నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, April 26, 2020

సరస్వతీ మంత్రము - Saraswathi Mantramu



సరస్వతీ మంత్రము - Saraswathi Mantramu
ఓం ప్రాణో దేవీ సరస్వతీ వాజేభివాజినీవతీ | ధీనామవిత్ర్యవతు || ఓం ||
“వాక్శక్తిని గురించి యోచించి చూడండి! ఉన్నతతత్త్వాలలోను, అట్లే దైనందిన జీవితంలోనూ అదొక మహాశక్తిగా అలరారుతూ ఉంది. మనం యోచించకుండా, పరిశోధించి చూడకుండా రేయింబవళ్ళు యీ శక్తిని వినియోగిస్తున్నాం. ఈ శక్తి స్వభావాన్ని తెలుసుకోవడమూ, దాన్ని ఆదర్శవంతంగా వినియోగించుకోవడమూ కర్మయోగంలో ఒక భాగమే” అంటారు స్వామి వివేకానంద.

వాక్ శక్తే వాక్ దేవి, సరస్వతి అంటూ వెదకాల పర్యంతంగా ఆరాధింపబడుతూ వచ్చింది. మనలో వాక్శక్తిని జాగృతం చేయమని దేవిని ప్రార్థిస్తుంది యీ మంత్రం.

ఓం ప్రాణో దేవీ సరస్వతీ వాజేభివాజినీవతీ | ధీనామవిత్ర్యవతు || ఓం ||
వాజేభిః=ప్రణమిల్లే వారిని; వాజినీవతీ=కాపాడేదానవైన; దేవీ సరస్వతీ=సరస్వతీ దేవీ; ప్రనః=మనలను కాపడనీ; ధీనాం=వాక్ శక్తులను; అవిత్ర్యవతు=జాగృతం చేయుగాక!
ప్రణమిల్లే యావన్మందినీ కాపాడే సరస్వతీదేవి మనలను కాపాడు గాక! వాక్ శక్తులను ప్రేరేపించి మనలను జాగృతం చేయుగాక!

సంకలనం: నాగవరపు రవీంద్ర
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com