భారతీయ పల్లెల్లో వ్యవసాయ విధానం - Pallelo Vyvasayam


భారతీయ పల్లెల్లో వ్యవసాయ విధానం - Pallelo Vyvasayam
పల్లెల్లో వ్యవసాయ విధానాలు

భారత దేశ జనాభాలో ఎనబై శాతం వ్యవసాయ దారులే. వీరిలో వ్యవసాయదారులు, వ్యవసాయ సంబంధిత పనులలో పనిచేసే వారు ఉన్నారు.

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార మరియు ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము.
 
వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం మరియు సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ఈ వ్యవసాయం చేయుటకు రైతులు వివిధ విధానాలను ప్రాంతాలవారీగా అనుసరిస్తారు. 

అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి 

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top