శనిదోషాలు - నివారణ - Shani Dosaluనిగ్రహం అన్న పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తుతారు. శనిగ్రహం రాశిలో మార్పు చెందితే ప్రజలు మరీ ఆందోళనలో పడిపోతుంటారు. శనిదేవుడు ఎలాంటి విపత్తులు సృష్టిస్తారోనని దిగులు పడిపోతుంటారు. ముఖ్యంగా చాలామందికి తమ తమ జన్మ కుండలి తెలీదు. అలాంటి వారు తమ జన్మకుండలిలో శనిదోషాన్ని గుర్తించడమెలాగో తెలుసుకోవాలను కుంటుం టారు. శనిగ్రహం మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా అనేది ఓ పెద్ద ప్రశ్నగా ఉంటుంది. శని ప్రతికూల పరిస్థితులు మన దినచర్యల్లో మార్పులు తీసుకు వస్తాయి. 

వీటిని గుర్తుంచుకుని వ్యవహరించాల్సివుంటుంది:
 • ✸ ఒకవేళ మీ శరీరం తరచూ అలసటకు గురవుతుంటే లేదా నిస్సహాయంగా మారిపోతుందేమో గుర్తించండి.
 • ✸ నిత్యకృత్యాలు జరుపడంలో ఇష్టం కలగకపోవడం లేక స్నానం చేసే తీరిక కలగకపోవడం.
 • ✸ కొత్త దుస్తులు కొనడం లేదా తొడుక్కునే అవసరం రాకపోవడం.
 • ✸ నూతన వస్త్రాలు లేదా మేజోళ్ళు (చెప్పులు) త్వరగా పాడైపోవడంకాని, చిరిగిపోవడం కాని జరుగుతుంటే...
 • ✸ ఇంట్లో నూనె, పప్పుదినుసులు నష్టపోతుంటే లేదా చేతిలోనుంచి జారిపోతుంటే.
 • ✸ మీ ఇంట్లోని అలమారా అస్తవ్యస్తంగా ఉంటే.
 • ✸ భోజనం చేయాలంటే ఇష్టం కలగకపోవడం.
 • ✸ తల, కాలిపిక్కలు, నడుములో నొప్పి అలాగే ఉంటే.
 • ✸ కుటుంబంలో తండ్రితో పొరపొచ్చాలు ఏర్పడితే.
 • ✸ చదువు పట్ల, ప్రజలను కలిసేందుకు మనసు అంగీకరించకపోతే, చిరాకుగా ఉంటే.
ఒకవేళ ఈ లక్షణాలు మీరు స్వయంగా అనుభవిస్తుంటే, శనిగ్రహం మీ జన్మకుండలిలో ఉన్నట్లు లెక్క.

దీని నివారణోపాయం ఇలా ఉంటుంది చేసి చూడండి:
 • నూనె, సన్న ఆవాలు, ఉద్దిపప్పును దానం చేయండి.
 • రావిచెట్టును పెంచండి. ఆ చెట్టువద్ద దీపాలు వెలిగించండి.
 • హనుమంతుడుని ఆరాధించండి. 
 • మాంసం, మద్యపానం అలవాటుంటే వాటిని త్యజించండి. 
 • పేదవారికి సహాయం చేయండి. 
 • నల్లటి వస్త్రాలు ధరించకండి. 
 • నల్లటి వస్తువులు దానం చేయండి.
అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top