Page Nav

HIDE

Grid

HIDE_BLOG

వీరబ్రహ్మంగారు జీవసమాధి పాందుట, అంతిమ సందేశం - Veera Brahmam Gari Jivasamdhi, Antima Sandesam - KaalaGnanam

వీరబ్రహ్మంగారు జీవసమాధి పాందుట కొన్ని సంవత్సరములు పూర్తయిన తర్వాత, ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు వీరబ్రహ్మంగారు...

వీరబ్రహ్మంగారు జీవసమాధి పాందుట
కొన్ని సంవత్సరములు పూర్తయిన తర్వాత, ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు వీరబ్రహ్మంగారు. తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందయాచార్య స్వామికి పట్టాభిషేకము చేయదలచి, ఈ విషయమై తన భక్తులందరికినీ కాలజ్ఞాన సౌజన్య పత్రికను పంపారు.

శ్రీ వీరబ్రహ్మంగారి అంతిమ సందేశం - కాలజ్ఞానం
మేం ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారం 2.30 గంటలకు ఈ భౌతిక దేహాన్ని వదిలి జీవ సమాధి సిద్ధిని పొందదలుచుకున్నాము. కనుక ఈ పీఠాధిపత్యం నా పెద్ద కుమారుడైన గోవిందాచార్య వారికి అప్పగించుకోదలిచాను. అది తిలకించి నా వద్ద మూడు రోజులుండి, నేను సమాధిగతుడనగుట చూడవలెనని ఆహ్వానము.

నేను వివరించబోవు కాలజ్ఞాన విశేషాలను విని తరించవచ్చును. అలా స్వయముగా వచ్చి కాలజ్ఞానాద్వైత త్త్వబోధ వినలేని వారి కోసం ఈ పత్రికలో కొన్ని కాలజ్ఞాన విశేషాలను వివరించి యున్నాము. ఈ పత్రికను వారు దీపారాధన నైవేద్యములతో పూజించిన వారికి సకల శుభములు కలుగును.
 • ➣ నేను ఈ వీరబ్రహ్మేంద్రస్వామి అను పేరు ధరించి ఇప్పటికి 175 సంవత్సరములు గడచాయి. ఇప్పుడు నేను సమాధి, నిష్టలో వుండాలని నిర్ణయించుకున్నాను. నేను మళ్ళీ భూమి మీదకు వీరభోగవసంతరాయులుగా రాబోతున్నాను.
 • ➣ నేను వచ్చే సమయానికి ఈ కలి లోకంలో, ఎర్ర బోయీలు - శ్వేత ద్వీప వాసులు వస్తారు. శాలివాహన శకమునందే, వీరు మహ్మదీయులు స్నేహం పొంది భరతఖండం పాలిస్తారు.
 • ➣ హరిహరాదుల గుళ్ళల్లో పూజలు హరించి పోతాయి.
 • ➣ నమధాంధులు సాధువులను, జ్ఞానులను దూషణ చేస్తారు.
 • ➣ భూమిపై పైరులు పండినట్లుగానే వుంటాయి. వర్షములు కురిసినట్లుగానే వుంటాయి కానీ పంటలుపండవు.
 • ➣ బహు ధాన్య నామ సంవత్సరంలో, కనకదుర్గ మొదలయిన శక్తులు భూమి మీదకు వస్తాయి.
 • ➣ "శ్రీశైలంలో తపస్సు చేస్తాను. నంద నామ సంవత్సరంలో నేను తపస్సు ప్రారంభించబోయే ముందు, భూమి మీద కొన్ని నక్షత్రాలు రాలిపడతాయి. భూమి గడగడ వణుకుతుంది. అనేక మంది ప్రజలు మరణిస్తారు.
 • ➣ నేను సమాధి విడిచి విష్ణు అంశతో కలికి అవతారం ఎత్తుతాను. ప్రమాదీచనామ సంవత్సరానికి ఎనిమిదేళ్ళవాడినై ఎర్ర బోయీలతో కలసి, వారికి అంతర్య బుద్దులు కల్పిస్తాను. అక్కడి నుండి శాలివాహనశకం 5407 సంవత్సరము నాటికి, సరిగా పింగళనామ సంవత్సరంలో భయంకరమైన కొట్లాటలు ప్రారంభమవుతాయి.
 • ➣ కాళయుక్త నామ సంవత్సరం వరకూ, ఉత్తరదేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి.
 • ➣ ఆనందనామ సంవత్సరంలో మార్గశిర బహుళ అష్టమీ గురువారం మల్లికార్జునుడు భ్రమరాంబా సమేతంగా వింధ్య పర్వతానికి చేరతాడు.
 • ➣ రక్తాక్షినామ సంవత్సరంలో విజయవాడకు వచ్చి, అక్కడ పోతులూరి వారి కన్యను పెళ్ళాడి, పట్టాభిషిక్తుడనవుతాను.
 • ➣ దుర్ముఖినామ సంవత్సరం, కార్తీక శుద్ధ చతుర్ధశి మొదలుకొని, దుష్ట నిగ్రహం ఆరంభిస్తాను. నేను వచ్చేసరికి కలియుగ ప్రమాణం 4094 అవుతుంది.
 • ➣ నా భక్తులయిన వారును సదా నమ్మి “ఓం హ్రీమ్  క్లీం శ్రీం శివాయ పరబ్రహ్మణే నమ:” అను బీజ సంపుటయైన మహామంత్రమును ఎప్పుడూ పలుకుతుంటే, వారికి నేను మోక్షం ప్రసాదిస్తాను.
సంకలనం: కే. వీర బ్రహ్మాచారి