నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Wednesday, March 25, 2020

ఆధ్యాత్మికంగా శారీరక, మానసిక ఉన్నతి కొరకు కొన్ని ఆరోగ్య సూత్రములు - Saariraka, Maanasika Arogya Suchanaluఆధ్యాత్మికంగా శారీరక, మానసిక ఉన్నతి కొరకు కొన్ని ఆరోగ్య సూత్రములు - Saariraka, Maanasika Arogya Suchanalu
ఆరోగ్య సూత్రములు 
ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యము అతను ఆరోగ్యము పట్ల తీసుకొను శ్రద్ధపై ఆదారపడి వుంటుంది. ప్రాణాయామము, ధ్యానములకు పరిపూర్ణముగా ఇచ్చుట శారీరక, మానసిక ఉన్నతి కొరకు కొన్ని ఆరోగ్య సూచనలు తెలియజేయబడినది.
 • 1. అన్ని ఋతువులు నందు స్వచ్చమైన నీరును వీలైనంత ఎక్కువగా ఏమరుపాటు లేకుండా త్రాగండి. నీరు నిజమైన సంజీవని. నీరును బాగుగా తీసుకొనట్లైతే ఆ నీరు రక్తమును పలచన చేసి రక్తనాళములలోనికి రక్తమును సరళముగా ప్రవహింప చేయును. మరియు శరీరములో జరుగు అనేక ప్రక్రియల వల్ల ఉత్పన్నమైన వేడిని బయటకు పంపివేసి శరీరమును చల్లబరుస్తుంది. ఏ విధముగానంటే కారు రేడియేటర్లోని నీరు ఏ విధంగా కారు యంత్రమును చల్లబరుచునో అదే విధముగా మనము త్రాగే నీరు మన శరీరమును చల్లగా వుంచుతుంది.
 • 2. మనము త్రాగే నీరు శరీరములో మిగిలిన మలిన పదార్థములను వెలుపలికి పంపిచేసి శరీరమును ఆరోగ్యముగా, శుభ్రముగా ఉంచుతుంది. శారీరక అనారోగ్యమునకు, అన్ని వ్యాధులకు మూలకారణము ఈ మలిన పదార్థములే. నీరు వీతిని శుభ్ర పరస్తుంది, కావున నీరు త్రాగడం ఒక అలవాటుగా చెసుకోండి. నిద్రపోవుటకు అరగంట ముంది ఒక చిన్న చెంబు నిండా నీటిని త్రాగండి. మనము పడుకొన్న తరువాత తిన్న ఆహారము జీర్ణమై దాని సారము రక్తములో చేరి రక్తమును మందము చేయను. ఈ రక్తము మందముగా, జిగురుగా తయారై నందువలన గుండె మామూలుకన్నా ఎక్కువ ఒత్తిడికి గురై పని చేయవలసివస్తుంది. ఈ కారణముచేతనే మధ్యవయస్సులోని వ్యక్తులు, ముసలి తనములోని వ్యక్తులు రాత్రిపూట నిద్రలో గుండెపోటుకు గురి కావడం సహజముగా జరుగుతున్నది. కావున రాత్రి నిద్రకు ముందు నీరు త్రాగడం వలన రక్తము పలుచబడి గుండె పై వత్తిడి తగ్గుతుంది మరియు శరీరమును చల్లబరచి మంచి నిద్ర రావాడానికి దోహదమవుతుంది. కావున అన్ని కాలముల యందు నీరు త్రాగడం మంచి అలవాటు.
 • 3. అల్పాహరమునకు లేక భోజనమునకు ముందు ఒక గ్లాసు నీటిని త్రాగినత్లైతే ఆ నీరు కడుపులో పేరుకొని ఉన్న వాయువును (గ్యాస్) బయటకు పంపిచేయును. మరియు తక్కువ తినునట్లు చెయును. స్థూలకాయమును తగ్గించుకొనుటకు భోజనమునకు ముందు నీరు త్రాగడం మంచి ఉపాయము.

 • 4. అతి ప్రాచీన వైద్య పద్దతి అయిన ఆయుర్వేదము ప్రకారము మట్టి మూకుడు, మట్టిపాత్రలలో వుంచిన నీరును త్రాగినత్లైతే ఆ నీరు మంచి ఆరోగ్యమును ఇచ్చును. ఎందువలననగా ముట్టి పాత్రలకు నీరులో ఉన్న అనవసరపు అయస్కాంత త్రరంగములుగాని విద్యత్ తరంగములుగాని ఉన్నచో అటువంటి వాటిని తనలోనికి ఇముడ్చుకొని స్వచ్చమైన నీటిని మనకు అందించు తత్త్వమును కలిగియున్నవి.
 • 5. మీ అభిరుచికి తగినట్లు భుజించండి. కాని తక్కువ కేలరీలు, ఎక్కువ పేచు పదార్థములు కలిగిన అహారమును భుజించండి.
 • 6. మంచి విటమున్లు కలిగిన కాయగూరలను భుజించండి. ముఖ్యముగా విటమిన్ -సి మరియు వితమిన్ -ఇ కలిగినవి. ఎందుకంటే విటమిన్ -సి సహజముగా సోకే వ్యాధులు(ఉదా - జలుబు) మైదలైన వాటినుంచి ఎక్కువ రోగనిరోధక శక్తినిచ్చి కాపాడుతుంది మరియు విటమిన్ -ఇ శరీరమును తేజోవంతం చేస్తుంది. మరియు కాయగూరలు శరీరమునకు తగినంత ఐరన్ను ఇస్తాయి. ఈ ఐరన్ రక్తహీనతను తగ్గించుటయే గాక రక్తములోని హిమోగ్లోబిన్ శాతమును వృద్ధి చేస్తుంది. రక్తములో ఈ హిమోగ్లోబిన్ శాతము తగ్గినంత ఉన్నప్పుడు మాత్రమే రక్తము ఊపిరితిత్తులలో వున్న ప్రాణవాయువు (ఆక్సిజన్)ను గ్రహించి మొదడుకు మరియు శరీర అవయవములకు చేరవేయును. మీరు ధీర్ఘప్రాణాయమము చేయునపుడు రక్తములో తగినంత హిమోగ్లోబిన్ శాతము లేనట్లెతే మెదడుకు మరియు శరీర అవయవములకు తగినంత ప్రాణవాయువు అందదు. అప్పుడు ధీర్ఘప్రాణాయామము తగినంత ఫలితం ఇప్వదు.
 • 7. మానవ శరీరము పంచభూతములైన పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైన వానితో నిర్మితమై యున్నది. అందులో భూమి, ఆకాశము స్థిరముగా వుంటే మిగిలిన అగ్ని, జలము, వాయువు చరిస్తుంటాయి. శరీరములో చరించే మధ్య అసమతౌల్యమేర్పడినట్లయితే అనేక రోగములకు కారణభూతమౌచున్నదని ఆయుర్వేదము తెలియజేయు చున్నది. త్రిఫల చూర్ణము లేదా మాత్రలు ( ఆయుర్వేద మునకు సంబంధిచిన ఓషదుల మిశ్రమము) ప్రతి దినము ప్రొద్దున పరగడుపున ఒక టే స్పూన్ పొడినిగాని లేదా మాత్రలు గాని నీటితో తీసుకొన్నట్లైతే శరీరములోని అగ్ని, జల, వాయువులను నియంత్రించి అనేక శారీరిక రుగ్మతలనుంచి కాపాడుతుంది.
 • 8. త్రిఫలా చూర్ణమును లేదా మాత్రలు ప్రతిదినము తీసుకొన్నట్లైతే అది శరీరములోని ఎముకల కదలికలకు సహకరించుటయే గాక శరీరములో అధికముగా వున్న వేడిని తొలగించి అగ్ని(పిత్త), వాయు(వాత), కఫ(జల)లను నియంత్రించి అనేక రుగ్మతలను దూరం చేస్తుంది.
 • మీరు గనుక సంగీత ప్రీయులైతే మృధు మధురమైన సంగీతమును వినండి. అది మీకు శారీరంగా, మానసికంగా విశ్రాంతిని కలుగజేస్తుంది. రణగొణ శబ్దములతో కూడిన సంగీతము నాడులను ఉద్రేకపరచి శరీరమునకు ఇబ్బంది కలుగజేసి కాలాంతరమందు శరీర అరోగ్యమునకు హానికలిగించును.
 • 9. ఎల్లప్పుడు అర్థవంతంమైన పుస్తకములను చుదువుచున్నట్లైతే అవి మంచి ఙ్నానమును ఇచ్చుటయే కాక ఉన్నతమైన వ్యక్తిత్వమును కలుగుచేయును. కొంచెము దానగుణము వృద్ధిచేసుకొన్నట్లైతే అది మనస్సుకు సంతృప్తి కలుగజేస్తుంది. ఈ దానగుణము వలన జీవితమునకు మంచి సార్థకతను ఏర్చరుస్తుంది.
 • 10. మంచి మరియు సృజనాత్మక ఆలోచనలు (పాజిటివ్ థింకింగ్) మనస్సును ఉన్నతం చేస్తుంది. ఆరోగ్యకరమైన మనస్సు ఆరోగ్యకరమైన శరీరమునకు పునాది వంటింది. ఎందుకంటే మనస్సే శరీరము యొక్క యజమాని కావున. ఉన్నత వ్యక్తిత్వము ఆరోగ్యకరమైన జీవనమునకు చాలా ముఖ్యము. 

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com