ఆరోగ్యానికి మంత్రము - Aarogyaniki Mantramuఆరోగ్యానికి మంత్రము - Aarogyaniki Mantramu
ఓం నమః శివాయ..
అనారోగ్యంతో బాధపడుతున్నవారు, ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు, నిత్యం ఈ స్తోత్రం చదవాలి.

మన జీవితంలొ ఒక్కసారి అయిన ఈనామాలు చదవాలి. కాశీఖండము లోని యముని చే చెప్పబడిన శివుడు..విష్ణువు ఇద్దరు తో కూడిన నామాలు ఒక్కసారి చదివినా అనేక జన్మల పాపాలు పోతాయి.

ఈ నామాలనూ ప్రతిరోజు పఠించే వాళ్ళకి యమదర్శనం వుండదు.
యముడు స్వయంగా తన యమభటులు కు ఈ శివకేశవ నామాలు ఎవ్వరు భక్తితో రోజు చదువుతూ వుంటారో వారి జోలికి మీరు పోవద్దు అనిచెప్పాడు.

యమకృత_శివకేశవ_స్తుతి.!!🙏
గోవింద మాధవ ముకుంద హరే మురారే,
శంభో శివేచ శంకర శశిశేఖర శూలపానే !

దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

గంగాధరాంధకరిపో హర నీలకంఠ,
వైకుంఠ కైటభరిపో కమలాబ్జపానే !

భూతేశ ఖండపరశో మృడ చండికేశ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే,
గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ !

నారాయణాసుర నిబర్హణ ,శార్జ్గపాణే,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో,
శ్రీకాంత పీతవసనాంబుదనీల శౌరే !
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

లక్ష్మిపతే మధురిపో పురుషోత్తమాద్య,
శ్రీకంఠ దిగ్విసన శాంతి పినాకపానే !
ఆనందకంద ధరణీధర పద్మనాభ,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ,
బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపానే !
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే,
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ!
చానూరమర్దన హృషీకపతే మురారే,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

శూలిన్ గిరీశ రజనీశకళావతంస,
కంసప్రణాశన సనాతన కేశినాశ!
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

గోపీపతే యదుపతే వసుదేవసూనో,
కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర !
గోవర్దనోద్దరన ధర్మధురీణ గోప,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

స్థానో త్రిలోచన పినాకధర స్మరారే,
కృష్ణానిరుద్ద కమలానాభ కల్మషారే !
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప,
త్యాజ్యా భటాయ ఇతి సంతత మామనంతి !!

ఈ యమకృత శివకేశవ నామాలను స్మరించువారు పాపరహితులై తిరిగి మాతృగర్బమున జన్మించరు.
‌‌‌ ఓం శివ నారాయణాయ నమః

రచన: శ్రావణి రాజ్ 
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top