వాస్తుపూజ కాల నిర్ణయం - Vasthu Puja Kala Nirnayam

వాస్తుపూజ కాల నిర్ణయం - Vasthu Puja Kala Nirnayam
వాస్తుపూజ కాల నిర్ణయం
వాస్తు పూజను ఏ ఏ సమయాల్లో చేయాలో విశ్వకర్మ ప్రకాశిక ఈ క్రింది విధంగా నిర్దేశించింది.
గృహారంభ సమయాల్లోను, గృహప్రవేశ సమయాల్లోను, ద్వార స్ధాపన సమయాల్లోను, త్రివిధ ప్రవేశ సమయాల్లోను, ప్రతి సంవత్సరం ఆరంభ సమయాల్లోను, యజ్ఞారంభ సమయాల్లోను, పుత్ర జనన సమయాల్లోను, ఉపనయన సమయాల్లోను, వివాహ సమయాల్లోను, గొప్ప ఉత్సవాల సమయాల్లోను, జీర్ణోద్ధార, శల్యోద్ధార సమయాల్లోను, పిడుగు పడిన సమయాల్లోను, దగ్ధమైన సమయాల్లోను వాస్తుపూజ తప్పక చేయవలెను.

ఛండాల ధూషిత గృహాలలోనూ, గుడ్లగూబ ప్రవేశించిన ఇండ్లలోను ఏడురోజులు కాకి ఉన్న ఇండ్లలోను, గో మార్జాలాది ధ్వనులు, ఏనుగులు, గుర్రాలు ధ్వనులన్నానుకరించు ధ్వనులు కలిగించు ఇండ్ల యందును, స్త్రీలు నిత్యం తగువులాడు గృహము నందును తేనేటెట్టెలు పట్టిన గృహము నందు, పావురాలు నివసించు ఇంటినందు మరియు అనేకరకాలైన ఉత్పాతాలు (భూకంపాలు) కలిగినప్పుడు శుభం జరగటం కోసం వాస్తు పురుష పూజ తప్పక చేయవలెను.

అంతేకాక గ్రామాలు, నగరాలు, దుర్గాలు, పట్టణాలు, ప్రాసాదాలు, ప్రాజాలోద్యానవనాలు, గృహారామ మండపాదులు నిర్మించునపుడు వాస్తుపూజ తప్పక చేయాలి. వాస్తుపూజ చేయకపోతే దరిద్రం, మృత్యువు, విఘ్నాలు కలుగుతాయని విశ్వకర్మ ప్రకాశికలో చెప్పబడింది.

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top