శ్రీ వీరబ్రహ్మంగారు అన్నాజయ్యకు చెప్పిన కాలజ్ఞానం - Sri Veera Brahmam garu Annajayya ku Bhodinchina KaalaGnanam

శ్రీ వీరబ్రహ్మంగారు అన్నాజయ్యకు చెప్పిన కాలజ్ఞానం - Sri Veera Brahmam garu Annajayya ku Bhodinchina KaalaGnanam
శ్రీ వీరబ్రహ్మంగారు అన్నాజయ్యకు చెప్పిన కాలజ్ఞానం
ఈ కాలజ్ఞానంలోని కొన్ని సంగతులు గతంలో అచ్చమ్మకు చెప్పినట్టుగానే కనబడుతున్నాయి. కానీ కొన్ని కొత్తవి కూడా వున్నాయి.

۞ ఎంతో మంది మార్బలం వున్న రాజులు కూడా సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
  • గతంలో జరిగిన యుద్ధాలలో ఈ పరిమాణం సంభవించింది. శ్రీ కృష్ణుని నిర్యాణం జరగబోయే ముందు కూడా జరిగినది ఇదే కదా ! అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకుని వస్తుంటే దారిలో చోరులు అర్జునుడి మీద, అతని సైన్యం మీదా దాడి చేస్తారు. వారిమీదతన మహావస్త్రాలను ప్రయోగించదలచుకున్నప్పటికీ ఒక్క అస్త్రం కూడా గుర్తురాక నిస్సహాయుడైపోతాడు అర్జునుడు. అదంతా కలియుగ ప్రభావమే అని చెబుతాడు వ్యాసుడు.
۞ పిడుగులు పడి నదులు ఇంకిపోయేను
  • ఉల్కల వల్ల 'ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయం. ఉల్మలు పడిన సమయంలో పిడుగువంటి శబ్దాలు వస్తాయి. 
  • ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమిమీద తిరిగిన అతిపెద్ద డైనోసార్లు తుడిచిపెట్టుకుపోయాయి. చిన్న పిడుగు పడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తారు. అలాంటిది ఉల్క పడితే ఏ ప్రమాదమయినా సంభవించవచ్చు
۞ విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చునట్టు, నిలుచున్నవారు నిలుచున్నట్టు హతమారిపోతారు.
  • నేడు మృత్యు తాండవం చేస్తున్న కరోనా వైరస్, డెంగ్యూ, చికెన్ గున్యా, ఎయిడ్స్ వంటి భయంకర వ్యాధులు ఎన్నో జనాల్ని నాశనం చేస్తున్నాయి.
۞ రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి. నీటియందు చేపలు తాము చత్తుమని పలుకుతూ బయటకు వస్తాయి
۞  శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది ఎనిమిది రోజులుండి, భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతువలె కూసి మాయమవుతుంది.
۞ శ్రీశైలం శిఖరాన అగ్నివర్షం పుడుతుంది. సందీశ్వరుడు రంకెలు వేస్తాడు. ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.

۞ సూర్యమండలము నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది.
  • ఇది పురాణాలలో వుంది. ఆశరీరవాణి తరుచుగా సత్య నిర్ధారణ చేయటం ఎన్నో సందర్భాలలో మనం పురాణాలు, ఇతిహాసాలలో కూడా చదువుకున్నాం.
  • బహుశా అప్పుడు చెప్పిన అశరీరవాణి ఇదే కావచ్చు.
۞ విషవాయువు కొట్టినపుడు శివుని కంట నీరు నిండుతుంది.
  • మధ్యప్రదేశ్ లోని భోపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాదిమంది ప్రజలు మరణించారు.
۞ గ్రామాలలో, పట్టణాలలో నెత్తుటి వాన కురిసేను.
  • రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటం కొన్ని ప్రాంతాలలోని ప్రజలు చూశారు. 
  • వివిధ రసాయనాలు, కాలుష్యం కారణంగా ఇలా ఎరుపురంగు. వర్షం పడుతోందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.
۞ సూర్యుడు, చంద్రుడు వున్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతూనే వుంటాయి.
۞ నా మఠమునకు ఈశాన్యం వేపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుట్టేను. అతడు నేనే భగవ్తుడను నన్ను పూజించండి అని పలుకుతాడు.

۞ నెల్లూరు సీమ మొత్తం నీట మునిగివుంటుంది
  • తుఫాన్ల సమయంలో నెల్లూరు మొత్తం జలమయం అవటం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.
సంకలనం: కే వీర బ్రహ్మాచారి 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top