ప్రకృతి ద్వారా "వేడి" నుంచి స్వాంతన - Prakruti DwaAra VedI nunchi swantana

విపరీతమైన ఎండ వేడి వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వేడిని దూరం చేసుకోవాలి. ఇంట్లో దొరికే కొన్ని ఆయుర్వేద పదార్థాలు వేడిని దూరం చేసి సాంత్వన అందిస్తాయి.

1. గులాబీలు: ఈ రేకల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వాటిని నూనెల్లో, సబ్బుల తయారీలోనూ వాడుతుంటారు. ఎండలో కమిలిన చర్మం తిరిగి జీవంతో వెలిగిపోవాలంటే... నీడలో గులాబీరేకలని ఎండ బెట్టి, వాటితో టీ తయారు చేసుకుని తాగుతూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది. వేడి నుంచి సాంత్వన అందుతుంది. డయేరియా వంటి సమస్యలున్నా తగ్గిపోతాయి.

3. పుదీనాః పుదీనా ఆకుల్ని ఈ కాలంలో ఏ రూపంలో తీసు కున్నా ఫర్వాలేదు. పుదీనానీ చట్నీగా చేసుకోవచ్చు, సలాడ్లలో వేసుకోవచ్చు. డికాక్షన్లో ఆకులు వేసి టీలానూ కాచుకుని,  ఎలా తీసుకున్నా దాని ఫలితాలు అమోఘం. వేసవిలో తలెత్తే తలనొప్పీ, వికారాలతోపాటూ ఒత్తిడి, నీరసం వంటివి రాకుండా పుదీనా చూస్తుంది

3. ఉసిరి: ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒంట్లో వేడి పెరగకుండా ఉంటుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తుంది. దీన్నుంచి విటమిన్ సి అందుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

4. తులసి: ఈ కాలంలో చెమట రూపంలో లవణాలని కోల్పోతుంటాం మనం. దాంతో వికారం, తలనొప్పి వంటి అనేక సమస్యలు తలెత్తు తుంటాయి. గుప్పెడు తులసి ఆకుల రసాన్ని మనం ఏ రూపంలో తీసుకున్నా ఎ విటమిన్ పుష్కలంగా అందడంతో పాటూ, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాల భర్తీ తేలిగ్గా జరుగుతుంది, ముఖ్యంగా రక్తహీనత రాకుండా చేసే ఇనుము దీని నుంచి పుష్కలంగా అందుతుంది.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top