లాక్‌డౌన్‌ దేశాన్ని రక్షించింది: ఎస్‌బీఐ ఛైర్మన్


రోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ, అది దేశాన్ని పెద్ద బాధ నుంచి రక్షించిందని స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ రజనీశ్‌ కుమార్‌ అన్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ తొలగించాలని తెలిపారు. 

”ప్రస్తుతం మనకి ఎంతో ఓర్పు అవసరం. వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టకుండా, పరిస్థితి పూర్తిగా అదుపులో రాకుండా భద్రతను తొలగించలేం. లాక్‌డౌన్‌ భారత దేశాన్ని అతిపెద్ద బాధ నుంచి కాపాడిందనే నా అభిప్రాయం. అలానే కరోనా కేసుల సంఖ్యను కూడా లాక్‌డౌన్‌ తగ్గించింది. లాక్‌డౌన్‌ కొనసాగినంత కాలం ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి. కానీ ఆర్ధిక వ్యవస్థకు ఉన్న డిమాండ్ తగ్గకుండా చూసుకుంటే, కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలూ తలెత్తవు” అని అన్నారు.

”లాక్‌డౌన్‌ పూర్తిగా తొలగించేందుకు మనం ఇంకా కొద్ది రోజుల దూరంలో ఉన్నామని అనుకుంటున్నా. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల పరిస్థితి మెరుగుకాలేదు. అలానే దేశవ్యాప్తంగా గ్రీన్‌ జోన్ల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలి” అని రజనీశ్‌ అభిప్రాయపడ్డారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌లో క్రమశిక్షణతో వ్యవహరిస్తే, త్వరలోనే వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుందని, కరోనా కేసుల సంఖ్య పెరగకుండా నిరోధించవచ్చని తెలిపారు. రికవరీ రేటు 25 శాతం కన్నా ఎక్కువ ఉండటమే లాక్‌డౌన్‌ ఫలితాలు మనం పొందుతున్నామనే దానికి నిదర్శనం అని అన్నారు.

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top