పల్లె వాసుల నివాస గృహాలు - Pallevaasula Nivaasa Gruhaalu

పల్లె వాసుల నివాస గృహాలు - Pallevaasula Nivaasa Gruhaalu
పల్లెలో నివాస గృహాలు
గుడెస,పూరిల్లు, గుడిసిల్లు/ చుట్టిల్లు, పెంకుటిల్లు, రేకుల ఇల్లు, మట్టి మిద్దె, బండ్ల మిద్దె, మిద్దె., మేడ, భవంతి, సపారు ఇలా అనేక రకాలు వుంటాయి. గోడలు గట్టి రాళ్ళతో కట్టుకని కప్పువేయటానికి ‘కూసాలు’ (pillers), దూలాల (beams)కు ‘యాప’ కలప వాడేవారు. అందువల్ల అవి ఎంతో బలంగా ఉండేవి. దూలాలపైన దంతెలు వేసి చాపలు గాని, బండలుగాని పరిచి ఆపైన చౌడుతో కాంక్రీట్‌ లాగా కప్పేవారు.ఇవి మట్ట్జి మిద్దెలు. ఇళ్ళ నిర్మాణం విశాలంగా ఉండేది. స్నానం చేసిన నీరు ‘మురుగు’ కాకుండా ‘జాలాది’ (పెద్ద గుంట) తీసి ఆ నీరు అందులో ఇంకేలా చేసుకొనే వారు. పశువులకు ప్రత్యేకంగా ‘ఆవాసాలను ఏర్పాటు చేసుకునే వారు. ఆర్థిక స్తోమత కల వారు మట్టిమిద్దెలు కట్టి పశువులకు తగిన వసతి (గాడి) ఏర్పాటు చేసుకొనే వారు. ఎరువు వేయటానికి ‘దిబ్బ’లకు వసతి చేసేవారు. అందుకే ‘గ్రామం గేయం లాంటిది – నగరం నాటకం లాంటిది’ అంటాడు ‘లాంగ్‌ఫెలో’.

పూరిళ్ళు :
ఇవి మట్టి గోడలపై కర్ర దూలాలుంచి వాటిపై ఏటవాలుగా వాసాలు పెట్టి వాటిని వెదురు బద్దలతో కట్టి దాని పై బోద, రెల్లుగడ్డి, ఇలాంటి వాటి తో కప్పు వేస్తారు. ఈ కప్పు ఏటవాలుగా వుండి పైన పడిన వర్షం నీరు క్రిందికి జారి పోవడానికి అనుకూలంగా వుంటుంది. పైన రెండు వైపుల కప్పు కలిసే చోటును "వెన్నుగోడు" అని కప్పు చివరి భాగం క్రింద "చూరు'' అని అంటారు. ఆ ఇంటిలో రెండు దూలాల మధ్యనున్న భాగాన్ని "అంకణం" అంటారు.

పూరిల్లు:
తాటాకుల ఇల్లు (యిదిపూరిల్లు లాంటిదే)
తాటాకుల ఇల్లు కూడా పూరిల్లు లాంటిదే. కాని ఇది కొంచెం వైవిధ్యం వుంటుంది: ఎలాగంటే దీని పై కప్పు తాటాకుల తో వుండి ఆ పైకప్పు ఇంటికి వెనక ముందు భూమికి మూడడుగుల ఎత్తు వరకు వుంటుంది. ముందు భాగం వెనక భాగం ఎత్తు తక్కువగా వున్నందున మనుషులు రాక పోకలు సాగించ డానికి వీలుండదు.
తాటాకుల ఇల్లు, అలాంటిదె చిన్న చుట్టిల్లు

గుడిసె :
ఇది ఎత్తు తక్కువగా వుండి తాటాకులు, లేదా కొబ్బరి మట్టలు, రెల్లు గడ్డి వంటి వాటి పైకప్పుతో తాత్కాలికంగా పొలాల వద్ద కాపలా కొరకు ఏర్పాటు చేసుకునేవి.

గుడిసిల్లు:
గుడిసిల్లు/చుట్టిల్లు ఇవి వృత్తాకారంలో వుండి ఒకే దూలం కలిగి కప్పు శంకాకారంలో పైకి వుంటాయి. పూరిల్లుకు లాగానె వీటికి పైకప్పు గడ్డి, బోద కసువు గాని వేస్తారు.

పెంకుటిల్లు :
ఇవి రెండు రకాలు. ఒకటి మంగుళూరు పెంకులు, రెండో రకం దేశవాళి పెంకులు వేసి కట్టినవి. ఇటుకల గోడపై సన్నని దూలాలు పెట్టి, గోడల పైనుండి ఏట వాలుగా వాసాలు అమర్చి వాటిపై అడ్డంగా సన్నని చెక్కలను వేసి వాటిపై పెంకులను పరుస్తారు. ఇవి పక్కా గృహాలు.
పెంకుటిల్లు

రేకుల ఇల్లు :
పై కప్పుగా సిమెంటు రేకుల వేసిన ఇళ్లను రేకుల ఇల్లు అంటారు. జింకు రేకులను కూడా పైకప్పుగా వాడతారు. కాని ఈ రేకుల ఇళ్లలో ....... ఎండా కాలంలో వీటి వలన వేడి ఎక్కువగా వుంటుంది. కాన నివాసానికి అంత సౌకర్య వంతంగా వుండవు.. పశువులకు, కోళ్ల ఫారాలకు వీటిని ఎక్కువగా వాడతారు. ఇవి కూడా పక్కా గృహాలె.

మట్టిమిద్దె:
మట్టి గోడలపై అడ్డంగా వాసాలను వుంచి వాటిపై అడ్డంగా సన్న కర్రలను/ లేదా కర్ర చక్కలను పేర్చి దాని పై శుద్ద మట్టిని మందంగా వేసి గట్టి పరుస్తారు. ఇల్లు పైభాగం మొత్తం కనబడీ, కనబడనంత ఈశాన్యానికి వాలుగా వుంటుంది.

బండ్ల మిద్దె చుట్టు రాతి గోడ కలిగి మధ్యలో రాతి కూసాలు ఏర్పాటు చేసి ఆ రాతి స్థంబాల మధ్యన రాతి దూలాలను అమర్చి వాటిపై పై రెండడుగుల వెడల్పు కలిగి నాలుగంగుళాల మందం కల రాతి బండలను వరుసగా పేర్చి వాటి సందులలో సిమెంటు చేసి బండల పైన అంతా సిమెంటు గాని, సున్నము గాని వేస్తారు. ఇవి చాల పక్కా గృహాలు. కాని వీటిలో విశాలమైన గదుల ఏర్పాటు చేయలేరు. పుణ్య క్షేత్రాల సమీపాన నిర్మించిన సత్రాలు ఇటివంటివే. ఇవి చిరకాలము నిలుస్తాయి.

భవంతి :
భవంతి తెలంగాణ ప్రాంతంలో కనబడుతుంది. ఇందులో మట్టి గోడలు దేశవాళి పెంకులు వాడుతారు. అన్ని నివాస యోగ్యమైన ఇళ్లకన్నా ఇది అతి తక్కవ ధనం ఖర్చైనా అతి అనుకూలంగా వుంటుంది.

చిన్న రాతి బండలను ---- పై కప్పుగా వేసి కట్టిన ఇళ్లు :
కొన్ని ప్రాంతాలలో పదడుగుల రాతి బండలు దొరకవు. వారు ఆయా ప్రాంతాలలో స్థానికంగా దొరికే బండలను ఇంటి పైకప్పుకు వాడతారు. కడప, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలలో ఎక్కువగా నల్లని కడప బండలు ఎక్కువగా దొరుకుతాయి.

మిద్దె :
ఇటుకల గోడలపై మంచి దూలాలను వుంచి వాటిపై అడ్డంగా సుమారు నాలుగంగుళాల ఎత్తు, రెండంగుళాల మందం ఆరు, ఏడు అడుగుల పొడవు గల కర్రలను (వీటిని దంతులు అంటారు.) అమర్చి., దానిపై చదునైన పల్చని చక్కలను వేసి వాటిపై సన్నని ఇటుకలను పేరుస్తారు.
బండ్ల మిద్దె, మేడ మిద్దె పై మరో మిద్దె కట్టిన దాన్ని మేడ అంటారు. మిద్దె పై పెంకు టిల్లు కట్టినా అది కూడా మేడ గానె పిలువ బడుతుంది.

కొట్టము:
పశువుల కొరకు కట్టినది కొట్టము, అది రేకులతో వేసినది గాని, గడ్డితో కప్పినది గాని దాన్ని కొట్టమె అంటారు. రాతి కూసాల పై దూలలను పెట్టి వాటి మధ్యన అడ్డ కర్రలు పెట్టి దాని పైన వరి గడ్డిని వామి వేస్తారు.

పందిరి:
ఇంటి ముందు వెదురు కర్రలు పాతి వాటిపై అడ్డంగా సన్న వెదులురు వేసి దానిపైన కొబ్బరి ఆకులు వేసినదె పందిరి. ఇంటి ముందు చల్లదనానికి దీన్ని అమర్చు కుంటారు. పెళ్ళిల్లు మరియి శుభ కార్యాల సందర్భంగా తప్పని సరిగా పందిళ్లలు వేస్తారు. ఇలాంటి వాటిని పచ్చి కొబ్బరి మట్టలతో వేస్తారు ఈ ఆచారం ప్పటికి కూడా కొనసాగుతున్నది.

దొడ్డి:
ఇది కూడా కొట్టం లాంటిదె. కాని ఇందు గొర్రెలు, మేకలు మొదలగు చిన్న జీవాల కొరకు ఉపయోగిస్తారు. వాటిని గొర్రెల దొడ్డి, మేకల దొడ్డి అని అంటారు.

కోళ్లు:
ఆరోజుల్లో ప్రతి ఇంటిలోను కోళ్లు వుండేవి. వాటిని రాత్రు లందు భద్ర పరచడానికి గూళ్లు, గంపలు వంటివి వుండేవి. ఈ ఇళ్లలో వందలాది కోళ్లు పెంచే వారు కాదు. పది, పదిహేను కోళ్లు వుంటే ఎక్కువ. ఇవన్నీ దేశవాళి కోళ్లు. అనగా నాటు కోళ్లు. వాటికి ప్రత్యేకించి మేత వేయ నవసరం లేదు.

అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top