తొలి స్వదేశీ సోషల్ మీడియా వేదిక 'ఏలిమెంట్స్' - Elyments Social Media App

తొలి స్వదేశీ సోషల్ మీడియా వేదిక 'ఏలిమెంట్స్' - Elyments Social Media App

తొలి స్వదేశీ సోషల్ మీడియా వేదిక 'ఏలిమెంట్స్'

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఉన్న విదేశీ యాప్ లకు దీటుగా అవిర్భవించింది "ఎలిమెంట్స్' తెలుగు సహా ఎనిమిది భారతీయ భాషల్లో అభివృద్ధి చేసిన 'ఏలిమెంట్స్' యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఉచిత ఆడియో, విడియో కాల్స్ చేసుకోవడంతో పాటు చాటింగ్ ద్వారా సంభాషించుకునే సౌలభ్యం ఉంది. 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఈ తొలి స్వదేశీ తొలి సోషల్ మీడియా యాప్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. "అనుకరణకు దూరంగా దేశీయంగా మరిన్ని ఆవిష్కరణలను ప్రోత్సహించాలని" పిలుపునిచ్చారు. దేశ యువత, ఐటీ నిపుణుల్లో దాగున్న సృజనాత్మకతను మరింత ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణం నిర్మించుకోవాలన్నారు. తద్వారా 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాలను చేరుకొనేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు.

వీరిని ప్రోత్సహిస్తూ మరిన్ని వినూత్న ఆవిష్కరణలు చేయడానికి సాంకేతిక రంగ సంస్థలు ముందుకు రావాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, రామోజి గ్రూపు సంస్థల శైర్మన్ రామోజీరావు, ప్రముఖ యోగా గురువు బాబారాందేవ్, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, కేంద్రమంత్రి సురేశ్ప్రభు, పారిశ్రామికవేత్త అనంత్ గోయెంకా, విద్యావేతర దివీ మోహన్ దాస్ పాయ్ తదితరులు పాల్గొన్నారు. 

__జాగృతి

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top