శివపురాణం ప్రకారం మ‌నిషికి రాబోయే మృత్యు సూచనలు - Death signs According Sivapuranam


శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట‌దంటారు. సృష్టి, స్థితి, ల‌య కార‌కుల్లో ల‌యంకు ముఖ్యుడైన శివుడికి తెలియ‌కుండా ఏ జీవీ మ‌ర‌ణించ‌లేద‌ని, శివుడి ఆజ్ఞ ల‌భించాకే య‌ముడు ప్రాణాలు తీసుకెళ్లేందుకు వ‌స్తాడ‌నే నేప‌థ్యంలో ఆ మాట‌ను చెప్పారు మ‌నిషి మ‌ర‌ణించ‌డానికి ముందు వాటిని క‌నిపెడితే త‌న‌కు మ‌ర‌ణం ఇంకా ఎన్ని రోజుల్లో వ‌స్తుందో  తెలుసుకోవచ్చని   శివ పురాణంలో సాక్షాత్తూ శివుడే ఈ విష‌యం గురించి పార్వ‌తికి చెప్పాడు.
 • 1. ఎవ‌రైనా వ్య‌క్తికి అత‌ని ప్ర‌తిబింబం నూనె, నీరు లేదా అద్దంలో క‌నిపించ‌డం లేదంటే అత‌ను మ‌రో 6 నెల‌ల్లో చ‌నిపోతాడ‌ని తెలుసుకోవాలి.
 • 2. ఎవ‌రికైతే నోరు, చెవులు, క‌ళ్లు, నాలుక ప‌నిచేయ‌కుండా పోతాయో వారు కూడా మ‌రో 6 నెల‌ల్లో చ‌నిపోతార‌ట‌. వాటిని మృత్యువుకు సూచ‌న‌లుగా భావించాల‌ట‌.
 • 3. ఎవ‌రైనా వ్య‌క్తి శ‌రీరం ఉన్న‌ట్టుండి తెలుపు లేదా ప‌సుపు రంగులోకి మారుతూ శ‌రీరంపై ఎరుపు రంగు మ‌చ్చ‌లు వ‌స్తుంటే వారు 6 నెల‌ల్లోగా చ‌నిపోతార‌ట‌.
 • 4. గొంతు, నాలుక వంటివి మాటి మాటికీ పొడిగా మారుతుంటే వారు త్వ‌ర‌లో చ‌నిపోయే అవ‌కాశాలు ఉంటాయట‌.
 • 5. నొప్పి కార‌ణంగా ఎడ‌మ చేతిని మాటి మాటికీ వెన‌క్కి తీసుకుంటున్నా, దాంతో నాలుక పొడిగా మారుతున్నా అలాంటి వారు ఒక నెల‌లో చ‌నిపోతార‌ట‌.
 • 6. సూర్యుడు లేదా చంద్రున్ని చూసిన‌ప్పుడు వారి చుట్టూ ఎరుపు రంగులో రింగ్ లాంటిది ఏదైనా ఎవ‌రికైనా క‌నిపిస్తే అలాంటి వారికి 15 రోజుల్లో మ‌ర‌ణం సంభ‌విస్తుంద‌ట‌.
 • 7. న‌క్ష‌త్రాలు, చంద్రున్ని అస‌లు చూడ‌లేని వారు, లేదంటే వాటి స్థానంలో న‌ల్ల‌ని కాంతిని చూసే వారికి మ‌ర‌ణం అత్యంత స‌మీపంలో ఉంద‌ని తెలుసుకోవాలి.
 • 8. నీలి రంగులో ఉండే ఈగ‌లు ఎవ‌రినైనా చుట్టు ముడుతుంటే వారికి మ‌ర‌ణం మ‌రో నెల‌లో సంభ‌విస్తుంద‌ట‌.
 •  9. రాబందు, కాకి లేదా పావురం ఎవ‌రి త‌ల‌పైనైనా కూర్చుంటే వారికి త్వ‌ర‌లో మ‌ర‌ణం సంభ‌విస్తుంద‌ట‌.
 • 10. ఎవ‌రైనా త‌న నీడ‌ను త‌ల లేకుండా చూస్తే వారు కూడా త్వ‌ర‌లో చ‌నిపోతార‌న్న‌మాట‌.
 • 11. ఎవ‌రికైనా చూపు పూర్తిగా పోయినా లేదా మంట‌ను స‌రిగ్గా చూడ‌లేక‌పోయినా వారికి కూడా త్వ‌ర‌లో మ‌ర‌ణం క‌లుగుతుంద‌ట‌.
 • 12. పొలారిస్ అని పిల‌వ‌బ‌డే నార్త్ స్టార్ లేదా సూర్యున్ని ఎవ‌రైనా చూడ‌లేక‌పోయినా, రాత్రి పూట ఇంద్ర ధ‌నుస్సు క‌నిపిస్తున్నా వారికి క‌చ్చితంగా త్వ‌ర‌లో మ‌ర‌ణం వ‌స్తుంద‌ట‌.
రచన: H.V.S.R.C. SHARMAC.ENGR.(RTD)
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top