గతమే సమాధానం, హిందువులకు కనువిప్పు కావలి - మేలుకో హిందువా - Gathme Samaadhanam, Melukoo Hinduvaa

 గతమే సమాధానం, హిందువులకు కనువిప్పు కావలి - మేలుకో హిందువా - Gathme Samaadhanam, Melukoo Hinduvaa
గతమే సమాధానం
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్లలో మతపరంగా వేధింపులకు గురవుతున్న హిందువులు, సిక్కులు జైనులు, పార్సీలు ఇతరులను భారతదేశానికి నిర్ధనులుగా, శరణార్థులుగా వస్తే వారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం CAA చట్టం చేసింది. ఆ మూడు దేశాల నుంచి ముస్లింలు వచ్చినా కూడా పౌరసత్వాన్ని ఇవ్వాలని, అలా ఇవ్వకపోవడం అమానుషమని, అది మత వివక్ష అని, ఇది రాజ్యాంగానికీ, లౌకికతత్వానికీ విరుద్ధమని కొన్ని పార్టీలు, స్వయం ప్రకటిత మేధావులు గగ్గోలు పెడుతున్నారు.

దేశంలో ముస్లిం పార్టీలు పుట్టినప్పటి నుంచే హిందూ ధర్మానికి, హిందువులకు, శత్రువులుగా
వ్యవహరించడం చరిత్ర. దేశ విభజనకు ఇదే నేపథ్యం.

ముస్లింలకు మద్దతు ఇస్తూ వస్తున్న కమ్యూనిస్టు పార్టీలు, వారి తోక మేధావులు, ఇంగ్లీషు ప్రభువు మెకాలే ఆశించినట్టు రక్తంలో, రంగులో భారతీయులుగా ఉండి, తలపులలో, విశ్వాసాలలో భారతీయతకు వ్యతిరేకమైన భావజాలంతో ఉన్న వ్యక్తులు, భారత వ్యతిరేక సమూహాలు CAA-సిఏఏను  అడ్డం పెట్టుకుని BJP - భాజపా మీద దాడిని తీవ్రం చేశాయి.  కరుడుగట్టిన హిందుత్వ పార్టీగా, ముస్లింలపై వివక్షను చూపిస్తున్న పార్టీగా భాజపాను వర్ణిస్తూ విధ్వంసక ఉద్యమాలు, కొన్ని విశ్వవిద్యాలయాలలో హింసాయుత ఉద్యమాలు ప్రారంభించారు.

ముస్లింలకు ఉద్దేశించిన అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (AMU), ఢిల్లీలోని జామీయా మిలియా యూనివర్సిటీ, హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ యూనివర్సిటీలలో వామపక్షీయులు తిష్ట వేసుకుని BJP - భాజపా వ్యతిరేక ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) హైదరాబాద్, కలకత్తాలో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు తరగతులు పరీక్షలు వదిలి, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టారు.

బంగ్లాదేశ్ నుంచీ శరణార్థులుగా వచ్చిన బెంగాలీ మాట్లాడే హిందువుల వల్ల తమ అస్సామీ భాషకు ముప్పు వస్తుందనీ, విలక్షణమైన అస్సామీ యువతకు భంగం కలుగుతుందని ఆ రాష్ట్ర వాసులు  కొంతమంది హిందు - అస్సామీలో కూడా CAA పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకత, ఆందోళనల ఉద్దేశం, ఎవరు ప్రేరేపింపించినవో తెలుసు కోవడం అవసరం.

మేము భారతీయులం కాము. ఇస్లాం ప్రకారం మేము వేరే జాతి వారం కాబట్టి, ఈ దేశాన్న్ని విభజించి, పాకిస్తాన్ అనే రాజ్యాన్ని స్థాపించుకుంటాం అని భారత ముస్లింల విభజనకై విజృంభించారు. ఇటు ఘాతుకాలకు పాల్పడుతూనే ఓట్ల ద్వారా ముస్లిం లీగ్ ను గెలిపించుకుని, కాంగ్రెస్, గాంధీ మెడలు వంచి, తూర్పు బెంగాల్తో కూడిన పశ్చిమ పంజాబ్, సింధు సరిహద్దు రాష్ట్రాలతో పాకిస్తాన్ ఏర్పరుచుకున్నారు.

అయితే వారే సృష్టించిన పాకిస్తాన్కు వెళ్లకుండా భారతదేశంలోనే ఉంటూ కొత్త ఆలోచనలు చేశారు. విభజన అనంతరం నాటి భారత జనాభాలో 9.8% ఉన్న ముస్లింలు అధిక సంతానోత్పత్తితో 16% కి పెరిగారు.

   చిత్రంగా విభజనకు పూర్వం పాకిస్తాన్లో 17% ఉన్న హిందూ - సిక్కు సముదాయం బలవంతంగా హింసాయుతంగా గెంటివేతకు గురై 1.5%కి తగ్గిపోయారు. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా (1971) అవతరించింది. 1947 నాటికి అక్కడ 30%గా ఉన్న హిందూ -బౌద్దులు ప్రస్తుతం 7%కి తగ్గిపోయారు. ఈ సంఖ్య తగ్గుతూనే ఉంది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశాలు. దీనితో హిందువులు, సిక్కులు, బౌద్ధులు వివక్షతో, అవమానాలతో, అభద్రతతో ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితిలో మాతృదేశంగా భావించే భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు.

వారందరూ హిందూ జీవనవిధానంలోని వారే. వారికి ఆశ్రయం ఇచ్చి, సహోదరులుగా భావించి, పౌరసత్వం ఇవ్వడం మన ధర్మం, కర్తవ్వం.

వీరికే ఎందుకు ఇవ్వాలి ఆశ్రయం?

మత వివక్షతో, పీడనతో వారు భారత దేశానికి వచ్చారు. ముస్లిం దేశాలుగా ఏర్పడ్డ పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ఏ ముస్లిం వర్గాలనైనా పీడనకు గురైతే, ఇంకా 57 దేశాలలో ఆశ్రయం  పొందవచ్చు కదా! హిందూ దేశానికి ఎందుకు రావాలి? దీనికి సమాధానం ఒక్కటే - భారతదేశానికి రావడం వెనుక వారికి దురుద్దేశం ఉంది.

కశ్మీర్ ముస్లిం మెజారిటీ కలిగి ఉన్నది. తరతరాలుగా, సహస్రాబ్దాల నుండి అక్కడే పుట్టి పెరిగిన 4 లక్షల మంది హిందువులను, సిక్కులను అక్కడ తీవ్రవాద ముస్లింలు మారణకాండ సృష్టించి వెళ్లగొట్టేశారు. కశ్మీర్ నుండి ప్రాణాలు అరచేత పట్టుకు వచ్చిన హిందువులు ఇక్కడే కాందీశీకులుగా బ్రతుకుతూ ఉంటే ఈ దేశంలో నివశిస్తున్న ముస్లింలు ఎవరైనా కశ్మీర్లోని ముస్లింలను, హిందువులను బలవంతంగా వెళ్లగొట్టడాన్ని ఏనాడైనా తప్పుపట్టారా? 

అంటే వారి ఉద్దేశంలో ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతంలో, రాజ్యాలలో ముస్లిమేతరులు వెళ్లగొట్టవచ్చు. కాని, ముస్లింలు ఏ దేశం నుండైనా, హిందూదేశంలోకి చొరబడి తమ మతస్తుల సహాయం ఉద్యమకారులతో భారతీయ పౌరసత్వం పొంది, ముస్లింలు సంఖ్యా బలాన్నిపెంచవచ్చుననా?

లక్షల మంది హిందువులు కశ్మీర్ నుంచి తరిమివేస్తే, ఇది తప్పు అని చెప్పని ఇక్కడి ముస్లింలు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అఫ్ఘానిస్తాన్ నుంచీ శరణార్థుల ముసుగులో గాని, చొరబాటుదారుగా గాని వచ్చే వారికి కాఫిర్లుగా పరిగణించే హిందూవుల దేశంలో పౌరసత్వం ఇవ్వాలా?

     హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతం నుంచీ పదే పదే ఎన్నికలలో గెలుస్తున్న రజాకార్ల వారసుడు, భారత రాజ్యాంగం ప్రకారం విశేష ప్రయోజనాలు పొందుతున్న ఈ పెద్దమనిషి సవరించిన పౌరసత్వ చట్టం హిందూ ఆధికత్యతకు దోహదం చేస్తుందనీ, సెక్యులరిజానికి వ్యతిరేకమని వాదిస్తున్నారు. ప్రజాబలం లేని కమ్యూనిస్టులు, బీజేపీ ప్రభుత్వాన్ని విమరిస్త్తూ, హిందుత్వాన్ని నిరశిస్తూ ప్రకటనలు చేస్తున్నారు.

ఏ దేశంలో అయినా ముస్లిం పార్టీలు, వారి నాయకులు సెక్యులరిజం గురించి వాగడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. విజాతీయ సిద్ధాంతాలే ఊపిరిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు వీరికి వత్తాసు పలుకుతున్నాయి.

మేము ముస్లింల కాబట్టి, మా సమాజపు నియమాలు నీతులు, వ్యవస్థలు, న్యాయా న్యాయాలు, హక్కులు, విధులు వేరని చెప్పుకున్నారు. 57 ముస్లిం దేశాలు ఐక్యరాజ్య సమితి Universal declaration of human rights ని కాదని Islamic Declaration of Human Rights అని ప్రకటించి ముస్లిమేతర మతాలకు, ధర్మాలకు  భిన్నంగా వేరే స్మృతిని ప్రకటించుకున్న వారికి భారతదేశానికి హిందువులకు నీతిని బోధించే అర్హత ఉందా?  ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఒక కుటుంబమని Umma చెప్పుకునే వారు హిందూదేశంలోకి రావడానికి స్థిరపడడానికి, పౌరసత్వాన్ని పొందడానికి హక్కుకావాలని ఎందుకు కోరుతున్నారు?

తమ 57 సోదర దేశాలలోకి వెళ్లకుండా, భారతదేశానికో (క్రైస్తవ యూరోప్ కో) వెళ్లడానికి హక్కు కల్పించాలని అడగడం దురహంకారం.కుట్రపూరితం కాదా? ఈ సువిశాల భారత దేశం మీద దండయాత్రల చేసి, దోపిడీ చేసి దేవాలయాలను కూల్చి, పరాజితులైన హిందువులను మతం మార్పించి, ఈ దేశంలోని బహు ప్రాంతాలను శతాబ్దాలు పాలించిన ముస్లింల చరిత్ర అమానుషం అని సుప్రసిద్ధ చరిత్ర కారులు Will Durant, Arnold toynbee రాశారు.

మనం అనుభవించిన బాధలెన్నో చరిత్రపుటలు చెబుతున్నాయి. అయినా సత్యమేవ జయతే, ధర్మం సనాతనంగా ఉండి విజయవంతం అవుతుందనే విశ్వాసంతో మనం ఉందాం.

   చివరగా అస్సామీ భాషీయులు తమ రాష్ట్రంలో తమ సంస్కృతికి, భాషకు ఈ చట్టం ద్వారా ప్రాథమికత పోతుందని భయం సబబే. ఆ భయం నిర్మూలనకు ఒక పరిష్కారం బెంగాలీ భాష మాట్లాడే హిందూ శరణార్థులకు అత్యధికంగా హిందువులున్న విశాలమైన మధ్యప్రదేశంలో అభయావాసాలను కేంద్రంప్రభుత్వం కల్పించడం ద్వారా భయాన్ని, నష్టాన్ని నిర్మూలించవచ్చు.

రచన: డా.. త్రిపురనేని హనుమాన్ చౌదరి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు.
వ్యాస మూలము, హక్కుదారులు: జాగృతి - జాతీయ వార పత్రిక

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top