వీరబ్రహ్మం గారు పాంచాననం వారికి చెప్పిన కాలజ్ఞానం - Veera Brahmam garu Paanchananam variki cheppina KaalaGnanam

వీరబ్రహ్మం గారు పాంచాననం వారికి చెప్పిన కాలజ్ఞానం - Veera Brahmam garu Paanchananam variki cheppina KaalaGnanam

శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు పాంచాననం వారికి చెప్పిన కాలజ్ఞానం


 • ➣ శ్రీముఖ నామ సంవత్సరమున శ్రీ వీరభోగ వసంతరాయులనై వచ్చి ప్రసిద్ధులైన. పరిపాలిస్తాను. మహానందికి ఉత్తరాన అనేక మంది మునులు పుట్టుకొస్తారు. భూమి మీద ఎన్నో మాయలు ప్రదర్శిస్తారు.
 • ➣ నేను 5000 సంవత్సరాలకు వచ్చేసరికి బ్రాహ్మణులు సంకరవృత్తులను చేస్తూ తమ వైభవం కోల్పోతారు. ఏ కులం వారు కూడా బ్రాహ్మణులను గౌరవించరు. సిద్ధులు, యోగులు జన్మించిన ఆ బ్రాహ్మణకులము పూర్తిగా వర్ణసంకరమవుతుంది.
 • ➣ ఆనాటికి ప్రజలలో దుర్బుద్ధులు అధికమవుతాయి. కృష్ణవేణమ్మ పొంగి కనకదుర్గమ్మ ముక్కుపోగును తాకుతుంది. రాజాధిరాజులు అణిగి వుంటారు. శూద్రులు విలాసాలను అనుభవిస్తూ, రాజుల హోదాలో వుంటారు. వారి ఇంట ధనలక్ష్మి నాట్యమాడుతూ వుంటుంది. నా భక్తులయిన వారికి నేనప్పుడే దర్శనమిస్తాను. కాని వారి నెత్తురు భూమిమీద పారుతుంది. కొంత భూభారము తగ్గుతుంది. దుర్మార్గుల రక్తముతో భూమి తడుస్తుంది.
 • ➣ చీమలుండు బెజ్జాల చోరులు దూరతారు. స్త్రీలందరూ చెడు తలంపులతో నుంటారు. అందువల్ల చోరులు ప్రత్యేకముగా కనపడరు. బిలం నుంచి మహానంది పర్వతము విడిచి వెళ్తుంది.
 • ➣ గడగం, లక్ష్మీపురం, రాయచూరు, చంద్రగిరి, అలిపేది, అరవరాజ్యము, వెలిగోడు. ఓరుగల్లు, గోలుకొండ మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. నా మఠంలో ఏడుసార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు.
 • ➣ ఉత్తర దేశాన భేరి కోమటి 'గ్రంధి' అనే మహాత్ముదడు అవతరిస్తాడు. అందరిచే పూజింపబడతాడు.
 • ➣ కలియుగం 4808 సంవత్సరములు గడచిన తరువాత కొట్లాటలు ఎక్కవుతాయి.  నిద్రాహార కాల పరిమితులు పాటించక మానవుల ధర్మహీనులవుతారు. శాంత స్వభావం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపాతారు. పిల్లలు పెద్దలను ఆశ్రయించుటకు బదులు పెద్దలే పిన్నలను ఆశ్రయిస్తారు.
 • ➣ దుష్టమానవుల బలం పెరుగుతుంది. రాజ్యాలేలిన వారు భిక్షాటనకు దిగుతారు, భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారు.
 • ➣ కుటుంబాలలో సామరస్యత తొలగిపోతుంది. వావి వరసలు నశిస్తాయి. బ్రహ్మణనింద, వేదనింద, గురువుల నిందలు ఎక్కవవుతాయి.
 • ➣ జారత్వము, చోరత్వము, అగ్నిరోగం, దుష్టులవలన ప్రజలు పీడింపబడతారు.
 • ➣ అడవి మృగాలు పట్టణాలు, పల్లెలలో తిరుగుతాయి.
 • ➣ మాల మాదిగలు వేదమంత్రాలు, చదువుతారు.
 • ➣ ఏనుగు కడుపున పంది, పంది కడుపున కోతి జన్మిస్తాయి.
 • ➣ రక్త వాంతులు, నోటిలో పుండ్లు వలన, తలలు పగలటం వలన జనం మరణిస్తారు.
 • ➣ కొండల మీద మంటలు పుడతాయి. జంతువులు గుంపులు గుంపులుగా మరణిస్తాయి.
 • ➣ భారతదేశము పరుల పాలనలోకి వెళుతుంది. ఈ పాలనలో అన్ని వర్ణాల వారు చదువుకుంటారు. కులం, ఆచారం నశిస్తాయి. మనుషులందరూ కలసి మెలసి, కుల మత వర్ణభేధాలు లేక ప్రవర్తిస్తారు.
 • ➣ ఎడ్లు లేకుండా బండ్లు నడుస్తాయి.
 • ➣ మంచినీటితో జ్యోతులు వెలుగుతాయి.
 • ➣ ఒకే రేవున పులి, మేక నీరు త్రాగుతాయి.
 • ➣ వెంపలిమొక్కకు నిచ్చెనలు వేసే మనుష్యులు పుడతారు.
 • ➣ విజయనగర వైభవము నశిస్తుంది. కాశీక్షేత్రం మండలం రోజులు పాడుపడిపోతుంది.
 • ➣ ”గోదావరి నది పన్నెండు రోజులు ఎండిపోయి తిరిగి పొంగిపొర్లుతుంది.
 • ➣ వెంకటేశ్వరుని కుడిభుజం అదురుతుంది.
 • ➣ మంగళగిరిలో వైష్ణవుల మధ్య కలహాలు చెలరేగుతాయి.
 • ➣ కర్ణాటక దేశంలో దేవాలయాలను తురకలు ధ్వంసం చేస్తారు.
 • ➣ కుక్కలు గుఱ్ఱాలను చంపుతాయి. ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. 
 • ➣ నేల నెత్తురుతో తడిచిపోతుంది. 
 • ➣ చనిపోయిన వారి ఎముకలు గుట్టలుగా పడి వుంటాయి.
 • ➣ దుష్టశక్తులు విజృంభిస్తాయి. అందువల్ల జననష్టం జరుగుతుంది. 
 • ➣ కాకులు కూస్తాయి. నక్కలు వూళలు వేస్తాయి. ఫలితంగా ప్రజలు మరింతమంది గుంపుగా మణిస్తారు.
 • ➣ కొండవీటి రాతిస్థంభం కూలిపోవటం తథ్యం.
 • ➣ కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనబడదు.
 • ➣ బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. 
 • ➣ శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి గుండ్లు దొర్లిపడి జననష్టం జరుగుతుంది, పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయి.
 • ➣ బిడ్డలు మాట్లాడతారు. 
 • ➣ ఒకరి భార్య మరొకరి భార్యగా మారుతుంది.
 • ➣ కార్తీక బహుళ ద్వాదశి రోజున ఉత్తరాన వింత వింత చుక్కలు కన్పిస్తాయి, అవి అయిదు నెలల పాటు వుంటాయి.
 • ➣ వెంకటేశ్వరుని సొమ్ము దొంగలు అపహరిస్తారు. 
 • ➣ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతమందు జనులు ఎక్కువగా నశిస్తారు. ప్రజలు గ్రామాలు వదలి అడవులకు వెళ్ళిపోతారు. 
 • ➣ అనేక రకాలయిన జబ్బుల వలన పలువురు మరణిస్తారు.
 • ➣ బెంగుళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. 

సంకలనం/రచన: కె.వీరబ్రహ్మచారి 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top