నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Saturday, May 2, 2020

దుఃఖాన్ని దూరం చేయండి - Dukkham

దుఃఖాన్ని దూరం చేయండి - Dokkham
దుఃఖాన్ని దూరం చేయడం ఎలా...?
దుఖం అనే పదము ఎవరు వినటానికి ఇష్టపడరు. దాని నుండి దూరం అవ్వడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు మానవులు. అసలు మనిషికి దుఃఖం ఎందుకు ఎలా వస్తుంది ? నాది నా వస్తువు నా వాళ్ళు నా ఇల్లు నా ధనము నా బంధువులు నా స్నేహితులు నా బిడ్డలు అనే పదము నమ్మినప్పుడు నమ్ముకున్న ఆ మనుషులు వస్తువులు దూరమైనప్పుడు దుఖం దగ్గరికి రావడానికి ప్రయ త్నం చేస్తూ ఉంటుంది.

నాది అన్న పదం దూరంగా ఉండేవారికి అసలు దుఃఖమే ఉండదు. అయితే ఇక్కడ అన్ని వదిలి ఎవరు అడవులకు వెళ్ళమని చెప్పరు. అలా వదిలి వెళ్లిన ను కొండలలో గుహలో ఉన్న మనస్సు ఇంట్లోనూ ఊర్లో నువ్వు మనసు విచా రిస్తూ ఉంటుంది. అప్పుడు దుఃఖంతో సహజీవనం చెయ్యవలసి వస్తుంది. కావున దుఖానికి దూరమవ్వడానికి భగవద్గీత ద్వారా భగవంతుడు అందించిన ఈ సూత్రాలు అందరికీ ఇదే మంచి ఉపాయం.

ఇంట్లో ఉండు ఊర్లో ఉండు సంసారం లో ఉండు వ్యాపారం చేసుకో ఉద్యోగం చేసుకో వ్యవసాయం చేసుకో దేనిని ఉపేక్షించకు. నీ స్వధర్మాలన్ని పాలించు. ఆధర్మాలన్నీ నిర్మూలించు తామరాకు నీటిలో పుట్టి నీటిలో పెరిగినను నీటిలో చిక్కుకోకుండా ఎలా వ్యవహరిస్తుందో అలా నీ మన సు కూడా తయారు చేసుకో. అప్పుడు దుఃఖం నీ నుండి పారిపోక తప్పదు. అలాకాక అందులోనే చిక్కుకున్నావో దుఖం నీకు దగ్గరై ఇంట్లోనే ఉండి నీతో సంసారం చేయగలదు. నీతో సహజీవనం చేయగలదు. అని చెప్తుంది భగవద్గీత.

దుఖం తో సహజీవనం చెయ్యాలని ఎవరూ ఒప్పు కోరు. దాని బారి నుండి తప్పించుకొనుటకు అందరూ విశ్వ ప్రయత్నం చేస్తారు. కోరికలు దాసోహమని వాటి వెంట పరిగెత్తినచో దుఃఖం వెంటబడును. అన్ని దుఃఖాలకు మూలం కోరికలు కోరికలు లేని వాడు కొండంత సుఖం పొందగలడు. కనుక మమ కారాలు వదిలి కోరికలు దులిపి వెయ్యడమే అన్నీ దుఖాల బారినుండి తప్పించుకోవడం చాలా సులభం అట్టి మార్గంలో పయనించాలని మనం ప్రయత్నం చేద్దాం.

సర్వేజనా సుఖినోభవన్తు...
« PREV
NEXT »