హైందువుల్లో ఐక్యతను తీసుకువచ్చిన ఆది శంకరాచార్యులు - Haindava, Hindu, Shankaracharya


దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే |
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః ||

లోకంలో దుష్టాచారాన్ని నశింపజేయడానికి సాక్షాత్తు కైవల్య నాయకుడైన శివుడు శంకరాచార్యుని రూపంలో భూమండలం మీద అవతరించారు.

కోటా వేంకటాచలం మొదలైన చరిత్రకారుల మనకు అందించిన సమాచారం ప్రకారం బుద్ధుడు బిఫోర్ కామన్ ఎరా 18 వ శతాబ్దానికి చెందినవాడు.. ఆది శంకరులు బిఫోర్ కామన్ ఎరా 509 కు చెందినవారు. వారు బిఫోర్ కామన్ ఎరా 477 లో శివైక్యం చెందారు. కానీ పాశ్చాత్యులు వ్రాసిన చరిత్రలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్రను మింగివేసారు.

ఒకసారి అప్పుడున్న పరిస్థితుల చూద్దాము.
ఒకనాడు ఇప్పటి పర్షియా, ఇరాన్, మెసపుటామియా, ఇరాఖ్ వరకు భరతవర్షం భారతదేశపు రాజుల ఆధీనంలో, ఈ "అఖండ భారతభూమిలో" భాగంగా ఉండేది. అటుపక్క మధ్య ఆసియా లోని కశ్యప సముద్రం (కాస్పియన్ సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఒకప్పుడు హిందువులైన పారశీకులు అధర్మాన్ని పాటించడం వలన దేశ బహిష్కారానికి లోనుకాగా, సరిహద్దుల్లో తిష్టవేసి, ఈ సంస్కృతి మీద ద్వేషంతో మన దేశంలో తమ మతాన్ని ప్రచారం చేసి, కొన్ని ప్రాంతాలను దేశం నుంచి వేరు చేశారు.

బౌద్ధం అహింసావాదం అని చెప్పుకున్నా, బౌద్ధులు తమ మతాన్ని హింసతోనే విస్తరింపజేశారు. బౌద్ధులు చంద్రగుప్తుని సమయం వరకు ఒక సమూహంగా ఏర్పడలేదు. పుష్యమిత్రుడు సింహాసనం ఎక్కే సమయానికి బౌద్ధులు ఒక మతంగా ఏర్పడడం మొదలుపెట్టారు.

మత విస్తరణ కోసం తమకు 300 ఏళ్ళు బువ్వ పెట్టిన హిందువుల మీద అకారణంగానే ఎక్కడలేని ద్వేషం పెంచుకున్నారు. జాతి వ్యతిరేక సమూహంగా మారి, గ్రీకులు దండయాత్రకు వస్తే, వాళ్ళ పక్షాన చేరారు, ఆ రాజును బౌద్ధులు ప్రేమగా మిళిందుడని కూడా పిలుచుకున్నారు. విశ్వవిద్యాలయాల్లో పిల్లలకు దేశ వ్యతిరేక సాహిత్యాన్ని చెప్పి, వాళ్ళను సంఘవిద్రోహ శక్తులుగా మార్చారు.

వీళ్ళ వలన దేశం అంతర్గతంగా బలహీనపడి, ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. అది పుష్యమిత్రుడికి నచ్చలేదు. జాతి సమగ్రత, సమైఖ్యత కోసం దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న దుష్టులను చంపమని ఆదేశించాడు. అప్పుడు ఆ చర్యలకు పాల్పడింది బౌద్ధలే కనుక వాళ్ళే మరణించారు. అది కూడా అందరిని కాదు. కేవలం విద్రోహచర్యలకు పాల్పడుతున్నవారు మాత్రమే చంపబడ్డారు. ఇది చరిత్ర. బౌద్ధులు ధర్మానికి వ్యతిరేకులు కనుక, అశ్వమేధం లాంటి యాగాలు చేస్తే, ప్రజలు సంఘటితమవుతారని, తమకు రాజకీయ ప్రాభవం దక్కదని, యజ్ఞయాగాది క్రతువులను, వేదాలను నిరసించారు. ఆ ప్రభావంతో ఈ దేశంలో అనేక రాజులు సరిహద్దులను పటిష్టం చేసే అశ్వమేధం వంటి యాగాలను విస్మరించి, అహింస పేరుతో మౌనం వహించి, అఖండభారత విచ్ఛిన్నానికి కారుకులయ్యారు.

ఇవిగాక శంకరులు అవతరించేనాటికి దేశంలో ఎన్నో మతాలు, వాదాలు విస్తరించి సమాజ ఐఖ్యతకు భంగం కలిగించాయి. ఇప్పుడు కూడా అలాంటి వాదాలు సమాజంలో చాలా ఉన్నాయి. కొందరు హిందువులుగా పైకి నటిస్తూ, జనాలను రెచ్చగొడుతూ, విభజనవాదాలను పెంచి పోషిస్తూ, మన ధర్మం మీద మెల్లిమెల్లిగా ద్వేషం పెంచుకునేలా చేస్తున్నారు. రోమిలా థాపర్, షెల్డన్ పాల్లోక్ వంటి అమ్ముడుపోయిన వ్యక్తులు అనేకమంది విద్యావేత్తలుగా ప్రచారం చేసుకుంటూ, సనాతనధర్మం మీద పుస్తకాలు రాస్తున్నమని చెప్పుకుంటూ, వాటి నిండా విషం నింపి అదే చరిత్ర మరియు ధర్మం అని నమ్మిస్తూ మతమార్పిడులకు సాయం చేస్తున్నారు. అవిగాక అన్యమతాలు ఎలాగో ఉండనే ఉన్నాయి.

వాటిని ఖండించి అవైదికులతో వాదించి వారిని తిరిగి సనాతనధర్మంలోకి తీసుకువచ్చారు ఆదిశంకరులు. ఈనాడు మనం పునారగమనం (ఘర్‌వాపసి) అంటున్నాం కదా, అది వారు ఆనాడే చేశారు. వేదధర్మంలో భాగంగా ఉన్న శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సౌర, కౌమార మతాలను సమన్వయం చేసి, పంచాయతన ఆరాధన పద్ధతిని అందించారు. పిచ్చి పిచ్చి వాదాలతో దారి తప్పిన హిందూ సమాజాన్ని తిరిగి దారిలోకి తెచ్చారు. అసలు ధర్మం ఏంటో చెప్పి, దాన్ని పునఃస్థాపితం చేశారు.

హిందువుల్లో ఐక్యతను తీసుకువచ్చారు. శంకరుల వాదనా పటిమకు బౌద్ధం పూర్తిగా బలహీనపడింది. వారి దేశవ్యత్రిరేక కార్యకలాపాలతో నశించిపోయింది. "బౌద్ధాన్ని ఈ దేశం ద్వేషించడానికి కారణం వారి మతసిద్ధాంతాలు కాదు, కానీ వారిలో ఉన్న జాతివ్యతిరేకత మరియు దేశద్రోహ లక్షణాలు" అంటారు వినాయక్ దామోదర్ సావర్కర్.

క్రీ.పూ. 7 వ శతాబ్దంలో వచ్చిన ఆదిశంకరుల ప్రభావం ఈ దేశంపై 1500 సంవత్సరాల వరకు చాలా తీవ్రంగా ఉన్నది. ఆయన ధర్మానికి కొత్త ఊపిరిలూదారు. ప్రభావంతో విక్రమాదిత్యుడు, శాలివాహానుడు మొదలైన రాజులు భరతవర్షం కోల్పోయిన భాగాలను తిరిగి ఈ దేశంలో విలీనం చేశారు.

ఒకవేళ శంకరాచార్యులే గనక రాకపోయి ఉంటే, అసలు మన ధర్మానికి ఒక దశ-దిశ ఉండేది కాదు. బౌద్ధుల అహింసావాదం, అవైదిక మతాల కారణంగా భరతజాతి క్రీ.శ.1 నాటికే ముక్కలై, ధర్మం కోసం, దేశం కోసం పోరాడలన్నా తపన ఉండేది కాదు. మనలో ఐఖ్య భావన ఉండేది కాదు. ఈనాడు మనమంతా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాళ్ళము కాదు, అసలు భారతదేశమే ఉండేది కాదు. అప్పటికే బౌద్ధులుగా మారి, ఆ తర్వాత ఇస్లాం మరియు క్రైస్తవుల చేతిలో పడి మన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయేవాళ్ళము.

శైవులైనా, వైష్ణవులైనా, ఏ మతస్థులైనా, హిందువులుగా, భారతీయులుగా బ్రతుకుంతున్నామంటే, అందుకు కారణం ఆదిశంకరాచార్యులు. వారిని మనం తప్పక స్మరించాలి. వారికి కృతజ్ఞులమై ఉండాలి.

జయ జయ శంకర హర హర శంకర

సంకలనం: గౌరి గణేష్ 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top