కాలజ్ఞాన తత్వము: చెప్పలేదంటనక పొయ్యేరు ! మొదటి భాగము - Kaalagnana Thathvamulu

 కాలజ్ఞాన తత్వము: చెప్పలేదంటనక పొయ్యేరు ! మొదటి భాగము - Kaalagnana Thathvamulu
శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 
కాలజ్ఞాన తత్వము - మొదటి భాగము

చెప్పలేదంటనక పొయ్యేరు
వకుళాభరణ రాగము, ఆటతాళము


🙏 చెప్పలేదంటనక పొయ్యేరు - నరులార గురుని
          చేరి మొక్కితె బతుక నేర్చేరూ     !!చెప్ప!!

చెప్పలేదంటనక పొయ్యేరు
తప్ప దిదిగో గురుని వాక్యము
తప్పుదోవల బోవువారల
చప్పరించి మింగు శక్తులు   !!చెప్ప!!

🙏 మొప్పెతనమున మోసపొయ్యేరు - అదిగాక కొందరు.
గొప్పతనమున గోసు మీరేరు
ఇప్పుడప్పు డనగ రాదు. 
ఎప్పుడో ఏ వేళనో మరి
గుప్పు గుప్పున దాటి పోయెడు
గుర్ర పడుగులు ఏరుపడును    !!చెప్ప!!

🙏 తాకు తప్పులు తలచకున్నారు - తార్కాణ మైతే
తక్కు వెక్కువ తెలియనేర్తూరు
జోక తోడుత తల్లి పిల్లలు
జోడు బాసి అడవులందు
కాకి శోకము చేసి ప్రజలు
కాయ కసురులు నమిలి చత్తురు     !!చెప్ప!!

🙏 కేక వేసియు ప్రాణ మిడిచేరు - రాకాసి మూకలు
కాకబట్టి కలవరించేరు
అకసమ్మది ఎర్రబారును
ఆరు మతములు ఒక్కటౌను
లోకమందలి జనము లందరు
నీరు నిప్పున మునిగి పోదురు   !!చెప్ప!!

🙏 అగలు విడిచీ పొగలు దాటేరు - అదిగాక పట్ట
పగలు చుక్కలు చూసి భ్రమసేరు
భుగులు భుగులు ధ్వనులు మింటను
పుట్టి యేగిన పిమ్మటాను
దిగులు పడుచు ప్రజలు చాలా
దిక్కులేని పక్షు లౌదురు   !!చెప్ప!!

🙏 పాతకూలు పదట గలిసేరు - పుణ్యాత్ములైన
సాధకూలు సంతసించేరు
భూతలంబున నిట్టి వింతలు
పుట్టి యణగిన పిమ్మటాను 1
నీతి కృతయుగ ధర్మ మప్పుడు
నిజము నిలకడ మీద తెలియును   !!చెప్ప!!

🙏 ఏమొ ఏమొ ఎరుగకున్నారు - ఎందెందు జూచిన
యముని పురికే నడవమన్నారు
భూమి మీదను ధూముధాములు
పుట్టి పెరిగిన పిమ్మటాను1
రామ రామా యనని వారలు
రాలి పోదురు కాలిపోదురు.    !!చెప్ప!!

🙏 ముందు వెనుకలు గానకున్నారు - ముర్ఖాళి భువిలో
ముందు గతినే ఎరుగకున్నారు
కందువతో పిన్న పెద్దల
కన్ను గానక గర్వములచే
మందె మేలము లాడువారిని
బందు బందుగ గోతు రక్కడ     !!చెప్ప!!

🙏 కీడె యైనను కూడ దందురు - ఒనగూడినప్పుడు
ఏడ జూచిన వాడుకొందురు
వేడుకతో పోతులూరి
వీరభోగ వసంత రాయలు
ఏడు దీవులు ఏక చక్రము
ఏలును బ్రహ్మాండ మంత    !!చెప్పు!!

🖝 రెండవ భాగములో - "చిల్లర రాళ్లకు"

రచన: డా. కొండవీటి మఠం 
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top