నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

15, నవంబర్ 2019, శుక్రవారం

సర్ప నాగ బంధం - Sarpha Naaga Bhandam 🐍



సర్ప నాగ బంధం - Sarpha Naaga Bhandam
సర్ప నాగ బంధం
వేదాలు, ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే, మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతుంది. అందుకే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం ఉన్న ఆరో నేలమాళిగను తెరిచేందుకు పండితులు అంగీకరించట్లేదనే విషయం తెలిసిందే. నాగజాతి విశేషాల సమాహారం ఇది.

“అనల తేజులు దీర్ఘ దేహులు నైన యట్టి తనూజులన్ వినుత సత్త్వుల గోరె గద్రువ వేపురం వేడ్కతో…” కశ్యపునికి ఇద్దరు భార్యలు. కద్రువ, వినత. ఇది కృతయుంగంలోని విషయం. పుత్ర కామేష్ఠ యాగానంతరం వారి వారి కోరికల ప్రకారం కద్రువకు ఐదు వందల ఏళ్ల పాటు నేతి కుండలలో భధ్రపరచగా కద్రువ గుడ్ల నుంచి శేషుడు, వాసుకి, ఐరావతం, తక్షక, కర్కోటక, ధనంజయ, కాళియ ఇత్యాది నాగుల వెలువడ్డారు. తల్లి తొందర పాటు వల్ల వినత అండాల నుంచి సగం దేహంతో అనూరుడు, ఆ తరువాత మరో ఐదు వందల ఏళ్లకు గరుడుడు జన్మించారని భారతంలోని అది పర్వం ద్వితియాశ్వాసంలో పేర్కొన్నారు.

హారంగా, పడకగా…
ఆది శేషుడు భూభారాన్ని వహించగా, వాసుకి పాల సముద్ర మధనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు. తక్షకుని విషం, చోరత్వం, పరీక్షిత్తు మరణానికి, జనమేజయుడు నిర్వహించిన సర్ప యాగానికి హేతువులైనాయి. కాళీయ మర్దనం కృష్ణావతారంలో ముఖ్య ఘట్టం. శివుని కంఠంలో హారంగా, విష్ణువు పడకగా సర్పాలు వారికి అత్యంత సన్నిహితులైనాయి.

తండ్రి ఒక్కరే అయినా తల్లుల మధ్య గల వైషమ్యం, పిల్లల మధ్య విరోధానికి ఎలా దారి తీస్తుందో నాగులు, గరుత్మంతుడి వృత్తాంతం ద్వారా మనకు అవగతమవుతుంది.

సర్పం - సప్త ప్రతీకలు
ప్రాచీన కాలం నుంచి సర్పం (సర్పెంట్) సప్త విషయాలకు ప్రతీకగా ఉంది.
  • 1. దేవునిగా - తన తోకను తానే మింగుతుంది కాబట్టి. అంతేగాక అనేక తెగలలో సర్పం సృష్టిలో ప్రముఖ పాత్ర వహించిందని నమ్మేవారు.
  • 2. తన తోకను తానే మింగుతూ వృత్తాకారంలో ఉన్న సర్పాన్ని అనంతానికి చిహ్నంగా ప్రాచీనులు భావించారు. నవీన శాస్త్రజ్ఞుడు ‘కెకూలే’ ఈ చిహ్నాన్ని కల గని ‘బెంజిన్’ అణు నిర్మాణాన్ని ఊహించాడని, అదే రసాయన శాస్త్రంలో మరో ముందడగు అయిందని చెబుతారు.
సర్పజాతులు
ఆస్ట్రేలియన్ల ఆదిమ తెగలు ఇంద్రధనుస్సు సర్పం భూమికి పర్వతాలతో, నదులతో నిర్మించిందని నమ్ముతారు. సర్పం కలలోకి రావడం శృంగారానికి, కామేచ్ఛకి చిహ్నంగా ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రజ్ఞులు చెప్పారు. సంవత్సరానికి లక్షమందిని మృతుల్ని చేసే విష జాతి సర్పాలు 600 ఉంటే, మొత్తం 3,000 రకాల పాముల ఉన్నాయని ఒక అంచనా అర్జునుడు నాగకన్య ఉలూచిని పెళ్లాడాడు. కంబోడియాలోని అంగ్‌కోర్ రాజ వంశీకులు తాము బ్రహ్మణ రాజకుమారుడు నాగుల యువరాణిల సంతానమని విశ్వసిస్తారు. హితుడిగాను, శత్రువుగాను సర్పం ప్రసిద్ధమే. అందుకే భగవానుడిలా వాక్రుచ్చినాడు.

“సర్పాణా మస్మి వాసుకిః అనంత శ్చాస్మి నాగానాం…”.

అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »