కోవిడ్-19 పరీక్ష అందరికీ ఎందుకు చేయడం లేదు? - Coronavirus, Covid-19 Vyadhi Nirdharana Parikshalu

కోవిడ్ -19 కేసులను గుర్తించే పరీక్ష కోసం మార్గదర్శకాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్రీ సెర్చ్ (ఐసిఎంఆర్) సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కింది వ్యక్తులను పరీక్షించాలి.
  • - తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రోగులందరూ (శ్వాస ఆడకపోవడం జ్వరంతో పాటు దగ్గు లక్షణాలను కలిగి ఉన్నవారిని) .
  • - వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తితో కలిసిన ఇతరులకు ఐదవ రోజు నుండి 14 వ రోజు మధ్య పరీక్ష అవసరం. 
  • - రోగలక్షణాలు కలిగిన ఆరోగ్య సిబ్బందికి .
  • - పరీక్షలలో (ప్రాథమికమైన వాటిలో) వైరస్ సోకినట్లు తెలినవారికి.
వైరస్ లక్షణాలు లేకపోయినా (COVID-19 లక్షణాలు), గత 14 రోజులలో అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారు రాగల రెండు వారాలపాటు ఇంట్లోనే ఉండాలి. ఆ సమయంలో వారిలో రోగ లక్షణాలు కనిపిస్తే తప్పకుండా పరీక్షించాలి.

మన దేశంలో వైరస్ విస్తృత వ్యాప్తి లేనందున, ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో మాత్రమే వ్యాధి లక్షణాలు కనుగొన్నారు. COVID-19 ప్రభావిత దేశాలలో ప్రయాణించిన వారితో పాటు వారితో కలసి తిరిగిన వారిలో COVID-19 లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేశారు. అలాగే తీవ్రమైన శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్న రోగులపై దృష్టి పెట్టడం జరిగింది.

పరీక్షించే ప్రక్రియ:
రోగి ముక్కు లేదా గొంతు(వైరస్ పేరుకుపోయిన ప్రదేశాలు)శాంపుల్ తీసుకొని, శీతలీకరించి పరీక్ష కోసం ప్రభుత్వ కేంద్రాలలో ఒకదానికి పంపుతారు. రీ చెకింగ్ కోసం ఒక నమూనాను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతారు. ఇవే ఇప్పటివరకు నిర్వహించిన ఖచ్చితమైన పరీక్షలు, ఈ పరీక్షా ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని గంటలు పడుతుంది.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 79 ప్రయోగశాలలో పరీక్షలన్నీ ఉచితంగా జరుగుతాయి. ప్రతి పరీక్షకు ప్రభుత్వానికి 4500 ఖర్చు అవుతుంది. లక్షణాలతో ఉన్న ఎవరికైనా లేదా ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించడం (ఇది సాధారణ ప్లూ కావచ్చు) వల్ల వనరులు, సమయం వృధా కావడంమే కాక నిజమైన COVID-19 కేసులను గుర్తించడంలో, చికిత్స చేయడంలో చిక్కులను కలిగిస్తుంది. వైరస్ సమూహాల ద్వారా విస్తరిస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి వనరుల కొరత ఉంటుంది.

సకారాత్మకంగా ఉండాలి:
60కి పైగా ప్రదేశాలలో జరిపిన పరీక్షలలో వైరస్ వ్యాప్తి కనిపించనందున ఇప్పటివరకు వైరస్స మూహాలలో వ్యాప్తి చెందలేదని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ విమానాల నిషేధంతో పాటు, భారతదేశం అంతటా రైళ్లను నిలిపివేయడం, వివిధ రాష్ట్రాల సరిహద్దులను మూసివేయడం, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వాణిజ్య సంస్థలచే కఠినమైన స్క్రీనింగ్, దేశవ్యాప్తంగా జనతా కర్పూ్య అమలు చేయడంతో పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. కొత్త మార్గదర్శకాలవల్ల వ్యాధి సోకే ప్రమాదం అధికంగా ఉన్నవారిని పరీక్షించడానికి వీలుకలగడంతోపాటు COVID-19 సోకిన వ్యక్తుల ఆచూకీ తెలుసుకునేందుకు, వారిని వైద్యుల పర్యవేక్షణలో విడిగా ఉంచడానికి, ప్రభుత్వం త్వరితంగా వ్యవహరించగలుగుతుంది.

ఎస్ కౌశిక్ -
రచయత: డిప్యూటీ డైరెక్టర్, తమిళగం రీసెర్చ్ ఫౌండేషన్, ఆర్గనైజర్ సౌజన్యంతో
మూలము: విశ్వ సంవాద కేంద్రము

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top