాయు (వాయు రూపం), తేజస్సు (శక్తి రూపం), ఆకాశము (ఈథర్), కాలము, దిక్కులు, ఆత్మ మరియు మనస్సు.
కణాదుడు
కణాదుడు
‘తేజస్సు’, అంటే శక్తి అనేది కూడా ద్రవ్యమేనని కణాదుడు చెప్పాడు. “పదార్థము – శక్తి” అనేవి ఒకటే అనే జ్ఞానం 20వ శతాబ్దం లోనే కలిగింది. కానీ ఈ విషయాన్ని కణాదుడు సుమారు 2,600 సంవత్సరాలకు పూర్వమే చెప్పాడు. అంతే కాక దిక్కులు, కాలాలు కూడా ద్రవ్యాలేనని కణాద మహర్షి చెప్పాడు. పాశ్చాత్య ప్రపంచంలో ఐన్ స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం తర్వాతనే ఈ పరిజ్ఞానం ప్రచారంలోకి వచ్చింది.

కణాద మహర్షి అభిప్రాయం ప్రకారం మనస్సు, ఆత్మ కూడా ద్రవ్యాలే. అయితే దీనిని నిరూపించే పరిజ్ఞానం ఇప్పటి ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో లేదు.
శివతాండవం - Shivatandavam
శివతాండవం - Shivatandavam 
శివతాండవం:
భాగవతం ప్రకారం పదార్థమనేది రెండు స్థితులలో ఉంటుంది : ఒకటి వ్యక్త స్థితి. రెండవది అవ్యక్త స్థితి. పదార్థం వ్యక్త రూపంలోకి మారినప్పుడు ఈ విశ్వం సృష్టి అవుతుంది. ఈ విశ్వం నాశనమైనప్పుడు పదార్థం తిరిగి అవ్యక్త స్థితిలోకి వెళ్తుంది.

సర్వ ప్రాణుల, జడ పదార్థాల జనన మరణాలు, సృష్టిలయాలకు సంకేతంగా ఉన్న 'శివతాండవం' లో ఐన్ స్టీన్ యొక్క పదార్థము - శక్తి యొక్క సమత్వభావన కనబడుతుంది. 
  • 🝒 శివుడు తన శక్తి నృత్యం ద్వారా జడమైన ప్రకృతిని మేల్కొలిపేలా శబ్దం (డమరుక ధ్వనిగా సూచితం) చేస్తాడు. 
  • 🝒 ఇలా తన నృత్యం ద్వారా పదార్థ రూపంలో వివిధ ప్రకృతి క్రియలను కొనసాగిస్తాడు.
  • 🝒 కాలాంతరంలో ఆయన తన నృత్యం ద్వారానే నామరూపాలనింటినీ నశింపజేసి, ప్రకృతికి విశ్రాంతినిస్తాడు.
  • 🝒 బ్రహ్మకు రాత్రి అయి నిద్రలోకి వెళ్ళినపుడు శివుడు రుద్ర తాండవం మొదలుపెడతాడు.  
  • 🝒 అప్పుడు ఈ విశ్వం నాశనమై, కుంచించుకు పోయి, శూన్య స్థితికి చేరుతుంది. 
  • 🝒 బ్రహ్మకు పగలు అయి, మేలుకున్నప్పుడు శివుడు ఆనంద తాండవం మొదలుపెడతాడు. అప్పుడు బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తాడు.
  • 🝒 సృష్టి అయిన దానిని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తే అందులో నుండి అఖండమైన శక్తి వెలువడుతుంది. 
  • 🝒 ఈ భావన శివుడి రుద్రతాండవంలో కనబడుతుంది. 
  • 🝒 ఈ విధంగా పదార్థము - శక్తి ఒకదానిలోకి ఒకటి రూపాంతరం చెందుతాయన్న విషయాన్ని శివతాండవం తెలియజేస్తోంది.
“ఇండియా : లివింగ్ విస్ డమ్ సిరీస్” అనే గ్రంథంలో రిచర్డ్ వాటర్ స్టోన్ ఇలా అంటారు : “నటరాజు యొక్క శక్తివంతమైన భంగిమలో సృష్టి లయలనబడే  అంతులేని గతిశీల ప్రక్రియ ప్రకటితమవుతోంది. శివ తాండవం వ్యక్త పరుస్తున్న ‘పదార్థము - శక్తి యొక్క సమత్వాని’కీ, ‘ఒక ఉపపరమాణు కణంలో నిబిడీకృతమై ఉన్న శక్తి దానియొక్క  ద్రవ్యరాశి మరియు కాంతివేగం యొక్క లబ్దం తో సమానమని’  చెప్పిన ఐన్ స్టీన్ సమీకరణానికి (E=mc2) ఆశ్చర్యకరమైన పోలికలున్నాయి.”

“క్రీ.ఫూ. 700 కి పూర్వమే హిందూ ఋషులు ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు) అని ఉచ్ఛరిస్తూ బాహ్య ప్రపంచం యొక్క అంతిమ వాస్తవికతను మిథ్య గా తెలుసుకున్నారు. దానికి బదులుగా వారు అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మరూపంలోని  బ్రహ్మము యొక్క శాశ్వతమైన తేజ: కణము కోసం అన్వేషించారు.”
పరాశక్తి - Parashakti
పరాశక్తి - Parashakti 
“ట్రావెల్స్ త్రూ సేక్రెడ్ ఇండియా” అనే గ్రంథంలో రోజెర్ హౌస్డెన్ ఇలా అంటారు : “ ఉదాహరణకు కాలం అనేది కాళికాదేవితో అన్యోన్య సంబంధం కలిగి ఉంది. ఆమె యొక్క సంహారకారక స్వభావంలో కొంతవరకు అది కనిపిస్తుంది. ఐన్ స్టీన్ సమీకరణంలోని ‘శక్తి’ (E) అనేది భారతదేశంలో ‘పరాశక్తి’ యొక్క అనేక రూపాలలో ప్రకటమవుతోంది.”

సంకలనం: మణికుమార్ వేమూరి
రచన: శ్రీ ఎ భరద్వాజ

Friday, May 22, 2020

వేదాంగ జ్యోతిష్యం - Vedanga Jyotishyam



వేదాంగ జ్యోతిష్యం - Vedanga Jyotishyam
వేదకాలపు ఋషులు ఖగోళాన్ని నిశితంగా పరిశీలించేవారు. జ్యోతిషం గురించి ఋగ్వేదంలో 36 ద్విపదలలో ప్రస్తావించబడింది. ఈ క్రింది ఋగ్వేద మంత్రాన్ని పరిశీలించండి
ద్వాదశారం నహితాజ్జరాయ
వర్వతి చక్రం పరిద్యామృతస్య
ఆ పుత్ర అగ్నే మిథునా సో
అత్ర సప్త  శతాని వింశతిశ్చ తస్యః  (24-1-164-11)
సూర్యుడి చక్రానికి పన్నెండు ఆకులు. (ఈ పన్నెండూ నెలలన్న మాట) ఓ అగ్నీ, ఈ చక్రం పైన యేడువందల ఇరవైమంది అధిరోహించి ఉన్నారు ( మూడువందల అరవై పవళ్ళు,  మూడువందల అరవై రాత్రులు అన్నమాట)

అథర్వవేదం క్రీ.పూ. 3000 ప్రాంతంలో ఆవిష్కృతమైనది. ఈ క్రింది అథర్వవేద మంత్రాల్ని చూడండి.
అయం గౌః ప్రశ్మిర్ క్రమీదస దన్మాతరం పురః
పితరం చ ప్రయత్నస్వన్    (4-VI-30-1)
త్రిసద్ ధామా వి రాజతి వాక్ పతంగో ఆశిశ్రియత్ప్ర
తి వస్తోరహద్యభిః    (4-VI-30-3)

ఈ మంత్రం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని స్పష్టంగా చెబుతోంది. ఈ మంత్రం రాత్రింబవళ్ళను సూర్యుడు ఒక్కొక్కటి ముప్పది భాగాలుగా చేస్తున్నాడని కూడా చెబుతోంది.  దీనిని బట్టి ఒక్కక్క ఆలాంటి విభాగమూ 24 నిముషాల ప్రమాణం కలిగి ఉందని తేలుతోంది.  ఇదే భారతీయమైన అత్యంత పురాతన సమయ విభాగం.

ఇలా రోజును 60 భాగాలుగా చేయటం బాబిలోనియన్ల పధ్దతి అనీ,  కొందరు బాబిలోనియన్ల వద్దనుండి భారతీయ ఖగోళజ్ఞులు. ఈ ఘడియ అనే మాటను గ్రహించారనీ, క్రీ.పూ 400 సంవత్సరాల కాలంలోని లగధుడు యీ ఘడియ అనే మాటను తన జ్యోతిషవేదాంగగ్రంధంలో వాడాడనీ భావించారు. కాని అథర్వవేదం క్రీ.పూ 3000 కాలంలో రచించబడితే,  బాబిలోనియన్ల  నాగరికత క్రీ.పూ 2వ శతాబ్దికాలం నాటిదే.

లగధుడి రచన అయిన వేదాంగజ్యోతిషం క్రీ.పూ 1500 కాలంనాటిది.   లగధుడు  'నాడి' అని యీ విభాగానికి నామకరణం చేయటం ఈ క్రింది శ్లోకంలో చూడవచ్చును

పలాని పంచాశదపం ధృతాని
తదాఢకం ద్రోణమతః ప్రమేయం
త్రిభిర్విహీనం కుడవైస్తు కార్య
తన్నాడికాఖ్యస్తు భవేత ప్రమాణం
లగధుడి వేదాంగ జ్యోతిషంలో యెక్కడా  ప్రస్తుతకాలందాకా వాడుకలో ఉండిన  యీ 'ఘటిక లేదా ఘడియ' అనే 24నిముషాల కాలప్రమాణం ప్రసక్తి కనిపించదు. ఆయితే  'ఘటిక లేదా ఘడియ' మాటను వరాహమిహిరాచార్యులు తన పంచసిధ్ధాంతిక ధ్వారా ప్రచారంలోనికి తెచ్చినట్లు కనిపిస్తున్నది.  పంచసిధ్ధాంతికను వరాహమిహిరుడు క్రీ,శ. 505లో విరచించాడు.

లగధుడి వేదాంగ జ్యోతిషంలో రెండు విభాగాలున్నాయి. ఒకటి  ఋగ్వేదజ్యోతిషం లేదా ఋక్-జ్యోతిషం, రెండవది యజుర్వేదజ్యోతిషం లేదా యజుర్జ్యోతిషం.  ఋగ్వేదజ్యోతిషంలో 36శ్లొకాలు, యజుర్జ్యోతిషంలో 44శ్లోకాలూ ఉన్నాయి.   అయితే యీ రెండు విభాగాల మధ్య చాలా శ్లోకాలు ఉమ్మడిగా దర్శనం  యిస్తాయి. అధర్వవేదజ్యోతిషం అని 162శ్లోకాలు గల మరొకటి ఉన్నది కాని అది వేదాంగజ్యోతిషంలో  భాగం కాదని తెలుస్తోంది.

" వేదాంగ జ్యోతిషం " గ్రంధంలో " యుగం " వివరణ ఇచ్చారు. ఇందులో యుగంలో ఐదేళ్ళున్నాయి. మాఘ మాస శుక్ల ప్రతిపద నాడు సూర్య చంద్రుల రేఖాంశ స్థానం ధనిష్ఠ (బీటా డెల్ఫినీ) నక్షత్రంలో ఉన్నప్పుడు ఆరంభమయ్యింది. ఇక్కడ విశేషంగా గమనించాల్సినది యేంటంటే ఆనాటికే మాస, తిథి, వార, ఆయన, నక్షత్ర, సంవత్సర, (రేఖాంశ స్థానం), కాల స్వరూపాలు వ్యవహారంలో ఉన్నాయి. అధిక, క్షయమాసాలగురించిన వివరణలను యీ గ్రంధం యిచ్చింది. క్షయ తిథులు, నక్షత్ర అహోరాత్రుల గణక సాధనాపద్ధతులు వ్యవహారంలో ఉండేవి. యుగంలో ఉన్న యేళ్ళు - 5,   సావన (సివిల్) దినములు (5 X 366) - 1830 దినములు, సౌర మాసాలు (5 X 12) - 60, చాంద్ర మాసాలు - 67, తిథులు (చాంద్రమాన దినములు) (62 X 30 దినములు) - 1860, క్షయ తిథులు (1860 - 1830) - 30, నక్షత్ర దినములు (67 X 27 దినములు) - 1809

ఋగ్వేదజ్యోతిషంలోని  యీ క్రింది శ్లోకాన్ని గమనించండి.
ధర్మవృధ్దిరపాం ప్రస్థా  క్షపా హ్రాస ఉదాగస్తౌ
దక్షిణేతౌ విపర్యాసః షణ్ముహూర్త్యానేన తు
సూర్యుడి ఉత్తరక్రాంతి దినాల్లో అహఃప్రమాణం పెరుగుతుంది, రాత్రిప్రమాణం తగ్గుతుంది. అదే సూర్యుడి దక్షిణక్రాంతి దినాల్లో  రాత్రిప్రమాణం పెరుగుతుంది,  అహఃప్రమాణం తగ్గుతుంది.  ఈ హెచ్చుతగ్గులయ్యే  దివారాత్రప్రమాణవ్యత్యాసం అత్యధికంగా 6 ముహూర్తాలుగా ఉంటుంది అని పై శ్లోకం యొక్క అర్థం.    కాశ్మీరంలో తప్ప భారతదేశంలో యేప్రాంతంలోనూ యింత హెచ్చు  వ్యత్యాసం రాదు.  దీని ఆధారంగా లగధుడు కాశ్మీరబ్రాహ్మణుడని ఊహిస్తున్నారు. 

రచన: శ్యామలీయం

Wednesday, May 20, 2020

వరాహమిహిరుడు, అత్యంత ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త - Varahamihirudu, Ancient astronomer, Khagola Sastravetta


వరాహమిహిరుడు, అత్యంత ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త - Varahamihirudu, the most ancient astronomer, Khagola Sastravetta

వరాహమిహిరుడు

ప్రాచీన భారతదేశపు అత్యంత ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలలో వరాహమిహిరుడు గణనీయుడు. ఈయన క్రీ.శ. 6వ శతాబ్దానికి  చెందిన వాడు. ఈయన ప్రముఖ గ్రంధం పంచసిధ్ధాంతిక 505వ సంవత్సరంప్రాంతంలో వ్రాయబడింది. పంచసిధ్ధాంతికలో క్రీ.శ. 499లో రచించబడిన ఆర్యభట్టీయాన్నివరాహమిహిరుడు  ప్రస్తావించాడు. బ్రహ్మగుప్తుడి బ్రహ్మస్ఫుట సిధ్ధాంతవ్యాఖ్యలో నవాధికపంచాసంఖ్యా శకే వరాహమిహిరాచార్యో దివంగతః అని ఉంది.   దీనిని బట్టి, ఈయన 587వ సంవత్సరంలో నిర్యాణం చెందినట్లు తెలుస్తోంది. 

వరాహమిహిరుడి బృహజ్జాతకంలో చివరన:
   ఆదిత్యదాస తనయా స్తదవాప్తబోధః
   కాపిథ్థకాః  సవితృలబ్ధవరప్రసాదః
   అవన్తికోమునిమతానై వలోక్య సమ్యక్
   హోరం వరాహమిహిరో రుచిరంకార

అని ఉండటాన్ని బట్టి వరాహమిహురుడి తండ్రి పేరు ఆదిత్యదాసుడని, ఇతను సూర్య వరప్రసాదంగా జన్మించాడనీ అనీ  తెలియ వస్తోంది.  ఆయన స్వగ్రామం కాపిథ్థకం ఉత్తరప్రదేశ్ లోని సంకాశ్యం. తరువాతి కాలంలో ఈయన అవంతి (ఉజ్జయిని)లో నివసించాడు.   మిహిర శబ్దానికి సూర్యుడని అర్థం. తదవాప్తబోధః అనటాన్ని బట్టి  వరాహమిహురుడు  తండ్రి వద్దే విద్యాభ్యాసం చేసాడని కూడా  తెలుస్తోంది.
  • ➣ వరాహమిహిరుడు విక్రమార్కుడి నవరత్నాలలో ఒకడని ప్రచారంలో ఉంది గాని  అది అంత నమ్మదగ్గ విషయం కాదు.
  • ➣ వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రంలోనూ, జ్యోతిషంలోనూ ఉద్దండపండితుడు.  స్కందత్రయ జ్యోతిష విభాగాల్లోనూ విస్తారంగా రచనలు చేసాడు.   అవన్నీ చాలా పెద్దపెద్ద గ్రంధాలు కావటంతో, అంత పెద్ద వాటిని అవలోఢనం చేయలేని అశక్తుల కోసం వాటికి లఘు గ్రంధాలు కూడా తానే స్వయంగా విరచించాడు.
  • ➣ సిధ్ధాంత గణితంలో పెద్దగ్రంధమైన పంచసిధ్ధాంతిక 18 ఆధ్యాయాలు కలిగి ఉంది.  జాతకపధ్ధతికి సంబంధించిన ఆయన గ్రంధం బృహజ్జాతకంలో 26 ఆధ్యాయాలున్నాయి.  ముహూర్తాది అనేక విషయాలుకల బృహత్సంహితలో యేకంగా 106 ఆధ్యాయాలున్నాయి.
  • ➣ యుధ్ధవిషయకమైన జ్యోతిషవిభాగంలో వరాహమిహిరుడు  మహాయాత్ర(భద్రయాత్ర, బృహద్యోగయాత్ర, యక్షేస్వమేధికయాత్ర అనికూడా దీనికి పేర్లున్నాయి),  స్వల్పయాత్ర,   యోగయాత్ర అని మూడు గ్రంధాలు రచించాడు. 
  • ➣ వివాహ విషయక జ్యోతిషంపైన  వివాహపటలము, స్వల్పవివాహపటలమూ  యీయన రచించాడు.
  • ➣ ఈయన రచనలన్నీ  సుష్టువైన, అందమైన, సరళమైన భాషలో ఉంటాయి.  విషయాన్ని స్పష్టంగా చెప్పటమే కాకుండా చాలా కవితాత్మకంగా వ్రాయటం యీయన ప్రత్యేకత.     ఛందస్సుమీద అఢికారమూ మంచి  సరసత ఉన్నవాడు.  కొన్ని కొన్ని చోట్ల మంచి కవితా ధోరణిలో తాను వ్రాస్తున్న పద్యం యొక్కఛందస్సు పేరును ఆ పద్యంలో ప్రస్తావించాడు కూడా.  కొన్ని చోట్ల దండకాలు వంటివి కూడా వ్రాసాడు.
బృహజ్జాతకానికి వ్యాఖ్యరచించిన ఉత్పలుడు, దాని ప్రారంభంలో వరాహమిహిరుణ్ణి గురించి ఇలా అంటాడు.

యఛ్ఛాస్త్రం సవితా చకార విపులం స్కంధత్రయై ర్జ్యోతిషం
తస్యోఛ్ఛిత్తి  భయాత్ పునః కలియుగే సంస్రజ్య యో భూతలం
భూయాః స్వల్పతరం వరాహమిహిర వ్యాజేన సర్వం వ్యధా
ద్దిష్టం యం ప్రవదన్తి మోక్షకుశలా స్తస్మై నమో భాస్వతే
తంత్ర (గణిత), జాతక, సంహితలనే మూడు స్కందములుగాల జ్యోతిషం  సాక్షాత్తు సూర్యభగవానుడే స్థాపించాడు.  కలియుగంలో అది నాశనమౌతుందని  భయపడి,  సూర్యుడే స్వయంగా వరాహమిహిరాచార్యుడిగా అవతారం ధరించి భూమికి వచ్చి ఆ స్కంధత్రయ జ్యోతిషాన్ని మరలా సులభంగా లఘురూపంలో  మనకు అందించాడు.  ఆసూర్యుడికి మోక్షార్ధులైన వాళ్ళు నమస్కరిస్తున్నారు.  ఇదీ ఆ పై శ్లోకం యొక్క అర్థం.

సంకలనం/రచన: శ్యామలీయం

Tuesday, May 19, 2020

హైందవ గ్రంథాలలో డైనోసార్లు - Dinosaurs in Hinduism


హిందూ గ్రంథాలలో డైనోసార్లు?

‘డైనోసార్లు’ లేదా ‘రాక్షసబల్లులు’ అనేవి సుమారు 23 కోట్ల సంవత్సరాల క్రితం ‘ట్రయాసిక్ యుగం’లో ఆవిర్భవించి ‘జురాసిక్ యుగం’ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ‘క్రెటాషియస్ యుగం’ చివర్లో, అంటే సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  డైనోసార్లనేవి ‘డైనోసారియా’ అనే ప్రజాతికి చెందిన జంతువుల సమూహం. వీటిలో వెయ్యి కి పైగా ఉపజాతులున్నాయి. మరి ఈ యుగాలకు చెందిన భారీ జంతువుల ప్రస్తావన హిందూ గ్రంథాలలో ఉందా? అనేది ఒకసారి పరిశీలిద్దాం.
మకర తోరణం - Makarathoranam
మకర తోరణం - Makarathoranam 
దేవతా విగ్రహాల మూల విరాట్టు వెనుక ఉండే లోహ తోరణాన్ని “మకర తోరణం” అంటారు. దాని తల భాగాన్ని ‘సింహ తలాటం’ అంటారు. ఈ తోరణం మీద ‘మకరం’ అనే జంతువు ఆకారం చెక్కబడి వుంటుంది. “మకరం” అంటే సహజంగా మనకు మొసలి గుర్తుకు వస్తుంది. కానీ హిందూ గ్రంథాలలో మకరం గురించి ఉన్న వర్ణనలను, హిందూ దేవాలయాల గోడలపై, గర్భాలయ తోరణాలపై ఉండే మకర శిల్పాలను పరిశీలిస్తే అది నిజం కాదని తెలుస్తుంది. భారత్ లోనే కాక కాంబోడియా, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల్లోని హిందూ ఆలయాల్లో కూడా ఇవి కనబడతాయి.

“మకరం” అనేది సగం జలచరంగా, సగం భూమి మీద తిరిగే జంతువులా ఉండే ఒక భారీ రాక్షస జీవి. దీని తల మొసలి తలలా ఉంటుంది. దీని తోక నెమలి పింఛంలా లేదా చేప తోకలా ఉంటుంది. దీనికి మేకకి ఉన్నట్లు చిన్న చిన్న కొమ్ములుంటాయి. డైనోసార్లకు కూడా కొమ్ములు లేక శిఖ (కొప్పు) వంటి నిర్మాణాలుంటాయి.

హిందూ గ్రంథాలలో “మకరం” గంగా దేవి వాహనంగా చెప్పబడింది. అంతే కాక వరుణదేవుడి వాహనంగా కూడా చెప్పబడింది.

వరుణుడు మాత్రమే మకరాన్ని నియంత్రించి ఓడించగల సమర్థుడని కూడా చెప్పబడింది. మొసలినైతే నైపుణ్యం గల సాధారణ వ్యక్తీ కూడా నియంత్రించి ఓడించగలడు. కాబట్టి మకరం అనేది మొసలి కాదని తెలుస్తోంది.

మహా భారతం ప్రకారం ‘మకరం’ మరియు ‘తిమింగలం’ అనేవి సముద్రంలో ఉండే  అత్యంత శక్తివంతమైన భారీ జలచరాలు.

“ నీటి అడుగున పెద్ద రాతి బండల్లాంటి తిమింగలాలు, తాబేళ్ళు, తిమి తిమింగలాలు, మకరాలు కనబడతాయి.” అని మహాభారతం లోని అరణ్యపర్వం 168.3 శ్లోకం వర్ణించింది.

అంతే కాక శుశ్రుత సంహిత, భాగవత పురాణం, భగవద్గీత వంటి గ్రంథాలలో కూడా ‘మకరం’ మరియు ‘తిమింగలాలు’ భయంకరమైన ఉభయచర జీవులుగా వర్ణించబడ్డాయి.

శుశ్రుత సంహిత - 45వ అధ్యాయం లో మకరం, తిమింగలం వంటివి సముద్ర జీవులని చెప్పబడింది.
భగవద్గీత (10-31) –
“పవన: పవతామస్మి రామ : శస్త్ర భృతామహమ్
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ.”     
“పవిత్రీకరించు వాటిలో నేను వాయువును. ఆయుధధారులలో రాముడను. మత్స్యములలో మకరమును. ప్రవహించు నదులలో గంగా నదిని ఆగుదును.”

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు " సముద్ర జీవుల్లో నేను మకరాన్ని " అని చెప్పాడు. అంటే అన్ని రకాల సముద్ర జీవుల్లోను ఉత్తమమైనది, భారీయైనది మకరం అని తెలుస్తోంది. ఈ వర్ణన మొసలికి సరిపోదు.

మకరము నీటిలో నివసించే జంతువులన్నింటిలో పెద్దదియు, మానవునకు హానికరమైనట్టిదియు నగుటచే  అది శ్రీ కృష్ణునకు ప్రాతినిధ్యం వహించునని శ్రీ ఏ.సి. భక్తివేదాంతస్వామి భాష్యం వ్రాశారు.

శ్రీమద్భాగవతంలో మార్కండేయ మహా ముని పై మకరాలు, తిమింగలాలు దాడి చేసాయని ఉంది.

పై శ్లోకాలలోని వర్ణనలను బట్టి మకరానికి ‘అంబులోసీటస్’ (ఇయోసీన్ యుగానికి చెందినది ) లేదా ‘ప్లెసియోసార్’ ( క్రెటాషియస్ యుగానికి చెందినది) అనే ప్రజాతి కి చెందిన భారీ సరీసృపాలతో పోలికలు  కనబడుతున్నాయి.

దాదాపు 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటి ‘ప్లెసియోసార్’ శిలాజం 2003 లో ఇంగ్లాండ్ లో బయటపడింది. భూమి మీద మరియు నీటిలోనూ జీవించే ‘అంబులోసీటస్’ ప్రజాతికి చెందిన భారీ జంతువులు 6 కోట్ల సంవత్సరాల క్రితం నాటివి. వీటి శిలాజాలు నేటి పాకిస్తాన్ లో దొరికాయి.

మకరం, తిమింగలాల గురించే కాక ఇతర భారీ జంతువుల ప్రస్తావన  కూడా హిందూ గ్రంథాలలో కనబడుతుంది. అయితే ఆ గ్రంథాలు దైవికమైన విషయాల గురించి వ్రాసినవి కాబట్టి ఆయా జంతువుల వర్ణనలు పరిమితంగానే అందులో కనబడతాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగే యుద్ధాలలో ఇరు పక్షాలవారు ఎక్కువగా ప్రమాదకరమైన జంతువులను వాహనాలుగా కలిగి ఉండడం కనబడుతుంది.
విభీషణుడు
విభీషణుడు
విభీషణుడు భారీ జంతువులను ఎదుర్కొన్న సంఘటన రామాయణంలో ఉంది. అంతేకాక, లంకా నగరాన్ని భారీ ఆకారాల్లో ఉండే ఎగిరే గుర్రాలు కాపలా కాస్తున్నాయని వాల్మీకి వ్రాసాడు.

సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు సముద్రం పై నుండి ఎగిరి, లంక కు వెళ్తున్నప్పుడు "సింహిక" అనే జల రక్కసి తారసపడుతుంది.
  •  “ ఆ తర్వాత హనుమంతుడు ప్రక్కల, పైనా, క్రిందా పరికించి చూడగా ఆ లవణ సముద్రంలోనుండి పైకి లేచిన  ఒక భారీ జంతువు దర్శనమిచ్చింది.” (సుందరకాండ - 5-1-186)
  •   “ భయంకరమైన ముఖం గల ఆ జంతువును  చూసిన హనుమంతుడు తనలో ఇలా అనుకున్నాడు. "నా నీడను పట్టుకొని లాగగలిగిన బలం గల, విచిత్రమైన ఆకారం గల ఈ జంతువు బహుశా సుగ్రీవుడు చెప్పినదై ఉండవచ్చు. అందులో సందేహం లేదు." (5-1-187)
  •  “ హనుమంతుడు తన శరీరాన్ని కుంచింపజేసుకొని ఆ జంతువు నోటిలోకి దూరి తన వాడియైన గోళ్ళతో దాని శరీరం లోపలి భాగాలను చీల్చి మనోవేగంతో బయటకు వచ్చాడు.”(5-1-194 )
ఈ వర్ణనలను బట్టి చూస్తే ఆ నీటి జంతువు డైనోసార్ జాతికి చెందినదిగా కనిపిస్తోంది.

మహాభారతంలో కూడా భయంకరమైన సరీసృపాల గురించి చేసిన వర్ణన డైనోసార్లను గుర్తుకు తెస్తుంది. సర్ప జాతిని సమూలంగా నాశనం చేయడానికి జనమేజయ మహారాజు సర్పయాగం తలపెడతాడు. ఈ సందర్భంలో నిప్పులు చిమ్మే డ్రాగన్ల గురించి, ఒక్క కాటుతో పచ్చని చెట్టు ని చంపగల సర్ప జాతుల గురించి  వర్ణనలు కనబడతాయి. డైనోసార్లు కూడా సరీసృపాల జాతికి చెందినవేననే సంగతి గమనార్హం.

        ఈ యాగంలో రకరకాల రంగులు కల వందల కొద్దీ, వేల కొద్దీ సర్పాలు, విషాలు కక్కుతూ మంటల్లో పడి బూడిద అయినట్లు వర్ణించబడింది. వాటిలో కొన్ని అనేక యోజనాల పొడవు ఉన్నవిగా కూడా చెప్పారు. ఒక యోజన అంటే సుమారు 8-15 కి.మీ.
డైనోసార్లు
వాసుకి, తక్షక, ఐరావతి, కౌరవ్య, ధృతరాష్ట్ర, వరాహక మొదలైన సర్పజాతులన్నీ ఈ యాగంలో నశించాయి. వీటి గురించి చేసిన వర్ణనలు డైనోసార్లను గుర్తుకు తెస్తాయి.

భాగవత పురాణం - 8 వ అధ్యాయం – 10 - 12 శ్లోకాలను పరిశీలిస్తే ఇందులో భాస, క్రికలస, గవయ, శరభ, అరుణ, వికృత విగ్రహ వంటివి ప్రమాదకరమైన జంతువులుగా చెప్పబడ్డాయి. సంస్కృతం లో “వికృత విగ్రహ” అంటే ‘వికృతమైన ఆకారం గల జంతువు’ అని అర్థం. “క్రికలస” అంటే ‘భారీ రాక్షస బల్లి లేదా ఊసరవెల్లి.’ ‘గవయ’ అంటే ‘అడవి దున్న.’ అయితే ఈ వర్ణనలు ఏ జంతువులను సూచిస్తున్నాయో ఇతమిత్థంగా చెప్పడం కష్టం. ఇవి అంతరించి పోయిన డైనోసార్లు లేదా ఇతర భారీ జంతువులు కావచ్చు.

భాగవత పురాణం ప్రకారం ప్రతీ మన్వంతరంలోనూ ఆ మన్వంతరానికి ప్రత్యేకమైన వృక్ష జంతు జాలాలుంటాయి. ఒక మన్వంతరంలోని కొన్ని జంతు, వృక్ష జాతులు ఆ తర్వాతి మన్వంతరంలో అంతరిస్తాయి. మరికొన్ని మన్వంతరాల తర్వాత తిరిగి పునరుజ్జీవింపబడతాయి. అంతరించిపోయిన జాతుల స్థానే, కొత్త మన్వంతరంలో కొత్త జాతులు ఏర్పడతాయి. ఈ పున:స్థాపన ను ‘ఆత్మ యొక్క శరీరాంతర ప్ర్రాప్తి’ అంటారు.

నాగ్ పూర్ జిల్లా లో ఇటివల పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తల అభిప్రాయంలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భారత దేశం లోని కొన్ని డైనోసార్ జాతులు, ఆ కాలంలో పండిన ఒక రకమైన ‘వరి’ని తిని బ్రతికాయి. మధ్య భారతంలోని త్రవ్వకాలలో 6.8-6.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ల గుడ్లు, గూళ్ళు అత్యధిక సంఖ్యలో బయట పడ్డాయి. ప్రపంచంలో అత్యధికంగా డైనోసార్ల ప్రజననం జరిగిన స్థలంగా మధ్య భారతం గుర్తింపు పొందింది.

మానవుడు - డైనోసార్ల సహజీవనాన్ని నిరూపించేలా కొన్ని ఆధారాలు లభిస్తున్నా అనేక రాజకీయమైన, మతపరమైన, భావజాలపరమైన కారణాల వాళ్ళ వాటిని బయట పెట్టడానికి శాస్త్రవేత్తలు సాహసించట్లేదు. ఏమైనా, ఈ భూమి మీద ఒకానొక కాలంలో పూర్తిగా డైనోసార్లే ఆధిపత్యం చలాయించాయనే వాదనలో పస లేదని తెలుస్తోంది.
డైనోసార్లు నీటిలో జీవించేవని
డైనోసార్లు నీటిలో జీవించేవని
డైనోసార్లు నీటిలో జీవించేవని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ కి చెందిన  ప్రొఫెసర్ బ్రియాన్ జె. ఫోర్డ్ అనే శాస్త్రవేత్త అభిప్రాయ పడుతున్నాడు. ఈయన అభిప్రాయం ప్రకారం – “డైనోసార్ల తోకలు పెద్దవిగా ఉండటం వల్ల భూమి మీద వేగంగా నడవడానికి, వేటాడడానికి వీలుగా ఉండవు. కాబట్టి వాటికి కావాల్సినంత మేత దొరకడం కష్టమవుతుంది. వాటికుండే పెద్ద తోక శరీరాన్ని నీటిలో తేలిక చేసి, వేగంగా ఈదడానికి సహాయపడుతుంది. లోతు జలాలు డైనోసార్ల శరీర బరువుకు అనువుగా ఉంటాయి..”

మరి కొందరు శాస్త్రవేత్తల సిద్ధాంతం ప్రకారం డైనోసార్లు నీటిలో ఈదగలవు, చిత్తడి నేలల్లో నివసించగలవు. కాబట్టి డైనోసార్లు ఉభయచర జీవులయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
పక్షిలా రెక్కలు, నెమలి కి ఉన్నట్లు పింఛము ఉన్న డైనోసార్ శిలాజం (Zhenyuanlong Suni)
పక్షిలా రెక్కలు, నెమలి కి ఉన్నట్లు పింఛము ఉన్న డైనోసార్ శిలాజం (Zhenyuanlong Suni - జెన్యువాన్లాంగ్ సుని
పక్షిలా రెక్కలు, నెమలి కి ఉన్నట్లు పింఛము ఉన్న డైనోసార్ శిలాజం (Zhenyuanlong Suni) ఒకదాన్ని 2015 లో చైనా లో కనుగొన్నారు. ఐతే ఆ డైనోసార్ ఎగరగలిగేదా లేదా అనేది ప్రశ్నార్థకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని రకాల డైనోసార్లకు ఏనుగులకు మాదిరిగా తొండాలు ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ విషయాలన్నీ పరిశీలిస్తే డైనోసార్ల కు సంబంధించి శాస్త్రవేత్తలకు నూటికి నూరు శాతం స్పష్టత లేదని తెలుస్తోంది. అవి భూమి మీద తిరిగేవా? లేక నీళ్ళలోనా? లేక అవి ఉభయచర జీవులా? వాటికి తొండం ఉండేదా? అవి మానవులతో పాటే ఈ భూమి మీద ఉండేవా? అనే విషయాలపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది.

మొత్తం మీద చూస్తే ట్రయాసిక్, జురాసిక్, క్రెటాషియస్ యుగాలకు చెందినవిగా శాస్త్రవేత్తలు చెబుతున్నడైనోసార్లు, ఇతర భారీ సరీసృపాలను గురించిన ప్రస్తావన మన హిందూ గ్రంథాలలో మరియు హిందూ దేవాలయాలలోని వాస్తు శిల్పం లో కనిపిస్తోందని రూఢిగా చెప్పవచ్చును.

సంకలనం/రచన: మణి కుమార్

Monday, May 11, 2020

బ్రహ్మ సత్యం - జగత్తు మిథ్య, సైన్సు - Jagattu,Brahma, Science

బ్రహ్మ సత్యం - జగత్తు మిథ్య, సైన్సు  - Jagattu, Science
ద్వైత సిద్ధాంతం ప్రకారం “బ్రహ్మ సత్యం - జగత్తు మిథ్య.” ఇదే ఆదిశంకరాచార్యుని మాయావాదంగా ప్రసిద్ధమైంది. మన కంటికి కనిపిస్తున్న ప్రపంచం నిజంగా ఉంది కదా! రాయి రాయిగా కనబడుతోంది. చెట్టు చెట్టుగా కనబడుతోంది. మరి దానిని మిథ్య అంటారేంటి? ఇదంతా ఆధునిక విద్యావంతులకు మెట్ట వేదాంతం లా కనబడుతుంది. మరి దీనిని గురించి సైన్స్ ఏం చెబుతోందో చూద్దాం.

భౌతిక శాస్త్రం ప్రకారం విశ్వంలోని పదార్థమంతా పరమాణువులతో నిర్మించబడి ఉంది. పరమాణువులో కేంద్రకం, దాని చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్, ప్రోటాన్ వంటి అతి సూక్ష్మ కణాలు ఉంటాయి.
గోళీ
గోళీ
ఉదాహరణకు మనం చిన్న పిల్లలు ఆడుకొనే “గోళీ” ని తీసుకుందాం. అది గుండ్రంగా, గట్టిగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది.  ఆ గోళీ ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో పరిశీలిస్తే అది పరమాణువులతో నిండి ఉందని తెలుస్తుంది. ఒక్కో పరమాణువును ఒక క్రికెట్ స్టేడియంతో పోలిస్తే, ఆ స్టేడియం మధ్యలో ఒక బియ్యపు గింజను పెడితే, అది ఆ పరమాణువు కేంద్రకం. ఎలక్ట్రాన్, ప్రోటాన్ వంటివి కూడా బియ్యపు గింజ పరిమాణంలో ఉండి, ప్రేక్షకుల స్టాండ్స్ మీదుగా కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మధ్యలోది అంతా ఖాళీ స్థలమే! ఒక పరమాణువులో 99.9999999 % ఖాళీ ప్రదేశమేనని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే గట్టిగా ఉన్నట్లు మనకు అనిపించే ఒక గోళీ లో 99.9999999 % ఖాళీ ప్రదేశమే. అంటే శూన్యమే. మరి ఆ గోళీ ని మన వేళ్ళతో నొక్కితే గట్టిగా ఉంటుంది కదా! మరి గోళీ అంతా ఖాళీ  అంటారేమిటని అంటారేమో! మన వేలులో ఉండే పరమాణువులకు, ఆ గోళీ లో ఉండే పరమాణువులకు మధ్య వికర్షణ ఏర్పడడం వాళ్ళ ఆ గోళీ గట్టిగా ఉన్నట్లు మనకు అనుభవమవుతుందని భౌతిక, శారీరక శాస్త్రాలు చెబుతాయి. అలాంటి గోళీ ఏదీ లేకపోయినా, అలాంటి వికర్షణను వేరే విధంగా కృత్రిమంగా మన వ్రేలిలోని పరమాణువులలో కలిగిస్తే, గోళీ ని పట్టుకున్న అనుభవమే మనకి కలుగుతుంది.

ఆ గోళీ నీలం రంగులో ఉందనుకుందాం. ఆ గోళీ మనకు నీలం గా కనబడడానికి కారణమేంటి? సైన్స్ ప్రకారం ఆ గోళీ పై పడ్డ కాంతి (విద్యుదయస్కాంత తరంగాలు) పరావర్తనం చెంది మన కంటిలోని రెటీనాపై పడి, ఆ విద్యుత్ ప్రస్పందనలు మన మెదడుకు చేరడంతో మనకు ఆ గోళీ నీలంగా ఉన్నట్లు కనబడుతుంది. అయితే మనకు "రంగు" అనే అనుభవం ఎలా కలుగుతోందో భౌతిక శాస్త్రవేత్తలం చెప్పలేమని ఎర్విన్ ష్రోడింగర్ అనే భౌతిక శాస్త్రవేత్త అంటారు. ఆ గోళీ ని పరమాణు స్థాయిలో పరిశీలించినా, రంగుకు సంబంధించిన ఆధారాలేవీ దొరకవు. రుచి, వాసన, సాంద్రత వంటి లక్షణాలేవీ ఉపపరమాణు కణాలలో ఉండవు. ఆ స్థాయిలో అది ద్రవమా, వాయువా లేక ఘన పదార్థమా అనేది కూడా నిర్థారించలేము.

ఒక యాపిల్ పండును మనం కొరికి చూస్తే దాని రుచి తెలుస్తుంది. మన నాలుకలోని రుచిమొగ్గల నిర్మాణం వల్ల ఆ ప్రస్పందనలు మన మెదడుకి చేరి మనకు ఆ రుచి అనుభవమవుతోంది. కానీ ఆ యాపిల్ ను పరమాణు స్థాయిలో పరిశీలిస్తే దానికి రంగు, రుచి, వాసన వంటి ధర్మాలు స్వత:స్సిద్ధంగా లేవని తెలుస్తుంది. మన ఇంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి, స్పర్శ, నాలుక వంటి వాటి ద్వారా మాత్రమే ఆ గుణాలు మనకు అనుభవమవుతాయి. కానీ పదార్థానికి ఆ లక్షణాలు లేవు.

కుక్కలు, పిల్లులు, చేపలు వంటి వాటి ఇంద్రియాల నిర్మాణం, మన ఇంద్రియ నిర్మాణం కంటే భిన్నంగా ఉంటుంది. అందువల్ల వాటికి ఈ ప్రపంచం మనకు కనిపించేలా కాకుండా భిన్నంగా కనిపిస్తుంది. పిల్లులు చీకటిలో మన కన్నా బాగా చూడగలవు. కుక్కలు మనకు వినబడని ఎన్నో శబ్దాలను వినగలవు. వాటి ఘ్రాణ శక్తి మన కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. కాబట్టి మనకు విశ్వంలో ఉన్నవన్నీ అనుభవం కావట్లేదు. కొన్ని మాత్రమే అనుభవమవుతున్నాయి. కాబట్టి నేను చూసేదే నిజం అనుకోవడం మన అజ్ఞానం మాత్రమే!
క్వాంటం సిద్ధాంతం
క్వాంటం సిద్ధాంతం
పరమాణువులో అతిసూక్ష్మ అంశాలైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఫెర్మియాన్లు, బోసాన్లు వంటి వాటికి “పదార్థం”, “వస్తువు” అనడానికి వీలైన ధర్మాలే లేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్, ప్రోటాన్ వంటివి మన పరిశీలనకు ఒక్కోసారి కణంగానూ, ఒక్కోసారి తరంగం గానూ ప్రవర్తిస్తాయి. ఈ వైరుధ్యాన్ని ( పారడాక్స్ ని) సైన్స్ ఇంతవరకూ సరిగా వివరించలేక పోయింది. కాబట్టి అవి అసలైన  పదార్థాలు కావనీ, శక్తి యొక్క రూపాలని నేటి సైన్స్ గుర్తిస్తోంది.

2013 లో హిగ్స్-బోసాన్ కణాన్ని (దైవ కణం) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పరమాణువులోని అతి సూక్ష్మ అంశాలకు ద్రవ్యరాశిని ఇచ్చేది ఈ హిగ్స్-బోసాన్ క్షేత్రమని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ క్షేత్రం విశ్వమంతా వ్యాపించి ఉంది. అది లేని చోటే లేదు. ఈ హిగ్స్-బోసాన్ శక్తి క్షేత్రం యొక్క క్వాంటం శక్తి ఆవేశాల కూర్పు హిగ్స్ కణం గా ప్రవర్తిస్తుంది. ఈ శక్తి క్షేత్రం వల్లే మనకు విశ్వంలో పదార్థం ఉన్నట్లుగా అనుభవమవుతుంది.

పరమాణువులోని ప్రాథమిక కణాలు, హిగ్స్ క్షేత్రంలోని కణాలతో ప్రభావితమై ఉండడం వల్లే వాటికి ద్రవ్యరాశి ఉన్నట్లుగా పరిశీలకుడికి తను ఉపయోగించే పరికరాలు ఇచ్చే సమాచారం ద్వారా తెలుస్తుంది.  ఈ హిగ్స్ క్షేత్రం వల్లనే యావత్ విశ్వానికి ద్రవ్యరాశి ఉన్నట్లుగా మనకు అనుభవమవుతుంది.

ఈ విశ్వంలో దాదాపు 95% కృష్ణ పదార్థం ( డార్క్ మాటర్ ) మరియు కృష్ణ శక్తి ( డార్క్ ఎనర్జీ ) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మిగిలిన 5% మాత్రమే మనకు కనిపించే పదార్థం ఉంది. ఈ కనిపించే పదార్థం యొక్క లోతుపాతులే ఇంకా సైన్స్ కి అర్థం కాలేదు. మిగిలిన 95 % లో ఏముందో ఏం అర్థమవుతుంది ? అందుకే దానికి “డార్క్ ఎనర్జీ”, “డార్క్ మాటర్” అని పేర్లు పెట్టారు. విశ్వంలోని గెలాక్సీలను పట్టి ఉంచే శక్తే ఈ ‘డార్క్ మాటర్’.  గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా విశ్వం యొక్క విస్తరణకు కారణమవుతున్న శక్తిని ‘డార్క్ ఎనర్జీ’ గా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  మొత్తం మీద ఈ డార్క్ మాటర్, డార్క్ ఎనర్జీలలో ఏముందో సైన్స్ కి ఇంకా అర్థం కాలేదు.

ద్రవ్యరాశిత్వం కూడా శక్తి యొక్క రూపమేనని, ఆ వస్తువు స్థిరంగా ఉన్నప్పుడు ఆ వస్తువులోని శక్తి దాని ద్రవ్యరాశి రూపంలో ఉంటుందనీ, ఆ వస్తువు కాంతి వేగంతో ప్రయాణిస్తే అది కాంతి అనే శక్తి రూపం ధరించి, దాని ద్రవ్యరాశిత్వం నశిస్తుందనీ ఐన్ స్టీన్ సిద్ధాంతం చెబుతుంది.

పరమాణు స్థాయిలోని ధర్మాలన్నీ వాటికి పరిశీలకునిపై గల ప్రభావాలే. ఈ పరిశీలకుడు, అతడు ఉపయోగించే పరికరాలు కూడా ఈ విశ్వంలో భాగమే కదా! వాటిలోని పరమాణువులకు కూడా క్వాంటం సిద్ధాంతం వర్తిస్తుంది కదా! అందుకే, పరిశీలకుడు పరిశీలిస్తేనే, అతడు వాడే కొలతలను బట్టి ఈ విశ్వం లో పదార్థం ఉన్నట్లుగా అనుభవమవుతుంది. చూసే వ్యక్తులు లేక ప్రాణులు లేకపోతే ఈ విశ్వానికి వాస్తవికమైన ఉనికి లేదు.

2015 మే నెలలో ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ కి చెందిన శాస్త్రవేత్తల బృందం – “జాన్ వీలర్ డిలేయిడ్ ఛాయిస్ థాట్ ప్రయోగం” ద్వారా ఈ విషయాన్నే ధ్రువపరిచారు. ఈ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రూ ట్రస్కాట్ చెప్పినట్లు " పరిశీలకుడు వాడే కొలతలను బట్టే క్వాంటం స్థాయిలో వాస్తవికత అనేది ఉందా, లేదా అనేది తెలుస్తుంది. పదార్థం యొక్క క్వాంటం స్థాయిలోని అంశాలను పరిశీలించే ఒక పరిశీలకుడు లేకపోతే పదార్థం (లేక వాస్తవికత) కూడా ఉండదు."
హైసెన్ బర్గ్ అనే భౌతిక శాస్త్రవేత్త చెప్పినట్లు " సమకాలీనమైన శాస్త్రం మనకు తెల్పేది ప్రకృతిని గురించి కాదు. ప్రకృతితో మనకు గల సంబంధాన్ని మాత్రమే."
అంటే పదార్థమనేది వాస్తవం కాదు. అది శక్తి తరంగాల కూర్పు - అని నేటి సైన్స్ చెబుతోంది. అంటే మనం చూసే ప్రపంచం వేరు. దాని అసలైన స్వరూపం వేరు. పదార్థం, వస్తువులు ఉన్నట్లు మనకు కనిపిస్తాయి. కానీ పరమాణు స్థాయిలో 'పదార్థం' అని చెప్పగలిగిందేదీ లేదు. పదార్థం అనేది ఎండమావి లాంటిది. ఈ సత్యాన్నే మన ప్రాచీన ఋషులు చెప్పారు. జ్ఞానమంటే కనిపించే దాని మాటున దాగి ఉన్న వాస్తవాన్ని గుర్తించడం. జ్ఞాని ఎండవావిని చూసి మోసపోడు.

ఆధ్యాత్మికంగా చూస్తే మనందరిలో విశ్వవ్యాప్తమైన చైతన్యాన్ని అనుభవించగల సామర్థ్యం దాగి ఉంది. కానీ, నిత్య జీవితంలో మనం దేహబద్ధులమైన ప్రాణులం మాత్రమే! మిథ్య లో బ్రతుకుతున్నప్పటికీ, మనం దానికి తగ్గట్లుగా ప్రవర్తించాల్సిందే. ఒక ఏనుగు వెంట పడి తరుముతుంటే, మనం పలాయనం చిత్తగించాల్సిందే. దీనినే " ఏనుగు మిథ్య - పలాయనం మిథ్య " అని ఆది శంకరుల వారు హాస్యస్పోరకంగా చెప్పారు.

ఇలా మన పరిమిత చైతన్యానికి అనుభవమయ్యే పరిమిత సృష్టి తత్వాన్నే మతాలన్నీ "ఇహలోకం" అన్నాయి. విశ్వ చైతన్యానుభూతి పొందిన మహనీయులే సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటారని మత గ్రంథాలు చెబుతాయి. మనకి ఉన్న సామర్థ్యం పరిమితమైనది. ప్రపంచం యొక్క అసలైన స్థితిని, స్వరూపాన్ని మనం గుర్తించలేక పోతున్నాము. అందుకే మనకు గోచరించే జగత్తును ‘మిథ్య’ అని వేదాంత గ్రంథాలు చెప్పాయి. నేటి సైన్స్ ప్రకారం కూడా అదే నిజమని తేలుతోంది.
  • ‘జగత్తు మిథ్య’ అని చెప్పటమే కాక అద్వైత సిద్దాంతం ‘బ్రహ్మ సత్యం’ అని కూడా చెప్పింది. “సర్వం ఖల్విదం బ్రహ్మ” - విశ్వమంతా వ్యాపించి ఉన్న ‘చైతన్యం’ లేక ‘ఎరుక’ గల ఒకానొక అద్వితీయ శక్తే ‘బ్రహ్మము’. ఈ చైతన్యమే సర్వ జీవుల్లోనూ ‘నేను’, ‘నేను’ అని అనుభవమవుతోందని వేదాంత గ్రంథాలు చెబుతాయి.
జగత్తు యొక్క యదార్థతత్వం నామరూపరహితము, సర్వవ్యాప్తము, ఇంద్రియ మనో అగోచరము, పదాలలో ఇట్టిది అని చెప్పడానికి వీలు లేని శక్తి అని ఇటు ఆధ్యాత్మికత, అటు ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతున్నాయి. కాబట్టి “జగత్తు మిథ్య” అనడం మెట్ట వేదాంతం కాదని తేలుతోంది.

నేడు “హాలోగ్రాఫిక్ యూనివర్స్” అనే సిద్ధాంతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలో సుదూరంగా ఉన్న తెర మీద నడపబడుతున్న 2 డి సమాచారం యొక్క ప్రక్షేపణమే (projection) మనకు 3 డి లో కనిపిస్తున్న ఈ జగత్తు. అంటే ఈ విశ్వంలో ఘనంగా ఉన్నట్లు మనకు కనిపించే వస్తుజాలం నిజానికి అలా లేదు. జగత్తు నిజానికి మన భ్రమే నని ఈ సిద్ధాంతం మరింత తేటతెల్లం చేస్తోంది.

(NOTE : మిథ్య అంటే ఏమీ లేనట్లు కాదు. అది ఫలానా అని ఖచ్చితంగా గుర్తించలేకపోవడం. పదార్థం నిజంగా ఉందనుకుంటాం. కానీ ఉప పరమాణు స్థాయిలో చూస్తే నిజమైన పదార్ధం కనబడదు. పదార్ధం శక్తి తరంగాల కూర్పు మాత్రమేనని భావించాల్సి వస్తుంది. అంటే విశ్వమంతా ఒకానొక ఏకత్వం ఉంది. అది శక్తి రూపం. అదే అన్ని రూపాలనూ ధరిస్తోంది. మన ఇంద్రియ నిర్మాణం వల్ల ఈ జగత్తు ఇలా కనబడుతోందే కానీ దాని వాస్తవ రూపం ఇది కాదు.మనలో అన్నింటినీ తెలుసుకొనే, అనుభవించే "చైతన్యం" లేక "ఎరుక" అనేది ఉంటుంది. అది సత్యం. అది మిథ్య కాదు. విశ్వవ్యాప్తమైన ఈ చైతన్యం లేక ఎరుక అనేది అన్ని జీవుల్లోనూ "నేను" గా ప్రకటమవుతోందని వేదాంతం చెబుతుంది. అదే "బ్రహ్మము" లేక Universal Consciousness.)

సంకలనం/రచన: మణి కుమార్ 

Monday, April 13, 2020

వేదాంతిగా మారిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త - ఇర్విన్ ష్రోడింగర్ - Vedic influence on Erwin Schrödinger

వేదాంతిగా మారిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త - ఇర్విన్ ష్రోడింగర్ - Vedic influence on Erwin Schrödinger
 వేదాంతిగా మారిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త - ష్రోడింగర్
ఎర్విన్ ష్రోడింగర్ ఆస్ట్రియాకు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. ఇతడు క్వాంటం తరంగ సిద్ధాంతాన్ని వివరించే క్వాంటం తరంగ సమీకరణాన్ని కనుగొన్నాడు. దీనినే “ష్రోడింగర్ సమీకరణం” అంటారు. ప్రతీ క్వాంటం వ్యవస్థ ఈ సమీకరణాన్ని పాటించాల్సిందే. క్వాంటం ఫిజిక్స్ లోని వేవ్ మెకానిక్స్ పై పరిశోధనలకు గాను ష్రోడింగర్ కు 1933 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఇతడు “క్వాంటం భౌతిక శాస్త్ర పిత” గా పేరుపొందాడు.
  • ۞ క్వాంటం సిద్ధాంతం అనేది భౌతిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ. ఈ సిద్ధాంతంలోని అంశాల ఆధారం లేకుంటే నేడు సైన్స్ ఇంతగా పురోగమించేది కాదు.
  • ۞ సత్యాన్వేషణలో భాగంగా తాను చేసిన పరిశోధనల పర్యవసానంగా ష్రోడింగర్ ఒక హిందూ వేదాంతిగా మారాడు. అతడు తను పడుకొనే మంచం ప్రక్కనే హిందూ మత గ్రంథాలను ఉంచుకునేవాడు. అతనికి ఎంతో ఇష్టమైన గ్రంథాలు ఉపనిషత్తులు మరియు భగవద్గీత.
  • ۞ ష్రోడింగెర్ చాలా చిత్రమైన మనిషి. అతడు తన పెంపుడు కుక్క కు ‘ఆత్మ’ అని పేరు పెట్టాడు. బహుశా సర్వజీవుల్లోనూ ఉన్న ఆత్మ యొక్క ఏకత్వానికి గుర్తుగా అతడు అలా పేరు పెట్టి ఉండవచ్చు.
ష్రోడింగర్ తన క్వాంటం సిద్ధాంతాన్ని కనుగొనక ముందే 1925 లో ఇలా వ్రాసాడు :
“ మీరు జీవిస్తున్న ఈ జీవితం ఈ మొత్తం అస్థిత్వంలో కేవలం ఒక భాగం మాత్రమే కాదు. ఒక విధంగా చెప్పాలంటే అస్థిత్వమంతా అదే. ఇది ఎలా కూర్చబడి ఉందంటే అది ఒక్కసారి చూడగానే అర్థమయ్యేలా  ఉండదు. ఇదే విషయం బ్రాహ్మణులు చెప్పే పవిత్రమైన, భావగర్భితమైన మంత్రాలలో ఉంది. అదే “తత్వమసి” - అదే నువ్వు అయి వున్నావు. దీనినే వేరే మాటల్లో చెప్పాలంటే నేను తూర్పున, పడమరన ఉన్నాను. నేను పైనా, క్రిందా ఉన్నాను. నేను ఈ అనంత విశ్వాన్ని.”

ఈ భావనను ష్రోడింగర్ ముండకోపనిషత్తు 2.2.11 నుండి గ్రహించాడు.
“ బ్రహ్మైవేదమమృతం పురస్తాద్బ్రహ్మ పశ్చద్బ్రహ్మ దక్షిణతశ్ఛోతరేణ
అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం.”

ష్రోడింగర్ కు గల ఈ వేదాంత భావన తన క్వాంటం సిద్ధాంత పరిశోధనలపై ప్రభావం చూపింది.

ష్రోడింగర్ 1944 లొ వ్రాసిన “ వాట్ ఈజ్ లైఫ్? “ అనే గ్రంథంలో వేదాంత భావాలను పొందుపరిచాడు.  జేమ్స్ వాట్సన్ తో కలిసి డి.ఎన్.ఏ. నిర్మాణాన్ని కనుగొన్న ఫ్రాన్సిస్ క్రిక్ తన ఆవిష్కరణకు ఈ గ్రంథంలోని భావాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పాడు.
ష్రోడింగర్ జీవిత చరిత్రను వ్రాసిన వాల్టర్ మూర్ అందులో ఇలా అంటారు :
“ వేదాంతంలో ఉండే ఏకత్వం, అఖండత లాంటివే తరంగ భౌతిక శాస్త్రంలోనూ ఉన్నాయి. 1925 నాటికి ఉన్న భౌతిక శాస్త్ర భావన ప్రకారం విశ్వం అంటే విడివిడిగా ఉండే, అన్యోన్య క్రియలు జరిపే పదార్థ కణాలు గల ఒక పెద్ద యంత్రం లాంటిది. కానీ తర్వాత కొద్ది సంవత్సరాలలోనే ష్రోడింగర్, హైసెన్ బర్గ్ వంటి శాస్త్రవేత్తలు అధ్యారోహితమైన, అభిన్నములైన, కంపన పరిమితి గల సంభావ్యతా తరంగాల ఆధారంగా గల విశ్వం యొక్క భావనను పొందుపరిచారు.  ఈ భావన అన్నిటిలోనూ ఉన్నది ఒక్కటే అనే వేదాంత భావనతో సరిపోలుతోంది.”
ష్రోడింగర్ చైతన్యాన్ని ఏకత్వం కలది గా భావించాడు. అనేకమైన ఆత్మలున్నాయని చెప్పే చైతన్యం యొక్క బహుత్వవాదాన్ని ష్రోడింగర్ ఒప్పుకోలేదు.ఈ ప్రపంచం నానాత్వంతో కనబడడానికి కారణం మాయ మాత్రమేనని భావించాడు. బ్రహ్మము యొక్క మాయ చేత ఈ ప్రపంచం ఇలా కనిపిస్తోందని ఆది శంకరులు చెప్పిన అద్వైత భావాన్ని ష్రోడింగర్ సమర్ధించాడు.

తాత్విక వాదనల ద్వారా చైతన్యం యొక్క ఏకత్వాన్ని నిర్ధారించలేమని, సాదృశ్యాన్ని బోధిస్తున్న ప్రకృతితో ఏకత్వాన్ని పొందడం ద్వారా అనుభవ జ్ఞానాన్ని పొందాల్సిందేనని ష్రోడింగర్ అభిప్రాయ పడ్డాడు.

తను వ్రాసిన ఒక వ్యాసంలో ఆయన ఇలా అన్నాడు :
“అంతర్దృష్టి లేక లోచూపు అన్నది కొత్తదేమీ కాదు. భారతీయ తత్వచింతనలో ఎంతో గొప్పవైన ఉపనిషత్తుల కాలం నుండే ఆత్మ, పరమాత్మల ఏకత్వభావన ఉంది. ప్రాపంచిక విషయాలపై లోతైన అంతర్దృష్టిని ఇది సూచిస్తోంది.”

“చైతన్యం ఒక్కటేనని భారతీయ వేదాంతం చెబుతుంది. అన్ని సంఘటనలు, జనన మరణాలు ఒకే విశ్వ చైతన్యంలో సంభవిస్తాయి. చైతన్యం బహువిధమని భావించిన  పాశ్చాత్య భావాల సంఘర్షణకు స్వస్తి పలకడానికి అందుబాటులో ఉన్న ఏకైక ప్రాచీన జ్ఞాననిధి ఉపనిషత్తులు.”

   పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రానికి ఉన్న ఆధ్యాత్మిక రక్తహీనత నుండి కాపాడదానికి తూర్పు నుండి పడమర దేశాలకు రక్త మార్పిడి జరగాలని ష్రోడింగర్ అభిప్రాయపడ్డాడు.
క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్, ప్రోటాన్ లాంటి ఉపపరమాణు కణాలు ఒక కొలత ప్రకారం కణం గానూ, మరొక కొలత ప్రకారం తరంగం గానూ ప్రవర్తిస్తాయి.
మానవ తర్కం ప్రకారం ఒక అంశం అటు తరంగం గానూ, ఇటు కణం గానూ ప్రవర్తించడానికి వీలు లేదు. తరంగానికి వ్యాప్తి ఉంటుంది. కానీ కణానికి వుండదు. కణానికి పరిమితము, నిర్ణీతము అయిన స్థానం ఉంటుంది. ఒకే అంశం అటు తరంగం గానూ, ఇటు కణం గానూ ప్రవర్తించడం అనేది ఒక వైరుధ్యం (పారడాక్స్).

ఈ వైరుధ్యానికి సరైన వివరణ ఇవ్వడానికి కొందరు శాస్త్రవేత్తలు కోపెన్ హాగెన్ లో సమావేశమయ్యారు. వీరి వివరణ ప్రకారం మనం కొలతలు వేసే పరికరాలు, ప్రయోగాలు భిన్నంగా ఉండడం వల్లే ఉపపరమాణు అంశాలు అటు కణాలు గాను, ఇటు తరంగం గానూ కనిపిస్తున్నాయి. అంటే ఒక పరిశీలకుడు పరిశీలన చేసే వరకు ఒక రేణువు ఒకే సమయంలో అనేక స్థితులలో ఉంటుంది.  అంటే పరమాణు స్థాయిలోని అంశాల ధర్మాలన్నీ వాటికి పరిశీలకునిపై గల  ప్రభావాలే.

క్వాంటం ఫిజిక్స్ పై కోపెన్ హాగెన్ వివరణ ప్రకారం గణితాత్మకంగా ఒక రేణువు ఒకే సమయంలో రెండు స్థితులలో (కణంగాను, తరంగం గాను) ఉంటుంది. ష్రోడింగర్ దీనిని నిజం కాదని నిరూపించాలనుకున్నాడు. దీని కోసం ఒక ఊహాత్మకమైన ప్రయోగం చేసాడు. దీనినే “ ష్రోడింగర్స్ క్యాట్ ప్రయోగం ” అంటారు.
     ఈ ప్రయోగంలో ష్రోడింగర్ ఒక పిల్లిని ఒక సీల్ చేసిన స్టీల్ బాక్స్ లో పెట్టి అందులో రేడియో ధార్మిక పదార్ధాన్ని, ఒక విషం బాటిల్ ని పెట్టాడు.  ఈ రేడియో ధార్మిక పదార్థం లో కనీసం ఒక్క అణువు క్షయం అయినా విషం బాటిల్ పగిలి విషం బయటకు వచ్చేలా ఒక సుత్తిని ఏర్పాటు చేశాడు.

పెట్టెను సీల్ చేసిన తర్వాత పెట్టేలోని రేడియోధార్మిక పదార్థం క్షయం కావడం మొదలు పెట్టగానే ‘గ్రెగర్ కౌంటర్’ అనే పరికరం దాన్ని గుర్తించి సుత్తిని విడుదల చేయడంతో అది ఆ విషం బాటిల్ ను పగలగొడుతుంది. దాంతో ఆ బాటిల్ నుండి విషం బయటకు వచ్చి పిల్లిని చంపుతుంది. అయితే ఆ బాక్స్ ని తెరిచి చూసేదాకా లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఒక గంట తర్వాత ఆ పెట్టె ను తెరిస్తే ఆ పిల్లి బ్రతికి వుండే అవకాశం 50%, చనిపోయి వుండే అవకాశం 50% వుంటుంది.
క్వాంటం ఫిజిక్స్ మీద కోపెన్ హేగన్ లో సమావేశమైన శాస్త్రవేత్తల వివరణ ప్రకారం ఒక పరిశీలకుడు పరిశీలన చేసే వరకు ఒక రేణువు ఒకే సమయంలో అనేక స్థితులలో ఉంటుంది. అంటే ఆ బాక్స్ తెరిచి చూసేలోపల ఆ పిల్లి ఒకే సమయంలో చనిపోయి ఉండాలి మరియు బ్రతికి ఉండాలి. కానీ అది అసాధ్యం. ఏ ప్రాణీ ఒకే సమయంలో చనిపోయి మరియు బ్రతికి ఉండదు. బాక్స్ తెరిచాక పిల్లి బ్రతికే వుంది. ఈ విధంగా కోపెన్ హేగెన్ వివరణ లోని లోపాన్ని ష్రోడింగర్ ఎత్తి చూపాడు.

అంటే పిల్లి రెండు స్థితులలో ఉండడం అసాధ్యం. కాబట్టి కోపెన్ హాగెన్ వివరణ నిజం కాదని నిరూపితమైంది. మరి పరమాణు స్థాయిలో ఈ వైరుధ్యానికి కారణమేంటి? దీనికి సరైన సమాధానం ఏమిటో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు.

సూక్ష్మ స్థాయిలో యదార్థ స్థితి ఎలా ఉంటుందో క్వాంటం సిద్ధాంతం వివరించిన దానికీ, మన పరిశీలనలో మనం కనుగొన్న యదార్థానికి మధ్య వైరుధ్యం ఉంటోంది. ఇలాంటి వైరుధ్యాల వల్ల  పదార్ధం యొక్క క్వాంటం స్థితిలో దాగి ఉన్న రహస్యాలు ఇప్పటికీ సైన్స్ కి అర్థం కాలేదు.

క్వాంటం సిద్ధాంతం మానవ తర్కానికి అందేలా ఉండదు. ఈ సిద్ధాంతం ప్రకారం వాస్తవికత లేదా యదార్థ తత్వం అనేది అన్ని రకాల సంభావ్యతల అధిస్థాపనం లేదా కూర్పు. వేదాంత భావన కూడా ఇదే. పదార్థం యొక్క యదార్థ స్థితిని మనం రోజువారీ మాట్లాడుకునే భాషలో చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన ప్రాచీన ఋషులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

క్వాంటం స్థాయిలోనే “చైతన్యం” లేక “ఎరుక” అనేదానికి ఆధారం ఉండొచ్చని ఇటీవల కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇదే గనుక పూర్తిగా నిర్ధారణ అయితే అదే ‘దేవుడు’ లేక ‘బ్రహ్మము’ అని చెప్పాల్సి వుంటుంది. అందుకేనేమో పదార్థ రహస్యం సైన్స్ కి అంతు పట్టకుండా ఉంది.

అందుకే "మనం చూసేదంతా మాయ" అనే అద్వైత సిద్ధాంతాన్ని ష్రోడింగర్ ఈ ప్రయోగం ద్వారా తెలియజేసినట్లయింది.. ఈ విషయంలో ష్రోడింగర్ ఆలోచనలు, ఆ రూపంలో భారతీయ వేదాంత భావనలు సైన్స్ ను ఎప్పటికీ ప్రబావితం చేస్తూనే ఉంటాయి.

కానీ ష్రోడింగర్ వంటి శాస్త్రవేత్తల పరిశోధనలపై భారతీయ వేదాంతం ప్రభావం చూపించిన విషయం భారతీయ పాఠ్య పుస్తకాలలో ఎక్కడా కనబడదు. ఇది భారతీయ విద్యా విధానం లోని లోపమని చెప్పక తప్పదు.

రచన: మణి కుమార్

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com