నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label కాలజ్ఞానం. Show all posts
Showing posts with label కాలజ్ఞానం. Show all posts

Wednesday, May 20, 2020

వీరబ్రహ్మం గారు పాంచాననం వారికి చెప్పిన కాలజ్ఞానం - Veera Brahmam garu Paanchananam variki cheppina KaalaGnanam

వీరబ్రహ్మం గారు పాంచాననం వారికి చెప్పిన కాలజ్ఞానం - Veera Brahmam garu Paanchananam variki cheppina KaalaGnanam

శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు పాంచాననం వారికి చెప్పిన కాలజ్ఞానం


 • ➣ శ్రీముఖ నామ సంవత్సరమున శ్రీ వీరభోగ వసంతరాయులనై వచ్చి ప్రసిద్ధులైన. పరిపాలిస్తాను. మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకొస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.
 • ➣ నేను 5000 సంవత్సరాలకు వచ్చేసరికి బ్రాహ్మణులు సంకరవృత్తులను చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్ధులు, యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణకులము పూర్తిగా వర్ణసంకరమవుతుంది.
 • ➣ ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమవుతాయి. కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగును తాకుతుంది. రాజాధిరాజులు అణిగి వుంటారు. శూద్రులు విలాసాలను అనుభవిస్తూ, రాజుల హోదాలో వుంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతూ వుంటుంది. నా భక్తులయిన వారికి నేనప్పుడే దర్శనమిస్తాను. కాని వారి నెత్తురు భూమిమీద పారుతుంది. కొంత భూభారము తగ్గుతుంది. దుర్మార్గుల రక్తముతో భూమి తడుస్తుంది.
 • ➣ చీమలుండు బెజ్జాల చోరులు దూరతారు. స్త్రీలందరూ చెడు తలంపులతో నుంటారు. అందువల్ల చోరులు ప్రత్యేకముగా కనపడరు. బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళ్తుంది.
 • ➣ గడగం, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలిపేది, అరవరాజ్యము, వెలిగోడు. ఓరుగల్లు, గోలుకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు.
 • ➣ ఉత్తర దేశాన భేరి కోమటి 'గ్రంధి' అనే మహాత్ముదడు అవతరిస్తాడు. అందరిచే పూజింపబడతాడు.
 • ➣ కలియుగం 4808 సంవత్సరములు గడచిన తరువాత కొట్లాటలు ఎక్కవుతాయి.  నిద్రాహార కాల పరిమితులు పాటించక మానవుల ధర్మహీనులవుతారు. శాంత స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపాతారు. పిల్లలు పెద్దలను ఆశ్రయించుటకు బదులు పెద్దలే పిన్నలను ఆశ్రయిస్తారు.
 • ➣ దుష్టమానవుల బలం పెరుగుతుంది. రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు, భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారు.
 • ➣ కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది. వావి వరసలు నశిస్తాయి. బ్రహ్మణనింద, వేదనింద, గురువుల నిందలు ఎక్కవవుతాయి.
 • ➣ జారత్వము, చోరత్వము, అగ్నిరోగం, దుష్టులవలన ప్రజలు పీడింపబడతారు.
 • ➣ అడవి మృగాలు పట్టణాలు, పల్లెలలో తిరుగుతాయి.
 • ➣ మాల మాదిగలు వేదమంత్రాలు, చదువుతారు.
 • ➣ ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి జన్మిస్తాయి.
 • ➣ రక్త వాంతులు, నోటిలో పుండ్లు వలన, తలలు పగలటం వలన జనం మరణిస్తారు.
 • ➣ కొండల మీద మంటలు పుడతాయి. జంతువులు గుంపులు గుంపులుగా మరణిస్తాయి.
 • ➣ భారతదేశము పరుల పాలనలోకి వెళుతుంది. ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు. కులం, ఆచారం నశిస్తాయి. మనుషులందరూ కలసి మెలసి, కుల మత వర్ణభేధాలు లేక ప్రవర్తిస్తారు.
 • ➣ ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి.
 • ➣ మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి.
 • ➣ ఒకే రేవున పులి, మేక నీరు త్రాగుతాయి.
 • ➣ వెంపలిమొక్కకు నిచ్చెనలు వేసే మనుష్యులు పుడతారు.
 • ➣ విజయనగర వైభవము నశిస్తుంది. కాశీక్షేత్రం మండలం రోజులు పాడుపడిపోతుంది.
 • ➣ ”గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగిపొర్లుతుంది.
 • ➣ వెంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది.
 • ➣ మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి.
 • ➣ కర్ణాటక దేశంలో దేవాలయాలను తురకలు ధ్వంసం చేస్తారు.
 • ➣ కుక్కలు గుఱ్ఱాలను చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. 
 • ➣ నేల నెత్తురుతో తడిచిపోతుంది. 
 • ➣ చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి వుంటాయి.
 • ➣ దుష్టశక్తులు విజృంభిస్తాయి. అందువల్ల జననష్టం జరుగుతుంది. 
 • ➣ కాకులు కూస్తాయి. నక్కలు వూళలు వేస్తాయి. ఫలితంగా ప్రజలు మరింతమంది గుంపుగా మణిస్తారు.
 • ➣ కొండవీటి రాతిస్థంభం కూలిపోవటం తథ్యం.
 • ➣ కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు.
 • ➣ బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. 
 • ➣ శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి గుండ్లు దొర్లిపడి జననష్టం జరుగుతుంది, పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి.
 • ➣ బిడ్డలు మాట్లాడతారు. 
 • ➣ ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది.
 • ➣ కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కన్పిస్తాయి, అవి అయిదు నెలల పాటు వుంటాయి.
 • ➣ వెంకటేశ్వరుని సొమ్ము దొంగలు అపహరిస్తారు. 
 • ➣ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు. ప్రజలు గ్రామాలు వదలి అడవులకు వెళ్ళిపోతారు. 
 • ➣ అనేక రకాలయిన జబ్బుల వలన పలువురు మరణిస్తారు.
 • ➣ బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. 

సంకలనం/రచన: కె.వీరబ్రహ్మచారి 

Saturday, May 2, 2020

వీరబ్రహ్మంగారు జీవసమాధి పాందుట, అంతిమ సందేశం - Veera Brahmam Gari Jivasamdhi, Antima Sandesam - KaalaGnanam

వీరబ్రహ్మంగారు జీవసమాధి పాందుట
కొన్ని సంవత్సరములు పూర్తయిన తర్వాత, ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు వీరబ్రహ్మంగారు. తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందయాచార్య స్వామికి పట్టాభిషేకము చేయదలచి, ఈ విషయమై తన భక్తులందరికినీ కాలజ్ఞాన సౌజన్య పత్రికను పంపారు.

శ్రీ వీరబ్రహ్మంగారి అంతిమ సందేశం - కాలజ్ఞానం
మేం ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారం 2.30 గంటలకు ఈ భౌతిక దేహాన్ని వదిలి జీవ సమాధి సిద్ధిని పొందదలుచుకున్నాము. కనుక ఈ పీఠాధిపత్యం నా పెద్ద కుమారుడైన గోవిందాచార్య వారికి అప్పగించుకోదలిచాను. అది తిలకించి నా వద్ద మూడు రోజులుండి, నేను సమాధిగతుడనగుట చూడవలెనని ఆహ్వానము.

నేను వివరించబోవు కాలజ్ఞాన విశేషాలను విని తరించవచ్చును. అలా స్వయముగా వచ్చి కాలజ్ఞానాద్వైత త్త్వబోధ వినలేని వారి కోసం ఈ పత్రికలో కొన్ని కాలజ్ఞాన విశేషాలను వివరించి యున్నాము. ఈ పత్రికను వారు దీపారాధన నైవేద్యములతో పూజించిన వారికి సకల శుభములు కలుగును.
 • ➣ నేను ఈ వీరబ్రహ్మేంద్రస్వామి అను పేరు ధరించి ఇప్పటికి 175 సంవత్సరములు గడచాయి. ఇప్పుడు నేను సమాధి, నిష్టలో వుండాలని నిర్ణయించుకున్నాను. నేను మళ్ళీ భూమి మీదకు వీరభోగవసంతరాయులుగా రాబోతున్నాను.
 • ➣ నేను వచ్చే సమయానికి ఈ కలి లోకంలో, ఎర్ర బోయీలు - శ్వేత ద్వీప వాసులు వస్తారు. శాలివాహన శకమునందే, వీరు మహ్మదీయులు స్నేహం పొంది భరతఖండం పాలిస్తారు.
 • ➣ హరిహరాదుల గుళ్ళల్లో పూజలు హరించి పోతాయి.
 • ➣ నమధాంధులు సాధువులను, జ్ఞానులను దూషణ చేస్తారు.
 • ➣ భూమిపై పైరులు పండినట్లుగానే వుంటాయి. వర్షములు కురిసినట్లుగానే వుంటాయి కానీ పంటలుపండవు.
 • ➣ బహు ధాన్య నామ సంవత్సరంలో, కనకదుర్గ మొదలయిన శక్తులు భూమి మీదకు వస్తాయి.
 • ➣ "శ్రీశైలంలో తపస్సు చేస్తాను. నంద నామ సంవత్సరంలో నేను తపస్సు ప్రారంభించబోయే ముందు, భూమి మీద కొన్ని నక్షత్రాలు రాలిపడతాయి. భూమి గడగడ వణుకుతుంది. అనేక మంది ప్రజలు మరణిస్తారు.
 • ➣ నేను సమాధి విడిచి విష్ణు అంశతో కలికి అవతారం ఎత్తుతాను. ప్రమాదీచనామ సంవత్సరానికి ఎనిమిదేళ్ళవాడినై ఎర్ర బోయీలతో కలసి, వారికి అంతర్య బుద్దులు కల్పిస్తాను. అక్కడి నుండి శాలివాహనశకం 5407 సంవత్సరము నాటికి, సరిగా పింగళనామ సంవత్సరంలో భయంకరమైన కొట్లాటలు ప్రారంభమవుతాయి.
 • ➣ కాళయుక్త నామ సంవత్సరం వరకూ, ఉత్తరదేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి.
 • ➣ ఆనందనామ సంవత్సరంలో మార్గశిర బహుళ అష్టమీ గురువారం మల్లికార్జునుడు భ్రమరాంబా సమేతంగా వింధ్య పర్వతానికి చేరతాడు.
 • ➣ రక్తాక్షినామ సంవత్సరంలో విజయవాడకు వచ్చి, అక్కడ పోతులూరి వారి కన్యను పెళ్ళాడి, పట్టాభిషిక్తుడనవుతాను.
 • ➣ దుర్ముఖినామ సంవత్సరం, కార్తీక శుద్ధ చతుర్ధశి మొదలుకొని, దుష్ట నిగ్రహం ఆరంభిస్తాను. నేను వచ్చేసరికి కలియుగ ప్రమాణం 4094 అవుతుంది.
 • ➣ నా భక్తులయిన వారును సదా నమ్మి “ఓం హ్రీమ్  క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మణే నమ:” అను బీజ సంపుటయైన మహామంత్రమును ఎప్పుడూ పలుకుతుంటే, వారికి నేను మోక్షం ప్రసాదిస్తాను.
సంకలనం: కే. వీర బ్రహ్మాచారి

Monday, April 27, 2020

పెదకొమెర్లలో చెప్పిన కాలజ్ఞానం - Pedakomerla lo cheppina kalagnanam

- పెదకొమెర్లలో చెప్పిన కాలజ్ఞానం -
ఒక రోజు సాయంకాలం మామూలుగానే ఆయన దగ్గరకు ఊరి పెద్దలందరూ చేరారు. తమకు జ్ఞానోపదేశం ప్రారంభించమని అడిగారు. వారందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా బ్రహ్మంగారు తాను ఆ రోజునుంచీ కాలజ్ఞానం చెప్పేందుకు నిర్ణయించుకున్నానని చెప్పి తన కాలజ్ఞానాన్ని అందరికీ వినిపించటం ప్రారంభించారు.

۞ వేల సంవత్సరాలనుంచి వేద ధర్మాన్ని ఆచరిస్తున్న భారతీయులు క్రమంగా దానిని వదిలేసి, ఇతర ధర్మాన్ని, సంస్కృతులను ఆచరించటం మొదలుపెడతారు.
 • ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాము. ప్రస్తుతం సజీవంగా వున్న, ఏకైక ప్రాచీన సంస్కృతి అయిన వేద ధర్మాన్ని క్రమంగా వదిలివేస్తూ, విదేశాలనుంచి పస్తున్న సంస్కృతిని తప్పనిసరిగా చేసుకుంటున్నాము. ఆధునిక ఫ్యాషన్లను, అలవాట్లను అనుకరిస్తున్నాము.
۞ వావి వరసలు మాయమైపోయి, కేవలం ఆడ మగ అనే రెండు జాతులు మాత్రమే మిగులుతాయి. క్షణికమైన సుఖం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ వుంటారు. 
 • బ్రహ్మంగారు చెప్పినట్టే ప్రస్తుతం విషయ వాంఛలు పెరిగిపోయాయి ఏ పదవిలో వున్నా, అధికారంలో వున్నా అందరికీ కావలసింది పరస్త్రీలు. 
 • వావి వరసలు మరిచిపోవటం వల్లే వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. హత్యలకు సైతం దారి తీస్తున్నాయి.
۞ ఒకే కుటుంబంలో వున్న వారు కూడా (తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, తమ్ముడు) ఒకరినొకరు మోసగించుకునేందుకు ప్రయత్నిస్తారు. గురు శిష్యుల మధ్య వుండవలసిన గౌరవ, ప్రేమ పూర్వకమైన సంబంధం నశించిపోతుంది. ఎవరికి వారు తమ స్వార్ధం కోసమే జీవిస్తారు.

۞ కరువు పెరుగుతుంది. పంటలు పండవు. ప్రకృతి ధర్మాలు నశించిపోతాయి దీనివల్ల అంతటా అల్లకల్లోలం ఏర్పడుతుంది.

۞ 5000 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రభవ పార్ధివ నామ సంవత్సరంలో ఒక పెద్ద ప్రళయం వస్తుంది. దీంతో ప్రపంచమంతా విస్ఫోటనాలు చెలరేగుతాయి. ఉప్పెనలు వస్తాయి. భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. ప్రజలందరూ మారణ జ్వాలలో చిక్కి నశించిపోతారు.

۞ మనోశక్తి వల్ల జరగబోయే విషయాలన్నీ తెలుస్తాయి. కొందరు దొంగ యోగులు ప్రజలను మభ్యపెట్టేందుకు చిన్న చిన్న మాయలు చేస్తారు. ప్రజలు వీరి వలలో చిక్కుకుంటారు.

۞ సూర్యుని శక్తి మనుషులకు కనబడుతుంది. సూర్యుడు పచ్చని రంగులో, మనిషి రూపంలో కనబడతాడు.

۞ శ్రావణ నామ సంవత్సరంలో నదులు, వాగులు, వంకలు పొంగి పట్నాలు పల్లెలు నాశనమవుతాయి. భూమినుంచి ఓంకారం పలుకుతుంది.

۞ పలనాటి నేలమీద బ్రాహ్మణుని ఇంటిలో కాకర చెట్టుకి చింతకాయలు కాస్తాయి అది చూసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు. నేను రాసి, పాతిపెట్టిన కాలజ్ఞానము వున్న చోట చింత చెట్టుకు జాజిపూలు పూస్తాయి.

۞ విజయవాడలో కనకదుర్గ వున్న ఇంద్ర కీలాద్రి పర్వతం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. ఇంద్ర కీలాద్రి పర్వతం బీటలు వారుతుంది. కనకదుర్గమ్మ వుండేందుకు చోటు లేక అక్కడినుంచి తరలిపోతుంది.

۞ కుంభకోణంలో పుస్న దేవాలయము కూలి కుంభుని విగ్రహం ముక్కలు ముక్కలయిపోతుంది.
 • కుంభ కోణం తమిళనాడు రాష్ట్రంలో వుందనే విషయం తెలిసిందే. మొదటినుంచీ కూడా ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు, ఇతర రకాలైన ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ విషయం వార్తా పత్రికలు చదివే వారికి బాగా అర్ధమవుతుంది.
 • కాబట్టి, ఇక్కడ వుండే దేవాలయం కూలిపోవటం అనేది కూడా భవిష్యత్ లో జరగవచ్చేమో!
۞ అయిదేళ్ళున్న చిన్న పిల్లవాడు జ్యోతిష్యము చెబుతాడు.

۞ రక్తాక్షి నామ సంవత్సరంలో చెన్నపట్టణంలో ఒక బ్రాహ్మణ గృహంలో ఎనిమిది సంవత్సరాలున్న ఒకటాలికకు ఒక శిశువుకు జన్మనిస్తుంది. ఆ శిశువు మానవ రూపంలోనే వున్నా అనేక వికృతులను కలిగివుంటాడు. ఆ బాలుడు 22 రోజులు జీవించి 23 వ రోజున త్వరలో వీరభోగ వసంతరాయలు ఈ భువిపైకి వస్తాడని చెప్పి మరణిస్తాడు.
 • జన్యుపరమైన లోపాల వల్ల పిల్లలు రకరకాల వికృతులతో పుట్టటం ఇప్పుడు మనం చూస్తూనే వున్నాం. ఈ రకమైన శిశువు గురించే బ్రహ్మంగారు చెప్పి వుంటారు అయితే దీనికి అణు, ఇతర రకాలైన పదార్ధాలు కూడా కారణమే! మధ్యప్రదేశ్లోని భోపాల్లో మిథేన్ గాస్ లీక్ కావటం వల్ల, అనేకమంది ప్రజలు మరణించగా బతికున్నవారు. 
 • భయంకర వ్యాదులవల్ల క్రమంగా మరణిస్తున్నారు. 
 • ఈ గాస్ వల్ల ఆ సమయంలో గర్భవతులుగా వున్న స్త్రీలకు పుట్టిన పిల్లలు రకరకాల వికృతులతో పుట్టారు.
۞ కర్నూలు పట్టణంలో ఉత్తర దిక్కున వున్న శివాలయంలో వేపచెట్టు పుడుతుంది అది పుట్టటం తోటే ఎన్నో వింత వింత సంఘటనలు జరుగుతాయి. ప్రజలు దీనిని ఒక మహిమ గల చెట్టు అని భావించి, మొత్తం 30 రోజులపాటు ఉత్సవములు జరుపుతారు.
ముప్రైమూడో రోజున అనేక ఉత్పాతములు జరిగి ఆ ప్రదేశం చుట్టుపక్కల వుండే ప్రజలందరూ మరణిస్తారు.

۞ బంగాళదేశము (బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్) నందు ప్రజలు జలోత్పాతాల వల్ల అధికంగా నశిస్తారు.
 • సముద్ర తీరంలోని బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాలు రెండిటికీ తుఫాన్ల తాకిడి బాగా ఎక్కువగా వుంటుందనేది అందరికీ తెలిసిందే.
۞ ధూర్జటి వ్యయనామ సంవత్సరములో దక్షిణాయనమునందు ఒక వినాశకరమైన నక్షత్రము పుడుతుంది. అది రాబోయే ఉత్పాతాలకు ఒక సూచన అని తెలుసుకోవాలి.
అది పుట్టిన తర్వాత 45 వ రోజున ప్రజల శరీరమున అనేక బొబ్బలు ఏర్పడతాయి వారు మంటలలో చిక్కుకున్నట్టు బాధలను అనుభవిస్తారు. తర్వాత మరణిస్తారు.

 ۞ పుణ్యభూమి అయిన భారత దేశంలోనూ, ప్రపంచంలోనూ పాపాలు పెరుగుతాయి. పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది. మనుషులలో క్రూరత్వం, అబద్ధమాడటం, ఇతరులను మోసం చేయటం, నమ్మినవాళ్ళకు చెడుచేయటం వంటి లక్షణాలు బాగా పెరుగుతాయి.

۞ మనుషులలో కామేచ్చ పెరుగుతుంది. వావి వరసలు లెక్క చేయరు.
 • బ్రహ్మంగారు చెప్పిన ఈ విషయాన్ని మాత్రం అందర ఒప్పుకోక తప్పదు. 
 • అన్ని విధాలుగా ముఖ్యంగా సినిమాలు, వ్యాపార ప్రకటనలు వంటి వాటిలో స్త్రీ పురుషులు అర్ధ నగ్న వస్త్రధారణ వేపు మరలుతున్నారు. 
 • అలాగే వివిధ ప్రసార సాధనాలు కూడా అంగ ప్రదర్శనను ప్రధానంగా చేసుకునే కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి.
۞ ఒక కులం వారు మరొక కులం వారిని వివాహమాడటం ఎక్కువవుతుంది.

۞ దేవతా స్థలములు - (అంటే దేవాలయములు అని అనుకోవచ్చు), ఆశ్రమ భూములలో అసుర కార్యక్రమాలు జరుగుతాయి.
 • అంటే వ్యభిచారం, జూదం, భక్తులను మోసం చేయటం వంటివి అని మనం
 • అర్ధం చేసుకోవచ్చు. 
 • ఈ మధ్య రోజుకొక దొంగ బాబా గురించి పేపర్లలో చదువుతున్నాము. 
 • ఈ బాబాలు ఆశ్రమాలను మొదలుపెట్టి, తమ భక్తురాళ్ళను ప్రలోభ పెట్టి రక రకాల అకృత్యాలకు పాల్పడటం మనకు తెలుసు. 
 • కొందరు దొంగ బాబాలు తమకేమో శక్తులున్నాయని చెప్పుకుంటూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.
۞ వేదాలను అధ్యయనం చేయటం, వాటిని గురించి వివరించటం తగ్గిపోతుంది, క్షత్రియ కులము నాశనమవుతుంది. శూద్రులు రాజరికం చేపడతారు.
 • ఇది అక్షరాలా జరుగుతోంది. హిందూ సంస్కృతికి జన్మనిచ్చిన వేదాలన గురించి ఇప్పటి హిందువులలో 90 శాతం పైగా తెలియదు. 
 • నేడు దేశాన్ని-రాష్ట్రాన్నిశూద్రులే అధికంగా పాలిస్తున్నారు.
۞ తల్లి తండ్రులు పిల్లలను విక్రయించుతారు.
 • తీవ్రమైన కరువు వల్ల పిల్లలను తల్లి తండ్రులు విక్రయించటం చాలా సామాన్యమైపోయింది. ప్రతిరోజూ ఇలాంటి వార్తలను మనం పేపర్లలో చదువుతూనే వున్నాం. 
 • మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలలో ఈ విషాదకర పరిస్థితి వుంది.
 • ఇక్కడ తాము బతకటానికో, లేకపోతే పిల్లలను బతికించటానికో ఇలా అమ్మటం ఈ జిల్లాల్లో సాధారణం అయిపోయింది.
۞ సువర్ణ ముఖినుంచి 11 మంది భక్తులు పుట్టబోతారు.

۞ లెక్కకు మిక్కిలి ప్రజలు మరణించి, తత్ఫలితంగా భూ భారం తగ్గిపోతుంది. ఇంటికి యజమానులు మరణిస్తారు. దీనివల్ల స్త్రీ,బాల వృద్దులు కష్టాల పాలవుతారు.

సంకలనం: కే. వీర బ్రహ్మాచారి  

Friday, April 24, 2020

కడప నవాబుకు చెప్పిన కాలజ్ఞానబోధ - Veera Brahmendra Garu Kadapa Navaabuku cheppina KaalaGnanam Bhoda

కడప నవాబుకు చెప్పిన కాలజ్ఞానబోధ - Veera Brahmendra Garu Kadapa Navaabuku cheppina KaalaGnanam Bhoda
- శ్రీ స్వామివారు కడప నవాబుకు చెప్పిన కాలజ్ఞానబోధ -
నేను శ్రీ వీర భోజుండనై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. ఈ కలియుగంలో 5000 సంవత్సరములు గడిచేసరికి దుష్టశిక్షణ, శిష్టరక్షణకై వస్తాను. ఈ లోపుగా సంభవించే కొన్ని పరిణామములను తెలియపరుస్తున్నాను విను.

۞ ఉప్పుకొండూరులో ఊరి చెరువు కింద ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్రమంగా నశించిపోతారు. జలప్రవాహాలు ముంచెత్తటం వలన 14 నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నేను రావటానికి ఇదే ఒక ప్రబల నిదర్శనం. 
۞ నాలుగు వర్ణాలవారు న్యాయం తప్పి నడుస్తారు.
۞ దేశంలో పెద్ద పొగ మేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి, మాడిపోతారు.
۞ సంవత్సరము 1 ధాత నామ సంవతసరం2 మా్ఘ శుద్ధ బుధవారం రోజున పట్టపలే పద్దెనిమిది పట్టణాలు దోపిడీకి గురవుతాయి.
۞ కోటిదూపాటిలోనూ, కొచ్చెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది.
۞ జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ములు దిగ ప్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగగొడతారు. దీనిని నిరూపించుకోవటం కోసం తప్పుడు ప్రమాణాలు చేస్తారు! భర్త మణించిన స్త్రీలు మరల ముత్తయిదువులవుతారు.

۞ కోమటి కులంలో 25 గోత్రములు వారు మాత్రమే నిలిచివుంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
 • ఇది మహాత్మాగాంధీ గురించి చెప్పిన జ్యోతిష్యం అని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. బ్రహ్మంగారు తాను చెప్పిన జోస్యంలో ఏ విధంగా అయితే  'మహాత్మ' అనే పదం వాడారో గాంధీ కూడా అదే పేరుమీద పేరు పొందటం మనందరికీ తెలిసినదే కదా! దేశవిదేశీయులందరూ కూడా ఆయనను 'మహాత్మ' పేరు మీదే సంభోదిస్తారు.
۞ మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
۞ పట్టపగలు ఆకాశంలోనుంచి పిడుగుల వాన పడి, నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు.

۞ పందికడుపున ఏనుగు పుడుతుంది. మేకకు అయిదు తలల మేకపోతు పుడుతుంది.
 • ఇది కూడా ఇప్పుడు మనం చూస్తున్నదే! పంది కడుపున ఏనుగు తొండం మాదిరి అవయవం కలిగిన పంది పిల్లలు పుట్టటం పేపర్లలో కూడా చూస్తూనే వున్నాము.
 • అలాగే వికృతులతో కూడిన మేకపిల్ల పుట్టటం కూడా!
۞ బనగానపల్లెలోని కాలజ్ఞాన పాతర మీది వేపచెట్టుకు జాజిపూలు పూస్తాయి.
 • గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగానపల్లె నవాబు కొంత కాలమే పాలన చేస్తాడు. ఆతరువాత బనగానపల్లెను ఇతర రాజులు స్వాధీన పరుచుకుంటారు. 
 • అద్దంకి నాంచారమ్మ ముందుగా మాటలాడుతుంది, అందవల్ల ఎందరో నష్టపోతారు.
۞ గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణము ఏలతారు.

۞ మహానంది మరుగున మహిమలు పుడతాయి.

۞ నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను కపాడతాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు వచ్చి మేమే వీరభోగ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు మాత్రం ఆ మాటలను నమ్మకుండా వుంటారు. మూఢులు మాత్రం నమ్ముతారు.

۞ మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు, అరికాలున తామరపద్మం కలిగిన వారు వస్తారు. వారిని నేనే అని భ్రమ వద్దు. నా రాకకు ఒక గుర్తు ఏమిటంటే కందిమల్లయ్యపల్లిలో నవరత్న మంటపం కడతారు. ఈ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది. 

۞ ”కంచికామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాదిమంది మృతి చెందుతారు.

۞ ఆవు కడుపులోని దూడ అదే విధంగా బయటి ప్రజలకు కన్పిస్తుంది.
۞ పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.

۞ కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను వాడు జన్మించి శైవుడైనా,అన్ని మతాలనూ గౌరవిస్తూ, గుళ్లూ గోపురాలూ నిర్మిస్తాడు. పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామదేవతలు ఊరేగుతారు.

۞ కాశీ, కుంభకోణం, గోకర్ణ క్షేత్రాల మహత్తులు తగ్గిపోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.

۞ ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ, ఈ నిదర్శనాలు| కనిపిస్తూంటాయి. పతివ్రతలు పతితలౌతారు. వరుసలు పాటించకుండా వుంటారు ఆచారాలు అన్నీ సమసిపోతాయి.

۞ రాయలవారి సింహాసనం కంపిస్తుంది. ఈ సమయంలో హస్తినాపురిలో మహామారి అనే శక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయల విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది

۞ శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. అనేక. కాల వ్యాధులు ప్రబలుతాయి. మందులకు తగ్గవు, స్త్రీ పురుషులంతా దూరాచారులవుతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.

۞ ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.

۞ వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవమతం తగ్గిపోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలతాయి. బెండ్లు మునుగుతాయి. చివరికి శివశక్తి అంటూ లేకుండా పోతుంది.

۞ విజయ నగరాన కోటలోని రాయల సింహాసనం బయటపడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామాలలోని రాతివిగ్రహాలు ఊగిసలాడుతాయి. అప్పుడు బిజ్జలరాయని కొలువున రాయల సింహాసనం బయటపడుతుంది..." ఇలా నవాబునకు కాలజ్ఞానము బోధించి, మంత్రదీక్ష యిచ్చి ఆశీర్వదించారు.

۞ నాలుగు వర్ణాల వారు మద్యపానం చేత భ్రష్ఠులయిపోతారు.

۞ వేదములు అంత్య జాతుల పాలవుతాయి. విప్రుల కులహీనులై తక్కువ కులస్థుల పంచన చేరతారు. విప్రులు విధవా వివాహాలు చేస్తారు. స్వ వృత్తి, ధర్మాలు మాని ఇతరులకు బానిస వృత్తి చేస్తారు.

۞ బ్రాహ్మణులను పిలిచేవారు వుండరు. బ్రాహ్మణులు ఇతర విద్యలు కోసం పంట భూములమ్ముతారు. నేను వచ్చేసరికి వారికి తినేందుకు తిండి, గుడ్డ కరువవుతాయి.

۞ మీన రాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీర భోగ వసంత రాయలుగా ఉద్బవిస్తాను. నాలుగు మూరల ఖడ్గము పట్టి శ్రీశైల పర్వతం మీదికి వచ్చి, అక్కడి ధనమంతా పుణ్యాత్ములయిన వారికి పంచి ఇస్తాను.

నేను తిరిగి భూమి మీదకు ఎలా వస్తానో వివరిస్తాను. వినండి:
 • ۞ కేదారవనంలో నిరాహారినై తపం చేస్తాను. మూడు వరాలు పొంది, అచ్చటి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ దశమి, బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి అక్కడ మహా మునులను, మహర్షులను దర్శనము చేసుకుంటాను. అటనుండి బయలుదేరి, శ్రీశైల మల్లికార్జునుని సేవిస్తాను. అనంతరం దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటాను.
 • ۞ వావి వరసలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. పార్వతీ అవతారములను డబ్బులకు అమ్ముతారు. కులగోత్రములు, నీతి జాతి లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి. 
 • ۞ రణ్యాలలోనూ, భూమిలోనూ అమితమైన ధనముండెను. నేను భూమిపై పేక్కదుష్టాంతాలను పుట్టిస్తాను. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమి మీద మంటలు పుడతాయి.
 • ۞ నాలుగు సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరుపతులు పాడయ్యేను. (అంటే 120 వైష్ణవ క్షేత్రములు నశించిపోవునని అర్థమయి వుండవచ్చును).
 • ۞ ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది.
 • ۞ నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు. నన్ను నమ్మిన వారికి నా రక్షణ కులుగుతుంది.
 • ۞ వైశాఖ శుద్ద పంచమిన నేను బయలుదేరి సూర్య మండలం నుండి కొలువు పాకకు వస్తాను. అక్కడి నుండి అహోబిలము తర్వాత సూర్యనంది చేరుకుంటాను.
 • ۞ శ్రీకృష్ణ నిర్యాణం ఆదిగా 4999 సంవత్సరాలకు కలిరూపం కొంత నాశనమవుతుంది. 
 • ۞ కలికి అవతారం కలియుగాంతాన వస్తుంది. పూర్వులు గ్రంథములలో కలియుగము, కలికి అవతారం వివరించారు. వ్యాసభగవానుడు, శాంతి పర్వం చివరన ఈ అవతారం గూర్చి చెప్పారు.
 • ۞ శ్రీ శైలాన పొగమంటలు పుడతాయి. బసవడు నాట్యమాడగా 'గణగణ' మువ్వల మోత వినబడుతుంది.
 • ۞ భ్రమరాంబ దేవాలయంలో ఒక మొసలి 7 రోజులుండి అదృశ్యమవుతుంది. భ్రమరాంబ మెడలోని మంగళసూత్రం తెగిపడిపోతుంది. ఆమె కంట నీరు కారుతుంది, స్తనాలనుంచి పాలు కారతాయి.
 • ۞ కందనూరి గోపాలుని గుడిముందు చింతచెట్టు పుడుతుంది. మహానందిలో ఈశ్వరుని విగ్రహం కదులుతుంది. దేవాలయమున రెండు పాపములు తిరుగుతాయి.
 • ۞ వాటిల్లో పెద్ద పాము శిఖరాన మూడు రోజులుండి తరువాత అదృశ్యమవుతుంది.
 • ۞ సూర్యనందీశ్వరుని ముందట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు ఆ క్షణాన పూలు పూచి, కాయలు కాచి, పండ్లు పండి వెనువెంటనే మాయమవుతుంది.
 • ۞ శిరువెళ్ళ నరసింహుని గుడి ముందర గంగరావిచెట్టు మొలుస్తుంది. బహు“ధాన్య నామ సంవత్సర, వైశాఖ శుద్ద తదియ, శుక్రవారం నాడు పల్లెకు తురకలు వస్తారు.
 • ۞ బసవన్న రంకె వేస్తాడు. తిరువళ్ళువరు వీరరాఘవస్వామికి చెమటలు పడతాయి,  భద్రకాళి కంపిస్తుంది. కంచి కామాక్షమ్మ దేహాన చెమటలు పుడతాయి. ఆమె కంట నీరు స్తనాల పాలు కారతాయి.
 • ۞ శాలివాహనం 1541 న ధూమకేతువు పుడుతుంది. శాలివాహనశకం 1555 నాటికి వివిధ దేశాల్లో జననష్టం జరుగుతుంది.
 • ۞ పెమ్మసాని తిమ్మనాయుడు వంశం నిర్వంశమయ్యేను. ఉదయగిరి, నెల్లూరులు రూపుమాసి పోయేను. గండికోట, గోలకొండ, ఆదలేని, కందనూరు పట్టణాలు నశించి తురకలు పారిపోతారు. విజయపురంలాంటి పట్టణాలు క్షయనామ సంవత్సరం నాటికి నశిస్తాయి.
 • ۞ స్త్రీల కన్నుల నుండి నెత్తుటి బిండువులు రాలతాయి. వడగండ్ల వానలు, బాణవర్షాలు కురుస్తాయి. చెరువులు, బావులు, నదులు నీరు ఇంకిపోతాయి. అయనా జుర్రేరు నీరు ఇంకదు.
సంకలనం: కే. వీర బ్రహ్మచారి

Tuesday, April 21, 2020

శ్రీ వీరబ్రహ్మంగారు అన్నాజయ్యకు చెప్పిన కాలజ్ఞానం - Sri Veera Brahmam garu Annajayya ku Bhodinchina KaalaGnanam

శ్రీ వీరబ్రహ్మంగారు అన్నాజయ్యకు చెప్పిన కాలజ్ఞానం - Sri Veera Brahmam garu Annajayya ku Bhodinchina KaalaGnanam
శ్రీ వీరబ్రహ్మంగారు అన్నాజయ్యకు చెప్పిన కాలజ్ఞానం
ఈ కాలజ్ఞానంలోని కొన్ని సంగతులు గతంలో అచ్చమ్మకు చెప్పినట్టుగానే కనబడుతున్నాయి. కానీ కొన్ని కొత్తవి కూడా వున్నాయి.

۞ ఎంతో మంది మార్బలం వున్న రాజులు కూడా సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
 • గతంలో జరిగిన యుద్ధాలలో ఈ పరిమాణం సంభవించింది. శ్రీ కృష్ణుని నిర్యాణం జరగబోయే ముందు కూడా జరిగినది ఇదే కదా ! అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకుని వస్తుంటే దారిలో చోరులు అర్జునుడి మీద, అతని సైన్యం మీదా దాడి చేస్తారు. వారిమీదతన మహావస్త్రాలను ప్రయోగించదలచుకున్నప్పటికీ ఒక్క అస్త్రం కూడా గుర్తురాక నిస్సహాయుడైపోతాడు అర్జునుడు. అదంతా కలియుగ ప్రభావమే అని చెబుతాడు వ్యాసుడు.
۞ పిడుగులు పడి నదులు ఇంకిపోయేను
 • ఉల్కల వల్ల 'ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయం. ఉల్మలు పడిన సమయంలో పిడుగువంటి శబ్దాలు వస్తాయి. 
 • ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమిమీద తిరిగిన అతిపెద్ద డైనోసార్లు తుడిచిపెట్టుకుపోయాయి. చిన్న పిడుగు పడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తారు. అలాంటిది ఉల్క పడితే ఏ ప్రమాదమయినా సంభవించవచ్చు
۞ విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చునట్టు, నిలుచున్నవారు నిలుచున్నట్టు హతమారిపోతారు.
 • నేడు మృత్యు తాండవం చేస్తున్న కరోనా వైరస్, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎయిడ్స్ వంటి భయంకర వ్యాధులు ఎన్నో జనాల్ని నాశనం చేస్తున్నాయి.
۞ రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి. నీటియందు చేపలు తాము చత్తుమని పలుకుతూ బయటకు వస్తాయి
۞  శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది ఎనిమిది రోజులుండి, భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతువలె కూసి మాయమవుతుంది.
۞ శ్రీశైలం శిఖరాన అగ్నివర్షం పుడుతుంది. సందీశ్వరుడు రంకెలు వేస్తాడు. ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.

۞ సూర్యమండలము నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది.
 • ఇది పురాణాలలో వుంది. ఆశరీరవాణి తరుచుగా సత్య నిర్ధారణ చేయటం ఎన్నో సందర్భాలలో మనం పురాణాలు, ఇతిహాసాలలో కూడా చదువుకున్నాం.
 • బహుశా అప్పుడు చెప్పిన అశరీరవాణి ఇదే కావచ్చు.
۞ విషవాయువు కొట్టినపుడు శివుని కంట నీరు నిండుతుంది.
 • మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాదిమంది ప్రజలు మరణించారు.
۞ గ్రామాలలో, పట్టణాలలో నెత్తుటి వాన కురిసేను.
 • రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటం కొన్ని ప్రాంతాలలోని ప్రజలు చూశారు. 
 • వివిధ రసాయనాలు, కాలుష్యం కారణంగా ఇలా ఎరుపురంగు. వర్షం పడుతోందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.
۞ సూర్యుడు, చంద్రుడు వున్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతూనే వుంటాయి.
۞ నా మఠమునకు ఈశాన్యం వేపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుట్టేను. అతడు నేనే భగవ్తుడను నన్ను పూజించండి అని పలుకుతాడు.

۞ నెల్లూరు సీమ మొత్తం నీట మునిగివుంటుంది
 • తుఫాన్ల సమయంలో నెల్లూరు మొత్తం జలమయం అవటం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.
సంకలనం: కే వీర బ్రహ్మాచారి 

Sunday, April 19, 2020

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అచ్చమ్మకు చెప్పిన కాలజ్ఞానం - Acchammaku Cheppina Kaalagnanamశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి వచన కాలజ్ఞానము, వీరబ్రహ్మేంద్రస్వామి జీవితంలో ఎన్నో మహిమలు జరిగినట్టు చెబుతారు. అయితే ఈ మహిమలు చూసినవారు, జరిగాయా లేదా అని తర్కించేవారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధికశాతం హిందువులు నమ్ముతారు.
అచ్చమ్మకు చెప్పిన కాలజ్ఞానం
🟔 దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచిప్రవర్తన కలవారు భయంకర కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు.
 • ప్రస్తుతం కేవలం అవినీతిపరులు మాత్రమే ప్రజా పాలకులుగా మారుతున్నారు. మన దేశమేకాదు, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతిపరులు, దుర్మార్గులుగానే వుంటున్నారు. 
 • ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు. వారికి ధన సంపాదనే ధ్యేయం. ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవరికీ పట్టడం లేదు.
🟔 మతకలహాలు పెరిగి ఒకర్నొకరు చంపుకుంటారు.
 • దేశ విభజన సమయంలో కూడా హిందూవులు, ముస్లింలు ఒకర్నొకరు చంపుకున్నారు. ఇటీవల కూడా గుజరాత్లో నరమేధం జరిగింది. ఇక్కడ ముందుగా ముస్లింలు మతకల్లోలాలను ప్రారంభించారు. వారు రైల్లో ప్రయాణిస్తున్న కొందరు హిందువులను సజీవదహనం చేయటంతో, హిందువులు ఆ పనిచేసిన ముస్లింలను హతమార్చారు.
🟔 అడవి మృగాలు అడవులలోనుంచి గ్రామాలు, పట్టణాలలోనికి ప్రవేశిస్తాయి మానవులను చంపుతాయి. 
 • పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల వారు పొలాల కోసం, కలపకోసం లక్షల ఎకరాలలో అడవులను నరికి, వాటిలో పంటలు పండిస్తున్నారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది. దీనివల్ల అక్కడ వుండాల్సిన పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు వంటివి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి.
 • మనుషుల్ని హతమారుస్తూ, పంటలను ధ్వంసం చేస్తున్నాయి
🟔 నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు.
 • బ్రహ్మంగారు పుట్టి, జ్యోతిష్యం చెప్పిన సమయానికి మారుమూల పల్లెలే కాదు, పట్నాల్లోకి కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు. అసలు వాటి గురించి ఎవ్వరూ ఊహించలేదు కూడా. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఈ శక్తి నీళ్ళ నుంచి ఆవిర్భవిస్తోందనేది మనందరికీ తెలుసు. 
 • ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ళ కిందటే తమ కాలజ్ఞానంలో చెప్పారాయన.
🟔 ఇతర దేశీయులు వచ్చి భారత దేశాన్ని పరిపాలిస్తారు.
 • ప్రాచీనకాలంలో చూస్తే హూణులు తదితరులు, ఆ తర్వాత ముస్లింలు, తర్వాత డచ్, పోర్చ్ గీసువారు, తర్వాత బ్రిటీష్ వారు ఇలా కోట్లమంది మంది హిందువులను చంపి ఈ దేశాన్ని ఆక్రమించారు. వందల సంవత్సరాలు పాలించారు. 
 • భారతీయులలో సహజంగా వున్న అనైక్యత వల్లే ఇతర దేశీయులు ఈదేశాన్ని పరిపాలించగలిగారు. 
🟔 మాచర్లలోని రాజులందరూ ఒక స్త్రీ చేత తస్నుకులాడి మరణిస్తారు.
 • అక్షరాలా బ్రహ్మంగారు చెప్పింది పల్నాటి రాజ్యంలో జరిగింది. నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు ఒక శ్మశానంగా మారిపోయింది. 
 • చిన్నచిన్న పట్టింపులు పౌరుషం వల్ల యుద్ధం జరిగి వేలాదిమంది ఆనాడు మరణించారు.
🟔 పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. దీనివల్ల కొన్ని గ్రామాలలో ప్రజలు మరణిస్తారు.
 • దీని గురించి ఖచ్చితమైన వివరణ ఇవ్వలేము. ఇది విమానాల్లో నుంచి వదిలే బాంబులు కావటానికి అవకాశం ఎక్కువగా వుంది. వియత్నాం యుద్ధంలో జరిగింది ఇదే. అక్కడ ఎక్కువగా గ్రామాలపైనే అమెరికా సేనలు దాడులు జరిపాయి. 
 • అక్కడ వామపక్ష గెరిల్లాలు గ్రామాలనుంచే తమ సాహసోపేతమయిన పారాటం చేశారు, అమెరికా సేనలను భయకంపితులను చేశారు.
🟔 ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు. స్త్రీ, పురుషులు కామముచేత పీడితులవుతారు.
 • నగర జీవనంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. 
 • గతంతో పోలిస్తే ఇప్పుడు స్త్రీ, పురుషులలో కామవాంఛ పెరిగింది. నైతిక విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయి.
🟔 వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహ్మదీయులు దేవాలయాలను దోచోచుకుంటారు.
 • ఇప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక దేవాలయంలో దొంగలు పడటం ఒక రోజువారీ వార్తగా మారిపోయింది. 
 • పూర్వం మహమ్మదీయుల పాలనాకాలంలో ఎన్నో ఆలయాలు ధ్వంసం చేయబడి దోచుకోబడ్డాయి.
🟔 మహామ్మదీయులు వేల సంఖ్యలో హిందువుల దేవాలయాలను ధ్వంసం చేస్తారు.
 • గుజరాత్లోని అత్యంత సుసంపన్నమైన సోమనాథ ఆలయం మీద ముస్లిం చక్రవర్తులు వరుసగా అనేకసార్లు దండయాత్రలు చేసి అక్కడి సంపదను మొత్తం దోచుకుని వెళ్ళారు.
🟔 అయిదు వేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది.
 • ఈ కాల పరిణామం సరస్వతీ నది విషయంలో అక్షరాలా జరిగింది. వేద కాలం నాటి సరస్వతీనది ప్రస్తుతం అంతర్ధానమైపోయినా, శాటిలైట్ ద్వారా ఆ నది గతంలో ప్రవహించిందని శాస్త్రవేత్తలు ధృవీకరించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 
 • గంగ విషయంలో జరుగుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.
🟔 చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి.
🟔 కృష్ణానది మధ్య ఒక బంగారు తేరు (రథము) పుడుతుంది. దాన్ని చూచినవారికి ఆ కాంతివల్ల కనులు కనబడవు.
 • ఇది ఇప్పటివరకు జరగలేదు కానీ, ఇకముందు జరగవచ్చేమో తెలియదు ప్రపంచంలో ఇకముందు పాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. 
 • క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడి, పాపాత్ములను శిక్షించేందుకు నేను అయిదువేల ఏళ్ళ తరువాత వీరభోగ వసంతరాయులుగా తిరిగి అవతరిస్తాను.
🟔 విజయనగరం కొన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలగుతుంది. ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి నాశనమైపోతుంది.
 • ఇది ఒక చారిత్రక వాస్తవం! శ్రీ కృష్ణదేవరాయల పాలన తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతఃకలహాలు మొదలయ్యాయి. 
 • అసమర్థులు, భోగలాలసులైన చక్రవర్తులు నేతలుగా మారారు.
 • మరోవైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహా సామ్రాజ్యం బలహీనమవటం ప్రారంభించింది. 
 • మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్నాటక, ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల కూడా విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు.
🟔 వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
 • వెంకటేశ్వరునికి ఒక మహమ్మదీయ వనిత భార్యగా వున్న విషయం అందరికీతెలిసిందే. బీబీ నాంచారి పేరుతో ఈ మహిళ పూజలందుకుంటోంది.
🟔 కృష్ణ, గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చేరు.
 • కృష్ణ గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే వుంది గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫాన్ సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు.
🟔 తూర్పునుంచి పడమర వరకు ఆకాశంబున యోజన ప్రమాణము వెడల్పుగా చెంగావి చీర కట్టినట్లు కనబడుతుంది.
 • ఇది కూడా అణ్వస్త్రాల కలిగే ఫలితం కావచ్చు. అణు బాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్టు కనబడ్డాయి.
ఇలా అచ్చమ్మకు కాలజ్ఞానాన్ని ఉపదేశించారు వీర బ్రహమేంద్రస్వామి వారు. అయన బోధనల వల్ల క్రమంగా అచ్చమ్మలో వున్న అజ్ఞానమంతా తొలగిపోతుంది.

సంకలనం:కే వీరబ్రహ్మచారి

Saturday, December 14, 2019

కాలజ్ఞాన తత్వము: చెప్పలేదంటనక పొయ్యేరు ! మొదటి భాగము - Kaalagnana Thathvamulu

 కాలజ్ఞాన తత్వము: చెప్పలేదంటనక పొయ్యేరు ! మొదటి భాగము - Kaalagnana Thathvamulu
శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 
కాలజ్ఞాన తత్వము - మొదటి భాగము

చెప్పలేదంటనక పొయ్యేరు
వకుళాభరణ రాగము, ఆటతాళము


🙏 చెప్పలేదంటనక పొయ్యేరు - నరులార గురుని
          చేరి మొక్కితె బతుక నేర్చేరూ     !!చెప్ప!!

చెప్పలేదంటనక పొయ్యేరు
తప్ప దిదిగో గురుని వాక్యము
తప్పుదోవల బోవువారల
చప్పరించి మింగు శక్తులు   !!చెప్ప!!

🙏 మొప్పెతనమున మోసపొయ్యేరు - అదిగాక కొందరు.
గొప్పతనమున గోసు మీరేరు
ఇప్పుడప్పు డనగ రాదు. 
ఎప్పుడో ఏ వేళనో మరి
గుప్పు గుప్పున దాటి పోయెడు
గుర్ర పడుగులు ఏరుపడును    !!చెప్ప!!

🙏 తాకు తప్పులు తలచకున్నారు - తార్కాణ మైతే
తక్కు వెక్కువ తెలియనేర్తూరు
జోక తోడుత తల్లి పిల్లలు
జోడు బాసి అడవులందు
కాకి శోకము చేసి ప్రజలు
కాయ కసురులు నమిలి చత్తురు     !!చెప్ప!!

🙏 కేక వేసియు ప్రాణ మిడిచేరు - రాకాసి మూకలు
కాకబట్టి కలవరించేరు
అకసమ్మది ఎర్రబారును
ఆరు మతములు ఒక్కటౌను
లోకమందలి జనము లందరు
నీరు నిప్పున మునిగి పోదురు   !!చెప్ప!!

🙏 అగలు విడిచీ పొగలు దాటేరు - అదిగాక పట్ట
పగలు చుక్కలు చూసి భ్రమసేరు
భుగులు భుగులు ధ్వనులు మింటను
పుట్టి యేగిన పిమ్మటాను
దిగులు పడుచు ప్రజలు చాలా
దిక్కులేని పక్షు లౌదురు   !!చెప్ప!!

🙏 పాతకూలు పదట గలిసేరు - పుణ్యాత్ములైన
సాధకూలు సంతసించేరు
భూతలంబున నిట్టి వింతలు
పుట్టి యణగిన పిమ్మటాను 1
నీతి కృతయుగ ధర్మ మప్పుడు
నిజము నిలకడ మీద తెలియును   !!చెప్ప!!

🙏 ఏమొ ఏమొ ఎరుగకున్నారు - ఎందెందు జూచిన
యముని పురికే నడవమన్నారు
భూమి మీదను ధూముధాములు
పుట్టి పెరిగిన పిమ్మటాను1
రామ రామా యనని వారలు
రాలి పోదురు కాలిపోదురు.    !!చెప్ప!!

🙏 ముందు వెనుకలు గానకున్నారు - ముర్ఖాళి భువిలో
ముందు గతినే ఎరుగకున్నారు
కందువతో పిన్న పెద్దల
కన్ను గానక గర్వములచే
మందె మేలము లాడువారిని
బందు బందుగ గోతు రక్కడ     !!చెప్ప!!

🙏 కీడె యైనను కూడ దందురు - ఒనగూడినప్పుడు
ఏడ జూచిన వాడుకొందురు
వేడుకతో పోతులూరి
వీరభోగ వసంత రాయలు
ఏడు దీవులు ఏక చక్రము
ఏలును బ్రహ్మాండ మంత    !!చెప్పు!!

🖝 రెండవ భాగములో - "చిల్లర రాళ్లకు"

రచన: డా. కొండవీటి మఠం 

Sunday, May 13, 2018

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి - Sri Potuluri Veera Brahmendra Swamy

 శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పుట్టుక:
 • జననం -- క్రీ.శ 1608
 • కాశీ పట్టణం
 • నివాస ప్రాంతం---కందిమల్లాయపల్లి,( వైఎస్ఆర్ కడప జిల్లా)
 • ఇతర పేర్లు--- బ్రహ్మం గారు,అగామి కాలజ్ఞాన కర్త, పురోగామి సమాజ సంస్కర్త
 • వృత్తి---కాలజ్ఞాన బోధ
 • ప్రసిద్ధి ---అగామి కాలజ్ఞాన కర్త,
 • పురోగామి సమాజ సంస్కర్త
 • భార్య /--గోవిందమ్మ
 • తండ్రి ---పరిపూర్ణయాచార్యులు
 • వీరభోజయాచార్య(పెంపకం)
 • తల్లి ప్రకృతాంబ
 • వీరపాపమాంబ(పెంపకం)
బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబలకు, క్రీస్తు శకం 1608 లో జన్మించారు. ఆయనను పెంచిన తండ్రి పేరు వీర భోజయాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. ఆయనకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. ఆయన వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరారు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశారు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని, వాటిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరారు

అతి చిన్న వయసులోనే, బ్రహ్మం గారు కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బురపరుస్తారు బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతుా తన తల్లి ఆశీర్వాదాలు కోరతారు. అందుకు, వారి తల్లి, నాయన, వీరంభోట్లయ్య (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్యగా పిలువబడ్డారు, పాపాఘ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి), మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రంలో మునిగి పోతుంది. అప్పుడు బ్రహ్మం గారు, తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించారు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, శుక్రశోణితంతో స్త్రీ గర్భ ధారణ గావించాక, గర్భం ధరించిన ప్రతి నెలలో, కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు బ్రహ్మం గారు. ఆగామి, ప్రారబ్ధ, సంచిత కర్మ సిద్ధాంతము గురించి వివరించి ఆమెకు మాయ తెరను తొలగించి, లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయల్దేరతారు బ్రహ్మం గారు.

( 1608[1]-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపులు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో వున్నట్టి పాపాగ్ని మఠం (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామివారు కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందారు. వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి. జరుగుతున్నాయి.

బ్రహ్మం గారు సాక్షాత్ దైవ స్వరూపుడు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరిని సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు. చరిత్రకారుల కాలజ్ఞాన పరిశోధన ఫలితంగా, బ్రహ్మం గారు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకున్నారు. కర్ణాటక లోని పాపాఘ్ని మఠాధిపతి యనమదల వీరభోజయచార్యులు, సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. సంతాన ప్రా్తి కై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మం గారిని అత్రి మహాముని అందజేస్తాడు. వీరభోజయాచార్య, ఈ బాలుడు, మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు.ఆ విధంగా బ్రహ్మం గారు పాపాఘ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తారు (ఈనాడు కర్ణాటక లోని పాపాఘ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠంగా పేరు గాంచి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నది).

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com