నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

17, మార్చి 2020, మంగళవారం

మన శరీరమునకు ఇంధనము వంటి కొన్ని ఆహార పదార్దములు - Some foods like fuel for our body

మన శరీరమునకు ఇంధనము వంటి కొన్ని ఆహార పదార్దములు - Some foods like fuel for our body
న శారీకక వ్యవస్థ ఓ యంత్రం వంటిది. ఇతర మెషిన్ల మాదిరే శరీరము శక్తి మీద ఆధారపడి పనిచేస్తుంది. ఆ శక్తి మనము అందించే ఇంధనం పై ఆధారపడుతుంది. మనం తినే ఆహారమే సదరు ఇందనము. ప్రతి శారీరక భాగము పనిచేయడానికి, మరమ్మతు చేసుకోవడానికి, పునరుజ్జీవనం పొందడానికి శక్తి అవసరం. శరీరానికి చాలినన్ని పోషకాల్ని అందించినప్పుడే ప్రతి అవయవము తన పని తానూ సక్రమంగా చేసుకుంటూ పోతుంది.

అనేక రుగ్మతల నుంచి కాపాడే 'యాంటి ఆక్షి డెంట్స్' (Anti Oxydents)' , సహజ చెక్కెరలు , పీచు , జీరో ఫ్యాట్ , నీటి శాతము ఎక్కువగా ఉంది తేలిక గా జీర్ణమయ్యే పండ్లు ,కూరగాయలు వీలైనంత ఎక్కువగా తినాలి . దైనందిన ఆహారము లో పండ్లు , కూరగాయలు భాగం చేసుకునే వారికి కొన్ని రకాల దీర్ఘకాలిక రుగ్మతలు కలిగే అవకాశమూ తక్కువ గా ఉంటుంది . స్నాక్స్ గా పండ్లు తేనే అలవాటు చేసుకోవాలి , పొద్దు తిరుగుడు , నువ్వులు , అవిసె , చిక్కుడు జాతి , వేరుశనగలు వంటి గింజలు ను , గోధుమ , బియ్యం , ఓట్స్ వంటి ధాన్యాలను ,తగు మోతాదులో తీసుకుంటా ఉండాలి . వాల్ నట్స్ , బాదం , జీడిపప్పు , పిస్తా , ఖర్జూరం వంటివి కొద్ది కొద్ది గా తినాలి. కొవ్వుపదర్ధములు చాలా తక్కువ గా తీసుకోవాలి . ఆహారము లో నూనె వాడకం అంతంత మాత్రం గా ఉండాలి . వేపుడు కూరలు , ఉరగాయలు , పాపడ్స్ , సీతలపానీయలు , ఐస్ కరీం లు మానేయాలి . 

|| ఆరోగ్యమే మహాభాగ్యము || 
ఆరోగ్యానికి ఆహారము : లేచినప్పటి నుండి అర్ధరాత్రి దాకా పరుగెత్తే యాంత్రిక జీవనములో చుట్టూ పొగ , ధూళి , రసాయనాలతో కలుషితమైన వాతావరణములో సగటు మనిషి నుండి మేధావి దాకా మంచి ఆహారము గుర్తించడము కస్టమైన పని అవుతుంది . 

రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ వంటివాటివల్ల పొట్ట పెరగడం , మలి వయసులో మధుమేహము , రక్తపోటు వంటివి రావడం మినహా మంచి జరగడం లేదు . ఒక ప్రాంతాన్ని , ఒక కాలాన్ని బట్టి కాక విశ్వనీయతతో ప్రకృతి ... దైవత్వాన్ని ఆకళింపుచేసుకొని , వాతావరణ మార్పులను అనుసంధానము చేసుకొని ఆహారాన్ని , ఆహారపదార్ధాల నిర్మాణాన్ని , ఆహార నియమాలను ప్రతిపాదించింది . అందుకే మనమెక్కడున్నా ప్రకృతిలోంచి వచ్చిన , వండిన , సమగ్రమైన , సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి . అన్నము బ్రహ్మ స్వరూపము , రసము విష్ణు స్వరూపము , భోజనము చేసే తను మహేశ్వర రూపమని భావించి ... అన్నము ప్రాణమయమని మంచి మనసు తో , ఆనందముతో , నలుగురుతో కలిసి , సమయాన్ననుసరించి తీసుకోవాలి.
  • ⭄ అమ్మ చేసిన సున్నివుండలలో వీర్యబలము ఉన్నది ,
  • ⭄ నువ్వుల వుండలలో స్త్రీ హార్మోను లను క్రమబద్ధము చేసే గుణము ఉన్నది ,
  • ⭄ పాయసము లో శక్తి ని , తృప్తిని , ఇచ్చే గుణము ఉన్నది ,
  • ⭄ పాలు , నెయ్యి, తేనె మధురపదార్ధాలేకాదు .. సప్తధాతువులకు శక్తి నిస్తాయి .
ఇలా పకృతి ప్రసాదించిన ప్రతీ పదార్ధము లోనూ మనిషి శరీరానికి అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి . ఈ విశ్వములో అనేక (84 లక్షల)రకాల జీవులున్నాయి .. ఒక్కోజీవికి ఒక్కొక్క ఆహారము అవసరమతూ ఉంటుంది . ఒక జీవికి మంచి చేసే పదార్ధము ఇంకోజీవికి విషమయమవవచ్చు . . . రోగాన్ని కలుగజేయవచ్చును . మానవులకు వచ్చే అనేక రుగ్మతాలకు పధ్యము అవసరము . ఈ పథ్యము మనిషికి కాదు ... మనిషి తత్వానికి , అతనికున్న రోగానికి , ఆహారపదార్ధాలలలో ఉండే రసశక్తిని బట్టి ఉంటుంది ఉదా : దానిమ్మ , చెరకు రసము వంటివి ఆహారము ముందు .... అరటి పండు , దోసకాయ , తీపివంటలు , అటుకులతో చేసినవి బోజనము తరువాత తినాలి . నేరేడు , కొబ్బరి , మామిడి పండు , పనస , అరటిపండు ఉదయాన్నే పరగడుపున తీసుకోరాదు ... ఎసిడిటీ పెరిగి ఉదరకోశ సమస్యలు వచ్చేఅవకాశముంటుంది . ఆహారములో ఆరు రుచులూ ఉండాలి ...................... : ఆహారము కూడా మందులాంటిదే . దానికి రసం అంటే రుచి , వీర్యం అంటే బలము , ఆమం అంటే విషము ఉంటాయి . రుచులు ఆరు (షడ్రుచులు )
  • 1. తీపి - మనలో శక్తిని పెంచుతాయి ,
  • 2. కారము - జీర్ణ శక్తి ని పెంచుతుంది ,
  • 3. చేదు - జ్ఞాపక శక్తిని , రక్టశోధనని కలుగజేస్తుంది ,
  • 4. ఉప్పు - ఆహారానికి రుచునిచ్చి ఆమ్ల , క్షార గుణాలను సమతుల్యము చేస్తుంది ,
  • 5. వగరు - కఠిన పదార్ధాలను ముక్కలు చేస్తుంది ,
  • 6. పులుపు - జీర్ణ శక్తిని పెంచుతుంది .
మన ఆహారములో ఈ ఆరు రుచులూ ఉండాలి . మితాహారము ఆరో్గ్యానికి మంచిది .

రచన/ సంకలనం: Dr. V శేషగిరి రావు, ఎం.బి.బి.స్
« PREV
NEXT »