నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Wednesday, April 15, 2020

ప్రధమ రజస్వల శుభ మరియు అశుభ విషయములు - Pradhama Rajashwala Subha, Asubha Vishyamuluప్రధమ రజస్వల శుభ మరియు అశుభ విషయములు - Pradhama Rajashwala Subha, Asubha Vishyamulu
స్త్రీ రజస్వల శుభ అశుభ విషయములు
రజస్వల విషయములు ప్రధమ రజస్వల ప్రాతః కాలమునుంచి మధ్యాహ్నములోపు అయిన శుభము. మిగిలిన కాలము అశుభము. ప్రాత కాలము అయినచో నిత్య సుమంగళి గానూ, మథ్యాహ్నం పూట అయినచో గొప్ప ధనవంతురాలవుతుంది. అర్థ రాత్రి అయితే గ్రహ తిథిలను బట్టి శాంతులు చేయించాలి. రజస్వల సరిసంఖ్య తేదీ కన్నా బేసి సంఖ్యా తేది మంచిది.
చిరుగులు లేనివీ, శుభ్రమైనవీ, రంగు గలవి అయిన దుస్తుల్లో ప్రధమ రజస్వల అయితే శుభప్రదములు. 
రజస్వల సమయం మంచిది కాకపోతే నవగ్రహ శాంతితొ పాటు గౌరీదేవి కుంకుమార్చన చేయించుట మంచిది. 

శుభ అశుభ విషయములు:
 • రాజస్వలకు దుష్ట తిధులు: అమావాస్య, ఉభయ పాద్యమిలు, షష్టి, అష్టమి, ద్వాదశి తిదుల యందును పరిఘ యోగముల పూర్వార్ధమునండును, వ్యతీపాత, వైధృతి యోగాములండును, సంధ్యా కాలమునండును, ఉప్పెన, భూకంప మొదలైన వుపద్రవ కాలమండును భద్ర కారణమూ నందును మొదటిసారి రజస్వల అయిన శుభకరము కాదు. సోమ, బుధ, గురు, శుక్ర వారములందు ప్రధమ రజస్వల అయిన శుభ ఫలము, ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలము కలుగుతుంది. 
 • శుభ నక్షత్రములు: అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ , శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి యీ నక్షత్రములందు ప్రధమ రజస్వల అయిన సౌభాగ్యము, సౌఖ్యము, సంతానము, ఆయువు, ధనము కలుగుతుంది. మిగిలిన నక్షత్రములు అశుభ ఫలములు ఇచ్చును. కావున శాంతి చేయాలి. గ్రహణ సమయములందు, సంక్రాంతి యందు, అశుభమైన నిద్రా సమయములందు, అర్ధరాత్రి యందు ప్రధమ రజస్వల అయినచో యుక్తమైన శాంతులు నిర్వహించాలి.
 • శుభ తిధులు: తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభము. 
 • లగ్న గ్రహ ఫలము: ప్రదమ రాజోదర్శన సమయమున కేంద్ర, కోణ, లాభ స్థానములందు శుబ గ్రహములు, తృతీయ, షష్ట లాభ స్థానములందు క్రూర గ్రహములు శుభ ఫలములిస్తాయి. చంద్రుడు అష్టమ స్థానమునందు వుండిన పతి నాశనము కలుగ జేస్తాడు. కాని చంద్ర తారాబలములు సంపన్నమైనపుదు పుత్ర, ధన సంపత్తులు కలుగుతాయి. కుజుడైనాను లేక చంద్రుడైనాను లగ్నమునకు 3, 6, 10 స్తానములన్డున్నచో సంపంనులగు కుమారులు కలుగుతారు. 
 • నక్షత్ర గ్రహ ఫలము: రజస్వలా సమయ నక్షత్రమందు గురుడుగాని, శనిగాని వున్నాను, యే గ్రహము లేకున్నను శుభము.  రజస్వలా సమయ నక్షత్రము నందు కుజుడున్నను బుధ శుక్రులు కలిసి వున్నాను, రవి వున్నాను రాహు కేతువులున్నను అశుభము.
రసజ్వల
రసజ్వల అయిన బాలిక ఊహా చిత్రం
సమయ మరియు స్థాన ఫలితములు:
 • తన యింటి యందును, గోడల చావిదియండును, స్వగ్రామ మధ్యమందు, జల సమీపమున, ఇంటి ఆవరణ మధ్య ప్రధమ రజస్వల అయిన శుభము.
 • గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా వున్నపుడు ఇతరుల యిండ్లలోను ప్రదమ రజస్వల అయిన అశుభము.
వేళా విశేషములు: ప్రాతః కాలం చిర సౌభాగ్యం, ఉషః కాలం శోవ్భాగ్య లోపం, పూర్వాహ్నం పుణ్య క్షేత్ర దర్శనం, మధ్యాహ్నం ధనవతి, పుత్రవతి, సాయంత్రం జారగునం, సంధ్యలందు చేడుప్రవర్తన కలది, అర్ధరాత్రి బాల వైధవ్యం కలుగును. 

రాత్రి వేళ నిర్ణయం: రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడు భాగాలుగా చేసి రెండు భాగముల కాలము పూర్వదినము, మూడవ భాగాకాలమున తదుపరి దినమునకు చెందుతుంది.

వస్త్రఫలము: తెల్లబాట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి, గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును, నూతన వస్త్రము ధరించాగానే శుభ సంపన్నురాలగును, చిరిగినా బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును, యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును, నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.

రసజ్వలకు నక్షత్ర ఫలములు
 •  అశ్వని : భోగభాగ్యములు పొందును. మొదటి సంతానం నష్టం.
 •  భరణి : అనారోగ్యము, భీతి, అల్పాయువు.
 •  కృత్తిక : కష్టనష్టములు అల్పసంతానం కలది చంచలము.
 •  రోహిణి : ధనధాన్యవృద్ధి, పుత్ర సంతావంతురాలు.
 •  మృగశిర : సుఖసౌఖ్యాదులు, దైవభక్తి కలది, యోగ్యురాలు.
 •  ఆర్ద్ర : నీతినియమములు లేనిది, దురదృష్టవంతురాలు.
 •  పునర్వసు : స్వగృహమును విడిచిపెట్టునది.
 •  పుష్యమి : పతిభక్తి గలది, సంతానం కలది యోగ్యురాలు.
 •  ఆశ్రేష : దుష్టసంతానం కలది పతి సౌఖ్యము తక్కువ కలిగినది.
 •  మఘ : తండ్రి యింటి వద్ద ఉండునది, భర్తకు కష్టం తెచ్చునది.
 •  పుబ్బ : గర్భస్రావం కలది దీనురాలు అనారోగ్యం కలది.
 •  ఉత్తర : సంతానం కలది. మంచిసౌఖ్యముగలది.
 •  హస్త : మంచిపుత్రికలు కలది. బందువులను ఆదరించునది.
 •  చిత్త : పతిభక్తిగలది. లలితకళల యందు ఆశక్తికలది.
 •  స్వాతి : పుత్రసంతానంగలది, పతివ్రత, భోగి.
 •  విశాఖ : ధనధాన్యములు లది విలాసవమ్తురాలు, భోగి.
 •  అనూరాధ : పుత్రసంతానంకలది పవిత్రురాలు.
 •  జ్యేష్ఠ : దుష్ఠ ప్రవర్తనకలది. పతినిపోగొట్టుకొనునది.
 •  మూల : పుణ్యక్షేత్రసంచారి, ధర్మంచేయుట యదిష్టతకలది.
 •  పూర్వాషాడ : వైధ్యవ్యము పొందునది. హంతకురాలు అగును.
 •  ఉతరాషాడ : పుణ్యకార్యములు చేయునది. సంపదలు గలది, భోగి శ్రవణం : దీర్ఘాయుర్దాయం కలది. పుత్రసంతానం కలది.
 •  ధనిష్ఠ : ధనధాన్యములు స్త్రీ సంతానం కలది. శతబిషం : సుఖ సౌఖ్యములు, ధన వృద్ధి కలది.
 •  పూర్వాభాద్ర : మూర్ఖత్వము కలది. అనారోగ్యము గల భర్త కలది.
 • ✹ ఉత్తరాభాద్ర : జ్ఞానము కలది. బంధువర్గము కలది. పవిత్రురాలు.
 • ✹ రేవతి : ధనవంతురాలు. పుణ్యకార్యములు చేయునది. మంచిజీవనము చేయునది.
క్రతువు:
 • ⭄ ప్రధమ రజస్వల అయిన కన్యకు అక్షతలు తలపై వేసి ఆసనమేసి కూర్చుండ బెట్టాలి. 
 • ⭄ దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు శ్రీ గంధము, పుష్పములను, తమ్బూలములను లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి. 
 • ⭄ ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే మూడు రోజులు ఉంచాలి. 
 • ⭄ ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి.
 • ⭄ భోజన విషయంలో పులగము, నెయ్యి, పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు, పులుపు, కారము లేకుండా ఇచ్చుట మంచిది, నాలుగవ రోజు స్నానము చేయించి నూతన వస్త్రములు కట్టించాలి. 
 • ⭄ మూడు దినములు ఎవరిని తాకకూడదు. 
 • ⭄ అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట , అగ్ని ముట్టుట, ప్రాసనము, సూర్యావలోకనము, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. 
 • ⭄ క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు.
ఆరోగ్యం అంతరార్ధం:
 • ⧫ రజస్వలా అయిన స్త్రీ మొదటి దినమునండు చండాల స్త్రీ సమానురాలు,
 • ⧫ రెండవ దినమందు పతితురాలితో సమానురాలు,
 • ⧫ మూడవ దినమునండు చాకలి స్త్రీతో సమానము,
 • ⧫ నాలుగవ దినమున కూడా శూద్ర స్త్రీ సమానురాలు,
 • ⧫ ప్రధమ రజస్వల అయిన స్త్రీ అయిదవ దినమందు దేవ పితృ కార్యములందు పరిశుద్దురాలూ అన్నారు.
 • ⧫ నాలుగవ దినమందు స్నాముచేత శుచి కాగలదు.
బహిష్టు అయిన స్త్రీ మూడు రోజుల తరువాత శుద్ధి అవుతుంది. తిరిగి మల్లి పంతొమ్మిది రోజులలో బహిష్టు అయిన ఒక దినముతో శుద్ధి అట్లుగాక ఇరవై రోజుల అనంతరము ఎప్పుడైనా బహిష్టు అయిన మూడు రోజుల తరువాత శుద్ధి అగును.

సంకలనం: ప్రసాద్
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com