పాల్ఘర్ హత్య:: ఇద్దరు సాధువులను హత్య చేసిన 110 హంతకుల అరెస్టు - పోలీసుల ప్రేక్షక పాత్ర - Palghar lynching: 110 including 9 juveniles arrested for murder of two Sadhus and a driver where police acted as mute spectatorపాల్ఘర్ హత్య:: ఇద్దరు సాధువులను హత్య చేసిన 110 హంతకుల అరెస్టు - పోలీసుల ప్రేక్షక పాత్ర - Palghar lynching: 110 including 9 juveniles arrested for murder of two Sadhus and a driver where police acted as mute spectator
యానకమైన ఈ సంఘటనలో 100 మందికి పైగా ఒక గుంపు ఇద్దరు సాధువులను మరియు వారి డ్రైవర్ను చంపివేశారు, అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకులుగా నిలబడి, ఈ అనాగరిక చర్యను చూస్తూ నిలబడ్డారు.

హెచ్చరిక: ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలలో హింసాత్మక చిత్రాలు ఉన్నాయి, వీక్షకుల అభీష్టానుసారం, విజ్ఞతతో చూడవచ్చు.
పైన చూపిన వీడియోలో, సాధువు తన ప్రాణాలను కాపాడుకోవటానికి పరిగెడుతూ పోలీసు ఆశ్రయ కోరి అతనిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వీడియో సుమారు 42 సెకన్ల సమయంలో వుంది, అందులో ఒకరు “మార్, షోయబ్, మార్” అంటే " చంపు, షోయబ్, చంపు" అని అరుస్తున్నాడు.
సాధువును వెంటాడి చంపుతున్న మరో వీడియోలో, పోలీసులు సాధులను రక్తపిపాసి గుంపుకు తీసుకెళ్తుండగా, యూనిఫాంలో ఉన్న పోలీసుతో సురక్షితంగా ఉంటాడని అనుకున్నాడు,  అక్కడ రక్తపిపాసి గుంపు సాధువును కర్రలు, మారణాయుధాలతో కొట్టడం ప్రారంభించినపుడు  పోలీసు తన చేతులలో ఉన్న సాధువును వదిలేయంగా, ఆలా ఆ వృద్ధుడిని చనిపోయేలా చేస్తాడు.

పాల్ఘర్ సంఘటన వివరాలు
2020 ఏప్రిల్ 16 న మహారాష్ట్రలోని పాల్ఘర్ లో  దారుణ సంఘటన జరిగింది.
ఇద్దరు సాధువులు, 70 ఏళ్ల కల్పవ్రిష్కా గిరి మహారాజ్, 35 ఏళ్ల సుశీల్ గిరి మహారాజ్‌తో పాటు వారి డ్రైవర్ 30 ఏళ్ల నీలేష్ తెల్‌గడే జూనా అఖారాతో సభ్యులుగా ఉన్నారు. సమాధిని మరొకరికి ఇవ్వడానికి ముంబై నుండి గుజరాత్ వెళ్తున్నారు.

గడచిన్చలే గ్రామంలో, 100 మందికి పైగా గుమిగూడిన ఉన్మాద గుంపు వారిపై దాడి చేశారు. గ్రామస్తులు వారిని దొంగలు అంటూ వారిపై దాడి చేయడం ప్రారంభించారు. 70 ఏళ్ల వ్యక్తి కల్పవ్రిష్కా గిరి మహారాజ్ ని రక్షించడానికి పోలీసులు అక్కడికి చేరుకున్న తమ బృందం పై కూడా ఉన్మాదుల గుంపు దాడిలో గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు.

ఈ గ్రామం గిరిజనుల ఆధిపత్యం అని, వారిలో ఎక్కువ మంది క్రైస్తవులు కాగా, కొందరు ముస్లింలు అని "సాధు సమాజ సంఘం" అంటున్నారు. ఈ మారణ కాండలో క్రైస్తవులు, ముస్లిం గిరిజనులకు భయపడి పోలీసులు సాధులను ఉన్మాదుల గుంపు అప్పగించారని, తరువాత ఆ సాధువులను కర్రలతో కొట్టారని "సాధు సమాజ సంఘం" ఆరోపిస్తోంది. ఒక వర్గం మతం యొక్క గిరిజనులు సాధులను కొట్టడం ప్రారంభించినప్పుడు, పోలీసులు జోక్యం చేసుకోలేదు.

పాల్ఘర్ సంఘటన పై ప్రశ్నలు వర్షం:
క్రూరమైన ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత, సాధువుల పై జరుగుతున్న అనాగరిక చెర్యను చూస్తూ ప్రేక్షకులుగా మిగిలిన పోలీసుల పాత్రను చాలామంది ప్రశ్నించారు.

పాల్ఘర్ సంఘటనను ఖండించిన అఖారా పరిషత్:

Opindiaతో మాట్లాడుతూ, అఖిల్ భారతీయ అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి సాధువుల హత్యలో పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు.

సాధులకు విజ్ఞప్తి చేస్తూ, సాధు ఎవరైనా సమాధిని తీసుకుంటే, అదే గ్రామంలోని సాధువులు మాత్రమే సందర్శించాలి, దానివలన కరోనావైరస్ లాక్డౌన్ మార్గదర్శకాలు ఉల్లంఘించబడవు.

“పోలీసుల ముందు, మా ఇద్దరు మహాత్ములు హత్య చేయబడ్డారు. ఈ ప్రాంత ముస్లింలు కరోనావైరస్ ముసుగులో సాధులను లక్ష్యంగా చేసుకుంటున్నారా? దీనిపై దర్యాప్తు చేయాలని నేను మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. లాక్డౌన్ ముగిసిన తర్వాత, అఖిల్ భారతీయ అఖాదా పరిషత్ జూనా అఖారాతో మాట్లాడుతుంది మరియు దీనికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచుతుంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రి (బాల్ ఠాక్రే) ఎల్లప్పుడూ సాధులను, మహాత్ములను గౌరవించేవారు. మీ పాలనలో ఇద్దరు సాధులు దారుణంగా చంపబడితే, అది చాలా ఖండించదగినది. నిందితులు ముస్లింలు అని వార్తలు వస్తున్నాయి. వారిని అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ”అని అన్నారు.
Juna Akhara letter - జూనా అఖారా లేఖ
Juna Akhara letter - జూనా అఖారా లేఖ
వ్యాస మూలము: Opindia
అనువాదం: కోటేశ్వర్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top